top of page

పర్యవసాన ప్రభావం


'Paryavasana Prabhavam' written by Siriprasad

రచన : శిరిప్రసాద్


ఒక తుఫాను వచ్చినా

ఒక పెద్ద స్కామ్ జరిగినా

కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చినా

దాని ప్రభావం ధనికుడి మీద, అవినీతిపరుడి మీద ఉండదు.

సామాన్యుడే బాధ పడతాడు, బలవుతాడు .

ప్రముఖ రచయిత సిరిప్రసాద్ గారు ఈ విషయాన్ని చక్కగా వివరించారు.మల్లయ్య తను కొత్తగా కొనుక్కున్న విమానంలోకి దర్జాగా ప్రవేశించాడు. విమానం లోపల విలాసవంతమైన ఏర్పాట్లు. అన్నింటినీ నిశితంగా పరిశీలించి, టాయ్లెట్ ముందున్న చెప్పుల స్టాండ్ మేడ్ ఇన్ ఇండియా ది గా గ్రహించి, అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ని పిలిచాడు. "ఇదొక్కటే మీకు ఫారిన్ లో దొరకలేదా?" అని గద్దించి అడిగాడు.

ఆ ఆఫీసర్ నీళ్ళు నములుతూ నిలబడ్డాడు.

"ఈ ఐర్క్రాఫ్ట్ లో మేడ్ ఇన్ ఇండియా ఐటమ్స్ ఏవీ వుండకూడదని చెప్పాకదా?"

"ఎస్ సార్!..."

"ఈ మేడ్ ఇన్ ఇండియా గాడు ఇలా వాగుతున్నాడేమిటి, అని ఆలోచిస్తున్నావా?"

"లేదు సార్. అయినా మీరు చూడడానికి బ్రిటిష్ వాళ్ళలా వుంటారు సార్!"

పెద్దగా నవ్వాడు మల్లయ్య. "మా తాత బ్రిటిష్ ఆఫీసర్ దగ్గిర పనిచేశాడు లే!" అన్నాడు.

తన పొగడ్త కి, ఆయన సమాధానానికి ఏమిటి సంబంధం, అని ఆలోచించసాగాడు అడ్మినిస్ట్రేటివ్ హెడ్.

అత్యంత ఖరీదైన రిక్లైనర్ సోఫాలు రౌండ్ గా, మధ్యలో ఖరీదైన గ్లాస్ టీపాయ్, ప్రతి సోఫా పక్కన అందమైన ఇటాలియన్ స్టాండ్ [మందు గ్లాసులు, చిరుతిండి పెట్టుకోడానికి], కొంచం దూరంలో బెడ్ రూ మ్, అందులో ఒక స్టడీ టేబుల్, 8 ఎం ఎం స్క్రీన్, దానికో ప్రొజెక్టర్-ఇంత ఖరీదైన హంగామా చూసి గర్వంగా మీసం మెలేసాడు. తన చిన్ననాటి కల అది. సొంతంగా ఒక ఎయిర్క్రాఫ్ట్ కొనుక్కోవాలని, అందులో అన్నీ సౌఖ్యాలు వుండాలని. యవ్వనంలో ఇంకో కోరిక మొలిచింది. ఆ ఎయిర్క్రాఫ్ట్ లో బెడ్ వుండాలని, ఆకాశం లో ఆ బెడ్ మీద దేవ కన్య లాంటి అందమైన అమ్మాయితో ఎంజాయ్ చేయాలనీ. ఇన్నాళ్ళకి ఆ కలలు ఫలించే సమయం వచ్చింది. ఆ కల ఇంకా పెరిగి, ఒక ఎయిర్లైన్స్ సంస్థనే నెలకొల్పాలని, అందులో ఎయిర్ ఇండియా లో లాగా కాకుండా, హుషారైన అమ్మాయిల్ని ఎయిర్ హోస్టెస్ లు గా నియమించుకోవాలని, ప్రపంచ మంతా తన ఎయిర్లైన్స్ కనపడాలని, ఫేమస్ కావాలని వగైరా.

ఎయిర్క్రాఫ్ట్ నించి బయటికొచ్చాక, జీ ఎం -ఫైనాన్స్ మల్లయ్య తో అన్నాడు,' సర్, యీ ఎయిర్క్రాఫ్ట్ కి లోన్ యిచ్చిన బ్యాంకు వాళ్ళు, ఎయిర్క్రాఫ్ట్ ఎంట్రన్స్ లో వాళ్ళ బాంక్ కి హైపోథికేట్ అయినట్టు సైన్ పెట్టమంటున్నారు.'

'ఎవరు చెప్పింది?' అడిగాడు మల్లయ్య. '

'జీ ఎం క్రెడిట్ ' చెప్పాడు జీ ఎం ఫైనాన్స్.

వెంటనే ఫోన్ తీసుకుని ఆ బ్యాంకు చైర్మన్ కి ఫోన్ చేసాడు, 'మీ జీ ఎం క్రెడిట్ హద్దు మీరుతున్నాడు. హెడ్ ఆఫీస్ నించి ట్రాన్స్ఫర్ చెయ్యి!' అని ఫోన్ కట్ చేసేసాడు. సాయంత్రం కల్లా ఆ జీ ఎం ని కలకత్తా కి ట్రాన్స్ఫర్ చేసి, అరగంట లో రిలీవ్ చేసేసారు.

మల్లయ్య క్యాబిన్ లోకి వచ్చి ఎదురుగా కూర్చున్నాడు ఆయన పీ ఏ శంకరన్. ఏమిటన్నట్టు చూసాడు మల్లయ్య.

'లీరు యాడ్ ఏజెన్సీ ఎం డీ అరోరా వస్తున్నాడు. ఐదు నిముషాల్లో వస్తానని చెప్పాడు ,' అన్నాడు శంకరన్, ముఖంలో ఒక పుస్తకమే చూపిస్తూ.

'ఏమిటో చెప్పు!' అన్నాడు మల్లయ్య, అనుమానంగా.

'లాస్ట్ ఇయర్ మనం దాదాపు ఐదువందల కోట్లకి ప్రకటనలు యిచ్చాం. వాళ్ళకి వచ్చే కమిషన్ డెబ్బై ఐదు కోట్లలో నలభై దాకా మనకివ్వాలి కదా!... అది వచ్చిందో, లేదో చూడండి. ఈ సంవత్సరం బడ్జెట్ కూడా ఇవ్వాలి కదా!...' అన్నాడు శంకరన్

'గుడ్. వాడ్ని వెయిట్ చేయమను. నేను చెక్ చేసుకుని, లోపలికి పిలుస్తాను,' అంటూ మల్లయ్య టేబుల్ సొరుగు లోంచి ఒక ట్యాబు బయటికి తీసాడు. శంకరన్ ని పొమ్మన్నట్టు సంజ్ఞ చేసాడు.

