నిజమైన ప్రేమ
- Penumaka Vasantha

- 3 hours ago
- 4 min read
నిజమైన ప్రేమ, తెలుగు ప్రేమ కథ, భావోద్వేగ కథ, భర్త భార్య ప్రేమ, దాంపత్య బంధం, త్యాగం, ప్రేమ గొప్పతనం, కుటుంబ కథ, తెలుగు కథలు, హృదయాన్ని కదిలించే కథ, నిస్వార్థ ప్రేమ, ప్రేమలో త్యాగం, Mana Telugu Kathalu

Nijamaina Prema - Telugu Emotional Love Story | Penumaka Vasantha
నిజమైన ప్రేమ - తెలుగు భావోద్వేగ ప్రేమ కథ | పెనుమాక వసంత
Published In manatelugukathalu.com On 22/07/2026
ప్రేమ అంటే కేవలం మాటలు కాదు... అవసరమైనప్పుడు త్యాగం చేయడం, ప్రాణం కంటే ప్రియమైన వ్యక్తి కోసం ఏ కష్టాన్నైనా భరించడం. "నిజమైన ప్రేమ" కథలో భార్య ప్రాణాలను కాపాడుకోవడానికి భర్త చేసిన అపూర్వ త్యాగం, జీవితాంతం ఒకరికి ఒకరు అండగా నిలిచిన దాంపత్య బంధం, ప్రేమలోని నిస్వార్థత హృదయాన్ని హత్తుకునేలా ఆవిష్కరించబడింది. నిజమైన ప్రేమకు డబ్బు, అందం, హోదా కాదని... త్యాగమే అసలైన ప్రమాణమని చెప్పే అద్భుతమైన తెలుగు కథ ఇది.
తన్మయి బస్ ఎక్కి చూసింది. రోజు తనను
చూసే కళ్ళ కోసం వెతికింది. ఆ చివరి వరుసలో
తన్నే చూస్తున్న ఆ చూపులతో కలిసాయి. కానీ వెంటనే
చూపు మరల్చుకుంది.
'ఛా, చూడకుండా వుండాల్సింది,
దొరికిపోయాను' అని తిట్టుకుంది మనసులో.
అలా ఆరు నెలల నిరీక్షణకు ఒక రూపం వచ్చింది.
ఆరోజు తన్మయి దిగిన స్టాప్లో తనతో పాటు దిగాడు
తరుణ్.
"హాయ్!" అన్నాడు తరుణ్.
"హాయ్!" అంది తన్మయి.
"ఇక చాలండి చూసుకోవటం. చూసే పీరియడ్ నుండి
ఇప్పుడు మాట్లాడే పీరియడ్ కు మారదామా?"
అయినా మౌనంగా చిరునవ్వుతో సమాధానం
ఇచ్చింది.
"అవును, మీకు పళ్ళు ఉన్నాయా నోటిలో?"
అన్నాడు ఆలోచిస్తూ.
"అదేంటి, ఎందుకు అలా అడిగారు?" అంటూ
నోరు విప్పింది తన్మయి.
"అమ్మయ్య, అన్ని పళ్ళు సరిగా ఉన్నాయండి. థాంక్స్ అండి. మా ఫ్రెండ్స్ కొంతమంది నవ్వడానికి ఇబ్బంది పడేవాళ్ళు, ఎందుకంటే వారి పళ్ళ వరుస సరిగా లేక ఎప్పుడూ అరకొరగా నవ్వేవాళ్ళు. మీకు ముప్పై రెండు పళ్ళు సరిగా ఉన్నాయి" అంటూ నవ్వాడు.
తన్మయి కూడా తరుణ్ మాటలకు నోరంతా తెరిచి నవ్వింది.
"సరే అండి. నేను రోజు మీరు దిగిన తర్వాత దిగుతాను. ఇవాళ ముందు దిగాను, మీ గురించి తెలుసుకోవటానికి. అలా అని సిఐడి మటుకు కాదు."
"ఇక చాలు, మామూలు మాటల్లోకి రండి" నవ్వును కంట్రోల్ చేసుకుంటూ అంది తన్మయి.
"నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాను. మీరు..?"
"నేను ఇక్కడ ఫ్యాషన్ టెక్నాలజీ ఫైనల్ ఇయర్ లో ఉన్నాను."
అప్పటినుండి మాటల్లో పడ్డారు.
అప్పుడప్పుడు సినిమాలకు వెళ్ళటం అది చేస్తున్నారు.
