మార్పు

Maarpu - Telugu Social Story| Addanki Lakshmi
మార్పు - తెలుగు సామాజిక కథ | అద్దంకి లక్ష్మి
Published In manatelugukathalu.com On 23/11/2026
కార్తీక మాసం పురాణకథ ద్వారా తన తప్పులను తెలుసుకుని పూర్తిగా మారిపోయిన రంగమ్మ కథ “మార్పు”. పాపపుణ్యాలు, నిజాయితీ, దయ, మానవత్వం విలువలను తెలియజేసే హృద్యమైన తెలుగు నైతిక కథ.
పద్మావతి మధ్యాహ్నం నిద్ర లేచి టీ పెట్టింది. భర్త రంగనాథం టీ తాగి వెళ్లారు; ఆయన గుళ్లో సాయంత్రాలు కార్తీక మాసమందు పురాణ కాలక్షేపం వింటూ గడుపుతారు.
పద్మావతికి కాళ్లు నొప్పులు, వెళ్లి కూర్చునేందుకు ఆమెకు కష్టం. ఇంట్లో కూర్చుని కార్తీక పురాణము చదువుకుంటుంది. పిల్లలు, మనవలు సిటీలో ఉంటారు.
రంగమ్మ పనిమనిషి వచ్చి రోజూ పని చేసుకుంటుంది. సాయంత్రం గిన్నెలు కడిగి, దొడ్డంతా తుడిచి ఇల్లు శుభ్రం చేసి వెళుతుంది.
రంగమ్మ తెలివైనది. దాని జీవితంలో కూడా అనేక కష్టాలు పడింది. మొగుడు పొలంలో పనిచేస్తూ ఉండేవాడు.
కొడుకు చాలా చిన్నవాడు, 10 సంవత్సరాలు, స్కూల్లో చదువుకుంటూ ఉండేవాడు. దురదృష్టవశాత్తు భర్త పాముకాటుతో చనిపోయాడు. సంసార భారము అంతా రంగమ్మ మీద పడింది.
ఆమె చాలా తెలివైనది. ఎలాగో నిలదొక్కుకుంది. సంసార భారం భరిస్తూ, కొడుకును డిగ్రీ వరకు చదివించింది.
కొడుకు బుద్ధిమంతుడు, తెలివైనవాడు. పట్టణంలో ఒక మంచి కంపెనీలో పని చేసుకుంటూ వాడి జీవితం వాడు, భార్యా పిల్లలు, సంసారాన్ని పోషించుకుంటున్నాడు.
రంగమ్మ చాలా తెలివైనది. రెండు గేదెలు, ఆవులు ఉంటాయి.
పాలు అమ్ముకుంటుంది. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి... పాలలో అయితే సగం నీళ్లు కలిపేస్తుంది.
డబ్బు గడించడమే ముఖ్యం దానికి. కూరగాయలు పండిస్తుంది. పట్నంలో లాగే ఎక్కువ రేటుకి అమ్ముకుంటుంది.
చుట్టుపట్ల గుడిసెల్లో ఉన్న ఆడవాళ్ళకు అప్పుడప్పుడు డబ్బు అవసరం వస్తుంది. అప్పుడు రంగమ్మ దగ్గరకు వచ్చి వస్తువులు తాకట్టుపెట్టి రూపాయలు తీసుకుని వెళుతుంటారు.
అయితే అన్నిటిలోనూ చాలా లాభాలు పొందుతూ ఉంటుంది.
ఎక్కడా జాలి, కరుణ, సానుభూతి చూపించదు. కష్టాల్లో ఉన్న వాళ్ళకి కూడా సహాయం చేయదు.
"ఎందుకమ్మా ఇవన్నీ అవస్థలు పడతావు, మాతో పాటు పట్టణంలో ఉండు," అంటూ కొడుకు, కోడలు అంటారు.
ఈవిడకి సునాయాసంగా, మోసం చేసి డబ్బు గడించడం అలవాటయిపోయి, పట్నం వెళ్ళబుద్ధి అవ్వదు.
ఆ రోజు పద్మావతి ఇంటిలో తొందరగా పని చేసి, "వెళ్ళొస్తా అమ్మగారు!" అంది రంగమ్మ. "ఏంటమ్మాగారు చదువుకుంటున్నారు?" అని అడిగింది.