ఆ టాబ్ లో రహస్య ఆదాయ వ్యయాల లెక్క వుంటుంది. లీరు యాడ్ ఏజెన్సీ ఖాతా తీసాడు. ఇంకా యెనిమిది కోట్లు రావాల్సి వుంది. లీరు ఎం డీ ని ఆ విషయమే అడిగాడు.

'సర్ ! ఆ యెనిమిది లో రెండు మీ మార్కెటింగ్, యాడ్ డిపార్టుమెంటు జీ ఎం మొదలు స్టాఫ్ అందరికీ యిచ్చాను. మరో కోటి మీ ఫైనాన్స్ డిపార్టుమెంటు లో పంచాను. మీకు యింకా ఐదు రావాల్సి వుంది. మాకు రావాల్సివున్నది చాలా వుంది......' అన్నాడు లీరు ఎండీ.

'ఆపేసినట్టున్నావ్...' అడిగాడు మల్లయ్య.

'లాస్ట్ ఇయర్ ఏర్పాట్లకి కోటి దాకా ఖర్చయ్యింది...' నీళ్ళు నములుతున్నాడు.

'అంత అయ్యిందా?'

'ఏర్పాట్లు టాప్ క్లాస్ గా వుండాలన్నారు ...... మల్టీ నేషనల్ అన్నారు కదా...' మళ్ళీ నీళ్ళు నములుతూ అన్నాడు.

'ఓకే ... ఓకే ... సుఖం వూరికే రాదు!... మిగిలిన నాలుగు ఫాస్ట్ గా యివ్వు !... నెక్స్ట్ ఇయర్ కేలండర్ కి యేమాలోచిస్తున్నావ్ ?' అడిగాడు మల్లయ్య.

'ఈ ఫోటోలు చూడండి సర్ ! ఇవి మోడల్స్ ప్రొఫైల్ పిక్స్ . అమ్మాయిల్ని సెలెక్ట్ చేస్తే, ఫోటో షూట్ స్టార్ట్ చేస్తాను. వివిధ భంగిమల్లో తీసి మీకు చూపిస్తాను,' అన్నాడు లీరు ఎం డీ .

'క్యాలెండర్లో పిక్స్ చూసి అందరూ వాళ్ళ కొలతలు తెలుసుకోవాలి. ఐ మీన్ అందర్నీ బికినీ లో చూపించాలి. ఈ సారి పన్నెండు పేజీల్లో పన్నెండు మందీ కొత్త అమ్మాయిలే వుండాలి . ఓకేనా?' అన్నాడు వుత్సాహంగా మల్లయ్య.

'అర్ధమైంది సర్ . ఏ నెల పేజీలో వున్న అమ్మాయి ఆ నెలలో మూడు రోజులు మీతో గడపాలి. ఆ ఖర్చు ఎంతో చెప్తాను. మీరే సెటిల్ చేయండి. ఆ విషయం లో మన మధ్య అభిప్రాయ బేధాలు రాకూడదు!' అన్నాడు లీరు ఎం డీ.

'ఓకే . అభిప్రాయ బేధాలు రాకుండా నువ్వే చూసుకోవాలి అరోరా!... అవి వస్తే నేను నా సొంత యాడ్ ఏజెన్సీ పెట్టేస్తాను. లిరయన్స్ కంపెనీ వాళ్ళు వాళ్ళ యాడ్ ఏజెన్సీ యెప్పుడో పెట్టేసుకున్నారు ...' అన్నాడు మల్లయ్య నర్మగర్బంగా.

'అంత మాట అనకండి సార్!... నేను చూసుకుంటాను,' అని అరోరా లేచాడు.

మల్లయ్య కంపెనీలకి లోన్లు యిచ్చిన నాలుగు బాంకుల చైర్మన్లు, వాళ్ళ జీ ఎం లు వొక హోటల్లో సమావేశమయ్యారు.

ఏబీసీ బ్యాంకు చైర్మన్, బ్యాంకుల కన్సార్టియం చైర్మన్ మెహతా అందరినీ వుద్దేశించి అన్నాడు, 'మల్ల య్య కంపెనీలకి మనందరం కలిసి యిచ్చిన లోన్ మొత్తం ఐదువేల కోట్లు దాటింది. వాళ్ళిచ్చే ఖాతా వివరాలు, స్టాక్స్, ఆస్తులు, అప్పులు అన్నీ విశ్లేషిస్తే యేవీ సరిగ్గా లేవనిపిస్తున్నాయి. కిందటి మీటింగ్ లో కమిటీని వేసాం. ఆ కమిటీ తో మల్లయ్య కంపెనీలు ఏవీ సహకరించట్లేదు. ఫైనాన్స్ మినిస్ట్రీ నించి కమిటీ యెందుకు వేశారు, అని ఫోన్లు కూడా వస్తున్నాయి. ఆయనే వొకప్పుడు ఎం పీ కదా!...'

'మీరు కేటాయించినట్టే మళ్ళీ ఐదువందల కోట్లు యిచ్చాము సర్ !' అన్నాడు 'డీ ఈ ఎఫ్ బాంక్' చైర్మన్ కామత్.

'మేమూ అంతే కదా,' అన్నాడు 'జీ హెచ్ ఐ బ్యాంకు' చైర్మన్ మక్సూద్.

'మేము లాస్ట్ మంత్ ఏడు వందల యాభై కోట్లు ఆమోదించాం ... ఆ మొత్తాన్ని డ్రా చేయనివ్వొచ్చా?' అడిగాడు 'జె కే ఎల్ బ్యాంకు ' చైర్మన్ జీ ఎస్ రావు.

'రావు గారూ, మీ లోన్ కి సెక్యూరిటీ వున్నదనుకుంటా!... మీరు కంటిన్యూ చేయండి!' అన్నాడు మెహతా.

'ఇంకా యెందుకు యివ్వాలి సార్ మల్లయ్యకి.? ' అడిగాడు మక్సూద్.

'ఎందుకంటే పైనించి ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి!' అన్నాడు మెహతా.

లంచ్ వరకు జరిగిన ఆ సమావేశం లో జే కే ఎల్ బాంక్ మాత్రం కొత్త లోన్ విడుదల చెయ్యాలి; మిగిలిన బాంకులు ప్రస్తుతానికి ఆపేయాలని నిర్ణయించారు.

జె కె ఎల్ బాంక్.

లోన్స్ ఆఫీసర్ తన టేబుల్ మీదున్న మల్లయ్య బ్రువరీస్ నించి వచ్చిన బిల్స్, లెటర్ చూసాడు. క్లియరింగ్ లో వందకోట్లకి చెక్ వచ్చింది. అతను పరుగున బ్రాంచ్ మేనేజర్ దగ్గిరకి వెళ్ళాడు. 'సార్! మల్లయ్య బ్రువరీస్ లీరు యాడ్ ఏజెన్సీ కి యిచ్చిన తొంభై తొమ్మిది కోట్ల తొంభై తొమ్మిది లక్షల చెక్ పేమెంట్ కి వచ్చింది. నిన్న కంపెనీ నించి వచ్చిన లెటర్ ప్రకారం యీ చెక్ వాళ్ళ కేలండర్ ఖర్చులు, కొన్ని ప్రకటనల ఖర్చులట. పాస్ చేయమంటారా?' అని బ్రాంచ్ మేనేజర్ ని అడిగాడు.

