కథలో పాత్ర
- Kotha Viritha

- 8 hours ago
- 2 min read
కథలో పాత్ర, జీవిత పాఠాలు, తెలుగు వ్యాసం, జీవిత తత్వం, ఆత్మపరిశీలన, వ్యక్తిత్వ వికాసం, మానవ విలువలు, తెలుగు సాహిత్యం, motivational Telugu article, inspirational Telugu writing, self reflection Telugu, emotional Telugu article, life lessons Telugu, positive thinking Telugu

Kathalo Pathra - Telugu Inspirational Article | Kotha Viritha
కథలో పాత్ర - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత
Publishes in manatelugukathalu.com on 26/06/2026
ప్రతి మనిషి జీవితంలో వెలుగైన పేజీలు ఉంటాయి. అలాగే చీకటితో నిండిన అధ్యాయాలు కూడా ఉంటాయి. విజయాలను మాత్రమే చెప్పడం సులభం. కానీ చేసిన తప్పులను, ఎదురైన మోసాలను, నేర్చుకున్న జీవిత పాఠాలను కూడా నిజాయితీగా చెప్పగలిగితేనే ఒక మనిషి కథ సంపూర్ణమవుతుంది. "కథలో పాత్ర" అనే ఈ ఆలోచనాత్మక రచన, మన జీవితంలోని ప్రతి అనుభవం ఒక గురువేనని, ప్రతి తప్పు మనల్ని మరింత మంచి మనిషిగా తీర్చిదిద్దుతుందని హృదయాన్ని తాకే రీతిలో వివరిస్తుంది.
కథ చెప్పేటప్పుడు
వెలుగుతో ఉన్న పేజీలను మాత్రమే కాదు,
చీకటి పేజీలను కూడా చెప్పగలిగే ధైర్యం ఉండాలి.
మన హృదయాన్ని నొప్పించిన మాటల్ని,
నమ్మకాన్ని మోసం చేసిన క్షణాలను,
బలంగా దెబ్బ తగిలితేనే కానీ తెలియదు, సులభంగా నమ్మేశామన్న విషయాలను,
కన్నీళ్లు కార్పించిన సందర్భాలను,
నాకెందుకులే అనుకోలేని విషయాలను దాచిపెట్టకూడదు.
ఎందుకంటే
ఆ చెడే మనకి
క్షమించమని పాఠం నేర్పిస్తుంది,
అహంకారం ముందు మనసు చిన్నదని చూపిస్తుంది,
సహనం ఎత్తైన గుణమని గుర్తుచేస్తుంది.
కథలో ప్రతిసారీ రాజా కుమారుడో, రాజా కుమారో కానక్కర్లేదు, ఒక్కోసారి రాక్షస పాత్రలు వేసిన జీవితం మనందరిది.
మన కథలోని మచ్చలు,
గాయాల గుర్తులు కావు,
మన ఎదుగుదలకు నిదర్శనాలు.
కాబట్టి “మన కథ చెప్పేటప్పుడు మనం చేసిన చెడు కూడా చెప్పాలి"
ఎందుకంటే ఆ చెడే మనల్ని నిజమైన మనిషిగా తీర్చిదిద్దింది.
ఎవరూ తప్పు చేయకపోతే కొత్త ఆలోచనలు పుట్టవు, కొత్త విషయాలు తెలియవు, అసలు జీవితాన్వేషనే ఉండదు.
కొత్త విరిత
సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్
ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్
***************************************
కొత్త విరిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: కొత్త విరిత
నా పేరు కొత్త విరిత
B.sc B.ed Msc చేశాను
IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.
240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.






Comments