top of page
Original.png

గురుబ్రహ్మ వ్యాసమహర్షి

గురుబ్రహ్మ వ్యాసమహర్షి, వేదవ్యాస మహర్షి, గురు పౌర్ణిమ, గురువు, గురు పరంపర, మహాభారతం, వేదాలు, అష్టాదశ పురాణాలు, భగవద్గీత, గణేశుడు, వ్యాసపీఠం, సనాతన ధర్మం, ఆధ్యాత్మిక వ్యాసం, భారతీయ సంస్కృతి, మన తెలుగు కథలు

www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'గురుబ్రహ్మ వ్యాసమహర్షి' వ్యాసంలో వ్యాసపీఠంపై ఆసీనుడైన వేదవ్యాస మహర్షి, మహాభారతాన్ని లిఖిస్తున్న గణేశుడు, వేద గ్రంథాలతో కూడిన దివ్య ఆధ్యాత్మిక దృశ్యం
www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'గురుబ్రహ్మ వ్యాసమహర్షి' వ్యాసంలో వ్యాసపీఠంపై ఆసీనుడైన వేదవ్యాస మహర్షి, మహాభారతాన్ని లిఖిస్తున్న గణేశుడు, వేద గ్రంథాలతో కూడిన దివ్య ఆధ్యాత్మిక దృశ్యం

 

Gurubrahma Vyasamaharshi - Telugu Devotional Article | R C Kumar

గురుబ్రహ్మ వ్యాసమహర్షి - తెలుగు ఆధ్యాత్మిక వ్యాసం | ఆర్ సి కుమార్

Published In manatelugukathalu.com On 29/07/2026


గురు పౌర్ణిమ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది వేదవ్యాస మహర్షి. వేదాలను నాలుగు భాగాలుగా విభజించి, మహాభారతం, అష్టాదశ పురాణాలు, భగవద్గీత వంటి అమూల్యమైన జ్ఞాన సంపదను మానవాళికి అందించిన మహాగురువు ఆయనే. గురువులకే గురువుగా ఆరాధించబడే వ్యాస మహర్షి జీవిత విశేషాలు, గురు పౌర్ణిమ ప్రాముఖ్యత, గురు-శిష్య పరంపర గొప్పతనాన్ని ఈ వ్యాసం తెలియజేస్తుంది.


‘గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః, గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్త్మై శ్రీ గురువే నమః’


సాక్షాత్తు భగవంతుడి స్వరూపమైన వ్యాస మహర్షిని గురు పౌర్ణమి రోజున పూజించే వారికి సుఖశాంతులతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. గురు పౌర్ణమి చాతుర్మాస దీక్ష ప్రారంభ సమయంలో ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున వస్తుంది. ఈ చాతుర్మాసంలో తపస్సంపన్నులు ఎక్కడకీ వెళ్లకుండా ఒకచోట ఉండి జ్ఞానబోధ చేస్తుంటారు. ఈ కాలంలోని తొలి పౌర్ణమి గురుపౌర్ణమి. తమకు సమీపంగా నివసిస్తున్న తపస్సంపన్నులను ఆశ్రయించి, పూజించి, జ్ఞానాన్ని సాధించే ఆచారం గురు పౌర్ణమితోనే మొదలైంది. ‌


భగవద్గీత ధ్యాన శ్లోకాలలో రెండవది అయిన నమోఽస్తుతే వ్యాస విశాలబుద్ధే అనే శ్లోకంతో వ్యాస మహర్షికి వందనాలు సమర్పించుకుంటారు. భగవద్గీతను పఠించే ముందు, వ్యాస మహర్షి యొక్క జ్ఞాన సంపదకు, అతనిలోని దైవత్వానికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఈ శ్లోకాన్ని పఠిస్తారు. కృష్ణ పరమాత్మ ఉపదేశించిన దివ్యజ్ఞానాన్ని మహాభారతంలో పొందుపరిచిన మహర్షి వేద వ్యాసుడికి మనమంతా ఎప్పటికీ కృతజ్ఞులమే. 


గురుపూజోత్సవం అంటే వ్యాస మహర్షితోపాటు గురువులను, ఉపాధ్యాయులను గౌరవించి, పూజించే పవిత్రమైన వేడుక. సమాజానికి జ్ఞానాన్ని అందించి, విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దే గురువులకు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. గురు పౌర్ణమి పండుగకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఇది గురువులకు కృతజ్ఞత తెలుపడానికి జరుపుకునే పండుగ.


అన్ని రకాల వృత్తులలో అత్యంత ఉన్నతమైన, శ్రేష్టమైన వృత్తి ఏది అంటే అది ఉపాధ్యాయ వృత్తి మాత్రమే. అందుకే మన సనాతన ధర్మంలో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటూ తల్లి, తండ్రి తర్వాత స్థానం గురువుకే దక్కింది. సంస్కృతంలో ‘గు’ అనే శబ్దానికి చీకటి అని అర్థం. ‘రు’ అంటే తేజస్సు అని అర్థం. చీకటి నుండి వెలుగులోకి మనలను నడిపించే గురువుకి కృతజ్ఞతతో నమస్కరించే సందర్భం ఇది. 


