మెమరీ కార్నర్
- Munipalle Vasundhara Rani

- 15 hours ago
- 3 min read

Memory Corner - Telugu Emotional Story | Vasundhara Rani Munipalle
మెమరీ కార్నర్ - తెలుగు భావోద్వేగ కథ | వసుంధర రాణి మునిపల్లె
Published in manatelugukathalu.com on 01/04/2026
రాణికి ఎన్నో ఏళ్లుగా ఉన్న సొంత ఇంటి కల నెరవేరుతోంది. ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో చక్కటి ఫ్లాట్‌ను ఆమె, తన కూతురు శృతి కలిసి కొనుక్కున్నారు. కానీ ఆ సంతోషం వెనుక ఒక తెలియని దిగులు రాణిని వెంటాడుతోంది. ఇల్లు కొన్నప్పటి నుండి పిల్లలిద్దరూ ఇంటీరియర్స్ వేటలో పడ్డారు. ఆధునికత పేరుతో ఇంట్లోని పాత వస్తువులన్నీ తీసేయాలని వారు గట్టిగా నిర్ణయించుకున్నారు.
ఒకరోజు హాల్‌లో కూర్చుని ఉండగా కొడుకు రవి అన్నాడు, అమ్మా ఈ పాత సోఫా సెట్ ఏంటి? కొత్త ఇంటి థీమ్‌కు ఇది అస్సలు మ్యాచ్ అవ్వదు. ఇవన్నీ పాతకాలపు వస్తువులు, వీటిని కొత్త ఇంట్లోకి తీసుకురావడానికి వీల్లేదు అని ముందే వార్నింగ్ ఇచ్చాడు. కూతురు శృతి కూడా వంత పాడుతూ, అవునమ్మా ఆ డైనింగ్ టేబుల్ కూడా అస్సలు సెట్ అవ్వదు. మనం అంతా గ్లాస్ ఫినిషింగ్‌తో మోడరన్ థీమ్ అనుకున్నాం కదా. ఇవన్నీ ఓఎల్ఎక్స్‌లో పెట్టేద్దాం. కొత్త ఇంట్లో ఈ పాత సామాన్లు పెట్టి ఇంటి షోని పాడు చేయకు అని ఖరాఖండిగా చెప్పేసింది.
రాణి ఆ సోఫా మీద మెల్లగా చేయి వేసింది. అది కేవలం వస్తువు కాదు. పాతికేళ్ల క్రితం తన భర్తకు మొదటిసారి ప్రమోషన్ వచ్చినప్పుడు ఇద్దరూ ఎంతో ముచ్చటపడి కొనుక్కున్నది. ఆ డైనింగ్ టేబుల్ దగ్గరే కదా ఆయన కూర్చుని పిల్లలకు గోరుముద్దలు తినిపించేవారు. ఇవన్నీ మీ నాన్న జ్ఞాపకాలు కదరా, వీటిలో ఆయన స్పర్శ ఉంది అని కళ్లల్లో నీళ్లతో మెల్లగా అంది రాణి. దానికి పిల్లలు ఏమాత్రం తగ్గకుండా, నువ్వు వస్తువుల్లో నాన్నను వెతుక్కుంటావేమిటమ్మా, జ్ఞాపకాలు గుండెల్లో ఉండాలి గానీ ఇలాంటి పాత సామాన్లలో కాదు అని కసిరినంత పని చేశారు. ఏమీ మాట్లాడలేక, గుండెల్లో బాధను దిగమింగుకుని రాణి మౌనంగా ఉండిపోయింది. సామాన్లు అమ్మేయడానికి ఆన్‌లైన్‌లో ఫోటోలు తీస్తుంటే, తన ప్రాణాన్ని ఎవరో ముక్కలు చేస్తున్నట్టుగా ఆమెకు అనిపించింది.
