మనం తోపే కదా

Manam Thopekadaa - Telugu Inspirational Article | Kotha Viritha
మనం తోపేకదా - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత
Published in manatelugukathalu.com on 18/09/2026
“నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావ్” ఇది ఒక సాధారణ ప్రశ్నలా అనిపించినా, మన జీవితాన్ని మలుపుతిప్పే శక్తి ఇందులో దాగి ఉంటుంది. చాలా సార్లు మనకు ఈ ప్రశ్న అడిగితే, “నా గురించే కదా, నా ఇష్టం ఏమైనా అనుకుంటా” అనిపిస్తుంది. నిజమే, మన గురించి ముందుగా మనకే తెలుసు.
ఆత్మవిశ్వాసం అంటే గర్వం కాదు, ఇతరులతో పోల్చుకోవడం కాదు. అది మన సామర్థ్యాలపై మనకున్న నమ్మకం. మనం చేసే పనిలో, తీసుకునే నిర్ణయాల్లో, ఎదుర్కొనే సవాళ్లలో మనపై మనకు ఉండే విశ్వాసమే ఆత్మవిశ్వాసం.
చాలా సార్లు మనం మనల్ని తక్కువ అంచనా వేస్తాం. “నేను చేయలేను”, “నా వల్ల కాదు” అనే ఆలోచనలు మనలోకి నెమ్మదిగా ప్రవేశిస్తాయి. కానీ ఒకసారి ఆలోచించండి మీరు మీకు బరోసా ఇవ్వకపోతే, మరెవరు ఇస్తారు.
మనలో ప్రతి ఒక్కరికీ ప్రత్యేకత ఉంది. ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు. ఇతరులతో పోల్చుకోవడం ఆపి, మన బలాలపై దృష్టి పెడితే ఆత్మవిశ్వాసం సహజంగా పెరుగుతుంది. చిన్న చిన్న విజయాలను గుర్తించి ఆనందించడం, తప్పులను నేర్చుకునే అవకాశాలుగా చూడడం ఇవే మనను ముందుకు నడిపించే అడుగులు.
“నేను ఎంత తోపుని ముందు నాకే కదా తెలిసేది” ఈ మాటలో నిజం ఉంది. కానీ అది అహంకారంగా కాకుండా, మనలోని బలాన్ని గుర్తించే వినయంతో ఉండాలి. నిజమైన ఆత్మవిశ్వాసం అలా ఉంటుంది శబ్దం చేయదు, కానీ మన ప్రయాణాన్ని బలంగా నిలబెడుతుంది.
ఈసారి ఎవరైనా "నువ్వేమన్న తోపా, అంటే, అవును నేనెవరో నాకు తెలుసు అనేయండి" మరి మనం తోపేకదా
***
కొత్త విరిత
సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్
ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: కొత్త విరిత
నా పేరు కొత్త విరిత
B.sc B.ed Msc చేశాను
IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.
240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.







Excellent lines 👌 👌