తర్వాత కొన్నాళ్లకి తరుణ్ అడిగాడు. "మన పేర్లు కలిసినట్లు మన మనసులు కలిసాయి. మరి ఆ మనసులు ఎప్పుడు కలిసి ఉండేలా మనం ఇద్దరం పెళ్లి చేసుకుందాం."
"మా ఇంట్లో ఒప్పుకోరు. సో నేనైతే నీతో పెళ్లికి రెడీ."
"సేమ్ ఫీలింగ్ నాది!" అన్నాడు తరుణ్.
ఇద్దరికీ ఇంట్లో ఒప్పుకోరు కాబట్టి మనం గుడిలో ఒకరోజు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు.
"తరుణ్, ఎప్పుడూ నేను నీకు డౌరీ తేలేదని నన్ను చిన్నచూపు చూడకూడదు. నాకు ఫుల్ భరోసా ఇస్తానంటే.. నేను నీతో ఎక్కడికైనా రెడీ."
"నేను నిన్ను పోషించుకోగలను, నిజమైన ప్రేమలో డబ్బుకు విలువలేదు డియర్!" అన్నాడు తరుణ్.
ఆనందంగా పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు తల్లిదండ్రులు
ఇక మాకు మీకు ఎటువంటి సంబంధం లేదని తేల్చి
చెప్పేశారు. తన్మయి కూడా ఒక చిన్న బొటిక్ స్టార్ట్ చేసి...
తనకంటూ ఒక లైఫ్ ను క్రియేట్ చేసుకుంది.
కాలగమనంలో పిల్లలు పుట్టారు. వాళ్ళు పెద్దవాళ్ళయ్యారు. వాళ్ళకు వారు కోరిన వారిని ఇచ్చి పెళ్లి చేశారు. వాళ్ళు అమెరికాలో స్థిర పడ్డారు.
తరుణ్, తన్మయిలు బాధ్యతలు తీరి రిటైర్మెంట్ లైఫ్ ను చాలా బాగా డీల్ చేస్తున్నారు. అప్పుడప్పుడు పిల్లల
దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తున్నారు. ఉన్నట్లుండి తన్మయికి మెదడుకు జబ్బు సోకింది.
దానికి చేయని ట్రీట్మెంట్ లేదు తరుణ్. ఇంకా కొద్దిరోజుల్లో
తన్మయి కోమాలోకి వెళ్తుందని డాక్టర్లు చెప్పారు. తరుణ్ చాలా దిగులు పడ్డాడు. అయినా తన్మయికి
ధైర్యం చెప్తున్నాడు.
తన్మయి తను బతకనని నిర్ణయించుకుంది.
"నువ్వు చాలా ధైర్యముగా ఉండాలి తరుణ్. నీ చేతుల్లో పోవటం నాకు ఎంతో అదృష్టం. నువ్వు నేను పోతే...
అమెరికా పిల్లల దగ్గరికి వెళ్ళు."
"నువ్వు నేను ఇద్దరం ఒకేసారి పోవాలి పైకి. నువ్వు లేకుండా నేను ఉండగలనా? నాకు నువ్వు, నీకు నేను. ఈ రిటైర్మెంట్ లైఫ్ లో నాకు కావలసింది ఒకరికొకరం మనమిద్దరం" అంటూ తన్మయికి ధైర్యం చెప్తున్నాడు తరుణ్.
ఎన్నో గుడులు తిరుగుతున్నాడు. హోమాలు చేయిస్తున్నాడు. అప్పుడే ఒక గుడిలోని పూజారి
"ఆమెకు తగ్గుతుంది. దానికి నువ్వు ఒక గుడి ముందు బిచ్చం ఎత్తుకోవాలి. అది చేస్తే... మీ భార్య నీకు దక్కుతుంది. కానీ ఇది ఎవరికి చెప్పకూడదు, చివరికి మీ భార్యకు కూడా."
ఇంటికొచ్చి... భార్యతో చెప్పాడు. "నేను ఒక టూ మంత్స్ అమెరికా వెళ్దామనుకుంటున్నాను. అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ నన్ను రమ్మని కోరింది. వారికి కావలసిన సాఫ్ట్వేర్ వర్క్ చూపించి వస్తాను."
"అదేంటి తరుణ్! నాకు ఒంట్లో బాగాలేదు. ఈ టైంలో నువ్వు ఇలా వెళ్ళటం?" బాధగా అంది.
"కానీ తప్పదు. అక్కడ నీకు ట్రీట్మెంట్ కోసం ఏవో మెడిసిన్స్ దొరికాయట. అవి తీసుకుని వచ్చేస్తాను." ఇంకా ఏవో ప్రశ్నలు అడుగుతున్న భార్యను, "వెళ్ళాలి టైమ్ లేదు, వస్తాగా?"