'ఒక్క క్షణం ఆగు!' అంటూ బ్రాంచ్ మేనేజర్ డివిజనల్ మేనేజర్ కి ఫోన్ చేసాడు. ఒక్క క్షణం ఆగు, అని ఆ డివిజనల్ మేనేజర్ హెడ్ ఆఫీస్ లో జీ ఎం కి ఫోన్ చేసాడు. ఆయన ఒక క్షణం ఆగమని చెప్పి, చైర్మన్ కి ఇంటర్ కం లో ఫోన్ చేసి అడిగాడు. ఆయన పాస్ చేయమన్నాడు. ఆ ఆదేశాలు కింద దాకా వచ్చేసాయి. పది నిముషాల్లో చెక్ పాస్ అయింది. సాయంత్రం యింటికి వెళ్లబోతుండగా వొక వ్యక్తి వచ్చి లోన్స్ ఆఫీసర్ కి, బ్రాంచ్ మేనేజర్ కి రెండు కవర్లు యిచ్చాడు. కవర్ని కొద్దిగా ఓపెన్ చేసి చూసుకున్నారు. కరెన్సీ నోట్లున్నాయి. ఇద్దరూ వొకరి ముఖం వొకరు చూసుకున్నారు. చిరునవ్వు బయటికి కనపడగా , మహదానందం లోపల వెళ్లి విరిసింది. ఇద్దరూ వొకటే అనుకున్నారు: మల్లయ్య సోషలిస్టబ్బా; అందరి నీ సమానంగా చూస్తున్నాడు!

నెల రోజుల్లో యేడు వందల యాభై కోట్లు అయిపోయాయి. అందులో మూడు వందల కోట్లు, పౌండ్స్ లో లండన్ లోని మల్లయ్య ఇన్కార్పొరేటెడ్ అనే సంస్థకి బదిలీ అయ్యాయి.

నెల నెలా మల్లయ్య బిజినెస్ పని మీద వివిధ దేశాలకి వెళ్ళి వస్తున్నాడు. ఒక్కోసారి వొక్కో కేలండర్ అమ్మాయిని పీ ఏ అని చెప్పి, కూడా తీసుకెళ్తున్నాడు. ఆ ఖర్చులు కోట్లలో వుండడం లో ఆశ్చర్యమేముంది. ఆ రోజు ఆఫీస్ లో కూర్చున్నాడు. పీ ఏ శంకరన్ ని పిలిచి కొన్ని డిక్టేషన్లు యిచ్చాడు.

'హూ... శంకరన్ విశేషాలేమిటి?'

'ఏమీ లేవు సర్. ఎంతవరకు నిజమో కానీ, జీ ఎం ఫైనాన్స్ రాజీనామా చేస్తున్నాట్ట... ' అన్నాడు శంకరన్.

'నిజమా? ... ' ఆశ్చర్యం వ్యక్తం చేసాడు మల్లయ్య. తనకి యింతవరకూ చెప్పలేదు. పీ ఏ గాడికి యెలా తెలిసిందబ్బా, అనుకున్నాడు.

'శంకరన్ ! పొతే పోయాడు కానీ, డీ జీ ఎం ఫైనాన్స్ యెలాంటి వాడు?' అని అడిగాడు పీ ఏ ని.

'మంచివాడే సర్ ' అన్నాడు శంకరన్ . మంచివాడు అంటే మల్లయ్య మాట తూ చా తప్పకుండా పాటించేవాడు, అని అర్ధం. 'సరే నువ్వెళ్ళి ఆ లెటర్స్ టైపు చేసి పట్టుకురా!' అని శంకరన్ ని పొమ్మన్నట్టు సంజ్ఞ చేసాడు.

'సార్!' నీళ్ళు నములుతూ అక్కడే నిలబడ్డాడు శంకరన్. ఏమిటన్నట్టు చూసాడు మల్లయ్య.

'సార్! ఐదేళ్లుగా నా జీతం పెంచడం లేదు. హెచ్ ఆర్ వాళ్ళకి చెప్పండి సార్!' అని అడిగాడు శంకరన్ వినయంగా.

'ఎంతిస్తున్నారు నీకు?'

'యాభై వేలు సర్ ' అన్నాడు.

'మోనికా కి ఎంతిస్తున్నారు ?'

'రెండు లక్షలు సర్ !' రెండు ని వొత్తి చెప్పాడు.

మోనికా మల్లయ్య కి చాలా కాలం గా పీ ఏ గా పనిచేస్తోంది.

'మోనికా కి వయసు నలభై దాటిపోయింది. దాన్ని యెలాగైనా బయటికి పంపేసెయ్ !... నీ జీతం రెండు లక్షలకి పెంచేస్తా!... నువ్వు నాకు చాలా యూస్ ఫుల్ !...' అన్నాడు మల్లయ్య. గత్యంతరం లేక తలవూపి క్యాబిన్ నించి బయటికి వెళ్ళాడు శంకరన్. 'వీడికి పై సంపాదన బాగానే వుంది. అయినా జీతం పెంచమని దేబరిస్తున్నాడు !' అనుకున్నాడు మనస్సులో మల్లయ్య.

మల్లయ్య డీ జీ ఎం ఫైనాన్స్ కి ఫోన్ చేసి, 'మీకు ప్రమోషన్ యివ్వడానికి టైం వస్తున్నది. మీ జీ ఎం రాజీనామా చేస్తున్నాట్ట కదా!... దగ్గిరుండి యేదో వొకటి చెప్పి నయానో, భయానో వాడి చేత నిజంగానే రాజీనామా చేయించు. రెండు రోజుల్లో వాడి రెజిగ్నేషన్ నా టేబుల్ మీద వుండాలి,' అన్నాడు మల్లయ్య.

డీ జీ ఎం ఫైనాన్స్ పరమానంద భరితుడై, 'అలాగే సార్!' అన్నాడు.

'ఇప్పుడు లండన్ లో నా సోల్ ప్రొప్రయిటరీ కన్సర్న్ ఖాతాలో బాలన్స్ ఎంతైంది?' అడిగాడు మల్లయ్య. ఠక్కున చెప్పాడు డీజీఎం,' వందకోట్ల పౌండ్లకి చేరుకుంది సార్!'

'దట్స్ గుడ్,' అన్నాడు మల్లయ్య.

వెంటనే లండన్లో తను నియమించిన బ్రోకర్ కి ఫోన్ చేసి, యిద్దరూ కలిసి ఫైనలైజ్ చేసిన యింటి రేట్ అడిగాడు. వాడు ఎనభై కోట్ల పౌండ్లు అని చెప్పాడు. వెంటనే ఆ బ్రోకర్ తో , 'గో ఎహెడ్ . రిజిస్ట్రేషన్ డేట్ ఫిక్స్ చెయ్యి. వచ్చేస్తాను!' అన్నాడు మల్లయ్య. ఒక అద్భుతమైన, విలాసవంతమైన, విశాలమైన బంగ్లా లండన్ లో తన సొంతం కాబోతోంది, అనుకుని మీసాలు మెలేసుకున్నాడు.

