top of page
Original.png

పరామర్శ

12 minutes ago
3 min read

ఆసుపత్రిలో ఆపదలో ఉన్న స్నేహితురాలికి ధైర్యం చెబుతున్న మహిళ – పరామర్శ కథ

Paramarsa - Telugu Social Stories | Sritha

పరామర్శ - తెలుగు సామాజిక కథలు | శ్రిత

Published in manatelugukathalu.com on 23/11/2026


కష్టకాలంలో మనవాళ్లు పలకరించి చెప్పే నాలుగు మంచి మాటలు మనోధైర్యాన్ని పెంచుతాయి. అవసరమైనప్పుడు సహాయం అడగడం బలహీనత కాదనే జీవిత సత్యాన్ని చెప్పే హృద్యమైన కథ “పరామర్శ”.


జమునకు తన స్నేహితురాలు శైలజ నుంచి ఫోన్ వచ్చింది. “జమునా! మా వారికి ఆరోగ్యం బాగాలేదు. 


ఐసీయూలో ఉంచారు,” అని శైలజ చెప్పగానే జమున కంగారుపడింది.


వెంటనే తన స్నేహితురాళ్లతో కలిసి యశోద హాస్పిటల్‌కు బయలుదేరింది.


అక్కడికి వెళ్లేసరికి శైలజ భర్తను ఐసీయూ నుంచి జనరల్ రూమ్‌కు మార్చారు. ఆయనతో మాట్లాడుతున్నారు, పలకరిస్తున్నారు. 


పరిస్థితి కొంత మెరుగుపడినట్లే కనిపించింది.


ఇంతలో శైలజ అక్కడికి వచ్చింది. “అసలు ఏం జరిగింది శైలజా?” అని జమున అడిగింది. “మా వారిని ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లారు. 


అంతా బాగానే అయిందని చెప్పారు. నేను కూడా మా వాళ్లందరికీ ఫోన్ చేసి చెప్పాను. అంతా సర్దుకుంది అనుకునేలోపే మళ్లీ స్ట్రోక్ వచ్చిందని తీసుకెళ్లారు. 


ఆ సమయంలో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు; చేతులు, కాళ్లు ఆడలేదు. మళ్లీ అందరికీ ఫోన్ చేశాను,” అంటూ తన ఆవేదనను చెప్పుకుంది శైలజ. జమున అక్కడి వాతావరణాన్ని గమనిస్తోంది.


శైలజ భర్త, ఆమె తమ్ముడు, అత్తమామలు, తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు... ఒక్కొక్కరుగా అందరూ వచ్చి ఆమెకు తోడుగా నిలబడ్డారు.


డాక్టర్లు రౌండ్స్‌కు వచ్చి పరీక్షలు చేస్తున్నారు, అవసరమైన వైద్యం అందిస్తున్నారు. 


కుటుంబ సభ్యులంతా అక్కడే ఉండి శైలజకు ధైర్యం చెబుతున్నారు.

డాక్టర్లు అందించే వైద్యం మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎంతగానో తోడ్పడుతుంది. 


కానీ, మన చుట్టూ మనవాళ్లు, బంధువులు, స్నేహితులు ఉంటే ఆ ధైర్యం మరింత బలపడుతుంది కదా! జమున రెండు నెలల క్రితం జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంది. రెండు నెలల క్రితం తన భర్తకు యాంజియోగ్రామ్ చేసి స్టెంట్ వేయాల్సి వచ్చింది. 


అప్పుడు తానే అన్నీ చూసుకుంది. తనకు తానుగా ధైర్యం చెప్పుకుంటూ, భర్తను ఆసుపత్రికి తీసుకెళ్లి, అవసరమైన పనులన్నీ పూర్తి చేసుకుని ఇంటికి తీసుకొచ్చింది.


చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు నేర్పిన పాఠం ఆమెకు గుర్తుకొచ్చింది: “నీ పనులు నువ్వే చేసుకోవాలి. ఎవరి మీదా ఆధారపడకూడదు.”


ఆ మాటలను పాటిస్తూ జమున ఎప్పుడూ తన పనులు తానే చేసుకునేది. ఎవరి సహాయమూ అడగడానికి ఇష్టపడేది కాదు.


