top of page
Original.png

పాపపు మాటలు పుట్టె...లక్ష్మణా!

3 hours ago
3 min read

సీతపై వచ్చిన అపవాదులతో ఆవేదన చెందుతున్న శ్రీరాముడు, పక్కన లక్ష్మణుడు — తిక్కన పద్య సన్నివేశం

Papapu Matalu Putte...Lakshmana! - Telugu Literary Article | Bhattu Venkata Rao

పాపపు మాటలు పుట్టె...లక్ష్మణా! - తెలుగు సాహిత్య వ్యాసం | భట్టు వెంకటరావు

Published in manatelugukathalu.com on 25/09/2026


శ్రీరాముడి పాలనలో ప్రజాభిప్రాయానికి ఎంత ప్రాధాన్యం ఉందో తెలియజేసే హృదయస్పర్శమైన ఘట్టం ఇది.సీతను అగ్నిదేవుడు సాక్షిగా స్వీకరించినప్పటికీ, ఆమె గురించి ప్రజల్లో పుట్టిన అపవాదులు శ్రీరాముడిని తీవ్రంగా కలచివేస్తాయి.

తిక్కన మహాకవి ‘నిర్వచనోత్తర రామాయణం’ అష్టమాశ్వాసంలోని 116వ పద్యంలో ఈ ఆవేదనను అద్భుతంగా ఆవిష్కరించారు.

“పాపపు మాటలు పుట్టె... లక్ష్మణా!” అనే శ్రీరాముడి వేదన ఈ పద్యానికి హృదయం.


భద్రుడు శ్రీరాముని నర్మసచివులలో అతి ముఖ్యుడు. ఒకనాడు రాజ్యంలో తన పాలనను గురించి పౌరులు ఏమి అనుకుంటున్నారో తెలుసుకుని వచ్చి చెప్పమని శ్రీరాముడు అతడిని ఏకాంతంలో అడిగాడు.


శ్రీరాముడు చెప్పిన ఆ పనిని పూర్తి చేసుకుని వచ్చిన భద్రుడు “ఇందులో వేరే చెప్పడానికేముంది ప్రభూ… విన్నంతలో అంతా చాలా గొప్పగా అనుకుంటున్నారు స్వామీ!” అని బదులిచ్చాడు. అయినా శ్రీరాముడికి అతడి మాటలలో ఏదో దాస్తున్నాడన్న అనుమానం కలిగింది.


'కొత్తగా రాజ్యాధికారం చేపట్టి పరిపాలించడం మొదలుపెట్టిన తొలి రోజులలో, సహజంగానే కొంత మందికి అందులో కొన్ని విషయాలు నచ్చకపోవడం జరుగుతుంటుంది. అలాంటి విమర్శకు సంబంధించి మాటలు ఏమీ నీ చెవిన పడలేదా?' అని అడిగాడు భద్రుడిని.


శ్రీరాముడి ఆ మాటలకు “అలాంటి అనుమానం మీకెందుకు కలిగింది స్వామీ?” అన్నాడు భద్రుడు.


“పొగడ్తలను చెప్పావు. విమర్శలు చెప్పవచ్చునో లేదో అని సందేహంలో పడినట్లుగా ఉంది నీ వైఖరి చూస్తూవుంటే. అవి దాచిన పాపం నీకు అంటకుండా, నీవు ఏమి వింటే అది, విన్నది విన్నట్లుగానే నాకు చెప్పు!” అన్నాడు శ్రీరాముడు. అప్పటికీ భద్రుడు బయటపెట్టలేదు.


అయితే శ్రీరాముడు కూడా “ఏమీ లేదు కాబోలు!” అని సమాధానపడి అక్కడితో ఆగిపోలేదు.


“ఎవరో పరాయివాళ్ళు మాట్లాడిన మాటలు చెప్పినంత మాత్రాన నాకు ఏదో అయిపోతుందని ఎందుకు అనుకుంటావు? నాకు ఇష్టమైనవాడవు, నా హితం కోరేవాడవైన నువ్వు, ఇప్పుడెందుకు నా యెదుట మాట్లాడడానికి భయపడుతున్నావు? మనం ఇరువురమే ఉన్న ఈ ఏకాంతంలోనే కదా నేను నిన్ను అడుగుతున్నాను!” అని భద్రుడికి భరోసా కలిగే విధంగా ఇంకా ఇలా అన్నాడు శ్రీరాముడు:


“నిజానిజాలను తెలుసుకోకుండా, లేని చెడును ఊహించి, చేయని తప్పులను కల్పించి, వాటిని ఆపాదించి నలుగురిలో మనలను అప్రతిష్ఠ పాలు చేసే వాళ్ళ నోళ్ళను మూయించడంలో మనకు కూడా మనస్సు ఆనందపడడం జరుగుతుంది కాబట్టి అందులో తప్పేమీ లేదు. అది జరగవలసిన పనే కానీ వేరు కాదు!”