ఏ బీ సీ బ్యాంకు చైర్మన్ మెహతా క్రెడిట్ జీ ఎం , క్రెడిట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూర్చుని మల్లయ్య కంపెనీ ల ఖాతాల విషయమై సీరియస్ గా చర్చిస్తున్నారు.

'కన్సార్టియం బాంకుల్లో మల్లయ్య కంపెనీ ల ఖాతాలన్నీ నిరర్ధక ఆస్తుల కింద మారిపోయాయి. మనం యింకా డిక్లేర్ చెయ్యలేదు. వాళ్ళు కనీసం ఐదు వందల కోట్లు కడితే మరో మూడు నెలలు లాగచ్చు...' జీ ఎం క్రెడిట్ వివరాలు చెప్పాడు. వెంటనే మెహతా మల్లయ్యకి ఫోన్ చేసాడు. రెస్పాన్స్ లేదు. రెండు నిముషాల గాప్ తో మళ్ళీ చేసాడు. మళ్ళీ నో రెస్సాన్స్. తర్వాత తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చిస్తున్నారు. ఇంతలో మల్లయ్య నించి ఫోన్ వచ్చింది.

''మల్లయ్యా జీ, మీ అకౌంట్స్ అన్నీ ఎన్ పీ ఏ లుగా మారిపోయాయి. మీరు మూడు నెలలుగా ఇన్స్టాల్మెంట్స్, ఇంటరెస్ట్ కట్టట్లేదు,' అన్నాడు మెహతా.

'మెహతాజీ, రేపు అన్నీ అకౌంట్స్ లో ఇంటరెస్ట్ చెల్లిస్తున్నాను. పొతే, నూట ఎనభై కోట్లు ఇన్స్టాల్మెంట్స్ వుంటాయి. వాటి సంగతి మీరే చూసుకోవాలి ....' అన్నాడు మల్లయ్య, కొంచం దీనంగా [నటిస్తూ]. '

'నేనేం చేస్తాను? మా అందరి జీతాలు కట్టినా అది పిట్టన్స్! ' అన్నాడు మెహతా.

ఒక నిముషం గాప్ తర్వాత అన్నాడు మల్లయ్య, ' మా మెయిన్ కంపెనీ షేర్స్ కొన్ని తాకట్టు పెడతాను. మార్కెట్ లో వాటి విలువ, అంటే వొక సంవత్సరం సగటు విలువ వెయ్యి కోట్లు వుంటుంది. మీరు ఐదొందల కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ యివ్వండి. ముందు ఇన్స్టాల్మెంట్స్ కట్టేస్తాను. మీకు తెలుసుగదా, మా ఎయిర్ లైన్స్ సంస్థ యింకా పుంజుకోలేదు. కొంత సమయం పడుతుంది. ఆ తర్వాత వొకసారి పుంజుకుంటే, యిక తిరిగి చూసుకునే అవసరం వుండదు.'

'మళ్ళీ కొత్త పిడి పెడుతున్నారే !... రేపు ప్రపోసల్ పంపండి. చూస్తాం,' అన్నాడు మెహతా.

బయట ఏదో గొడవ జరుగుతున్నట్టు వినిపిస్తోంది.

మెహతా అడిగాడు, 'వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ?'

జీ ఎం చెప్పాడు, 'శాలరీ పెంపు కోసం స్టాఫ్ ధర్నా చేస్తున్నారు సార్!'

'ఓహో! మర్చిపోయాను!... ఓకే. రేపు ఇంటరెస్ట్ కడతాడట. మళ్ళీ ప్రోమోటర్ల షేర్స్ మీద ఓడి అడుగుతున్నాడు. ' అన్నాడు మెహతా.

'ఇంకో బాంక్ దగ్గిరకి పొమ్మందాం సార్! మన నాలుగు బాంకుల్లో మనం యివ్వగలిగినంతా యిచ్చేసాం . ఇంక యివ్వలేం !' అన్నాడు కార్పొరేట్ లోన్స్ ఆఫీసర్.

'ఓకే . చూద్దాం...' అంటూ మెహతా మీటింగ్ ముగించాడు. బయటి నించి స్లొగన్స్ వినిపిస్తున్నాయి :

'వియ్ డిమాండ్ ...శాలరీ రివిజన్

'వియ్ డిమాండ్ ..... శాలరీ ఇంక్రీజ్ అఫ్ 40%...

'వియ్ డిమాండ్.... హెచ్ ఆర్ యే 40%

'సీతాఫల్ కచ్చా హయ్ ... మెహతాసాబ్ లుచ్చా హయ్ ...'

ఇంకా దారుణంగా స్లొగన్స్ యిస్తున్నారు.

ఆఫీస్ లో మల్లయ్య ముఖ్యమైన స్టాఫ్ తో చర్చిస్తున్నారు.

'ఏడాది కిందటే దూరదృష్టి తో మన స్టాక్ బ్రోకర్లతో చెప్పాను. మన కంపెనీ షేర్స్ అన్నీ వంద రెట్లు పెంచమని. మన ఆడిటర్స్ ని మేనేజ్ చేసాం. ఆర్ధిక గణాంకాల్ని మార్చేసాం. అందుకే మన మెయిన్ షేర్ పద్దెనిమిది రూపాయాల్నించి పన్నెండొందలకి పెరిగింది. ఇప్పుడు ఆ షేర్స్ మీద కనీసం వెయ్యి కోట్ల ఓడీ నో, లోనో తీసుకోవచ్చు. ఇంకా కొంతకాలం మనం యీ కష్టాలు భరించాలి. వెంటనే ఎక్స్ వై జడ్ బాంక్ కి వెళ్ళి వెయ్యి కోట్ల ఓడీ కి అప్లై చేయండి. పది విమానాలు అద్దెకి అయ్యే ఖర్చు , రీసేల్ ఎయిర్ బస్సు లు రెండు కొనడానికి, నాలుగు ఎయిర్ పోర్ట్స్ లో పార్కింగ్ స్పేస్ కోసం అని రాయండి. మన ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇన్వాయిస్ లు రెఢీ చేసిపెట్టింది. శాంక్షన్ సంగతి నేను చూసుకుంటాను.'

మల్లయ్య మాటల్తో జీ ఎం, డీ జీ ఎం హాపీ గా వున్నారు కానీ, మిగిలిన నలుగురు కింది వుద్యోగులు భయపడ్డారు. షేర్స్ ప్లెడ్జ్ చేసేవరకు వెళ్ళామంటే, యింక మిగిలిందేముంది? తాము కూర్చుంటున్న కుర్చీలు కూడా బ్యాంకులకి తాకట్టు లో వున్నాయి. ఈ కంపెనీలు యింకా యెంతకాలం నడుస్తాయో అనే శంక వాళ్ళని తొలిచేస్తోంది. వేరే కంపెనీ కి షిఫ్ట్ అయిపోవడం మంచిదనుకున్నారు.