వ్యాసో నారాయణో హరిః మానవ కళ్యాణం కోసం పురాతన హిందూ గ్రంథాలను మనకు అందించడానికే వేద వ్యాసుడు విష్ణువు యొక్క అంశగా జన్మించాడు. గురువులకే గురువు, మహా గురువుగా పరిగణించబడే వేద వ్యాస మహర్షికి గురు పూర్ణిమ నాడు గురు పూజ చేసుకొని వారి ఆశీస్సులు పొందాలి. లేని వ్యక్తి ఆశీస్సులు ఎలా వస్తాయి అంటారా ? ఎందుకు లేడు ఆయన చిరంజీవి, సప్త చిరంజీవుల్లో ఒకరు.


రెండవది ఆయన జ్ఞానాన్ని ప్రసాదించిన గ్రంథకర్త. వేద విజ్ఞానం, మహాభారతం, అష్టాదశ పురాణాలు, భగవద్గీత లాంటివి ప్రవచనాల్లో, సత్సంగంలో వింటూనే ఉన్నాం. అవన్నీ వారు పెట్టిన బిక్షే కదా ! ఆ రూపంలో ఆయన ఆశీస్సులు మనకు అందుతూనే ఉన్నాయి, అజ్ఞానపు చీకటి తొలిగి జ్ఞాన వెలుగులు ప్రసరిస్తున్నాయి. 


మొదట్లో వేద జ్ఞానం మౌఖికంగా మాత్రమే అందుబాటులో ఉండేది కాబట్టి విష్ణువు వేదాల జ్ఞానాన్ని లిపి రూపంలోకి మార్చాలని అనుకొని ఆ పనిని వ్యాస మహర్షికి అప్పచెప్పారు. ఏకరూపమైన వేదాన్ని వ్యాస మహర్షి విభజించి నాలుగు శాఖలుగా ఏర్పరిచారు. అవే ఋగ్గ్వేద, యజుర్వేద, సామ, అధర్వణ వేదాలు. వీటి ప్రచారానికి వ్యాసులవారు పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు అనే నలుగురు శిష్యులను ఎంచుకున్నారు. 


ఆ నలుగురికి వ్యాస మహర్షి నాలుగు వేదాలను నేర్పించి, వారిని నాలుగు దిక్కులకు పంపించి ప్రచారం చేసే బాధ్యతను అప్పగించారు. వారి ద్వారా ఈజ్ఞానం తరతరాలకు వ్యాపించగా ఈనాటి ప్రపంచానికి ఆ భాగ్యం లభించింది. 


సులభంగా అర్థం చేసుకోగల వేదాల సారాన్ని పంచమ వేదంగా మహాభారతం అనే ప్రసిద్ధ భారతీయ ఇతిహాసాన్ని వేద వ్యాసుడు గ్రంథస్తం చేయదలచి గణేశుడిని ఆ గాధను వివరిస్తూ దానికి రచయితగా ఉండమని అభ్యర్థించాడు. ఒక షరతుతో గణేశుడు అలా చేయడానికి అంగీకరించాడు. అదేమిటంటే వేద వ్యాసుని కథనం నిరాటంకంగా విరామం లేకుండా ఉండాలి. ఒకవేళ ఆపితే తను రాయడం ఆపేస్తానని గణేశుడు షరతు పెట్టాడు.


వ్యాసుడు ఆ షరతును అంగీకరించి, తాను చెప్పే శ్లోకాలను రాసే ముందు గణేశుడు కూడా వాటిని అర్థం చేసుకుంటూ రాయాలి అనే తన షరతును విధించాడు. ఎందుకో తెలుసా ? వ్యాసుడు మధ్యమధ్యలో అత్యంత సంక్లిష్టమైన, గూఢార్థాలు ఉన్న శ్లోకాలను చెప్పేవాడు. ఆ సమయంలో గణేశుడు వాటి అర్థాన్ని ఆలోచిస్తూ ఉండగా, వ్యాసుడు తదుపరి శ్లోకాలను మనసులో కూర్చుకోవడానికి (ఆలోచించుకోవడానికి) సమయం దొరికేది.


అది వ్యాస మహర్షి యొక్క వివేకంతో కూడిన సమయస్ఫూర్తి. వ్యాస మహర్షి మహాభారతం చెబుతుండగా రాస్తుండగానే మధ్యలో కలం విరిగిపోవడంతో, రచనకు అంతరాయం కలగకుండా వినాయకుడు తన దంతాన్ని విరిచి కలంగా ఉపయోగించాడు. 


