top of page
Original.png

గౌరీ శంకరుల సంవాదం - పార్ట్ 4

17 hours ago
3 min read

గౌరీ శంకరుల సంవాదంలో చతురాశ్రమ ధర్మాలు, గృహస్థాశ్రమం మరియు అహింసను వివరిస్తున్న పరమేశ్వరుడు

Gouri Sankarula Samvadam - Part 4 - Telugu Devotional Story | Bhaskara Rao B. R. K. V.

గౌరీ శంకరుల సంవాదం - పార్ట్ 4 - తెలుగు ఆధ్యాత్మిక కథ | బి ఆర్ కె వి భాస్కర రావు

Published in manatelugukathalu.com on 04/10/2026


గౌరీ శంకరుల సంవాదం – పార్ట్ 4లో పార్వతీదేవి అడిగిన ప్రశ్నలకు సమాధానంగా పరమేశ్వరుడు బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం అనే చతురాశ్రమ ధర్మాలను వివరిస్తాడు. అన్ని ఆశ్రమాల మనుగడకు గృహస్థాశ్రమమే ఆధారమని తెలియజేస్తూ, తల్లిదండ్రుల సేవ, అతిథి సత్కారం, దానం, దయ, జీవకారుణ్యం వంటి కర్తవ్యాల ప్రాముఖ్యాన్ని వివరిస్తాడు. అనంతరం “జీవులను హింసించకుండా ఉండటమే పరమ ధర్మం” అనే అహింసా రహస్యాన్ని పార్వతికి బోధిస్తాడు.




గౌరీ శంకరుల సంవాదం - పార్ట్ 4 చదవండి.

 

“నాథా! ఇక ఆశ్రమ ధర్మాలను విశదపరచండి” అని గౌరి కోరగా, పరమేశ్వరుడు మొదటిదైన బ్రహ్మచర్య ధర్మాన్ని వివరిస్తూ “ఈ వ్రతం అవలంబించడంలో గొప్ప నిలకడ అవసరం. గురుదేవుడిని ఆశ్రయించడం, భిక్షాన్నం భుజించడం, హోమాలు సల్పడం బ్రహ్మచారి విధులు.


దేవి! అన్ని ఆశ్రమాలకు గృహస్థాశ్రమం ఆధారభూతమైనది. పరిశుద్ధతను పాటించడం, తన భార్యతోనే సంతృప్తి చెందడం, వేదములందు ఆసక్తి, దానం, హోమం, దయ, అతిథి పూజ గృహస్థునకు ఆచరణీయములైన ధర్మాలు.


అడవిలో నివసించడం, కందమూలాలను భక్షించడం, స్త్రీ సంగమ విసర్జనం, జడలు తాల్చడం, చర్మాలు ధరించడం వానప్రస్థాశ్రమంలో ఉన్నవారి ధర్మాలు. 


కోపంగా ఉండకూడదు, ఇంద్రియాలను అణచివేయాలి. బ్రాహ్మణులతో కలసి నివసించాలి. భిక్షాన్నం భుజించాలి. కారుణ్యం కలిగి ఉండాలి. ఓ శైలజా! ఇవి వేదాలలో చెప్పబడిన సన్యాసి ధర్మాలు.


ఆకలి దప్పులతో ఇంటికి వచ్చిన అతిథికి అన్నం పెట్టి అతడి బడలిక తీర్చడం పుణ్యాలన్నింటిలో గొప్ప పుణ్యం. ఈ అతిథి సత్కారానికి, తక్కిన ఆశ్రమ ధర్మాల మనుగడకు గృహస్థాశ్రమమే ఆధారం కనుక ఏ ఆశ్రమం కూడా దీని పదారవ భాగానికి కూడా సమానం కాదు. అనగా చతురాశ్రమాలలో గృహస్థాశ్రమమే కడు గొప్పదని భావం.” అని చంద్రశేఖరుడు వివరించాడు.


“నాథా! గృహస్థునికి ఏ పని ముఖ్యం?” అని పార్వతి అడుగగా, “అతని తల్లిదండ్రుల పూజ ముఖ్యమైన పని” అని శివుడు బదులిచ్చాడు.


“కైలాసవాసా! గృహస్థు తల్లిదండ్రులనూ, భార్య భర్తనూ కోల్పోయినప్పుడు వారు చేయవలసిన పనులేమిటో సెలవివ్వండి” అని దుర్గ కోరగా…


“చెప్తాను విను. దేవతలు, పితృదేవతల పూజలు, అతిథులను గౌరవించడం నరులకు ముఖ్యం.

బ్రహ్మచర్య వ్రతం ఏ విధంగానైనా ఏమరకుండటం విధవలకు యుక్తం. నెలలో వచ్చే అష్టమి, చతుర్దశి, పూర్ణిమ, అమావాస్య, రవి సంక్రాంతి తిథుల్లో సంగమం వదలి కేవలం తన భార్యతోనే సంగమించి, గృహంలోని ధాన్యాలను ఎలుకలు, పక్షులు తింటుంటే వాటిని హింసించకుండా అవి కూడా బ్రతుకుతాయి కదా అని భావించే గృహస్థునకు అశ్వమేధయాగం చేసిన ఫలం లభిస్తుంది.”