కానీ, ఇప్పుడు శైలజ పరిస్థితి చూసిన తర్వాత ఆమె ఆలోచనలో మార్పు వచ్చింది. మనకు అవసరమైనప్పుడు ఇతరుల సహాయం అడగడంలో తప్పేముంది? రాముడంతటి వాడే హనుమంతుడి సహాయం తీసుకున్నప్పుడు, మనుషులమైన మనం ఒకరి సహాయం మరొకరం తీసుకోవడంలో తప్పేముంది? సహాయం అడిగితేనే ఎదుటివారు చేయగలరో లేదో తెలుస్తుంది. 


చేయడం, చేయకపోవడం వారి ఇష్టం. కానీ, మన అవసరాన్ని చెప్పుకోవడంలో మాత్రం ఎలాంటి తప్పూ లేదు. ఎవరైనా వచ్చి మనల్ని పలకరించి, నాలుగు మంచి మాటలు మాట్లాడినా చాలు. 


మనలోని మనోవేదనను నలుగురితో పంచుకున్నప్పుడు మనసు కొంత తేలికపడుతుంది. ఆ పలకరింపే మనలోని మనోబలాన్ని రెట్టింపు చేస్తుంది. ఈ రోజుల్లో చాలామంది ఉద్యోగాల కోసం, డబ్బు సంపాదన కోసం స్వదేశాన్ని వదిలి విదేశాలకు వెళ్లిపోతున్నారు. 


కుటుంబ సభ్యులంతా దూరంగా ఉంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో కష్టకాలంలో ఒకరి తోడు మరొకరికి ఎంతో అవసరం.


ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తిని చూడటానికి నలుగురు వచ్చి పలకరిస్తే, రోగికి మాత్రమే కాదు, వారి కుటుంబ సభ్యులకు కూడా ఎంతో ధైర్యం వస్తుంది. 


కొన్నిసార్లు ఆ మనోధైర్యమే కోలుకోవడానికి తోడ్పడుతుంది. అందుకేనేమో పూర్వకాలంలో ఎవరైనా ఆసుపత్రిలో ఉన్నారని తెలిస్తే, దూరపు బంధువులైనా సరే, “అయ్యో! అలా జరిగిందా? వెళ్లి పలకరించి వద్దాం,” అనుకునేవారు. 


ఇంటికి వెళ్లే ముందు దిష్టి తీసి, లోపలికి వెళ్లి పరామర్శించేవారు. అది మన సంస్కృతిలో ఒక భాగం.


కానీ, కాలం మారుతున్న కొద్దీ మన సంస్కృతిలోని ఇలాంటి మంచి ఆచారాలను మనమే పక్కన పెట్టేస్తున్నామేమో అనిపించింది జమునకు. ఆసుపత్రిలో వైద్యుల సహకారం ఎంత ముఖ్యమో, ఆ సమయంలో మనవాళ్లు వచ్చి పలకరించడం కూడా అంతే ముఖ్యం. 


వారి నాలుగు మంచి మాటలు మనకు ఒక పవర్‌ఫుల్ టానిక్‌లా పనిచేస్తాయి. ఆ రోజు శైలజను పరామర్శించడానికి వెళ్లిన జమునకు ఒక కొత్త విషయం అర్థమైంది.


అవసరమైనప్పుడు సహాయం అడగడం బలహీనత కాదు. మన బాధను పంచుకోవడం, మనల్ని పలకరించడానికి వచ్చిన వారిని ఆప్యాయంగా స్వీకరించడం కూడా ఒక గొప్ప మనోబలం.


పరామర్శించడం అంటే కేవలం చూడటానికి వెళ్లడం కాదు... ఎదుటివారి మనసుకు ధైర్యాన్ని ఇవ్వడం! ఆ రోజు జమున నేర్చుకున్న జీవిత పాఠం అదే.


***








📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y


***

శ్రిత గారి కొన్ని ఇతర రచనలు:



శ్రిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


 రచయిత్రి పరిచయం: శ్రిత

శ్రిత అనే కలం పేరుతో రచనలు చేస్తున్న జమున, సాధారణ జీవితంలోని అనుభూతులు, కుటుంబ బంధాలు, మానవ సంబంధాలు, మహిళల మనోభావాలను కథల రూపంలో ఆవిష్కరించడాన్ని ఇష్టపడతారు.

ఆమె రచనల్లో ఆప్యాయత, మానవత్వం, కుటుంబ విలువలు సహజంగా ప్రతిబింబిస్తాయి. రోజువారీ జీవితంలో కనిపించే చిన్న చిన్న సంఘటనల్లోని గొప్ప భావాలను పాఠకుల హృదయాలకు చేరేలా చెప్పడం ఆమె రచనల ప్రత్యేకత.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page