మాకు వద్దు
- Kotha Viritha

- 1 hour ago
- 2 min read
మాకు వద్దు, కొత్త విరిత, తెలుగు వ్యాసం, తెలుగు ఆలోచనాత్మక రచన, జీవిత సత్యాలు, మూడో మనిషి పాత్ర, మధ్యవర్తిత్వం, సంబంధాల విలువ, సలహా ప్రాముఖ్యత, జీవన తత్వం, తెలుగు ప్రేరణాత్మక వ్యాసం, సామాజిక వ్యాసం, తెలుగు రచనలు, మన తెలుగు కథలు, Telugu article, Telugu motivational writing

Maku Vaddu - Telugu Inspirational Article | Kotha Viritha
మాకు వద్దు - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత
Publishes in manatelugukathalu.com on 02/07/2026
"మా జీవితంలో మూడో మనిషి ప్రమేయం ఉండకూడదు" అని చెప్పేటప్పుడు వచ్చే ఆత్మవిశ్వాసం చూస్తే, ప్రపంచం మొత్తం మన సొంతంగా నడిపేస్తున్నామేమో అనిపిస్తుంది. కానీ కాసేపు ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తే, మన జీవితంలో మూడో మనిషి ప్రమేయం లేకుండా జరిగే పని ఒక్కటైనా ఉందా?
పిల్లాడిని మంచి స్కూల్లో చేర్పించాలంటే, "అక్కడ బాగా చెబుతారు" అని ఎవరో చెప్పాలి. పెళ్లి సంబంధం కావాలంటే, "మా దగ్గర ఒక మంచి సంబంధం ఉంది" అని ఎవరో పరిచయం చేయాలి. ప్రేమించుకోవడం ఇద్దరి ఇష్టం కావచ్చు, కానీ ఆ ప్రేమను పెళ్లి పీటల దాకా తీసుకెళ్లడానికి ఒక "మాటల మాంత్రికుడు" తప్పనిసరిగా కావాలి. ఉద్యోగం రావాలంటే, రిజ్యూమే కంటే ముందు రిఫరెన్స్ అడిగే రోజులు ఇవి. సినిమా చూడాలన్నా, "బావుంది రా" అని ఎవరో చెప్పాలి. హోటల్‌కి వెళ్లాలన్నా, "అక్కడ బిర్యానీ అదిరిపోతుంది" అనే మాట ముందే మన చెవిలో పడాలి.
చివరికి డాక్టర్ దగ్గరకు కూడా మనమే వెళ్లం; "ఆ డాక్టర్ చాలా బాగా చూస్తారు" అని ఎవరో చెప్పాకే అపాయింట్‌మెంట్ బుక్ చేస్తాం. ఇంతా అయ్యాక కూడా, "మధ్యవర్తులు మాకు అస్సలు వద్దు" అని చెప్పేవాళ్లను ఏమనాలి అసలు?
అందుకే, ఈ ప్రపంచంలో మనిషి ఒంటరిగా బతకలేడు. కొన్ని రాయబారాలు అవసరం, కొన్ని పరిచయాలు అవకాశాల తలుపులు తెరుస్తాయి, మరికొన్ని మధ్యవర్తిత్వాలు జీవితాన్నే మార్చేస్తాయి. కాబట్టి, "మూడో మనిషి అవసరం లేదు" అనడం కంటే, "అవసరమైన చోట సరైన మనిషి ఉండాలి" అనడం కాస్త నిజానికి దగ్గరగా ఉంటుంది. మిగతా అన్నీ "మాకు వద్దు" అనే మాటలే - అవసరం వచ్చేవరకు.
కొత్త విరిత
సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్
ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్
***************************************
కొత్త విరిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: కొత్త విరిత
నా పేరు కొత్త విరిత
B.sc B.ed Msc చేశాను
IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.
240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.






Excellent write up