'Gunapatam Nerpina Pappi, Chintu ' written by N. Dhanalakshmi
రచన : N. ధనలక్ష్మి
బాధ్యతను, బంధాలను మరిచి ప్రవర్తిస్తున్న అమ్మానాన్నలకు బుద్ధి చెప్పిన చిన్నారుల కథ
@@@@@@@@@@@@@@@@@@
“బాబూ చింటూ! పప్పీ! లేవండమ్మా. స్కూల్ కి లేట్ అవుతుంది” అని రంగమ్మ వాళ్ళను లేపి వాష్రూమ్ కి పంపించి తాను హౌస్ మొత్తం క్లీన్ చేస్తుంది.
తరువాత పిల్లలు ఇద్దరూ రెడీ అయి వస్తారు. రంగమ్మ పప్పి కి జడ వేస్తుంది.. చింటూకి, పప్పీకి టిఫిన్ పెడుతుంది.. “మీరు ఇద్దరు త్వరగా తినేస్తే నేను ఇంట్లో పని పూర్తిచేసి, మా ఇంటికి వెళ్తాను” అని చెప్పి తాను కిచెన్ లోకి వెళ్తుంది. వాళ్లకి ఇది అలవాటు. వాళ్ళ అమ్మ నాన్న లక్ష్మణ్, శ్రీజ ఇద్దరూ ఆఫీస్ కి వాళ్ళు లేవక ముందే వెళ్ళిపోతారు. తరువాత ఎప్పుడో వస్తారు.. ఇది వాళ్ళ ఇంట్లో దినచర్య.
తరువాత యధావిధిగా రంగమ్మ వాళ్ళ ఇంటికి, పిల్లలు వాళ్ళ స్కూల్ కి వెళ్ళిపోతారు.
చింటూ 5 వ తరగతి, పప్పి 7 వ తరగతి చదువుతున్నారు. ఇద్దరూ వాళ్ళ క్లాస్ కి వెళ్లారు.. లంచ్ టైం లో ఎవరి ఫ్రెండ్స్ కి దగ్గర వాళ్ళు కూర్చొని తింటారు. అప్పుడు పప్పి ఫ్రెండ్ శాండీ ‘నందూ’ అని వస్తుంది.. మన పప్పి పాప పేరు నందన. శాండీ పాప పేరు శ్రావణి..
"హా.. చెప్పు శాండీ! ఎందుకు రెండు రోజుల నుంచి స్కూల్ కి రావడం లేదు.. మార్నింగ్ రాకుండా ఇప్పుడు ఎందుకు వచ్చావు"
"మా నానమ్మ ఒక రెండు నెలలు తీర్థయాత్రలకు వెళ్తున్నారు. నేను ఇంతవరకు ఒక రోజు కూడా తనని వదిలి ఉండలేదు.. అందుకు రెండు రోజులు తనతో ఫుల్ టైం స్పెండ్ చేశాను. మార్నింగ్ తనని రైల్వే స్టేషన్లో సెండాఫ్ ఇవ్వడానికి వెళ్ళాను. అందుకే లేట్ అయింది” అలా చెపుతూ తాను ఏడుస్తుంది.
‘పప్పీ! నేను తనని చాల మిస్ అవుతాను. నీకు తెలుసా? నాకు ఎప్పుడూ మంచి కథలు చెబుతుంది. ఎవరితో ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో అన్నీ నాన్నమ్మ నేర్పిస్తుంది. ఒకే ఒక్క నెల! అంతే.. తాను కూడా కొద్దిరోజులు ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేయాలి కదా !" అని చెప్పుతుంటే మన పప్పి పాపకు షాక్ గా ఉంటుంది. ‘నానమ్మ ఉంటే ఇంత బాగా ఉంటుందా’ అని అలా మాటలు చెప్పుకుంటూ వాళ్ళ లంచ్ కంప్లీట్ చేసి క్లాస్ కి వెళ్తారు.
