గుడ్డి ప్రేమ

Guddi Prema - Telugu Love Story | Penumaka Vasantha
గుడ్డి ప్రేమ - తెలుగు ప్రేమ కథ | పెనుమాక వసంత
Published In manatelugukathalu.com On 17/10/2026
నిజమైన ప్రేమకు కళ్లతో చూసే అందం కాదు, మనసుతో గుర్తించే మంచితనం ముఖ్యం. చిత్రకారుడు శశివర్మ, సుచిత్రల ఆత్మీయ అనుబంధం ద్వారా ప్రేమ, నమ్మకం, ఆత్మగౌరవం విలువలను తెలియజేసే హృదయాన్ని తాకే తెలుగు కథ “గుడ్డి ప్రేమ”.
ప్రఖ్యాత చిత్రకారుడు శశివర్మ చిత్రాలు టౌన్ హాల్లో పెడితే, చూడటానికి త్వరగా రెడీ అయి వెళ్లేది సుచిత్ర.
ఇంతవరకు పేపర్లో ఆయన గురించి వినడమే కానీ చూడలేదు. ఇవాళ ఆయన్ని చూడబోతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. తను కూడా పెయింటింగ్స్ వేస్తుంది కాబట్టి చిత్రాల ఎగ్జిబిషన్ ఎక్కడ జరిగినా వెళ్తుంది సుచిత్ర.
ఆయన ఎక్కువగా ముంబాయిలో ఉంటాడు, ఇవాళ హైదరాబాదు వచ్చాడు. "ముందు నా అభిమాన చిత్రకారుడు అయిన ఆయన్ని చూడాలి" అనుకుంటూ వెళ్లేది సుచిత్ర.
సుమారు యాభై ఏళ్లు ఉంటాయి ఆయనకి. అందరితో ఎంతో చక్కగా మాట్లాడుతూ నవ్వుతూ ఉన్నాడు. నెరిసిన గడ్డంతో, నల్ల కళ్లజోడులో తను ఎలా ఊహించుకున్నదో... అలానే ఉన్నాడు! తెలుగు వాడవటం వల్ల తనని పరిచయం చేసుకుని మాట్లాడింది.
"సార్, నమస్తే! మీ పెయింటింగ్స్ అంటే నాకిష్టం. మిమ్మల్ని ఎప్పటి నుండో కలవాలని ఉంది, ఇప్పటికి కుదిరింది," అంటూ నవ్వింది.
"థాంక్స్...! మీరు ఏం చేస్తారు?"
"నేను ఏదో పిచ్చి గీతలు గీస్తాను. మీ పెయింటింగ్స్ మా ఇంట్లో ఉన్నాయి సార్."
"నేను మొదట్లో పిచ్చి గీతలు గీసినవాడినే...!" అంటూ నవ్వాడు శశివర్మ.
చిత్రాలు చూస్తూ... "అబ్బా! మొదటి చిత్రానికి కింద 'తీరానికి అన్వేషణ' అంటూ సముద్రపు అలలు తీరానికి చేరాలనే తపన చూపించారు... చాలా బాగుంది సార్!"
"'ఆశల అంకురం'... ఈ చిత్రంలో మన ఆశలు మొలకెత్తినట్లుగా చూపించారు. అబ్బా...! ఏమి ఆలోచన సార్!"
"'కలల కాన్వాస్' అంటూ ఇంద్రధనస్సు వేశారు. దానికి అర్థం ఏంటి సార్?"
"మనం రంగు రంగుల కలలు కంటాము. ఆ రంగులను ఇంద్రధనస్సు రూపంలో మలుస్తూ వేసిన చిత్రం అది."
"సార్, ఇది 'ముసుగు వెనుక' అంటూ ఆ స్త్రీ బొమ్మ స్పష్టంగా కనపడలేదు... ఏంటి సార్?"
"ముసుగు వెనుక అంటే... కనపడని స్త్రీ...! కనపడితే ఆ ముసుగు ఉండదు," నవ్వుతూ అన్నాడు శశివర్మ.