"ఏం లేదే, ఈ నెల అంతా కార్తీక మాసం కదా! పొద్దున్నే స్నానం చేసి శివుడికి దీపం పెట్టుకొని ఉపవాసం ఉండాలి. సాయంత్రం పురాణం చదువుకోవాలి.
నేను గుడికి వెళ్లి అక్కడ కూర్చోలేను కదా, అందుకనే అయ్యగారు వెళ్లారు. నేను ఈ కార్తీక మాసం కథలు ఉంటాయి కదా, చదువుకుంటున్నాను," అంది.
"ఏమిటి ఉంటాయ్ అమ్మగారు ఆ కథల్లో, వినడానికి బాగుంటాయా?" అని అడిగింది రంగమ్మ.
"ఇందులో అన్ని విషయాలు ఉంటాయి.
ఏ పనులు చేస్తే పుణ్యం వస్తుంది, ఎలాగుంటే పుణ్యం దొరుకుతుంది, ఏ పనులు చేస్తే పాపాలు వస్తాయి... అన్నీ ఉంటాయి."
"అట్లాగా అమ్మగారు! నాకీ విషయాలేమీ తెలవదు."
"నీకు పనేం లేకపోతే కాసేపు కూర్చోవే, ఈ పురాణ కథలు చదివి వినిపిస్తాను. ఇందులో ఎన్నో మంచి మంచి విషయాలు ఉంటాయి మనము నేర్చుకునేందుకు," అంది పద్మావతి.
ఆమెకి ఎవరైనా తన దగ్గర ఉంటే కాలక్షేపం.
"సరే అమ్మగారు, నా పని అంతా అయిపోయింది. కూర్చుంటాను, నాకు చెప్పండి ఆ కథ," అంటూ కూర్చుంది రంగమ్మ.
ఆ రోజు పద్మావతి కార్తీక మాసం మాహాత్మ్యంలో ఒక కథ చదివింది. అందులోని ఆ విధవరాలు జీవితం, ఈ రంగమ్మ జీవితం ఒక్కలాగే ఉంది.
పాపపుణ్యాలు తెలియక ఈ డబ్బు ఆశలో పడి జీవితాన్ని ఎట్లా నాశనం చేసుకుందో ఒక విధవరాలు... దాని గురించి చెబుదామని అనుకుంది పద్మావతి. ఇలాంటి కథలు వింటే రంగమ్మ కూడా కొంచెం సన్మార్గంలో పడుతుంది అనుకుంది.
మొదలుపెట్టింది కథ... "ఒక విధవరాలు ఉండేది. భర్త చిన్నతనంలోనే పోయాడు.
కుటుంబాన్ని పోషించాలి కదా, ఆమె అందర్నీ మోసం చేస్తూ డబ్బులు గడిస్తూ ఉండేది. ఎక్కువ వడ్డీలకు డబ్బులు ఇచ్చి అందర్నీ వేధిస్తూ ఉండేది.
ఒక స్వామీజీ వచ్చి ఆమెకు మంచి చెడులను బోధించినాడు. దానితో ఆమె మంచి మంచి పుణ్యకార్యాలు చేయడం మొదలుపెట్టింది.
ఎవరినీ మోసం చేయకుండా, కార్తీక మాసంలో దానధర్మాలు, దీపదానము చేస్తూ ఉండేది. బ్రాహ్మణులకు భోజనాలు పెట్టేది.
అన్యాయంగా సంపాదిస్తున్న సొమ్ముతో అందరికీ, బీదవారికి సహాయం చేసేది. ఈ విధంగా మారి ఆమె పుణ్యలోకాలకు వెళ్లిందని ఆ స్వామీజీ చెప్పాడు.
ఇదీ ఆ కథలోని భావం. నీవు కూడా మంచి కార్యాలు చెయ్యి అని కథలో చెప్పాడు. దానితో ఆమె పూర్తిగా మారి పుణ్యకార్యాలు చేసి మోక్షము సంపాదించింది... చూడు రంగమ్మా! మనము చేసే పుణ్యాలు మనకి పుణ్య జీవితాన్ని ఇస్తాయి.
మనము చేసే పాపాల వల్ల మనము వచ్చే జన్మలో కష్టాలు పడుతూ ఉంటాము.