పదిహేను రోజుల్లో లోన్ కం ఓడీ శాంక్షన్ అయ్యింది. బోర్డు మెంబెర్స్ కి కోట్లలో, బ్యాంకు ఆఫీసర్లకు లక్షల్లో ముడుపులు వెళ్ళిపోయాయి. ఈ వ్యవహారాల్లో ఆరితేరిన బ్రోకర్లు ముగ్గుర్ని పెట్టుకున్నాడు మల్లయ్య. వాళ్ళు మినిస్టర్ యెవరైనా సరే, వాళ్ళ క్యాబిన్ల లోకి యెవరి పర్మిషన్ అవసరం లేకుండా వెళ్ళగలరు. బాంక్ చైర్మన్లని, బోర్డు మెంబెర్స్ ని మానేజ్ చేయగలరు.

ఆరు నెలల్లో మల్లయ్య కంపెనీలు అన్నీ నిరర్ధక ఆస్తులుగా బాంక్ వాళ్ళు వర్గీకరించారు. మొదటి క్వార్టర్ లో లాభాల బాటలో వున్న మూడు బాంకులు నష్టాల బాట పడ్డాయి. స్థూల లాభం నించి మల్లయ్య లోన్ మొత్తాల్లో కొంత భాగాన్ని విడిగా రిజర్వు లో పెట్టేసరికి నికరంగా నష్టం లోకి బాంకులు పడిపోయాయి.

ఏ బీ సి బాంక్ లో బోర్డ్ రూమ్ లో చర్చలు నడుస్తున్నాయి. అప్పటికి మూడుగంటలు గడిచాయి. కొలిక్కి రావట్లేదు. టేబుల్ కి వొక వైపు చైర్మన్ మెహతా, జీ ఎం హెచ్ ఆర్ ఎన్ రావు, వాళ్ళ టీం. మరో వైపు మూడు యూనియన్ల ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, యితర నాయకులు. రెండు రోజుల స్ట్రైక్ అనంతరం మానేజ్మెంట్ యూనియన్లని చర్చలకు పిలిచింది.

యూనియన్ల డిమాండ్ శాలరీ పెంపు 40%. మూడు గంటల చర్చల తర్వాత యూనియన్లు 30% కి దిగారు.

మెహతాకి విసుగొచ్చింది. ' చూడండీ, మన బాంక్ పరిస్థితి చెప్పాను. వందకోట్ల నికర లాభం నించి, ఒక కోటి నికర నష్టానికి వచ్చాము. మూడు నెలల తర్వాత నష్టం వంద కోట్లకి పెరుగుతుంది. అప్పుడు శాలరీ రివిషన్ అనేది మీరు అడగలేరు, మేము యివ్వలేము. ఇంకో ఆరు నెలలు పొతే నష్టం వెయ్యి కోట్లకి చేరుతుంది. అప్పుడు వచ్చే నెల శాలరీ వస్తే చాలనుకుంటారు. నేను లాస్ట్ గా 10% పెరుగుదల కి అంగీకరిస్తున్నాను. అంటే నేను ముందు చెప్పిన 5% నించి 10% కి అంటే డబుల్ ఆఫర్ చేస్తున్నాను. ఒప్పుకోండి. ఇప్పటికే వుద్యోగులందరూ రెండురోజుల శాలరీ పోగొట్టుకున్నారు, మీరిచ్చిన స్ట్రైక్ కాల్ వల్ల,' అన్నాడు మెహతా తను కూర్చున్న చైర్ లో అసహనంగా కదులుతూ.

'మన బాంకుల్లో వొకప్పుడు టాప్ శాలరీస్ యిచ్చేవాళ్ళు సార్! బాంకుల్ని 'హై వేజ్ ఐలాండ్' అనేవారు! ఇప్పుడు ఈ జీతాలు చూసి అబ్బాయి లకి పిల్ల నివ్వట్లేదు సార్!... పరిస్థితి అంత దారుణంగా వుంది,' అన్నాడో చిన్న లీడర్.

నవ్వాడు మెహతా. 'మన రిక్రూట్ మెంట్ పాలసీ మారుద్దాం. అబ్బాయిల్ని, అమ్మాయిల్నీ ఈక్వల్ గా రిక్రూట్ చేద్దాం. మీరు వొక మ్యారేజ్ బ్యూరో పెట్టి మన ఎంప్లాయిస్ లోనే మ్యారేజ్ ఫిక్స్ చేయండి, ' అన్నాడు హేళనగా. నవ్వలేక నవ్వారు అందరూ.

యూనియన్ లీడర్లందరూ లేచి నిలబడ్డారు. 'మాకు 10% పెరుగుదల ఆమోదయోగ్యం కాదు. కనీసం 20% యివ్వండి . లేకపోతే మమ్మల్ని వుద్యోగులు చెప్పులతో కొడతారు. ప్రస్తుతం మేము మీ ఆఫర్ కి నిరశన తెలుపుతూ వాక్ అవుట్ చేస్తున్నాం,' అంటూ వెళ్ళబోయారు.

మెహతా కూడా లేచి నిలబడి వాళ్ళతో అన్నాడు, 'యిప్పుడు మల్లయ్య లోన్లు ఎన్ పీ యే లైనందుకే బ్యాంకు కి యింత లాస్ వచ్చింది. రేపు వజ్రాల వ్యాపారి బొక్సి అకౌంట్లు బాడ్ అయ్యేట్లు కనిపిస్తున్నాయి ... మీ యిష్టం!'

యూనియన్ నాయకులందరూ వెనక్కి తిరిగి, 'మీరంతా ఆ దొంగ వ్యాపారస్తుల దగ్గిర కోట్లు తిని, బాంక్ కి నష్టాలు తెస్తున్నారు. మా దగ్గిర అన్నీ ఆధారాలూ వున్నాయి. రేపో, మాపో సీ బీ ఐ కి ఆ వివరాలన్నీ యిస్తాం , మిమ్మల్ని అందరినీ జైల్లోకి తోయిస్తాం!' అని చూపుడు వేలు తిప్పుతూ హెచ్చరించారు.

