చాయ్ చెప్పే హాయ్
- Kotha Viritha

- 14 hours ago
- 2 min read

Chai Cheppe Hai - Telugu Inspirational Article | Kotha Viritha
చాయ్ చెప్పే హాయ్ - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత
Published in manatelugukathalu.com on 04/09/2026
ఇద్దరు కలిసి చాయ్ తాగడానికి కూర్చుంటారు… కానీ వారి మధ్య కనిపించని మూడో వ్యక్తి కూడా ఉంటాడు! చాయ్‌లో చక్కెర ఎంతుందో తెలియదు కానీ మాటల్లో మసాలా మాత్రం పుష్కలంగా ఉంటుంది. “అతని సంగతి తెలుసా?” అని మొదలైన మాట అతని అలవాట్లు, నిర్ణయాలు, స్వభావం, చివరికి అతను ఎందుకు అలా చేశాడనే విశ్లేషణ వరకు వెళ్తుంది. చాయ్ చల్లారిపోవచ్చు… కానీ గాసిప్ మాత్రం వేడిగా ఉండాల్సిందే!
ఇద్దరం కలిసి చాయ్ తాగడానికి కూర్చుంటారు.
చాయ్‌లో చక్కెర ఎంత ఉందో తెలియదు కానీ, మాటల్లో మసాలా మాత్రం ఎక్కువే!
ఇద్దరు మాట్లాడుకుంటున్నామని అనుకుంటారు, కానీ 99% చర్చ తమ దగ్గర లేని మూడో వ్యక్తి గురించే ఉంటుంది!
“అతని సంగతి తెలుసా?” అంటూ మొదలైన మాట…
“అసలు వాడి నేచర్ ఏంటంటే…” అంటూ అరగంట సాగుతుంది!
ఆ వ్యక్తి అక్కడ ఉంటే మాత్రం… “ఏమీలేదు రా!” అని నవ్వేస్తారు.వాడు వెళ్లగానే వారి విశ్లేషణ కమిటీ మళ్లీ షురూ!
చాయ్ చల్లారిపోయినా పర్లేదు… గాసిప్ మాత్రం వేడిగా ఉండాలి!వాడి నిర్ణయాలు, అలవాట్లు, మాటలు అన్నింటికీ తమ దగ్గర రివ్యూ ఉంటుంది!
అతను ఏం చేశాడో కంటే, “ఎందుకు చేశాడో” కూడా వాళ్లే కనిపెట్టేస్తారు.
నిజం ఎంతుందో దేవుడికే తెలుసు… వారి కాన్ఫిడెన్స్ మాత్రం 100%!
ఒక్కోసారి అనిపిస్తుంది తమకు చాయ్ కప్పు కాదు, మూడో వ్యక్తి కావాలి!
ఎందుకంటే అతను లేకపోతే కన్వర్జేషన్ కి కంటెంట్ ఉండదు!ఇద్దరి చాయ్‌లో మూడో వ్యక్తి కనిపించకపోయినా, అతని పేరు మాత్రం ప్రతి సిప్‌లో ఉంటుంది!
చివరికి చాయ్ అయిపోతుంది, మాటలు మాత్రం “ఇంకో కప్పు తెప్పించు” అంటాయి!
కొత్త విరిత
సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్
ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: కొత్త విరిత
నా పేరు కొత్త విరిత
B.sc B.ed Msc చేశాను
IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.
240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.






👍 చాయ్ కబుర్లు