ధైర్యవంతుడు
కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link

'Dhairyavanthudu' written by N. Dhanalakshmi
రచన : N. ధనలక్ష్మి
మనం సరదాగా సమయం గడిపే పార్క్ జీవిత పాఠాలు నేర్పిస్తే...
భయస్తుడు అయిన రాము పార్క్ లో సమయం గడపడం వల్ల ఎలా ధైర్యవంతుడుగా మారి, అందమైన ప్రపంచాన్ని సృష్టించుకున్నాడో తెలియచేసే కథ.. ఈ తరం రచయిత్రి ధనలక్ష్మి గారు ఈ కథను ఆకట్టుకునేలా రచించారు. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్
@@@@@@@@@@@@@@
చంద్రం, సీతమ్మలకు రాము ఒక్కగానొక్క కొడుకు. రాము పేరుకు తగ్గట్టు మంచి అబ్బాయి. వాళ్ళ గ్రామంలో పది వరకే ఉండేది. తరువాత ఇంటర్ కోసం పక్కనే ఉన్న గ్రామానికి వెళ్ళేవాడు. పది వరకు తెలుగు మీడియం చదివాడు.. తరువాత ఇంటర్ ఇంగ్లీష్ మీడియం అయినా ఎలాగో కష్టపడి చదివి పాస్ అయ్యాడు.
రాము కి కంప్యూటర్ ఇంజనీర్ కావాలని లక్ష్యం. దాని కోసం కచ్చితంగా సిటీ కి వెళ్ళాలి. రాము బాగా చదువుతాడు కానీ కొంచం భయస్తుడు. ఎక్కువ ఎవరితోనూ కలవడు. అమ్మాయిల వైపు అసలు చూడడు. ఎంసెట్ లో కూడా 25th ర్యాంక్ తెచ్చుకున్నాడు. కౌన్సిలింగ్ పూర్తి అయింది.
తనకి వైజాగ్లో ఒక మంచి కాలేజీ లో సీట్ వచ్చింది. ‘ఇలాంటి భయస్తుడు అలాంటి సిటీ లో ఉండగలడా’ అని సీతమ్మ గారు పడతారు.
చంద్రం గారు “నువ్వు ఏదీ మనసులో పెట్టుకోకు. సమయం, పరిస్థితులు మనిషికి ఎలా అయినా బ్రతికే ధైర్యన్ని ఇస్తాయి. తల్లిదండ్రులుగా మనం రాము కి ఎగిరే స్వేచ్ఛను, మేము నీకు తోడు ఉన్నాము అనే నమ్మకాన్ని ఇవ్వాలి” అని నచ్చచెపుతారు..
రామును కాలేజీ లో చేర్చి చంద్రం గారు వెళ్లిపోయారు. రాముకి ఏడుపు ఒకటే తక్కువ. వాళ్ళ నాన్న అలా విడిచి వెళ్ళుతుంటే బాధ వేస్తుంది. తరువాత కాలేజీ కి వెళ్ళాడు. అక్కడ అందరూ ఇంగ్లీష్ లోనే మాట్లాడుతున్నారు. చాలా మంది వచ్చి తనతో మాట్లాడినా కూడా తనకి ఉన్న బిడియం వల్ల మాట కలపలేక పోతాడు. హాస్టల్ లో రూమ్ మేట్స్ వచ్చి మాట్లాడినా కూడా అలాగే ఉంటాడు. ఇన్ని రోజులు అమ్మ, నాన్నలతో సంతోషంగా ఉన్న తాను ఇలా ఎలా ఒంటరిగా ఉండగలడు? తన ఫోన్ తీసుకొని వాళ్ళ నాన్న కు వీడియో కాల్ చేసి మాట్లాడిన తరువాత తనకు కొంచం బాధ తగ్గుతుంది.
అప్పుడు వాళ్ళ అమ్మ గారు" చూడు కన్నా! ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే, ధైర్యంగా ఉండాలి. తెలియని వాటిని ఫోన్ లో చూసి నేర్చుకో. అలాగే మన మాట మంచిగా ఉంటే చాలు, ప్రతి ఒకరు మనతో కలిసి పోతారు. భయ పడుతూ ఉంటే నువ్వు అనుకున్న లక్ష్యం ఎప్పటికి చేరుకోలేవు” అని హితబోధ చేస్తారు.
“అలాగే అమ్మా !” అని రాము ఫోన్ పెట్టేస్తాడు..