"ఇది కూడా 'స్వేచ్ఛా విహంగం' అంటూ ఒక స్త్రీ బొమ్మ పంజరంలో నుండి ఎగరటం ఎంతో బాగుంది. ఆ ముసుగు మహిళేనా సార్ ఎగిరిపోయింది?" అంటూ నవ్వింది.
"ఈ చిత్రంలో ఆమె గుండెసడి వింటే మీకు తెలుస్తుంది... ఆమె ఎందుకు ఎగిరివెళ్లిపోయిందో," హార్ట్ బొమ్మ వేసిన చిత్రం చూపిస్తూ అన్నాడు. ఆ చిత్రం కింద 'ఆమె గుండెసడి...! ఎవరి కోసమో కొట్టుకుంటుంది' అని ఉంది.
దాని పక్కనున్న దాన్ని చూస్తూ... "‘కన్నీటి కాంతి’లో కన్నీరు మాత్రమే కాంతితో మెరిసిపోయేలాగా చూపించారు ఈ చిత్రంలో! సూపర్...! మీలాగా ఎవరూ ఇలా వేయలేరు సార్. ‘కరిగిన కాలం’ చిత్రంలో వయసయిన పెద్ద వయస్సు స్త్రీని సింబాలిక్‌గా చాలా చక్కగా చూపించారు."
"అబ్బా...! ఈ చిత్రంలో ‘మౌనరాగం’ అంటూ కేవలం సప్తస్వరాలను మలిచారు. ఆసమ్ సార్...!"
"ఎందుకు సార్, మీ చిత్రంలో ఎక్కువగా స్త్రీల బాధల గురించి ఇంత చక్కగా వివరిస్తారు?"
దానికి నవ్వి ఊరుకున్నాడు శశివర్మ, జవాబివ్వలేదు.
"సార్, మీరు ఇవాళ మా ఇంటికి డిన్నర్‌కు రావాలి. ప్లీజ్ సార్...! నా పెయింటింగ్స్ చూసి ఇంకా నేను ఎలా వేయాలో చెప్పాలి సార్."
"ఈసారి చాలా బిజీగా ఉన్నాను సుచిత్ర. వచ్చే నెలలో ఇక్కడకు మళ్లీ వచ్చేది ఉంది. అప్పుడు తప్పకుండా వస్తాను."
శశివర్మ నంబర్ తీసుకుని ఇంటికి వచ్చింది. తను వేసిన చిత్రాలు ఆయనకు పంపుతూ ఉంది సుచిత్ర. ఆయన ఎలా వేయాలో వీడియో కాల్లో చెప్తున్నాడు.
ఈసారి హైదరాబాద్ రాగానే సుచిత్ర ఇంటికి వచ్చాడు శశివర్మ. సుచిత్ర పెయింటింగ్స్ చూసి "బాగున్నాయి" అని అన్నిటినీ చేతులతో తడిమి చూశాడు.
"సార్, కళ్లజోడు తీయండి సార్! ఇంకా బాగా కనిపిస్తాయి," అంటే... తీశాడు. శశివర్మ కళ్లు చిట్లించి చూస్తున్నాడు.
"సార్...!" అని విచిత్రంగా చూస్తున్న సుచిత్రను చూసి... "నాకు కళ్లు కనపడవు, కళ్లు కొద్దిగా మాత్రమే కనిపిస్తాయి."
"మరి ఇవన్నీ... ఎలా వేశారు?" విస్తుపోతూ అంది సుచిత్ర.
"హెలెన్ కెల్లర్ నాకన్నా గొప్పవారు. ఆమె బ్రెయిలీ లిపి రాసింది, నేనెంత? నాకు చిన్నప్పుడు బాగానే ఉండేది చూపు. పదేళ్లు వచ్చేసరికి తొంబై శాతం చూపు పోయి ఇలా కొద్దిగా మసకగా కనిపిస్తుంది.
అప్పుడే మా నాన్న మమ్మల్ని వదిలేశాడు. మా అమ్మ కష్టాలు చూసి ఈ చిత్రాలు వేయటం మొదలెట్టాను. మా అమ్మ బ్లైండ్ స్కూల్లో చేర్పిస్తే... అక్కడ ఈ కొద్ది చూపుతో చిత్రాలు నేర్చుకుని వేయటం మొదలుపెట్టాను. తర్వాత మా అక్క ప్రేమలో మోసపోయి ఆత్మహత్య చేసుకుంది.