యధావిధిగా ఈవెనింగ్ ఇంటికి వెళ్తారు. వీళ్ళు ఇద్దరూ వెళ్ళేటప్పటికి అక్కడ రంగమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు ఫ్రెష్ అప్ అయి వచ్చేటప్పటికి రంగమ్మ పిల్లలకి స్నాక్స్, పాలు టేబుల్ పైన పెట్టింది. వాళ్ళు టీవీ పెట్టి ప్రోగ్రాం చూస్తుంటే వాళ్ళ అమ్మ నాన్న ఆఫీస్ నుంచి ఫ్రెష్ అయి పిల్లలు తో ఆడుతూ ఉంటారు.
అప్పుడు మన చింటూ " నాన్నా! నాకు నాన్నమ్మ ఉన్నారా? లేదా? మీకు తెలుసా.. ఈ రోజు బిట్టు (శాండీ తమ్ముడు ) వాళ్ళ నానమ్మ గురించి ఎంత బాగా చెప్పాడో తెలుసా” అంటూ చెబుతూ ఉంటే పప్పి కూడా అదే విషయం చెబుతుంది..
లక్ష్మణ్ “ఉన్నారు! ఇక్కడ లేరు. వేరే ఊరిలో ఉన్నారు” అని చెప్పి మాట దాటేస్తారు. శ్రీజను కూడా అడుగుతారు పిల్లలు. తాను కూడా మాట దాటేస్తుంది. తరువాత డిన్నర్ చేసి బెడ్ రూమ్ కి వెళ్తారు. అప్పుడు పప్పితో చింటూ గాడు “అక్కా! మనకు నానమ్మ ఉంటే ఎంత బాగా ఉంటుందో కదా” అంటాడు. ఇద్దరూ ఆ విషయంలో ఫీల్ అవుతారు
తరువాత రోజు వాళ్ళ ప్రిన్సిపాల్ మేడమ్ బర్త్డే. టీచర్స్ అంతా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేయాలి అనుకుంటారు. కానీ ప్రిన్సిపాల్ మేడమ్ “అలా ఏమీ వద్దు. కావాలంటే నా బర్త్డే ని ఓల్డ్ ఏజ్ హోమ్ లో సెలెబ్రేట్ చేసుకుంటాను. మొత్తం ఖర్చు నాదే” అని చెప్పి స్వీట్స్, పండ్లు తెప్పించి “ఇవి మన స్కూల్ పిల్లల చేత ఇప్పించాలి అనుకుంటున్నాను. అలాగే పిల్లలకి తెలుస్తుంది సాయం చేయడంలో ఎంత సంతోషం ఉందొ” అని “అందుకు నా బర్త్డే ని ఓల్డ్ ఏజ్ హోమ్ సెలెబ్రేట్ చేసుకుంటా” అంటారు. టీచర్స్ అంతా హ్యాపీ గా
ఫీల్ అయి పిల్లలు అందరినీ దగ్గరలో ఉన్న ఓల్డ్ ఏజ్ హోమ్ కి తీసుకువెళ్లి అక్కడ పిల్లలచేత అక్కడ ఉన్నవారికి పండ్లు, స్వీట్స్ ఇప్పిస్తుంటారు.
పప్పి పండ్లు ఇస్తుంటే ఒక ఫోటో గాలికి ఎగురుకుంటూ వస్తూ తన కాలికి అడ్డు పడుతుంది. అపుడు ఆ ఫోటో తీసుకొని చూస్తే షాక్ అవుతుంది. ఎందుకంటే అది వాళ్ళ నాన్న ఫోటో. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక పెద్దావిడ పప్పి తో "అమ్మా! ఆ ఫోటో నాకు ఇవ్వవా. అది మా బాబుది” అని తీసుకొని ముద్దు పెడుతుంది.