నీకు చిన్నతనములోనే విధవరాలికము వచ్చింది, కష్టాలు పడుతున్నావు కదా! పొట్టకూటికి సంపాదించుకోవాలి, అన్యాయము అక్రమముగా చేసి ఎదుటివారిని పీడించరాదు.
పాలలో నీవు పూర్తిగా నీళ్లు కలుపుతావు. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, కూరగాయలు ఎక్కువ రేటుకి అమ్ముతావు, అందరూ నిన్ను అసహ్యించుకుంటున్నారు కదా! నిజానికి నీవు ఇప్పుడు డబ్బు మోసం చేసి సంపాదించవలసిన అవసరం లేదు.
మీ పిల్లవాడి సంసారం బాగానే ఉంది. పాపకార్యాలు చేస్తే దేవుడు మనకు వచ్చే జన్మలో కూడా చక్కటి జీవితాన్ని ఇవ్వడు. అందుకే పాపం చేయడానికి అందరూ భయపడతారు, ఎదుటివారిని మోసం చేయకూడదు."
"అవునమ్మాగారు, నేను కూడా ఎంతో మందిని మోసం చేస్తూ డబ్బు గడించాను. ఇక్కడి నుంచి నేను పూర్తిగా మారిపోతాను. నాకు మంచి కథ చెప్పినారు," అంటూ లెంపలేసుకుంది రంగమ్మ.
"వెళ్ళొస్తా అమ్మగారు," అంటూ వెళ్ళిపోయింది.
నిజంగా రంగమ్మ పూర్తిగా మారిపోయింది. కార్తీక మాసంలోని కథ విని, పాపాలు చేస్తే వచ్చే జన్మలో కూడా తను కష్టాలు పడాలి అని భయం పట్టుకుంది. పాలలో నీళ్లు కలిపి మోసం చేయడం, వస్తువులు తాకట్టు పెట్టిన వాటిపై డబ్బు సంపాదించడం—ఇవన్నీ మానుకుంది.
ఎవరైనా పేదవారికి డబ్బు కావలసి వస్తే వడ్డీ తీసుకోకుండా ఊరికే సహాయము చేయటం మొదలుపెట్టింది.
రంగమ్మ సడన్‌గా ఎందుకు మారిపోయిందా అని ఆ గ్రామంలోని ఆడవాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు.
"ఏమే రంగమ్మా! నువ్వు మారిపోయావు అని అందరూ చెప్పుకుంటున్నారు, నిజమేనా?" అని అడిగింది ఒకరోజు పద్మావతి.
"అవును అమ్మగారు, మీరు కార్తీక మాసం కథ చెప్పినారు కదా! అప్పటి నుంచి నేను చేస్తున్నవన్నీ పాపాలని తెలిసినాయి. అందుకే పాపాలు చేయడం మానేశాను.
మీ దయ అమ్మగారు, నాకు మంచి విషయాలు తెలియపరచినారు," అంటూ పద్మావతి కాళ్ళకి మొక్కింది రంగమ్మ.
పురాణ గాథలు వినడం వల్ల మనుషులలో నైతిక విలువలు వస్తాయి.
సమాప్తం
***
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
అద్దంకి లక్ష్మి గారి కొన్ని ఇతర రచనలు:
అద్దంకి లక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: అద్దంకి లక్ష్మి
నా పేరు శ్రీమతి అద్దంకి లక్ష్మి
జన్మ స్థలం:రాజమహేంద్రవరం
డేట్ అఫ్ బర్త్
3_6_1946.
నివాసం: నవీ ముంబయి
విద్యార్హతలు:
బి.ఎ; బి. ఇడి
**వృత్తి:విశ్రాంత ఉపాధ్యాయిని,
బాంబే మునిసిపల్ కార్పొరేషన్
**తల్లిదండ్రులు: శ్రీమతి రత్నమ్మ గారు_శ్రీరామ మూర్తి గారు.
భర్త:శ్రీ వేంకటేశ్వర రావు;