పార్వతి “నాథా! ధర్మ రహస్యం వినాలని కుతూహలంగా ఉంది” అనగా..

“దేవీ! సకల ధర్మ సమూహమునందు జీవులను హింసించకుండుటయే పరమ ధర్మం” అని పలికాడు శివుడు.


“ప్రాణేశ్వరా! హింస చేయకుండా ఉండడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అహింసా స్వరూపం ఎలాంటిదో తెలుపమని” జగజ్జనని వేడగా,


“ప్రేయసీ! నీవన్నట్టు నేలమీద చీమలు, దోమలు, తలలోని పేలు వంటి కీటకాలను చంపకుండా ఉండుట ఎవ్వరికీ సాధ్యం కాదు. అందుచేత ఫలాలు ఇచ్చి, నీడనివ్వడానికి ఆకులు బాగుగా ఉన్న చెట్లనుండి రాలే ఫలాలు తింటూ, ఆకలి తీర్చుకుంటూ, ఆవు పాలో, పెరుగో తాగి దాహం తీర్చుకుంటూ, బుద్ధిని ఇతర విషయాల మీదకు పోకుండా చిత్తరువులోని బొమ్మ మాదిరిగా చలన రహితులై జితేంద్రియులైన మహానుభావులు అహింసావాదులు” అని చెప్పాడు జగన్నాథుడు.


“ఇంకా అహింసావాదమెట్టిదంటే, మనుషులు తమ తమ పనులు చేసుకుంటున్నప్పుడు ఎన్నో జీవులు — ఉదాహరణకు దీపపు పురుగులు, నాగలి కర్రకు తగిలిన జీవులు — చనిపోతే ఆ పాపం మనిషికి అంటదు. 


రంతిదేవుని యాగంలో పడి చనిపోవడానికి ఎన్నో గోవులు వచ్చి రాజును కోరాయి. ఆ రాజు వాటిని సంహరించగా వాటి చర్మాలు గట్టుగా, వాటి నెత్తురు నదిగా ప్రవహించింది. ఆ నది చర్మణ్వతి నదిగా పేరుగాంచి, దానిలోని రక్తం పావన జలమై, రుచికరమైన కమ్మని పరిమళాలు వెదజల్లుతూ ప్రసిద్ధికెక్కెను.”


గౌరీ శంకరుల సంవాదం - పార్ట్ 5 త్వరలో మీ ముందుకు వస్తుంది. 


*** 


📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y


బి ఆర్ కె వి భాస్కర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


బి ఆర్ కె వి భాస్కర రావు

రచయిత పరిచయం: బి ఆర్ కె వి భాస్కర రావు


ప్రతి ఒక్కరు చెప్పే సాధారణ సాకే అనుకోకపోతే నాక్కూడా తక్కువ ఖాళీ వల్ల ఎక్కువ కథలు రాయలేకపోయాను. బీఎస్సీ చదివి తాత తండ్రుల వారసత్వంగా వచ్చే వైద్యం చేపట్టి పల్లెటూరులో ఆర్ఎంపీ గా స్థిరపడి అడపా దడపా కథలు రాస్తూ గడుపుతూ ఉంటాను.ఆంధ్రప్రభ,ఆంధ్రభూమి,అంజలి,గీతాంజలి వంటి వీక్లీ లలో కథలు,వ్యాసాలు,కవితలు నావి అచ్చయ్యాయి.

భారతం ,భాగవతం లాంటి పురాణాలు అంటే చెవి కోసుకుంటాను.

రచయితలలో కొడవటిగంటి కుటుంబం రావు,చాసో,బుచ్చిబాబు నాకు ఇష్టమైన వారు.

ఒకప్పుడు పుస్తకం హస్తభూషణం అనేవారు.మరి ఇప్పుడో సెల్ ఫోన్ హస్త భూషణం అనే రోజులొచ్చాయి.

పుస్తకాలు తీరిగ్గా చదివే ఓపిక సమయం లేనిఈ రోజుల్లో పాఠకుల మనసును గ్రహించి వాళ్ళను రంజింప చేసే ప్రయత్నం లో మన తెలుగు కథలు యాజమాన్యం వారు రచయితలకు గొప్ప ప్లాట్ఫారం ఏర్పాటు చేయడం అభిందనీయం. వీక్లీలు పుస్తక రూపంలో ఇంచుమించు కనుమరుగయ్యే నేటి రోజుల్లో రచయితలకు దిశ ,దశ చూపించినందుకు కృతజ్ఞతలు

నాపేరు బి ఆర్ కె వి భాస్కర రావు

ఊరు పాలి

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page