నోటికి రుచిగా… మనసుకు శుచిగా

Notiki Ruchiga Manasuku Suchiga - Telugu Inspirational Article | Kotha Viritha
నోటికి రుచిగా… మనసుకు శుచిగా - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత
Published in manatelugukathalu.com on 12/10/2026
మాటలోని నిజం కంటే, ఆ నిజాన్ని చెప్పే తీరు కూడా ముఖ్యమని గుర్తుచేసే కొత్త విరిత ఆలోచనాత్మక రచన “నోటికి రుచిగా… మనసుకి శుచిగా”.
చక్కగా వంట చేసి, విస్తరి వేసి, గ్లాసులో నీళ్లు పోసి,
“రండి… తినండి” అని మర్యాదగా పిలిస్తే పచ్చడి అన్నం కూడా అమృతంలా అనిపిస్తుంది. అదే వంట చేసి టేబుల్ మీద పడేసి, “నువ్వే పెట్టుకుని తిను” అంటే బిర్యానీ కూడా బేకార్ గా అనిపిస్తుంది.
అసలు తేడా వంటలో లేదు… వడ్డించే విధానంలో ఉంటుంది. అలాగే మనం చెప్పే విషయాల్లోనే గొప్పతనం ఉందనుకుంటాం. కానీ ఎదుటివాడికి గుర్తుండిపోయేది విషయం కంటే, మనం చెప్పిన విధానం.
“ఇది ఇలా చేయాలి” అంటే సలహాలా ఉంటుంది.
“నీకు ఇది కూడా తెలియదా?” అంటే అదే మాట అవమానంగా మారుతుంది.
“జాగ్రత్తగా ఉండు” అంటే ఆప్యాయతగా ఉంటుంది.
“నీ వల్ల ఏం అవుతుంది?” అంటే అదే మాట గుండెల్లో ముల్లవుతుంది.
మాట ఒకటే… మనసులు మాత్రం వేరు వేరుగా గాయపడతాయి. మన దగ్గర నిజం ఉందని, నోటికి వచ్చినట్టు చెప్పేయడం కాదు. కత్తి పదునుగా ఉండటం గొప్ప కాదు… ఎక్కడ వాడాలో తెలిసుండటం గొప్ప.
అలాగే మాట గట్టిగా ఉండటం గొప్ప కాదు,
ఎక్కడ మృదువుగా ఉండాలో తెలిసుండటం గొప్ప.
మంచి ఉద్దేశంతో చెప్పిన మాట కూడా చెడ్డ పద్ధతిలో చెబితే, ఎదుటివాడికి ఉద్దేశం కనిపించదు… మన మాటలే కనిపిస్తాయి, గుర్తుండిపోతాయి.
అందుకే మనం ఏం చెప్పామన్నదికంటే, ఎలా చెప్పామన్నదే అసలైన మహత్యం.
వంట, పచ్చడి అన్నమైనా పర్లేదు, వడ్డించే మనసు మాత్రం అమృతంలా ఉంటే నోటికి రుచి.
అలాగే మాట ఎంత గొప్పదైనా పర్లేదు, అది చెప్పే మనసు శుచిగా ఉంటేనే మాటకు విలువ.
నోటికి రుచిగా ఉండేది వంట అయితే, మనసుకి శుచిగా ఉండేది మాట.
***
కొత్త విరిత
సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్
ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
మనతెలుగుకథలు.కామ్ — తెలుగు కథలకు మీ సొంత వేదిక
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: కొత్త విరిత
నా పేరు కొత్త విరిత
B.sc B.ed Msc చేశాను
IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.
240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.







చాలా బాగుంది
Super