అన్నాడు తరుణ్.
"పిల్లల దగ్గరకు వెళ్తావా తరుణ్? వాళ్లకి కావలసినవి
పాక్ చేస్తాను."
"నో తన్మయి, నేను టెక్సాస్ వెళ్తున్నా. వాళ్ళు ఉండేది
వేరే స్టేట్ లో. నాకు టైమ్ ఉండదు. నేను డాక్టర్
తో టచ్ లో ఉంటా. నువ్వు మందులు రెగ్యులర్గా
వేసుకో, జాగ్రత్త! ప్లీజ్! ఈ ఒక్కసారికి నన్ను వదిలి
వుండు. నేను నీకు కాల్ చేయటానికి ఉండదు.
పిల్లలకి చెప్పాను, వాళ్ళు నీతో మాట్లాడుతుంటారు."
కింద వాచ్మెన్ భార్యను రాత్రి పూట పడుకోమని చెప్పాడు అని చెప్పి అన్ని ఒక బ్యాగ్ లో సర్దుకుని వెళ్ళాడు.
ఊరి చివర ఉన్న ఆలయంలో ఇదివరకు తమ పెళ్లి జరిగిన గుడి దగ్గరే... ప్లాన్ చేసుకున్నాడు. కేవలం ఒక పాతబడిన షర్ట్, ప్యాంట్ తెచ్చుకున్నాడు. మొదటి రోజు గుడి దగ్గర కూర్చుంటే.. కొంచెం మొహంలో బిచ్చగాడి చాయలు లేకపోవటంతో గబగబా బయటికి వెళ్ళి… కాస్త మట్టి పూసుకుని కూర్చున్నాడు.
ఎండలో కూర్చోటం వల్ల నల్లబడి, తర్వాత గడ్డం
పెరిగి ఆటోమేటిక్ గా బిచ్చగాడిలాగా అయ్యాడు. అక్కడ
బిచ్చగాళ్లతో ఎన్నో ముష్టి యుద్ధాలు చేశాడు. కొన్నాళ్ళు
మాత్రమే వుంటాను అని బతిమాలి వున్నాడు.
ముందే..
పిల్లలకు చెప్పి వుండటం వల్ల వాళ్ళు తన్మయికి
ధైర్యం చెపుతూ వున్నారు. చివరి రోజు అయిపోయి
గుడిలోకి వెళ్ళి పూజ చేయించుకుని ఇంటికి బయలుదేరాడు.
ముందు సెలూన్ కు వెళ్ళి గడ్డం చేయించుకుని మొహం ఫేషియల్ చేయించుకుని
బయలుదేరాడు. అప్పుడే ఫోన్ తీసి సెలూన్లో ఛార్జ్ పెట్టుకుని, కాస్త పర్వాలేదన్నట్లుగా చూసుకుని ఇంటికి వెళ్ళాడు. తన్మయికి మెసేజ్ పెట్టాడు వస్తున్నానని.
ఇంటికి వెళ్ళేసరికి తన్మయి ఎదురు వచ్చి హగ్ చేసుకుంది. "పదా నేను స్నానం చేసి వస్తాను. హాస్పిటల్ కు వెళ్దాం" అన్నాడు తరుణ్.
"లేదండి..! మీరు అమెరికా నుండి ఆ డాక్టర్ కు
పంపిన మందుల వల్ల చాలా వరకు నయం అయింది.
వచ్చే వారం వెళ్దాం. మీరు వెళ్లిన చోట బాగా ఎండలని
అబ్బాయి చెప్పాడు.
వాడే, నాన్న అక్కడ నుండి డాక్టర్ కు కొరియర్ చేస్తున్నారు మందులని చెప్పాడు. చాలా థాంక్స్ తరుణ్. ఇక మనిద్దరం లైఫ్ హ్యాపీగా డీల్ చేయవచ్చు" అని తరుణ్ ను అల్లుకుంది ప్రేమగా.
"థ్యాంక్ గాడ్!" అని దేవుడికి మొక్కుకున్నాడు. హ్యాపీగా ఆరోజు కడుపునిండా అన్నం తిని నిద్రపోయాడు. తరుణ్ నిజమైన ప్రేమ, తన్మయి చావును జయించింది. అందుకే ఎవరినైనా మనం మనస్ఫూర్తిగా ప్రేమిస్తే.. ఆ దేవుడు ఆ ప్రేమను బతికిస్తాడు తప్పక.
సమాప్తం
పెనుమాక వసంత గారి కొన్ని ఇతర రచనలు:
పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.










Nice