పప్పి షాక్ అయి, పండ్లు తీసుకొని ఆమెకి ఇచ్చి “మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు?” అని అడిగితే తాను “మా బాబు పెద్ద జాబ్ చేస్తున్నాడు. నన్ను త్వరలో తీసుకుపోతాడు. అప్పుడు నేను నా బిడ్డ తో, మనవడు, మనవరాలు తో హ్యాపీగా ఉంటాను” అంటూ ఏడుస్తుంది.
అప్పుడు ఇంకో పెద్దావిడ వచ్చి “ఏంటో సీతమ్మా! నువ్వు ఎంత చెప్పినా వినవు. నీ కొడుకు నిన్ను వదిలి వెళ్ళాడు” అని చెపుతుంది.. పప్పికి అర్టం అవుతుంది తను వాళ్ళ నానమ్మ అని. పప్పి ఏడుస్తుంది.
తన నాన్నమ్మ కన్నీరు తుడిచి “అలా ఏడవకూడదు పాపా!” అని చెప్పి తన దగ్గర ఉన్న చాక్లెట్ ఇస్తుంది..
పప్పికి నానమ్మ అని పిలవాలి అని ఉన్నా పిలవలేకపోతుంది. వెంటనే వెళ్లి చింటుకి వాళ్ళ నానమ్మను చూపిస్తుంది. అప్పుడు వాళ్ళు ఇద్దరూ కలిసి ఒక ప్లాన్ వేస్తారు. ఆ రోజు నైట్ పప్పి, వాళ్ళ నాన్న ఇచ్చిన పాకెట్ మనీ తీసి కౌంట్ చేస్తుంది. చింటూ ఏమో ఏంటో లిస్ట్ రాస్తూ ఉంటాడు. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన లక్ష్మణ్, శ్రీజ ఇద్దరూ “ఏమి చేస్తున్నారు మీరు ఇద్దరు?” అని అడిగారు. “అదేమీ లేదు డాడీ! మీ ఇద్దరూ ముసలివాళ్ళు అయిపోతారుగా. అప్పుడు మీకు ఏమేమి అవసరం అవుతాయి అని చింటు, మీకు ఎంత అమౌంట్ ఖర్చు పెట్టాలో ఓల్డ్ ఏజ్ హోమ్ లో అని నేను, నా భాగం ఎంత డబ్బు అవసరం అవుతుంది అని కౌంట్ చేసున్నా డాడీ. ఇంకా నేను ఎంత సంపాదించాలో తెలుస్తుంది కదా” అని పప్పి అంటుంది.. శ్రీజ, లక్ష్మణ్.. ఇద్దరికీ కోపం వచ్చి “ఏమి మాట్లాడుతున్నారు మీరు? అసలు మేము మీ అమ్మానాన్నలం. మమల్ని మీరు చూసుకోవాలి కదా. అది మీ రెస్పాన్సిబిలిటీ కదా!” అని ఆవేశంగా అంటారు.
“ అవునా? మరి నానమ్మ విషయంలో మీరు చేసింది ఏమిటి?” అని ఏకకంఠం తో ఇద్దరూ ఒకసారి అంటారు. అప్పుడు శ్రీజ, లక్ష్మణ్ కి ఇద్దరికీ చాచి కొట్టినట్టు ఉంటుంది. అప్పుడు తాను అలా ఏజ్ హోంలో వాళ్ళ నానమ్మను చూసింది మొత్తం చెబుతుంది. వాళ్ళు ఇద్దరూ తల దించుకుంటారు
అప్పుడు పప్పి “నాన్నా! స్కూల్ లో మా మేడమ్ చెప్పారు. అమ్మ నాన్న ముసిలి వారు అయినా తరువాత వాళ్ళు చిన్న పిల్లలాగా ఉంటారు అంట. అప్పుడు మీరు మీ పేరెంట్స్ కి మీరు అమ్మ నాన్న అవుతారు. అలాగే మా మేడమ్ ఒక మాట అన్నారు. మీరు ఎలా వున్నా, ఏమి చేసినా చేయకపోయినా సరే, మీ పేరెంట్స్ మిమల్ని వదిలి పెట్టారు. శ్రావణ కుమారుడు వాళ్ళ అమ్మ నాన్నను మోసుకువెళ్ళే వారంట. మీరు అలా చేయపోయినా పర్లేదు. అలా ఎలా ఒంటరిగా వదిలివేశారు? ఇంకా మీరు వచ్చి తనని తీసుకువెళ్తారు అని ఆశగా ఎదురుచూస్తున్నారు డాడీ, నాన్నమ్మ. మీరు ఇలాగే చేస్తే మేము కూడా పెద్ద అయినా తర్వాత ఇలాగే చేస్తాము. అప్పుడు మీకు అర్థం అవుతుంది” అని చెబుతుంది పప్పి.