తరువాత తాను హాస్టల్ దగ్గరలో ఉన్న పార్క్ కి వెళ్తాడు. అక్కడ ఒక బెంచ్ పైన కూర్చొని ‘ఎలా నా భయాన్ని పోగుట్టుకోవాలి’ అని ఆలోచిస్తాడు. అప్పుడు తనకి ఆకలి వేస్తుంది. ఏమైనా తినడం కోసం అక్కడ వెతుకుతుంటే ఒక అబ్బాయి… 15 వ సంవత్సరాలు ఉంటాయి, తాను వేరుశెనగలు అమ్ముతూ ఉంటాడు. అక్కడికి ఒక విదేశీ జంట వస్తే ఆ అబ్బాయి ఇంగ్లీష్ లో కమ్యూనికేట్ చేస్తాడు. రాము షాక్ అవుతాడు. తరువాత ఆ అబ్బాయి దగ్గరికి వెళ్తాడు.
“నువ్వు అలా ఎలా ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు? చదువుకోకుండా ఇక్కడ ఎం చేస్తున్నావు” అని అడుగుతాడు ఆశ్చర్యంగా...
ఆ అబ్బాయి “అన్నా! నా పేరు సూర్య, నేను పదవ తరగతి చదువుతున్నాను. అమ్మ, నాన్న ఒక ఫ్యాక్టరీ లో పని చేస్తున్నారు. నేను స్కూల్ అయిపోయిన తరువాత ఇక్కడికి వచ్చి అమ్మ చేసి ఇచ్చిన వాటిని అమ్ముతాను. వచ్చిన డబ్బు నా చదువు కోసం వాడుతాను” అని చెప్పాడు.
రాము “నీకు భయం వేయడం లేదా వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు?” అని అడిగాడు .
సూర్య నవ్వుతూ " అన్నా! మనం ఎందుకు భయపడాలి? మనం భయపడుతూ ఉంటే ఎలా మన లక్షాన్ని మనం చేరుకుంటాం? భయ’పడడం’ లోనే పడడం ఉంది. ఆశ కాన్సర్ ఉన్నవాళ్ళని బ్రతికిస్తుంది. భయం అల్సర్ ఉన్నవాళ్ళని కూడా చంపేస్తుంది” అని చెబుతాడు.
రాము క్లాప్స్ కొడితే “అన్నా! ఈ డైలాగ్ నేను కాదు చెప్పింది, అల్లు అర్జున్. ఒక మూవీ లో చెప్పాడు నేను నీకు చెపుతున్నానంతే ! చూడు అన్నా! మన లైఫ్ చాలా చిన్నది. అనవసర భయాలతో టైం వేస్ట్ చేసుకోకూడదు” అన్నాడు..
ఇదంతా విన్న రాము కూడా ‘మారాలి’ అని ఒక నిర్ణయానికి వచ్చాడు. ‘భయాన్ని వీడి ధైర్యం తెచ్చుకోవాలి’ అని నిర్ణయం తీసుకుంటాడు.
“అన్నా! ఇది లాస్ట్ పొట్లం. నువ్వు తీసుకుంటే నేను వెళ్ళి చదువుకోవాలి. అసలే నాకు మాథెమాటిక్స్ అంటే ఇష్టం. కానీ నేను ఇంకా ఎక్కువ నేర్చుకుంటేనే కదా కలెక్టర్ అయ్యేది” అంటాడు.
రాము “నువ్వు చిన్నవాడివైనా చాలా మంచి మాట చెప్పావు. నీకు నేను ట్యూషన్ చెబుతాను”
అని మాథెమాటిక్స్ ని ఈజీ వే లో ఎలా చేయాలో నేర్పిస్తాడు.
సూర్య, రాముని హాగ్ చేసుకొని ‘థాంక్స్’ అంటాడు.
రాము నవ్వుతూ "నీ ఫ్రండ్స్ ఎవరు వున్నా సరే! నువ్వు పార్క్ కి తీసుకొని రా. నేను ట్యూషన్ ఫ్రీ గానే చెపుతాను” అన్నాడు.
తరువాత హాస్టల్ లో రూమ్మేట్ రవి తో మాట్లాడుతాడు. త్వరలోనే వాళ్ళు ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అవుతారు. తరువాత కాలేజీ లో కూడా రాము తన భయాన్ని కొద్ది కొద్దిగా అందరితో మాట్లాడుతూ తగ్గించుకుంటాడు.. టైం దొరికితే చాలు మొబైల్ లో ఇంగ్లీష్ నేర్చుకునే వాడు. ఎక్కువ సేపు లైబ్రరీ లో ఉండేవాడు. కొద్ది రోజుల్లోనే లెక్చరర్ లకి, స్టూడెంట్స్ కి తన మాటకారితనంతో బాగా దగ్గర అయ్యాడు. పార్కుకి ప్రతి రోజూ వెళ్ళి సూర్యకి, ఇంకా కొంతమంది పిల్లలకి ట్యూషన్ చెప్పేవాడు.
