top of page

కల్పతరువు - పార్ట్ 15'Kalpatharuvu - Part 15' - New Telugu Web Series Written By Surekha Puli

Published In manatelugukathalu.com On 17/02/2024

'కల్పతరువు - పార్ట్ 15' తెలుగు ధారావాహిక

రచన: సురేఖ పులి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్జరిగిన కథ:


బాంబు దాడిలో సత్యలీల భర్త డి. ఎస్. పి. విశ్వం మరణిస్తాడు. మిగిలిన జీవితం ఒంటరిగానే గడపాలని నిర్ణయించుకుంటుంది సత్యలీల. చండీగఢ్‌లో సాఫ్ట్ వేర్ ప్రోగ్రామర్ ఉద్యోగం సంపాదించుకుంటుంది. 


పక్క పోర్షన్ అచలాదేవి తో పరిచయం ఏర్పడుతుంది సత్యలీలకి. అచల, తన భర్త త్యాగిసోనీని సత్యలీలకి పరిచయం చేస్తుంది. నిజానికి అచల భర్త మరణించడంతో, అత్తగారి ప్రోద్బలంతో మరిది త్యాగిసోనీతో వివాహం జరిపిస్తారు. 


పెళ్ళికి ముందే ప్రజ్ఞతో కలవాలని కోరుతాడు ఆమె బావ పృథ్వీధర్. ఒప్పుకోదు ప్రజ్ఞ. పెళ్లి ప్రస్తావన తెస్తే తప్పించుకుంటాడు పృథ్వీధర్. ప్రజ్ఞ ఆరోగ్యం బాగుండక పోవడంతో ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ కి మకాం మారుస్తాడు ఆమె తండ్రి నారాయణ. ప్రజ్ఞను కొందరు ఆకతాయిలు వేధిస్తుండటంతో తోడుగా తన అసిస్టెంట్ ఆనంద్ ని పంపుతాడు ఆమె తండ్రి స్నేహితుడు కేశవరెడ్డి. 


త్యాగితో విడాకులు తీసుకోవాలనుకుంటున్నట్లు చెబుతుంది అచల. సత్యలీలతో పరిచయం పెరిగాక, తనకు జస్ప్రీత్ అనే మరో స్త్రీతో సాన్నిహిత్యం ఉన్నట్లు అంగీకరిస్తాడు త్యాగి. విడాకుల కాగితాల మీద అచల సంతకం చేస్తుంది. 


టూర్ కి వెళ్లిన ప్రజ్ఞ తలిదండ్రులు ప్రమీల, నారాయణ తిరుగు ప్రయాణంలో మరణిస్తారు. ఆమెను కేశవ రెడ్డి స్వంత కూతురిలా చూసుకుంటాడు. తనకు ప్రజ్ఞ అంటే ఇష్టమని కేశవరెడ్డితో చెబుతాడు ఆనంద్. 


ప్రజ్ఞ, ఆనంద్ ల వివాహం జరిపిస్తాడు కేశవరెడ్డి. వాళ్లకు ఇద్దరు పిల్లలు పుట్టి పెద్ద వాళ్లవుతారు. 

పృథ్వీధర్ కి పెళ్లి విఫలమై, భార్యతో విడాకులు తీసుకుంటాడు. ప్రజ్ఞ తనతో వచ్చేస్తుందని ఆశతో ఆమె దగ్గరకు వస్తాడు. అతనికి సరైన సమాధానం చెప్పి పంపిస్తుంది ప్రజ్ఞ.


ఇక కల్పతరువు ధారావాహిక 15 (చివరి భాగం) చదవండి. 


“మన సూపర్ మార్కెట్ లాభాల వలన ముందుకు సాగుతున్నాము కానీ రెడీమేడ్ బట్టల వ్యాపారములో అంతగా అభివృద్ది లేదు. అన్ని రంగాల్లోనూ పోటీ పెరిగి పోయింది. ఏమైనా చేయాలి.” ఆనంద్ ఖాతా పుస్తకాల తనిఖీ పిమ్మట ఆలోచించ సాగాడు. 