విశ్రాంత జాయింట్ కమిషనర్, ఆదాయపు పన్ను శాఖ
**కుమారుడు:
గిరిధర్ సిఏ;ఎంబీఏ; శాక్రమెంటో కాలిఫోర్నియా,
**కూతురు:మాధురి వెబ్ మేనేజర్ న్యూయార్క్ స్టేట్ అమెరికా.
అల్లుడు మధుసూదన్ అమెరికా
వృత్తి/ప్రవృత్తిలో ముఖ్య ఘట్టాలు
**నూతన విద్యా విధానం గురించి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి,ఉత్తమ రిసోర్స్ పర్సన్ టీచర్ గా పురస్కారం పొందాను,
నిరక్షరాస్యతను నిర్మూలించుటకు
సేవా కార్యక్రమాలు నిర్వహించాను,,
నాటకాలు వ్రాసి
విద్యార్థుల నాటకాలు
వేయించాను బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ రైటర్ అవార్డులు పొందాను,
సౌత్ ఇండియన్ భాషలలో వేయించిన నాటకాల్లో, పిల్లలకు బెస్ట్ యాక్టర్ గా పురస్కారాలు లభించాయి
చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు ప్రత్యేకంగా పాఠాలు చెప్పి వారి విద్యాభివృద్ధికి తోట్పడినాను,
**తెలుగు రచయితల సంఘం మహారాష్ట్ర వారి సంకలనాలలో కథ,కవిత రాసి పురస్కారాలు పొందాను,
**ఆల్ ఇండియా రేడియో తెలుగు కేంద్రంలో ఢిల్లీలో నాలుగేండ్లు తెలుగులో వార్తలు చదివిన అనుభవం
**ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ లో నాలుగేండ్ల అనుభవం
సాహితీ జీవితం_రచనలు
**వివిధ సాహితీ సమూహాల్లో కథలు,కవితలు రాస్తుంటాను
**ఆంధ్ర ప్రభ,ఆంధ్ర పత్రికల్లో కథలు, వ్యాసాలు ప్రచురించ బడ్డాయి
ఆంధ్రప్రభ పత్రికలో కథలకు బహుమతులు పొందాను
**అనేక సమూహాల్లోని
ఇ-సంకలనాలలో నా కథలు,కవితలు,
పద్యాలు ప్రచురించ బడినవి
కవితలకు కథలకు బహుమతులు పొందినాను
నేను రాసిన
కవితలు మరియు ప్రక్రియలు 4000 పైగా
**మినీ కవితలు
పంచపదులు
సున్నితాలు
ఇష్టపదులు
**గేయాలు
**వ్యాసాలు
**నాటకాలు
పద్యాలు
గజల్స్
కథలు
రుబాయీలు
బాల సాహిత్యం
**పేరడీ పాటలు 20 వివిధ దిన పత్రికలలో ప్రచురించబడ్డాయి
*సాహిత్య సేవ
తేనియలు,
తొణుకులు,
చిలక పలుకులు,
పరిమళాలు,
మధురిమలు,
ముత్యాలహారాలు,ఇష్టపదులు,
సకినాలు,
సున్నితాలు,
పంచ పదులు, బాల పంచ పదులు, నానీలు అనేక లఘు కవితా ప్రక్రియల్లో అన్నిట్లోనూ శతాధికంగా కవితలు రాసి, ప్రశంసా పత్రాలను పొందినాను,
**1500 వందలకు పైగా ప్రశంసా పత్రాలు పొందాను
**సాహితీ చక్రవర్తి, ఇష్టపది శ్రేష్ఠ,కవన కిరణం, అక్షర ఝరి , పంచపది కవి రత్న లాంటి , సాయి వనములో సాహిత్యం నుంచి కవన రత్న, కథా భూషణ్, మెదక్ జిల్లా విశిష్ట పురస్కారం, ఏకె మీడియం ముంబై వారి పురస్కారం, నారీ శ్రీ, సున్నితార పురస్కారం,,
అన్ని గ్రూపుల నుంచి,
15 బిరుదులు పొందడం జరిగినది,
ఆగస్టు 2022లో అమ్మ అంశముపై నేను రాసిన పద్యములకు,,
2 సున్నితాల ప్రక్రియ లో కవితకు కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైనను,
రెండుసార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యాను,
1.ప్రచురణ,,,
1 ,కవితా కుసుమాలు పుస్తకాన్ని ప్రచురించుకున్నాను,














Comments