నాకు జీవితంలో నా ఉన్నతికి పాటుపడిన వీరిద్దరూ ప్రతి చిత్రంలో కనిపిస్తారు. అందుకే నా చిత్రాలన్నీ ఆడవాళ్ల చుట్టూ అల్లుకుంటూ వేసినవే."
"అందుకేనా చాలా సహజంగా ఉంటాయి! మీ మీద ఇంకా నాకు గౌరవం ఎక్కువైంది సార్. మనిద్దరి మధ్య మంచి ఆత్మీయ బంధం పెనవేసుకుంది సార్...!" అంటూ శశివర్మ కాళ్లకు మొక్కింది.
"నువ్వు బాగా వేశావు. ఇంకా బాగా వేసి పేరు తెచ్చుకో...!" అంటూ సుచిత్రను పైకి లేవదీస్తూ ప్రేమగా అన్నాడు శశివర్మ.
"ఎప్పుడు నీ పెళ్లి?" అని అడిగాడు.
"నాకు పెళ్లి చేసుకోవాలనే కోరిక లేదు."
"అదేంటి? ఎందుకు?"
"ఏమో సార్, నాకు మనసుకు నచ్చినవాళ్లు తారసపడలేదు. చదువు, ఉద్యోగం అంటూ ముప్పై ఏళ్లు దాటాయి. తరువాత నా ఉద్యోగం చూసి ఎవరికైనా 'నాకు అహంకారం ఉంటుంది' అని నన్ను పెళ్లి చేసుకోవటానికి ముందుకు రాలేదు.
ఇదిగో ఈలోపల నలభై దాటాయి. మా అమ్మానాన్న చెప్పి చెప్పి విసిగిపోయి వదిలేశారు," అంటూ నవ్వింది.
"సరే, నేను వెళ్తాను," అంటూ లేచాడు.
రోజూ సుచిత్రకు శశివర్మతో మాట్లాడకపోతే నిద్రపట్టదు. ఒకరోజు వాళ్ల అమ్మానాన్నకు చెప్పింది... "నేను శశివర్మను పెళ్లి చేసుకుంటాను," అంది.
వాళ్లు వద్దన్నారు. "పోయి పోయి గుడ్డివాడితో పెళ్లేంటి? నిజంగా నీ ప్రేమ గుడ్డిది! అంత గుడ్డిప్రేమ మంచిది కాదు."
"గుడ్డివాడే కానీ మనసు గుడ్డిది కాదు! మీరు ఎన్నో సంబంధాలు తెచ్చారు. వాళ్లు 'నీ జీతం మాకే ఇవ్వాలి, పెయింటింగులు వేయకూడదు' అని ఎన్నో షరతులు పెట్టారు. వాళ్లు నా ఉద్యోగం, నా వెనుక ఉన్న ఆస్తి చూసి ప్రేమించారు. వర్మతో నా జీవితం బాగుంటుంది.
మీరు ఒప్పుకోకపోయినా నేను వర్మను చేసుకుంటాను. మీరు తెచ్చిన యువకులు కళ్లు ఉన్నా మనసులు గుడ్డివి; కళ్లు లేకపోయినా మంచి మనసున్నవాడు ఆయన," అంటూ లేచి బట్టలు సర్దుకుంది.
సుచిత్ర ఫ్లైట్ ఎక్కింది. తన చేతిలో ఒక పెయింటింగ్ 'తీరం చేరిన నావ' అనే క్యాప్షన్‌తో ఉంది.
దాన్ని చూస్తూ... 'ఇది వర్మకు చూపించాలి. ఈ తీరం చేరిన నావ నేనే అంటే ఎలా నవ్వుతాడో?' ఊహించుకుంటూ కళ్లు మూసుకుంది సుచిత్ర.
***
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
పెనుమాక వసంత గారి కొన్ని ఇతర రచనలు:
పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.












Comments