చేతిలో పని లేక... బుద్ధికి నిద్ర లేక
- Kotha Viritha

- 3 hours ago
- 2 min read

Chethilo Pani Leka Buddhiki Nidra Leka - Telugu Inspirational Article | Kotha Viritha
చేతిలో పని లేక... బుద్ధికి నిద్ర లేక - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత
Publishes in manatelugukathalu.com on 07/06/2026
ఒకప్పుడు మనిషి జీవితంలో చేతి పనులు ఎక్కువగా ఉండేవి. వ్యవసాయం, వృత్తులు, కళలు, ఇంటి పనులు అన్నీ శారీరక శ్రమతో సాగేవి. అందువల్ల శరీరం ఆరోగ్యంగా ఉండేది, మనసు ప్రశాంతంగా ఉండేది. పని పూర్తయిన తర్వాత ఒక సంతృప్తి ఉండేది. కానీ కాలం మారింది. సాంకేతికత అభివృద్ధి చెందింది. యంత్రాలు, కంప్యూటర్లు, కృత్రిమ మేధస్సు అనేక చేతి పనులను భర్తీ చేశాయి. ఇప్పుడు మనిషి చేతుల కంటే మెదడుతో ఎక్కువ పని చేస్తున్నాడు. ఆలోచనలు, విశ్లేషణలు, నిర్ణయాలు, లక్ష్యాలు, డెడ్‌లైన్లు జీవితాన్ని నడిపిస్తున్నాయి.
దీని ఫలితంగా ఒకవైపు చేతిలో పని లేక కొందరు చేతులు పిసుక్కుంటున్నారు. మరోవైపు బుద్ధి పనుల ఒత్తిడి వల్ల కొందరు మానసిక ప్రశాంతత కోల్పోతున్నారు. శరీరం కదలకపోయినా మెదడు మాత్రం విశ్రాంతి లేకుండా పరుగులు తీస్తోంది. ఫలితంగా ఒత్తిడి, ఆందోళన, అసహనం పెరుగుతున్నాయి.
మనిషికి చేతి పని కూడా అవసరమే, బుద్ధి పని కూడా అవసరమే. చేతి పని శరీరానికి బలాన్ని ఇస్తే, బుద్ధి పని జీవితానికి దిశను ఇస్తుంది. ఈ రెండింటి మధ్య సమతుల్యత ఉంటేనే సంపూర్ణ జీవితం సాధ్యమవుతుంది.
రోజులో కొంత సమయం తోటపని, వ్యాయామం, సరుకుల కోసం జోమాటో, స్విగ్గి కాకుండా, మనమే మార్కెట్ కి వెళ్ళటం, ఇంటి పనులు లేదా ఏదైనా సృజనాత్మక చేతి పనికి కేటాయిస్తే మనసు తేలికపడుతుంది. అలాగే బుద్ధిని సరైన దిశలో ఉపయోగిస్తే అభివృద్ధి సాధ్యమవుతుంది.
ఈ రోజు ప్రపంచం మన చేతుల పనిని యంత్రాలకు అప్పగించింది. కానీ మన చేతులు విశ్రాంతి తీసుకున్న కొద్దీ, మన బుద్ధి మరింత భారాన్ని మోస్తోంది. అందుకే ఆధునిక మనిషి సమస్య శారీరక అలసట కాదు, మానసిక అలసట.
చేతులు పనిచేస్తే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, బుద్ధి పనిచేస్తే జీవితం ముందుకు సాగుతుంది. కానీ చేతులు, బుద్ధి రెండూ సమతుల్యంగా పనిచేసినప్పుడే మనిషి ప్రశాంతంగా జీవించగలడు. లేకపోతే చేతిలో పని లేక, బుద్ధికి నిద్ర లేక మనిషి కష్టపడాల్సిందే.
కొత్త విరిత
సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్
ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్
***************************************
కొత్త విరిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: కొత్త విరిత
నా పేరు కొత్త విరిత
B.sc B.ed Msc చేశాను
IIT నుండి సైకాలజీ, ప్సైకారిటీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.
240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్, టెక్ మహీంద్రా లో చేస్తున్నాను.




Very much true.. human physiology is meant to do physical work atleast for themselves.. to lead a happy healthy life..
Great words. What you write is often relevant to people's lives and reflects the reality many experience but rarely express.
Wah
Nice one