top of page
Original.png

గో సంరక్షణ


గో సంరక్షణ, గోసేవ, గోమాత, గోపూజ, గోశాల, పశుసంపద, భారతీయ సంస్కృతి, ధార్మిక వ్యాసాలు, అద్దంకి లక్ష్మి, మన తెలుగు కథలు

సాంప్రదాయ గోశాలలో దేశవాళీ గోవులకు ఆకుకూరలు, కూరగాయల తొక్కలు, గంజి అందిస్తూ గోసేవ చేస్తున్న మహిళలు మరియు స్వచ్ఛంద సేవకులు.
సాంప్రదాయ గోశాలలో దేశవాళీ గోవులకు ఆకుకూరలు, కూరగాయల తొక్కలు, గంజి అందిస్తూ గోసేవ చేస్తున్న మహిళలు మరియు స్వచ్ఛంద సేవకులు.

Go Samrakshana - Telugu Inspirational Article Addanki Lakshmi

గో సంరక్షణ - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | అద్దంకి లక్ష్మి

Published In manatelugukathalu.com On 30/06/2026

 

గోవు భారతీయ సంస్కృతిలో కేవలం ఒక పశువు మాత్రమే కాదు, కరుణ, సేవ, ప్రకృతి పరిరక్షణకు ప్రతీకగా భావించబడుతుంది. "గో సంరక్షణ" అనే ఈ వ్యాసంలో గోవుల ప్రాముఖ్యత, దేశీయ గోవుల పరిరక్షణ అవసరం, గోశాలల పాత్ర, ప్రతి కుటుంబం చిన్నచిన్న ప్రయత్నాలతో గోవులకు ఎలా మేత సమకూర్చగలదో వివరంగా తెలియజేశారు. ఇంట్లో మిగిలే కూరగాయల తొక్కలు, ఆకుకూరల వ్యర్థాలు, గంజి వంటి వాటిని సద్వినియోగం చేసి గోసేవలో భాగస్వాములు కావచ్చని ఈ వ్యాసం చక్కగా వివరిస్తుంది. గోవుల సంరక్షణ ద్వారా పశుసంపద అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, మానవతా విలువల పెంపు వంటి అంశాలపై ఆలోచింపజేసే విలువైన రచన ఇది.


గోవు పరదేవతా స్వరూపం. గోవు సకల దేవతా స్వరూపం. హిందువులు గోమాతను పూజిస్తారు.


పీఠాలలో చేసేవి గజ పూజ, అశ్వ పూజ పశుపూజ. 


కానీ గోవుకు చేసే పూజ సాక్షాత్ కామాక్షికి చేసిన పూజతో సమానం.


 గోవు అంటే దేశవాళి గోవు. వేరేవి గోవులు కాదు.


మనకు గోపూజ చేసే సంప్రదాయం ఉన్నప్పటికి, చాలా మంది గోవులను సరిగ్గా రక్షించరు. 


వేరే దేశాలతో పోలిస్తే మన దేశంలో గోవుల సంఖ్య ఎక్కువ, కానీ పాల ఉత్పత్తి మాత్రం చాలా తక్కువ. వేరే దేశాలతో పోల్చితే మన దేశంలో పాలను చాలా తక్కువ తీసుకుంటాము.


ఇప్పుడు గోవధశాలల్లో చంపబడుతున్న గోవులన్నీ వారు మన హిందువుల నుండి తీసుకున్నవే.


దీనికి ముఖ్య కారణం పశువుల మేతపై మనకు ముందుచూపు లేకపోవడమే. 


మనదేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మ అయిన గోవుల విషయంలో మన శాస్త్రం మనకు ఇచ్చిన బాధ్యతలను కూడా మర్చిపోయాము. ఇళ్ళల్లో గోవులను పెట్టుకుని పోషిస్తున్న వారు కూడా వాటి విషయంలో చేయరాని పాపం చేస్తున్నారు.