కొత్త ఫ్లాట్‌లోకి మారారు. అంతా ధగధగ మెరుస్తోంది. ఖరీదైన ఇటాలియన్ సోఫాలు, విదేశీ లైట్లు, అద్దాల టేబుళ్లతో ఇల్లంతా ఒక షోరూంలా ఉంది. పిల్లలు సోషల్ మీడియాలో ఫోటోలు పెడుతూ మురిసిపోతున్నారు. కానీ రాణికి ఆ ఇంట్లో ఏదో తెలియని వెలితి. తన భర్త కూర్చునే ఆ పాత సోఫా మూల లేదని, ఆయన ఉన్నప్పుడు ఉపయోగించిన ఒక్క వస్తువు కూడా లేదని ఆమె మనసు తల్లడిల్లింది. ఆ మెరిసిపోయే కొత్త సామాన్ల మీద కూర్చోవడానికి కూడా ఆమెకు భయం వేస్తోంది. రాణి ఆనందంగా లేదని, ఏదో కోల్పోయినట్టు అసంతృప్తిగా ఉందని పిల్లలు గ్రహించారు.
రాణి మామయ్య వాళ్ల ఇంటి నుంచి రాగానే పిల్లలిద్దరూ అమ్మ వచ్చేసావా నీకోసం ఒక సర్ ప్రైజ్ ప్లాన్ చేశాం ఒకసారి స్టడీ రూమ్ లోకి వెళ్దాం రా అని పిలిచారు. రాణి ఆశ్చర్యంగా ఆ గది తలుపు తీసింది. లోపలికి వెళ్ళగానే ఆమె కళ్లు చెమర్చాయి. ఆ గదిని పిల్లలు ఒక అద్భుతమైన మెమరీ కార్నర్ లాగా మార్చేశారు. ఆమె ఎంతో ప్రాణంగా ప్రేమించిన ఆ పాత సోఫా సెట్, ఆ చిన్న టీపాయ్ అక్కడ ఉన్నాయి. అంతేకాక తన భర్త ఉపయోగించిన వస్తువులకి కొత్త మెరుగులు అద్ది, ఒరిజినాలిటీ పోకుండా ఆ ఇంటికి తగ్గట్టు మార్చి ఆ రూమ్‌ని అందంగా తయారుచేశారు. గోడ మీద ఆమె భర్త పెద్ద ఫోటోను తగిలించి, పక్కనే ఆయనకు ఇష్టమైన పుస్తకాలను పేర్చారు.
ఇవన్నీ ఎప్పుడు చేశారు అని రాణి ఆశ్చర్యపోయింది. అప్పుడు పిల్లలిద్దరూ, నువ్వు మామయ్య వాళ్లింటికి వెళ్ళినప్పుడు మీ ఫ్రెండ్ లక్ష్మి ఆంటీ ఫోన్ చేసింది అమ్మ. మాటల మధ్యలో నువ్వు పడుతున్న బాధ గురించి చెప్పింది. అమ్మ సంతోషంగా ఉందో లేదో చూడండి, మహల్‌లో ఉన్నా పూరి గుడిసెలో ఉన్నా ఆనందం లేకపోతే ఎక్కడున్నా ఒకటే అని అంది. మేము నిన్ను గమనించాము అమ్మ, ఇంటి షో కన్నా నీ సంతోషమే మాకు ముఖ్యమని అర్థం చేసుకున్నాము అని క్షమాపణ కోరారు. తమ తప్పు తెలుసుకున్న పిల్లలను చూసి రాణి కళ్లలో ఆనందబాష్పాలు రాలాయి. ఆ పాత సోఫాలో కూర్చున్నప్పుడు ఆమెకు మళ్లీ తన భర్త పక్కన ఉన్నట్టే అనిపించింది. ఇప్పుడు ఆ కొత్త ఇల్లు ఆమెకు నిజమైన స్వగృహంలా అనిపించింది.
సమాప్తం
ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం www.manatelugukathalu.com సందర్శించండి.
వసుంధర రాణి మునిపల్లె గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
వసుంధర రాణి మునిపల్లె గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: వసుంధర రాణి మునిపల్లె
నాకు ఈ సదవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు.
నేనొక హౌస్ వైఫ్ ని నాకు కథలు రాయడం ఒక హాబీ.
ఇంతకుముందు జాగృతి లాంటి పత్రికలలో కథలు ప్రచురితమయ్యాయి. ఇంకా కొన్ని కథలు పరిశీలనలో ఉన్నాయి.




Comments