నైమిశారణ్యంలోని వ్యాస గద్ది (వ్యాసపీఠం) పై కూర్చుని వేద వ్యాసుడు నాలుగు వేదాలను విభజించి, అష్టాదశ పురాణాలు, మహాభారతం మరియు శ్రీ సత్యనారాయణ వ్రత కథలను రచించినందువల్ల అది అత్యంత పవిత్రమైన దివ్య స్థానంగా ప్రఖ్యాతిగాంచింది. మహాభారతాన్ని వ్యాసుడు తన శిష్యుడైన వైశంపాయనుడికి మొదటగా బోధించాడు.


వైశంపాయనుడు దీనిని జనమేజయ మహారాజు చేసిన సర్పయాగంలో వినిపించాడు. అష్టాదశ పురాణాలతో కూడిన పురాణ సంహితను తన శిష్యుడైన రోమహర్షణుడికి (సూతుడు) బోధించాడు. అక్కడి నుంచి తన శిష్యులకు అలా, అలా గురుశిష్య పరంపర ద్వారా ఈ జ్ఞానం తరతరాలకు వ్యాపించి అందరికీ అందింది. 


ఆ విధంగా గణేశుడు, వేదవ్యాసుడి భాగస్వామ్యంతో అతని శిష్యుల ద్వారా మనకు మహాభారతం, 18 పురాణాలు మరియు ఉపనిషత్తులు బహుమతిగా వచ్చాయి. వేదవ్యాస మహర్షి మహా భారతం అనే మహా కావ్యానికి రచయిత మాత్రమే కాదు, కథా గమనాన్ని నడిపించిన సూత్రధారి మరియు పాత్రధారి కూడా.


విచిత్రవీర్యుని మరణం తరువాత కురు వంశాన్ని నిలపడం కోసం తన యోగశక్తితో ధృతరాష్ట్రుడు, పాండురాజు, మరియు విదురుడి జన్మకు కారణమయ్యాడు. 


'వ్యాసాయ విష్ణురూపాయ, వ్యాసరూపాయ విష్ణవే' 


ఆర్ సి కుమార్  గారి కొన్ని ఇతర రచనలు:


ఆర్ సి కుమార్  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నమస్తే 

ఆర్.సి. కుమార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో వివిధ హోదాల్లో అత్యుత్తమ సేవలు అందించి అనేక అవార్డులు రివార్డులు పొందారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ చేసిన పిదప సంస్థకు చెందిన పూర్వ ఉద్యోగులతో వెటరన్స్ గిల్డ్ అనే సంస్థను స్థాపించి అనేక సామాజిక, సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేశారు.

పదవి విరమణ తర్వాత గత పది సంవత్సరాలుగా వివిధ హోదాల్లో తన ప్రవృత్తికి ఊతమిచ్చే సామాజిక సేవా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అమీర్ పేట, సనత్ నగర్ ప్రాంతాలలో గల కాలనీల సంక్షేమ సంఘాలతో కూడిన సమాఖ్యను 'ఫ్రాబ్స్' (FRABSS, ఫెడరేషన్ అఫ్ రెసిడెంట్స్ అసోసియేషన్స్ ఆఫ్  బల్కంపేట్, సంజీవరెడ్డి నగర్, సనత్ నగర్) అనే పేరుతో ఏర్పాటు చేసి అచిరకాలంలోనే స్థానికంగా దానినొక ప్రఖ్యాత సంస్థగా తీర్చిదిద్దారు. సుమారు ఐదు సంవత్సరాల పాటు ఆ సంస్థ తరఫున అధ్యక్ష హోదాలో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రముఖ సామాజిక వేత్తగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.


రాయల సేవా సమితి అనే మరొక స్వచ్ఛంద సంస్థను స్థాపించి పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజం పై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తూ, బీద సాదలకు అన్నదానాలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్షిప్ లు అందించడం, మొక్కలు నాటించడం వంటి సేవా కార్యక్రమాలు ప్రతి నెలా  చేస్తుంటారు. బస్తీలు, కాలనీల లో సమాజ సేవా కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, జల సంరక్షణ వంటి అనేక సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన తెచ్చే విధంగా పాటుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీరి సేవలను కొనియాడుతూ ప్రశంసా పత్రాన్ని సైతం  అందజేశారు.


కథలు కవితలు రాయడం వారికి ఇష్టమైన హాబీ. స్వతంత్ర పాత్రికేయుడిగా వీరి రచనలు తరచుగా మాస పత్రికలు, దినసరి వార్తా పత్రికల్లోని ఎడిటోరియల్ పేజీల్లో ప్రచురింపబడుతుంటాయి. వక్తగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అనేక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను కొనసాగించడమే కాక ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, సత్సంగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. 


వందనం, ఆర్ సి కుమార్

(కలం పేరు - రాకుమార్, పూర్తి పేరు - ఆర్. శ్రీరామచంద్రకుమార్) 

సామాజికవేత్త


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page