చిన్న గా నవ్వాడు మెహతా. 'నేను వచ్చి రెండేళ్లయింది. అంతకు ముందు నించే మల్లయ్యకి, బొక్సి కి లోన్లు వున్నాయి. మీ యూనియన్ల ప్రతినిధులు బ్యాంకు బోర్డు లో వున్నారు. వాళ్ళకి కూడా జవాబుదారీ తనం వుంటుంది . ఇంకో విషయం. మనం పదేళ్ళు కోర్టుల్లో పోరాడి, వాళ్ళ ఆస్తుల్ని వేలం వేస్తె యెంత వస్తుందో తెలియదు. అప్పుడు ప్రభుత్వం మల్లయ్య మాకు యింత పన్నుల బకాయిలున్నాడు, దాని మీద వడ్డీ యింత అని ఉత్తర్వులు యిస్తారు. మనం కష్టపడి సంపాదించిన మొత్తంలో ప్రభుత్వానికి పన్ను బకాయిలు యిచ్చేయాలి . వాడి కంపెనీ వుద్యోగులకి బకాయిలుంటాయి. వాటిని చెల్లించాలి. అవి పోగా మనకి యెంత మిగులుతుందో, యెంత నష్టపోతామో యిప్పుడు చెప్పలేం. ఆలస్యాత్ అమృతం విషం! ఆలోచించుకోండి ' అని మెహతా బోర్డు రూమ్ నించి బయటికి వెళ్ళిపోయాడు.

రెండు రోజుల తర్వాత యూనియన్లు చర్చలకు పిలిపించుకుని వచ్చారు.

'సార్! మా సంగతి, మా ఇజ్జత్ గురించి కొంచం ఆలోచించండి. మన బాంక్ వుద్యోగులందరూ రాత్రనక, పగలనక కష్ట పడుతున్నారు. డిఫాల్టర్స్ చేసే హరాస్మెంట్, అవమానాలు, హెచ్చరికలు, దాడులు అన్నీ భరించి కింది స్థాయిలో వుద్యోగులు రికవరీ చేస్తున్నారు. వారి పట్ల కనీస సానుభూతి చూపండని వేడుకుంటున్నాం. కనీసం 15% పెంచండి,' బతిమాలారు నాయకులు.

'మీరు అంతగా అడుగుతున్నారు కాబట్టి, 10.25% కి వొప్పుకుంటాను,' అన్నాడు మెహతా. 'ఎంత అన్యాయం సార్! పావు శాతం పెంచుతున్నారా! కనీసం 11% కూడా వొప్పుకోరా?' అన్నారు నాయకులు.

'లాస్ట్ అండ్ ఫైనల్ 10.5%. సెటిల్మెంట్ సైన్ చేసుకోండి. జీ ఎం హెచ్ ఆర్ మిగతా ఫార్మాలిటీస్ చూసుకుంటారు. థాంక్ యు అల్. ఆలస్యమౌతున్న కొద్దీ పెరిగేది తగ్గుతుంది! '

'ఓకే సార్! ... థాంక్ యు,' అన్నారు నాయకులు. కనీసం 20% పెరగాల్సిన జీతాలు అందులో సగం పెరుగుతున్నాయి. ఎవర్ని తిట్టుకోవాలో అర్ధం కాలేదు నాయకులకి. విషణ్ణ వదనాలతో సంతకాలు చేసి, బయట వుద్యోగుల ముందు మేక పోతు గాంభీర్యం ప్రదర్శించారు.

అక్కడ మల్లయ్య కంపెనీలన్నీ మూత పడ్డాయి. ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ప్రభుత్వం ఆ కంపెనీ లని పునరుద్ధరించే ప్రయత్నం లో వుంది.

మల్లయ్య పీ యే జీతం రెండు లక్షలకి పెరగక ముందే, వుద్యోగం పోయి, తక్కువ జీతానికి మరో వుద్యోగం చూసుకున్నాడు!

విచిత్రం గా అవినీతి, దానితో ప్రత్యక్ష సంబంధం లేని వాళ్ళని శిక్షిస్తుంది యీ దేశంలో.

[సమాప్తం]