లక్ష్మణ్ కి కంట్లో నీళ్లు వస్తాయి.. శ్రీజ అయితే తనకు ఏం చెప్పాలో అర్థం కాక తల పట్టుకొని కూర్చుంటుంది. లక్ష్మణ్ పైకి లేచి పప్పిని చింటూ ని గట్టిగా హత్తుకొని “మనం ఇప్పుడే వెళ్లి మా అమ్మను తెచ్చుకుందాం” అని వెళ్తారు.
ఓల్డ్ ఏజ్ హోమ్ సీతమ్మ గారు తన టైం పాస్ కోసం కుర్తాస్, డ్రెస్సెస్ అన్నీ కుట్టి ఉంటారు. అప్పుడు అక్కడ వార్డెన్ ఆమెకు డబ్బు ఇస్తే సీతమ్మ గారు "మేడమ్ గారూ! మీరు ఈ డబ్బుని మా బాబుకి చేరవేస్తారు కదా. ఎందుకంటే రేపు నా కన్నయ్య బర్త్డే” అని చెపుతుంటే తన కాళ్లను ఎవరో పట్టుకొని ఉన్నట్టు చూస్తే అది లక్ష్మణ్! గట్టిగా వాళ్ళమ్మను క్షమించమని వేడుకొని, పప్పిని, చింటూని చూపిస్తాడు. వాళ్ళు కూడా నాన్నమ్మని గట్టిగా హత్తుకొని ఏడుస్తారు. శ్రీజ కూడా “సారీ అత్తమ్మా! అని కాళ్ళు పట్టుకుంటుంది.
సీతమ్మ గారు “మీరు నా పిల్లలు. మీరు ఏమి చేసినా కడుపులో దాచుకుంటాను” అని చెబితే శ్రీజకి, లక్ష్మణ్ కి వాళ్ళ ఎంత తప్పు చేసారో అర్థం అవుతుంది. సీతమ్మ గారిని ఇంటికి తీసుకువెళ్లి చాలా బాగా చూసుకుంటూ ఉన్నారు. పప్పి, చింటూ కూడా ఎక్కువ సమయం వాళ్ళ నాన్నమ్మ తో ఉంటూ మంచి విషయాలను నేర్చుకుంటూ ఉన్నారు.
మనం పిల్లలకి ఇచ్చే ఆస్తి విలువైన విద్య, మంచిని నేర్పడం, మన అమ్మ, నాన్నలను తాతయ్య, నాన్నమ్మలుగా పరిచయం చేయడమే. మన బంధాల పట్ల ఎప్పుడూ మనం అలెర్ట్ గా ఉండాలి.
***శుభం***
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత్రి పరిచయం :
నమస్తే. నా పేరు ధనలక్ష్మి. వృత్తి రీత్యా ప్రైవేట్ స్కూల్లో గణితం బోధిస్తాను. మాది మదనపల్లి, చిత్తూర్ జిల్లా. కథలు , కవితలు రాయడం నాకు ఇష్టమైన వ్యాపకం. ఆనందం వేసినా, బాధ వేసినా, కోపం వచ్చినా నేను పంచుకునే నా నేస్తం అక్షరం. నాలో మెదిలే భావాలను, నేను చూసిన సంఘటనలను రాయడం నాకు అలవాటు.
Comments