“ఫ్యాషన్ డిజైనింగ్ ట్రైనింగ్ వున్న స్టాఫ్ కావాలి” ప్రజ్ఞ సలహా ఇచ్చింది. 


“అదొక్కటే కాదు, కొంత పబ్లిసిటీ కూడా పెంచాలి. బ్యాంక్ లోన్ తీసుకుని, ధైర్యం చేద్దామా?” బిజినెస్ పెంపుదలకు ప్లాన్ వేశాడు. 


“న్యూస్ పేపర్ ప్రకటన యిద్దాము. కుదర లేదంటే, బ్యాంక్ లోన్ గురించి ఆలోచిద్దాం.” 


భార్య అంచనా మేరకు రెడీమేడ్ బట్టల వ్యాపారం ముందడుగు కోసం పలుకుబడి వున్న దిన పత్రికల్లో బుటిక్ అభివృద్ది కొరకు ప్రకటించారు. 


***


భోజనాలానంతరము "పెదనాన్న, బట్టల వ్యాపారం కొంత మార్పులతో కొత్తగా మార్చాలను కున్నాం, ఏదైనా మంచి పేరు చెప్పండి…." అందిప్రజ్ఞ.


కేశవ రెడ్డి కొద్ది సేపు ఆలోచించి 'కల్పతరువు' అన్నాడు.


నిర్దారణ జరిగింది


>>>>>>>>>>


ఇంటికి దగ్గర్లోని స్కూల్లో జ్వాలను జాయిన్ చేసింది సత్యలీల.


“మన ఇంటికి దగ్గరగా వుండాలి అని బిజినెస్ పెట్టుకోవద్దు. మనం వుండేది బర్కత్పురా, నీ స్థలంలో బుటిక్ పెట్టాలనుకున్నది బంజారాహిల్స్. 


కొత్తగా బిల్డింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మార్కెటింగ్ అంటే చాలా యిబ్బందులు ఎదుర్కోవాలి. 


నా సలహా ఏమిటంటే, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన బుటిక్ ఎన్నుకొని కొంత మన వంతు డబ్బు, శ్రమ పెట్టి బిజినెస్ మొదలు పెడితే సబబు.” వదిన జగదాంబ తన మనసులోని మాట చెప్పింది. 


సత్యప్రకాష్ చలోక్తి "అంబ పలుకు జగదాంబ పలుకు…" దిన పత్రికలో వెలువడ్డ కుట్లు అల్లికలకు సంబంధించిన ప్రకటనలన్నిటికీ సత్యలీల జవాబు యిస్తున్నా, తృప్తికరమైన నిర్ధారణ చేసుకోలేక పోతున్నది. 


అన్వేషణ ఆగక మానదు. జాతీయ దినపత్రికల కంటే ప్రాంతీయ దినపత్రికల ద్వారా వెలువడ్డ బడీచౌడి 'కల్పతరువు' ప్రకటనకు అచల, సత్యలీల హాజరు అయ్యారు. 


వచ్చిన అప్లికేషన్స్ అన్నిటిలోకి సత్యలీలకు అవకాశం లభించింది. 


………


కొత్త బిజినెస్కు సంబంధించిన నోట్ తయారు అయింది. అందులోని కొన్ని ముఖ్యాంశాలు : 


“వ్యాపార పెట్టుబడి ప్రజ్ఞా, సత్యలీల వంతు. 


మౌలిక సదుపాయాలు, స్తలమూ ఆనంద్ సమకూర్చాలి. 


ముడి సరుకు కొనుగోలు, అమ్మకపు పర్యవేక్షణ అచల, సత్యలీల జాబితాలోకి వచ్చాయి. 