పర్యవసాన ప్రభావం [Cascading Effect] -శిరిప్రసాద్ మల్లయ్య తను కొత్తగా కొనుక్కున్న విమానంలోకి దర్జాగా ప్రవేశించాడు. విమానం లోపల విలాసవంతమైన ఏర్పాట్లు. అన్నింటినీ నిశితంగా పరిశీలించి, టాయ్లెట్ ముందున్న చెప్పుల స్టాండ్ మేడ్ ఇన్ ఇండియా ది గా గ్రహించి, అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ని పిలిచాడు. "ఇదొక్కటే మీకు ఫారిన్ లో దొరకలేదా?" అని గద్దించి అడిగాడు. ఆ ఆఫీసర్ నీళ్ళు నములుతూ నిలబడ్డాడు. "ఈ ఐర్క్రాఫ్ట్ లో మేడ్ ఇన్ ఇండియా ఐటమ్స్ ఏవీ వుండకూడదని చెప్పాకదా?" "ఎస్ సార్!..." "ఈ మేడ్ ఇన్ ఇండియా గాడు ఇలా వాగుతున్నాడేమిటి, అని ఆలోచిస్తున్నావా?" "లేదు సార్. అయినా మీరు చూడడానికి బ్రిటిష్ వాళ్ళలా వుంటారు సార్!" పెద్దగా నవ్వాడు మల్లయ్య. "మా తాత బ్రిటిష్ ఆఫీసర్ దగ్గిర పనిచేశాడు లే!" అన్నాడు. తన పొగడ్త కి, ఆయన సమాధానానికి ఏమిటి సంబంధం, అని ఆలోచించసాగాడు అడ్మినిస్ట్రేటివ్ హెడ్. అత్యంత ఖరీదైన రిక్లైనర్ సోఫాలు రౌండ్ గా, మధ్యలో ఖరీదైన గ్లాస్ టీపాయ్, ప్రతి సోఫా పక్కన అందమైన ఇటాలియన్ స్టాండ్ [మందు గ్లాసులు, చిరుతిండి పెట్టుకోడానికి], కొంచం దూరంలో బెడ్ రూ మ్, అందులో ఒక స్టడీ టేబుల్, 8 ఎం ఎం స్క్రీన్, దానికో ప్రొజెక్టర్-ఇంత ఖరీదైన హంగామా చూసి గర్వంగా మీసం మెలేసాడు. తన చిన్ననాటి కల అది. సొంతంగా ఒక ఎయిర్క్రాఫ్ట్ కొనుక్కోవాలని, అందులో అన్నీ సౌఖ్యాలు వుండాలని. యవ్వనంలో ఇంకో కోరిక మొలిచింది. ఆ ఎయిర్క్రాఫ్ట్ లో బెడ్ వుండాలని, ఆకాశం లో ఆ బెడ్ మీద దేవ కన్య లాంటి అందమైన అమ్మాయితో ఎంజాయ్ చేయాలనీ. ఇన్నాళ్ళకి ఆ కలలు ఫలించే సమయం వచ్చింది. ఆ కల ఇంకా పెరిగి, ఒక ఎయిర్లైన్స్ సంస్థనే నెలకొల్పాలని, అందులో ఎయిర్ ఇండియా లో లాగా కాకుండా, హుషారైన అమ్మాయిల్ని ఎయిర్ హోస్టెస్ లు గా నియమించుకోవాలని, ప్రపంచ మంతా తన ఎయిర్లైన్స్ కనపడాలని, ఫేమస్ కావాలని వగైరా. ఎయిర్క్రాఫ్ట్ నించి బయటికొచ్చాక, జీ ఎం -ఫైనాన్స్ మల్లయ్య తో అన్నాడు,' సర్, యీ ఎయిర్క్రాఫ్ట్ కి లోన్ యిచ్చిన బ్యాంకు వాళ్ళు, ఎయిర్క్రాఫ్ట్ ఎంట్రన్స్ లో వాళ్ళ బాంక్ కి హైపోథికేట్ అయినట్టు సైన్ పెట్టమంటున్నారు.' 'ఎవరు చెప్పింది?' అడిగాడు మల్లయ్య. ' 'జీ ఎం క్రెడిట్ ' చెప్పాడు జీ ఎం ఫైనాన్స్. వెంటనే ఫోన్ తీసుకుని ఆ బ్యాంకు చైర్మన్ కి ఫోన్ చేసాడు, 'మీ జీ ఎం క్రెడిట్ హద్దు మీరుతున్నాడు. హెడ్ ఆఫీస్ నించి ట్రాన్స్ఫర్ చెయ్యి!' అని ఫోన్ కట్ చేసేసాడు. సాయంత్రం కల్లా ఆ జీ ఎం ని కలకత్తా కి ట్రాన్స్ఫర్ చేసి, అరగంట లో రిలీవ్ చేసేసారు. మల్లయ్య క్యాబిన్ లోకి వచ్చి ఎదురుగా కూర్చున్నాడు ఆయన పీ ఏ శంకరన్. ఏమిటన్నట్టు చూసాడు మల్లయ్య. 'లీరు యాడ్ ఏజెన్సీ ఎం డీ అరోరా వస్తున్నాడు. ఐదు నిముషాల్లో వస్తానని చెప్పాడు ,' అన్నాడు శంకరన్, ముఖంలో ఒక పుస్తకమే చూపిస్తూ. 'ఏమిటో చెప్పు!' అన్నాడు మల్లయ్య, అనుమానంగా. 'లాస్ట్ ఇయర్ మనం దాదాపు ఐదువందల కోట్లకి ప్రకటనలు యిచ్చాం. వాళ్ళకి వచ్చే కమిషన్ డెబ్బై ఐదు కోట్లలో నలభై దాకా మనకివ్వాలి కదా!... అది వచ్చిందో, లేదో చూడండి. ఈ సంవత్సరం బడ్జెట్ కూడా ఇవ్వాలి కదా!...' అన్నాడు శంకరన్ 'గుడ్. వాడ్ని వెయిట్ చేయమను. నేను చెక్ చేసుకుని, లోపలికి పిలుస్తాను,' అంటూ మల్లయ్య టేబుల్ సొరుగు లోంచి ఒక ట్యాబు బయటికి తీసాడు. శంకరన్ ని పొమ్మన్నట్టు సంజ్ఞ చేసాడు. ఆ టాబ్ లో రహస్య ఆదాయ వ్యయాల లెక్క వుంటుంది. లీరు యాడ్ ఏజెన్సీ ఖాతా తీసాడు. ఇంకా యెనిమిది కోట్లు రావాల్సి వుంది. లీరు ఎం డీ ని ఆ విషయమే అడిగాడు. 'సర్ ! ఆ యెనిమిది లో రెండు మీ మార్కెటింగ్, యాడ్ డిపార్టుమెంటు జీ ఎం మొదలు స్టాఫ్ అందరికీ యిచ్చాను. మరో కోటి మీ ఫైనాన్స్ డిపార్టుమెంటు లో పంచాను. మీకు యింకా ఐదు రావాల్సి వుంది. మాకు రావాల్సివున్నది చాలా వుంది......' అన్నాడు లీరు ఎండీ. 'ఆపేసినట్టున్నావ్...' అడిగాడు మల్లయ్య. 'లాస్ట్ ఇయర్ ఏర్పాట్లకి కోటి దాకా ఖర్చయ్యింది...' నీళ్ళు నములుతున్నాడు. 'అంత అయ్యిందా?' 'ఏర్పాట్లు టాప్ క్లాస్ గా వుండాలన్నారు ...... మల్టీ నేషనల్ అన్నారు కదా...' మళ్ళీ నీళ్ళు నములుతూ అన్నాడు. 'ఓకే ... ఓకే ... సుఖం వూరికే రాదు!... మిగిలిన నాలుగు ఫాస్ట్ గా యివ్వు !... నెక్స్ట్ ఇయర్ కేలండర్ కి యేమాలోచిస్తున్నావ్ ?' అడిగాడు మల్లయ్య. 'ఈ ఫోటోలు చూడండి సర్ ! ఇవి మోడల్స్ ప్రొఫైల్ పిక్స్ . అమ్మాయిల్ని సెలెక్ట్ చేస్తే, ఫోటో షూట్ స్టార్ట్ చేస్తాను. వివిధ భంగిమల్లో తీసి మీకు చూపిస్తాను,' అన్నాడు లీరు ఎం డీ . 'క్యాలెండర్లో పిక్స్ చూసి అందరూ వాళ్ళ కొలతలు తెలుసుకోవాలి. ఐ మీన్ అందర్నీ బికినీ లో చూపించాలి. ఈ సారి పన్నెండు పేజీల్లో పన్నెండు మందీ కొత్త అమ్మాయిలే వుండాలి . ఓకేనా?' అన్నాడు వుత్సాహంగా మల్లయ్య. 