జీవుడే దేవుడు
- Kotha Viritha

- 1 day ago
- 2 min read
తెలుగు వ్యాసం, రాముడు, శ్రీరాముడు, మానవత్వం, ధర్మం, జీవన విలువలు, ఆధ్యాత్మిక వ్యాసం, ప్రేరణ, మంచి మనిషి, తెలుగు సాహిత్యం, Humanity, Lord Rama, Dharma, Inspirational Article, Spirituality, Values, Telugu Articles, Mana Telugu Kathalu

Jeevude Devudu - Telugu Inspirational Article | Kotha Viritha
జీవుడే దేవుడు - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత
Publishes in manatelugukathalu.com on 29/06/2026
మనిషి గొప్పతనం అతని సంపదలో, అధికారంలో లేదా బాహ్య వైభవంలో ఉండదు. నిజాయితీ, ధర్మం, మానవత్వం, ఇతరుల పట్ల గౌరవం వంటి విలువలతో జీవించే వ్యక్తే నిజమైన మహనీయుడు. "జీవుడే దేవుడు" అనే ఈ ఆలోచింపజేసే తెలుగు వ్యాసం, శ్రీరాముడి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని, దేవత్వం కంటే మానవత్వమే శాశ్వతంగా నిలిచే గొప్ప గుణమని లోతుగా వివరిస్తుంది.
ప్రతి మనిషీ తానే గొప్పవాడని, తానే మంచివాడని అనుకుంటాడు.
కానీ నిజంగా గొప్పవాళ్లు ఎవరు, “మంచి” అని చెప్పడానికి ఏదైనా కొలమానం ఉందా అంటే, ఉంది అనే చెప్పాలి.
మన పురాణాలు, ఇతిహాసాలు అదే సత్యాన్ని మనకు చెబుతున్నాయి.
మనిషి దేవుడిలా గొప్పవాడవ్వాలంటే దివ్య శక్తులు అవసరం లేదు.
అస్త్రశస్త్రాలు, మణి మకుటాలు, చేతిలో సుదర్శన చక్రం, కిరీటాలు, పట్టు వస్త్రాలు, సుగంధాలు, పువ్వులు ఇవేవీ అవసరం కాదు. కేవలం మనిషిలా బ్రతికితే చాలు.
ఈ సత్యం తెలియకనే మనమే మన శత్రువులమవుతున్నాం.
మనిషిగా జీవించకుండా,
అహంకారంలో, పోలికల్లో, పోటీల్లో మునిగిపోతూ
మన విలువలను మనమే కోల్పోతున్నాం.
కానీ మనిషిగా జీవించి,
మహిత చరిత్రగా మిగలడం పూర్తిగా సాధ్యమే.
మనిషిగానే పుట్టి, మనిషిగానే బ్రతికినా ఈ లోకానికి ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వవచ్చు.
దేవుడవ్వాల్సిన అవసరం లేదు. అద్భుతాలు చేయాల్సిన పనీ లేదు.
నిజాయితీగా, ధర్మంగా, విలువలతో జీవిస్తే
అదే జీవితం ఒక మహత్తర చరిత్రగా మారుతుంది.
ఈ సత్యాన్ని ప్రపంచానికి చూపించినవాడు రాముడు.
పరమాత్ముడైనప్పటికీ,
ఆయన దేవుడిలా కాకుండా
ఒక సాధారణ మనిషిగా ఈ భూమిపై నిలిచాడు.
తన జీవితం ద్వారా
మనిషి ఎదుర్కొనే కష్టాలు,
బాధ్యతలు,
త్యాగాలు ఎలా ఉండాలో చూపించాడు.
తండ్రి మాటకు విలువ ఇవ్వడం,
భార్యపై అచంచలమైన నమ్మకం,
తోబుట్టువు పై ప్రేమ,
ప్రజల పట్ల బాధ్యత
ఇవన్నీ ఆయన జీవితం మనకు నేర్పిన అమూల్యమైన పాఠాలు.
రాముడి గొప్పతనం ఆయన దేవత్వంలో కాదు, ఆయన మానవత్వంలో ఉంది.
అధికారం ఉన్నా అహంకారం లేకుండా, శక్తి ఉన్నా సంయమనం కోల్పోకుండా
జీవించడం ఎంత కష్టమో ఆయన చూపించాడు.
అందుకే రాముడు కాలాతీతంగా ఆదర్శంగా నిలిచాడు.
మనమూ రోజూ చేసే చిన్న పనుల్లోనే మన నిజమైన విలువలు ప్రతిబింబిస్తాయి.
నిజం మాట్లాడటం, ఇతరులను గౌరవించడం,
తప్పు చేయకుండా ఉండటం,
ఇవే మన జీవితాన్ని గొప్పదిగా మార్చే మార్గాలు.
ప్రతి మనిషికీ మహిత చరిత్రగా మిగిలే అవకాశం ఉంది.
రాముడు చూపించిన దారిలో నడిస్తే,
మనిషిగానే జీవించి కూడా
మన జీవితం ఒక మంచి చరిత్రగా మిగలగలదు.
కొత్త విరిత
సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్
ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్
ఈ వ్యాసం మీకు స్ఫూర్తినిచ్చితే మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో తప్పకుండా పంచుకోండి. మానవత్వం, ధర్మం, జీవన విలువలు, ఆధ్యాత్మిక చింతనపై ఇలాంటి మరిన్ని తెలుగు వ్యాసాల కోసం manatelugukathalu.com ను అనుసరించండి.
***************************************
కొత్త విరిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: కొత్త విరిత
నా పేరు కొత్త విరిత
B.sc B.ed Msc చేశాను
IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.
240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.






Excellent 👌👌👌👌
👌👌 madam