ప్రస్తుత ఫాషన్ డిజైన్స్, కస్టమర్స్ అవసరాలను సమన్వయంతో శిక్షణ పొందిన ప్రజ్ఞ; శిక్షణ లేకున్నా ప్రతిభ గల అచల బాధ్యత వహించాలి.”


వీరందరికి సాయంగా శిక్షణ గల టైలరింగ్ నిపుణులు కొందరు ప్రోరేటా బేసిస్ ఉద్యోగ భృతి పొందారు.


అందంగా నిర్మించిన గాజు తలుపుల షోరూమ్ను చాణక్య, చాతుర్య తాత కేశవరెడ్డిగారిని చెరొక ప్రక్క పట్టుకొని దీపారాధన చేయించి, ప్రారంభోత్సవము జరిపించారు.


ఎల్లప్పుడూ జనసందోహం కల్గిన చోట అనతి కాలంలోనే ప్రచార వ్యవస్త ప్రజల్లో ప్రకాశించింది కల్పతరువు.


========================================================================

సమాప్తం

ఈ ధారావాహికను ఆదరించిన పాఠకులకు మనతెలుగుకథలు.కామ్ తరఫున, రచయిత్రి శ్రీమతి సురేఖ పులి గారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.

========================================================================


సురేఖ పులి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

 ఇక్కడ క్లిక్ చేయండి.


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సురేఖ పులి  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

Profile Link:

Youtube Play List Link:

 పేరు :సురేఖ

ఇంటి పేరు: పులి

వయసు: 68 సంవత్సరాలు

భర్త పేరు: స్వర్గీయ పి. అరుణ్ కుమార్

ఎంఏ (సోషియాలజీ&ఇంగ్లీష్) చేశాను. ఇద్దరు అమ్మాయిల వివాహమైంది.

పుట్టి, పెరిగింది హైదరాబాద్ లో.

ప్రస్తుత నివాసం బెంగళూర్ లో.

మా నాన్న స్వర్గీయ అర్జున్ రావు గారు నా మార్గదర్శకులు.

స్కూల్, కాలేజీ మ్యాగజైన్ కు రాయడంతో నా రచనా వ్యాసంగం ప్రారంభమైంది.

HMT Hyd లో నా ఉద్యోగం, 2008 లో స్వచ్ఛంద పదవీ విరమణ తర్వాత

ఒక డైలీ న్యూస్ పేపర్ కోసం పనిచేసాను.

చందమామ, యువ, స్వాతి, ఈనాడు, నెచ్చెలి, మన తెలుగుకథలుడాట్కాంల లో నా కథలు, కథానికలు ప్రచురితమయ్యాయి.

ప్రస్తుతం విశ్రాంత సీనియర్ సిటిజన్ను. కధలు రాయటము, చదవడం నా హాబి. చిత్ర లేఖనం, పెన్సిల్ డ్రాయింగ్ ఇష్టపడతాను.

మీ ప్రోత్సాహమే నా బలం 🤝

మరిన్ని రచనలతో పాఠకులకు దగ్గర కావాలన్నదే నా ఆశయం.

సురేఖ పులి

57 views6 comments

6 Comments


rakhee venugopal

12 hours ago

Very nice soft 👍ending...

Like
Replying to

Thank you Rakhee. Your regular & valuable comments are delighted. Its in other words a motivation for me. 🌹

Like


@surekhap4148

• 23 hours ago (edited)

మీ అమూల్యమైన సమయంలో నా కల్పతరువు నవలను చదివి నన్ను ప్రోత్స ఇచ్చిన (పేరు పేరున) అందరికీ నా ధన్యవాదాలు

Like

Anil Gurram

21 hours ago

👌🥳👌🙏

Like

Divik G

22 hours ago

Women empowerment. Congratulations 🤝👌🌹

Like

నా మొదటి నవలను ప్రచురించిన మన తెలుగు కథలు డాట్కాం వారికి హృదయ పూర్వకమైన ధన్యవాదాలు 🙏🫶🤝

Like
bottom of page