మసాలా
మసాలా, జీవితంలో మసాలా, జీవిత పాఠాలు, ప్రేరణాత్మక వ్యాసం, జీవన విలువలు, వ్యక్తిత్వ వికాసం, కొత్త విరిత, తెలుగు వ్యాసం

Masala - Telugu Inspirational Article | Kotha Viritha
మసాలా - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత
Publishes in manatelugukathalu.com on 26/07/2026
ప్రతి మనిషి జీవితంలో ప్రశాంతతను కోరుకుంటాడు. కానీ విచిత్రం ఏమిటంటే... ఎలాంటి మలుపులు లేని జీవితం బోరింగ్‌గా అనిపిస్తుంది. చిన్న చిన్న సమస్యలు, అపార్థాలు, అనుకోని ట్విస్టులు, కష్టాలు దాటాకే విజయానికి అసలు రుచి తెలుస్తుంది. "మసాలా" అనే ఈ ఆలోచింపజేసే వ్యాసం జీవితంలో ఎదురయ్యే సవాళ్లే మన ప్రయాణాన్ని ఆసక్తికరంగా మారుస్తాయని చమత్కారంగా వివరిస్తుంది.
మనిషికి శాంతి కావాలని ఉంటుంది, కానీ శాంతికి ముందు కాస్త మసాలా కూడా కావాలి!
"అన్నీ నేను అనుకున్నట్టే జరగాలి" అని కోరుకుంటాం.
అన్నీ అనుకున్నట్టే జరిగితే,
"లైఫ్‌లో థ్రిల్ ఏమీ లేదు!" అనుకుంటాం.
ఒక్క చిన్న ట్విస్ట్ వస్తే,
"దేవుడా! నన్నే ఎందుకు?" అని పైకి చూస్తాం.
అదే ట్విస్ట్ దాటాక,
"అది లేకపోతే నేను ఈ స్థాయికి వచ్చేవాడిని కాదు!" అని మోటివేషనల్ స్పీకర్స్ అయిపోతాం.
అసలు మనకు విజయం ఒక్కటే సరిపోదు. దానికి ముందు కాస్త కన్ఫ్యూజన్, కొన్ని అపార్థాలు, రెండు మూడు టెన్షన్లు, "ఇక అయిపోయింది!" అనే డైలాగులు, చివర్లో ఒక హ్యాపీ ఎండింగ్.
అప్పుడే వెధవ మనసుకు తృప్తి.
సూటిగా జరిగిపోయిన విజయానికి పెద్దగా విలువ ఇవ్వం. పది మలుపులు తిరిగి వచ్చిన విజయాన్నే"నా జర్నీ" అంటూ గొప్పగా చెబుతాం. జీవితం బాగుండాలి అంటాం, కానీ కథలా కూడా ఉండాలని ఆశపడతాం.
అందుకే, మనిషికి నిజంగా కావాల్సింది శాంతి మాత్రమే కాదు. శాంతికి రుచి తెచ్చే కాస్త మసాలా కూడా!
కొత్త విరిత
సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్
ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: కొత్త విరిత
నా పేరు కొత్త విరిత
B.sc B.ed Msc చేశాను
IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.
240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.







Chala bagundi viritha👌
ఎందుకంటే ఎన్నో సంఘర్షణల తర్వాత వచ్చే విజయాలే చాలా ఆస్వాదిస్తాము. అదే మన విజయంగా చెప్పుకుంటాము. అదే సులువుగా వస్తే ఆ థ్రిల్లుఉండదు.Nice 👍