ఇలా చేయడం వల్ల రాము తన భయాన్ని, బిడియాన్ని తగ్గించుకున్నాడు. తానే చెప్పే విధానం నచ్చి, ఆ పార్క్ వచ్చే పెద్దవాళ్ళు వారి పిల్లలకి కూడా ట్యూషన్ చెప్పమంటే తనకి చాల హ్యాపీ గా అనిపించి అలా పార్ట్ టైం ట్యూషన్ చెప్పేవాడు. వాళ్ళు ఎంత ఇస్తే అంతా తీసుకునేవాడు. ఎవరైనా ఇవ్వక పోయినా ఏమీ అనేవాడు కాదు. ఎంతో ఇష్టంగా ట్యూషన్ చెపుతూ ఉండేవాడు.. ఇన్నాళ్ళు ఈ ప్రపంచంలో నేను ఎలా బ్రతక గలను అనుకున్న తనకిప్పుడు లోకమే అందమైన ప్రపంచంగా కనిపిస్తుంది...
ఒక రోజు రాము వాళ్ల అమ్మ, నాన్న తనని చూడడానికి కాలేజీ కి వచ్చినప్పుడు తాను సెమినార్ ఇస్తున్నాడు. తానే చెప్పే విధానం అందరికీ నచ్చి క్లాప్స్ కొడుతుంటే వాళ్ల అమ్మ నాన్నకి హ్యాపీగా అనిపిస్తుంది. అంత ఎత్తుకు ఎదిగిన వారి అబ్బాయి రాముని చూస్తుంటే వారి కళ్లలో ఆనంద బాష్పాలు వస్తాయి.
చంద్రం గారు "చూసావా సీతా! మన రాముడు ఎలా మారిపోయాడో.. నేను చెప్పాను కదా, టైం ఎవరిని అయినా సరే మారుస్తుంది” అన్నారు.
సీత గారు "ఎవరి కొడుకు ఇక్కడ?’ అంటారు నవ్వుతూ.
“చంద్ర గారు షాక్.. సీత గారు రాక్స్..” అంటూ రాము వచ్చి వాళ్ళ అమ్మ ను హాగ్ చేసుకుంటాడు.
తరువాత పార్క్ కి తీసుకువెళ్లి తాను ట్యూషన్ చెప్పే వాళ్ళకి అమ్మ, నాన్నలను పరిచయం చేస్తాడు.. సీత గారు తాను తెచ్చిన పండ్లను, స్వీట్స్ ని అక్కడున్న పిల్లలకి ఇస్తారు.
అలా రాము చక్కగా చదువుకొని ఇంజనీర్ అయ్యాడు. తనకు టైం ఉన్నపుడు దగ్గర లో ఉన్న అనాథ ఆశ్రమంలో ఉన్న పిల్లలకి చదువు చెపుతున్నాడు. అంతే కాదు మన సూర్య ని కూడా రాము తన డబ్బు తో చదివిస్తున్నాడు.
మనం భయాన్ని అధిగమించినపుడే ఎటువంటి పరిస్థితిని అయినా ఈజీగా క్రాస్ చేయగలం..
మనకు లైఫ్ లో చాలా సిట్యుయేషన్స్ వస్తూ ఉంటాయి. వాటిని చిరునవ్వుతో, ధెర్యంగా ఎదురుకోవాలి. సమయం ముఖ్యమైంది. ఒకసారి వెళ్ళితే మరల తిరిగి తీసుకురాలేము...
@@@@@@@@@@@@@
లోకమే అందంగా మారదా
నీ పై నమ్మకం ఉంటే...
ప్రపంచమే కొత్తగా కనపడదా
నీలో ధైర్యం ఉంటే...
అడుగులు తడపడితే బాధ పడకు..
వెనుకంజ వేయకు..
ఎన్నో అశలని..
మరెన్నో ఆశయాలను
ఇంకెన్నో కలలను
నిజం చేసుకోవాలి అనుకుంటే
భయాన్ని వీడి...
అడుగు ముందుకు వేస్తే
విజయం తప్పక నీ సొంతం అవుతుంది.
***శుభం***
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
https://linktr.ee/manatelugukathalu
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
https://www.facebook.com/ManaTeluguKathaluDotCom
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
నీ ప్రేమకై వేచి చూస్తున్న నేను
మోడరన్ నాన్నమ్మ చెప్పిన సోక్రటీస్ కథ

రచయిత్రి పరిచయం :
నమస్తే. నా పేరు ధనలక్ష్మి. వృత్తి రీత్యా ప్రైవేట్ స్కూల్లో గణితం బోధిస్తాను. మాది మదనపల్లి, చిత్తూర్ జిల్లా. కథలు , కవితలు రాయడం నాకు ఇష్టమైన వ్యాపకం. ఆనందం వేసినా, బాధ వేసినా, కోపం వచ్చినా నేను పంచుకునే నా నేస్తం అక్షరం. నాలో మెదిలే భావాలను, నేను చూసిన సంఘటనలను రాయడం నాకు అలవాటు.