అని శ్రీరాముడు బలవంతం చేసి అడుగగా, సంకోచం వీడినవాడై, ప్రభువు అంతగా అడిగిన మీదట ఇక చెప్పక తప్పదన్నట్లుగా భద్రుడు చెప్పిన సంగతి విని శ్రీరాముడు హతాశుడై, విచలిత మనస్కుడయ్యాడు.


తన బాధనంతా తమ్ముడైన లక్ష్మణుడితో బేలగా వెళ్ళబోసుకోవడాన్ని, పాఠకుడి మనసును కలచివేసే సన్నివేశంగా వర్ణించాడు తిక్కన ‘నిర్వచనోత్తర రామాయణం’ లోని ఈ క్రింది పద్యంలో (అష్టమాశ్వాసం, 116వ పద్యం):


ఉ. రావణునింట నుండఁగ ధరాసుత నే మరలంగఁ దెచ్చి సం

భాావన సేఁత కష్టమని పల్కిరి చూచితె లక్ష్మణా! మహా

దేవుఁడు బ్రహ్మయున్ మునులు దేవగణంబులు మెచ్చ నయ్యెడం

బావకుఁ డిచ్చె నాకు సతిఁ బాపపు మాటలు వుట్టె నియ్యెడన్.


“రావణుడి ఇంట్లో అన్ని నాళ్ళు ఉన్న భూమిపుత్రి సీతను నేను మరలా నాతో తెచ్చుకుని ప్రేమగా చూసుకోవడం వారికి కష్టం కలిగించిందని అంటున్నారు, ఎంత అన్యాయమో చూశావా లక్ష్మణా!” అని మాట్లాడిన శ్రీరాముడి మాటలలో ఎంత దైన్యం వినబడుతోందో వేరే చెప్పనక్కర లేదు కదా!


“బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పాటుగా సకల దేవతలు, మునిగణం సాక్షిగా అగ్నిదేవుడు నా చేతికిచ్చిన ఆమెను గురించి పాపపు మాటలు పుడుతున్నాయి ఇక్కడ, నా పాలనలో, నా రాజ్యంలోనే తమ్ముడా. నేను ఇప్పుడు ఏమి చేయాలి చెప్పు!” అని మనసు విరిగిన నిర్వేదంలో శ్రీరాముడు బాధపడడం కళ్ళకు కట్టినట్లు వర్ణించాడు తిక్కన మహాకవి పై పద్యంలో.


***


పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.



భట్టు వెంకటరావు గారి కొన్ని ఇతర రచనలు:



భట్టు వెంకటరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: భట్టు వెంకటరావు


భట్టు వెంకటరావు

నా పేరు భట్టు వెంకటరావు.

కేంద్ర ప్రభుత్వ విశ్రాంత అధికారిని. 

సాహిత్యంపై అభిలాషతో విశ్రాంత జీవితంలో తెలుగు సంప్రదాయ సాహిత్యం చదవడం మొదలుపెట్టాను. అలా చదవడం మొదలుపెట్టిన కొన్నాళ్ళకి చిన్న చిన్న వ్యాసాలు వ్రాయడం ఆరంభించి, కొనసాగిస్తున్నాను. 


నా రచనా వ్యాసంగం ప్రథానంగా పూర్వ కవుల రచనలలోని ఆసక్తికరమైన విషయాలపై సాహిత్య సంబంధమైన వ్యాఖ్యలతో కూడినదిగా ఉంటుంది. అన్ని ప్రథాన దినపత్రికల సాహిత్యం పేజీలలో నా వ్యాసాలు గత ఆరేడు సంవత్సరాలుగా ప్రచురితమయ్యాయి, అవుతున్నాయి. వాటితో పాటు అప్పుడప్పుడు ఛందోబద్ధమైన పద్యాలను, కంద పద్యం వ్రాయడంతో మొదలుపెట్టి, వ్రాస్తున్నాను.


ప్రస్తుతానికి నా రచనా వ్యాసంగం గురించి చెప్పుకోగలిగినది ఇంతవరకే. ధన్యవాదములు!

నమస్కారములతో,


భట్టు వెంకటరావు,

హైదరాబాదు. 


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page