వాటిని సరిగ్గా పట్టించుకోవడం లేదు. కేవలం వాటి పాలను అమ్ముకుని డబ్బు సంపాదిస్తున్నారు.


కాని గో సంరక్షణ మనందరి బాధ్యత. ఏమాత్రం ఖర్చులేకుండా గోవులకు మేత సమకూర్చడం చాలా తేలిక. గృహిణులు, హోటల్ యాజమాన్యం, హాస్టల్ వంటవారు రోజూ వారి వంటల్లో వాడే ఆకుకూరల వ్యర్థాలు, పళ్ళు కూరగాయల తొక్కు, బియ్యం కడిగిన నీళ్ళు, అన్నం వంచిన గంజి మొదలగునవి శుభ్రంగా భద్రపరిచి వాటిని గోవులకు పెడితే సరి. వాటికి కావలసిన పోషణ మేత రెండూ లభిస్తాయి.


కాని ఈరోజు మనం వీటన్నింటిని అనాలోచితంగా వీధులలో, చెత్త బుట్టలలో పారబోసి మన పారిశుధ్య కార్మికులకు పని పెడుతున్నాము.


ప్రతివారు వీటిని దగ్గర్లో ఉన్న గోశాలకు ఇస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీనికి కేవలం కొద్ది శ్రమ, చేయవలెనన్న ఆలోచన ఉండాలి అంతే.


గోశాలా నిర్వాహకులు మరియు గోవుల యజమానులు కొంతమంది కలిసి ప్రతి ఇంటికి వెళ్ళీ వీటిని సేకరించవచ్చు. అలా సేకరించినది చాలా గోవులకు సరిపోగలదు. వాటికి మంచి పోషణ కూడా లభించగలదు.

గోవు మనకు పాలు ఇస్తుంది పాలు పెరుగు వెన్న నెయ్యి, ఎంతో ఉపయోగం, చిన్నపిల్లలకు పాలు పట్టిస్తాము.


ఈ చిన్న ఆలోచన చేత గోవులకు మంచి మేత లభించడమే కాక మన దేశ పశుసంపద కూడా వృద్ధి పొందుతుంది. మనం గోవులను సంరక్షించము అనే అపవాదు తొలగటంతో పాటు ఈ గోసేవ వల్ల శాస్త్రంలో చెప్పినట్టు పుణ్యం కూడా చేకూరుతుంది.


***

అద్దంకి లక్ష్మి గారి కొన్ని ఇతర రచనలు:


అద్దంకి లక్ష్మి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


అద్దంకి లక్ష్మి
అద్దంకి లక్ష్మి

రచయిత్రి పరిచయం: అద్దంకి లక్ష్మి

నా పేరు శ్రీమతి అద్దంకి లక్ష్మి

జన్మ స్థలం:రాజమహేంద్రవరం

డేట్ అఫ్ బర్త్

3_6_1946.

నివాసం: నవీ ముంబయి

విద్యార్హతలు:

బి.ఎ; బి. ఇడి

**వృత్తి:విశ్రాంత ఉపాధ్యాయిని,

బాంబే మునిసిపల్ కార్పొరేషన్


**తల్లిదండ్రులు: శ్రీమతి రత్నమ్మ గారు_శ్రీరామ మూర్తి గారు.

భర్త:శ్రీ వేంకటేశ్వర రావు;

విశ్రాంత జాయింట్ కమిషనర్, ఆదాయపు పన్ను శాఖ

**కుమారుడు:

గిరిధర్ సిఏ;ఎంబీఏ; శాక్రమెంటో కాలిఫోర్నియా,


**కూతురు:మాధురి వెబ్ మేనేజర్ న్యూయార్క్ స్టేట్ అమెరికా.

అల్లుడు మధుసూదన్ అమెరికా

వృత్తి/ప్రవృత్తిలో ముఖ్య ఘట్టాలు


**నూతన విద్యా విధానం గురించి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి,ఉత్తమ రిసోర్స్ పర్సన్ టీచర్ గా పురస్కారం పొందాను,


నిరక్షరాస్యతను నిర్మూలించుటకు

సేవా కార్యక్రమాలు నిర్వహించాను,,


నాటకాలు వ్రాసి

విద్యార్థుల నాటకాలు

వేయించాను బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ రైటర్ అవార్డులు పొందాను,

సౌత్ ఇండియన్ భాషలలో వేయించిన నాటకాల్లో, పిల్లలకు బెస్ట్ యాక్టర్ గా పురస్కారాలు లభించాయి


చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు ప్రత్యేకంగా పాఠాలు చెప్పి వారి విద్యాభివృద్ధికి తోట్పడినాను,


**తెలుగు రచయితల సంఘం మహారాష్ట్ర వారి సంకలనాలలో కథ,కవిత రాసి పురస్కారాలు పొందాను,


**ఆల్ ఇండియా రేడియో తెలుగు కేంద్రంలో ఢిల్లీలో నాలుగేండ్లు తెలుగులో వార్తలు చదివిన అనుభవం


**ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ లో నాలుగేండ్ల అనుభవం


సాహితీ జీవితం_రచనలు

**వివిధ సాహితీ సమూహాల్లో కథలు,కవితలు రాస్తుంటాను

**ఆంధ్ర ప్రభ,ఆంధ్ర పత్రికల్లో కథలు, వ్యాసాలు ప్రచురించ బడ్డాయి


ఆంధ్రప్రభ పత్రికలో కథలకు బహుమతులు పొందాను


**అనేక సమూహాల్లోని

ఇ-సంకలనాలలో నా కథలు,కవితలు,

పద్యాలు ప్రచురించ బడినవి

కవితలకు కథలకు బహుమతులు పొందినాను


నేను రాసిన

కవితలు మరియు ప్రక్రియలు 4000 పైగా

**మినీ కవితలు

పంచపదులు

సున్నితాలు

ఇష్టపదులు

**గేయాలు

**వ్యాసాలు

**నాటకాలు

పద్యాలు

గజల్స్

కథలు

రుబాయీలు

బాల సాహిత్యం

**పేరడీ పాటలు 20 వివిధ దిన పత్రికలలో ప్రచురించబడ్డాయి


*సాహిత్య సేవ

తేనియలు,

తొణుకులు,

చిలక పలుకులు,

పరిమళాలు,

మధురిమలు,

ముత్యాలహారాలు,ఇష్టపదులు,

సకినాలు,

సున్నితాలు,

పంచ పదులు, బాల పంచ పదులు, నానీలు అనేక లఘు కవితా ప్రక్రియల్లో అన్నిట్లోనూ శతాధికంగా కవితలు రాసి, ప్రశంసా పత్రాలను పొందినాను,


**1500 వందలకు పైగా ప్రశంసా పత్రాలు పొందాను

**సాహితీ చక్రవర్తి, ఇష్టపది శ్రేష్ఠ,కవన కిరణం, అక్షర ఝరి , పంచపది కవి రత్న లాంటి , సాయి వనములో సాహిత్యం నుంచి కవన రత్న, కథా భూషణ్, మెదక్ జిల్లా విశిష్ట పురస్కారం, ఏకె మీడియం ముంబై వారి పురస్కారం, నారీ శ్రీ, సున్నితార పురస్కారం,,

అన్ని గ్రూపుల నుంచి,

15 బిరుదులు పొందడం జరిగినది,


ఆగస్టు 2022లో అమ్మ అంశముపై నేను రాసిన పద్యములకు,,

2 సున్నితాల ప్రక్రియ లో కవితకు కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైనను,


రెండుసార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యాను,


1.ప్రచురణ,,,


1 ,కవితా కుసుమాలు పుస్తకాన్ని ప్రచురించుకున్నాను,


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page