'అర్ధమైంది సర్ . ఏ నెల పేజీలో వున్న అమ్మాయి ఆ నెలలో మూడు రోజులు మీతో గడపాలి. ఆ ఖర్చు ఎంతో చెప్తాను. మీరే సెటిల్ చేయండి. ఆ విషయం లో మన మధ్య అభిప్రాయ బేధాలు రాకూడదు!' అన్నాడు లీరు ఎం డీ. 'ఓకే . అభిప్రాయ బేధాలు రాకుండా నువ్వే చూసుకోవాలి అరోరా!... అవి వస్తే నేను నా సొంత యాడ్ ఏజెన్సీ పెట్టేస్తాను. లిరయన్స్ కంపెనీ వాళ్ళు వాళ్ళ యాడ్ ఏజెన్సీ యెప్పుడో పెట్టేసుకున్నారు ...' అన్నాడు మల్లయ్య నర్మగర్బంగా. 'అంత మాట అనకండి సార్!... నేను చూసుకుంటాను,' అని అరోరా లేచాడు. మల్లయ్య కంపెనీలకి లోన్లు యిచ్చిన నాలుగు బాంకుల చైర్మన్లు, వాళ్ళ జీ ఎం లు వొక హోటల్లో సమావేశమయ్యారు. ఏబీసీ బ్యాంకు చైర్మన్, బ్యాంకుల కన్సార్టియం చైర్మన్ మెహతా అందరినీ వుద్దేశించి అన్నాడు, 'మల్ల య్య కంపెనీలకి మనందరం కలిసి యిచ్చిన లోన్ మొత్తం ఐదువేల కోట్లు దాటింది. వాళ్ళిచ్చే ఖాతా వివరాలు, స్టాక్స్, ఆస్తులు, అప్పులు అన్నీ విశ్లేషిస్తే యేవీ సరిగ్గా లేవనిపిస్తున్నాయి. కిందటి మీటింగ్ లో కమిటీని వేసాం. ఆ కమిటీ తో మల్లయ్య కంపెనీలు ఏవీ సహకరించట్లేదు. ఫైనాన్స్ మినిస్ట్రీ నించి కమిటీ యెందుకు వేశారు, అని ఫోన్లు కూడా వస్తున్నాయి. ఆయనే వొకప్పుడు ఎం పీ కదా!...' 'మీరు కేటాయించినట్టే మళ్ళీ ఐదువందల కోట్లు యిచ్చాము సర్ !' అన్నాడు 'డీ ఈ ఎఫ్ బాంక్' చైర్మన్ కామత్. 'మేమూ అంతే కదా,' అన్నాడు 'జీ హెచ్ ఐ బ్యాంకు' చైర్మన్ మక్సూద్. 'మేము లాస్ట్ మంత్ ఏడు వందల యాభై కోట్లు ఆమోదించాం ... ఆ మొత్తాన్ని డ్రా చేయనివ్వొచ్చా?' అడిగాడు 'జె కే ఎల్ బ్యాంకు ' చైర్మన్ జీ ఎస్ రావు. 'రావు గారూ, మీ లోన్ కి సెక్యూరిటీ వున్నదనుకుంటా!... మీరు కంటిన్యూ చేయండి!' అన్నాడు మెహతా. 'ఇంకా యెందుకు యివ్వాలి సార్ మల్లయ్యకి.? ' అడిగాడు మక్సూద్. 'ఎందుకంటే పైనించి ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి!' అన్నాడు మెహతా. లంచ్ వరకు జరిగిన ఆ సమావేశం లో జే కే ఎల్ బాంక్ మాత్రం కొత్త లోన్ విడుదల చెయ్యాలి; మిగిలిన బాంకులు ప్రస్తుతానికి ఆపేయాలని నిర్ణయించారు. జె కె ఎల్ బాంక్. లోన్స్ ఆఫీసర్ తన టేబుల్ మీదున్న మల్లయ్య బ్రువరీస్ నించి వచ్చిన బిల్స్, లెటర్ చూసాడు. క్లియరింగ్ లో వందకోట్లకి చెక్ వచ్చింది. అతను పరుగున బ్రాంచ్ మేనేజర్ దగ్గిరకి వెళ్ళాడు. 'సార్! మల్లయ్య బ్రువరీస్ లీరు యాడ్ ఏజెన్సీ కి యిచ్చిన తొంభై తొమ్మిది కోట్ల తొంభై తొమ్మిది లక్షల చెక్ పేమెంట్ కి వచ్చింది. నిన్న కంపెనీ నించి వచ్చిన లెటర్ ప్రకారం యీ చెక్ వాళ్ళ కేలండర్ ఖర్చులు, కొన్ని ప్రకటనల ఖర్చులట. పాస్ చేయమంటారా?' అని బ్రాంచ్ మేనేజర్ ని అడిగాడు. 'ఒక్క క్షణం ఆగు!' అంటూ బ్రాంచ్ మేనేజర్ డివిజనల్ మేనేజర్ కి ఫోన్ చేసాడు. ఒక్క క్షణం ఆగు, అని ఆ డివిజనల్ మేనేజర్ హెడ్ ఆఫీస్ లో జీ ఎం కి ఫోన్ చేసాడు. ఆయన ఒక క్షణం ఆగమని చెప్పి, చైర్మన్ కి ఇంటర్ కం లో ఫోన్ చేసి అడిగాడు. ఆయన పాస్ చేయమన్నాడు. ఆ ఆదేశాలు కింద దాకా వచ్చేసాయి. పది నిముషాల్లో చెక్ పాస్ అయింది. సాయంత్రం యింటికి వెళ్లబోతుండగా వొక వ్యక్తి వచ్చి లోన్స్ ఆఫీసర్ కి, బ్రాంచ్ మేనేజర్ కి రెండు కవర్లు యిచ్చాడు. కవర్ని కొద్దిగా ఓపెన్ చేసి చూసుకున్నారు. కరెన్సీ నోట్లున్నాయి. ఇద్దరూ వొకరి ముఖం వొకరు చూసుకున్నారు. చిరునవ్వు బయటికి కనపడగా , మహదానందం లోపల వెళ్లి విరిసింది. ఇద్దరూ వొకటే అనుకున్నారు: మల్లయ్య సోషలిస్టబ్బా; అందరి నీ సమానంగా చూస్తున్నాడు! నెల రోజుల్లో యేడు వందల యాభై కోట్లు అయిపోయాయి. అందులో మూడు వందల కోట్లు, పౌండ్స్ లో లండన్ లోని మల్లయ్య ఇన్కార్పొరేటెడ్ అనే సంస్థకి బదిలీ అయ్యాయి. నెల నెలా మల్లయ్య బిజినెస్ పని మీద వివిధ దేశాలకి వెళ్ళి వస్తున్నాడు. ఒక్కోసారి వొక్కో కేలండర్ అమ్మాయిని పీ ఏ అని చెప్పి, కూడా తీసుకెళ్తున్నాడు. ఆ ఖర్చులు కోట్లలో వుండడం లో ఆశ్చర్యమేముంది. ఆ రోజు ఆఫీస్ లో కూర్చున్నాడు. పీ ఏ శంకరన్ ని పిలిచి కొన్ని డిక్టేషన్లు యిచ్చాడు. 'హూ... శంకరన్ విశేషాలేమిటి?' 'ఏమీ లేవు సర్. ఎంతవరకు నిజమో కానీ, జీ ఎం ఫైనాన్స్ రాజీనామా చేస్తున్నాట్ట... ' అన్నాడు శంకరన్. 'నిజమా? ... ' ఆశ్చర్యం వ్యక్తం చేసాడు మల్లయ్య. తనకి యింతవరకూ చెప్పలేదు. పీ ఏ గాడికి యెలా తెలిసిందబ్బా, అనుకున్నాడు. 'శంకరన్ ! పొతే పోయాడు కానీ, డీ జీ ఎం ఫైనాన్స్ యెలాంటి వాడు?' అని అడిగాడు పీ ఏ ని. 'మంచివాడే సర్ ' అన్నాడు శంకరన్ . మంచివాడు అంటే మల్లయ్య మాట తూ చా తప్పకుండా పాటించేవాడు, అని అర్ధం. 'సరే నువ్వెళ్ళి ఆ లెటర్స్ టైపు చేసి పట్టుకురా!' అని శంకరన్ ని పొమ్మన్నట్టు సంజ్ఞ చేసాడు. 'సార్!' నీళ్ళు నములుతూ అక్కడే నిలబడ్డాడు శంకరన్. ఏమిటన్నట్టు చూసాడు మల్లయ్య. 'సార్! ఐదేళ్లుగా నా జీతం పెంచడం లేదు. హెచ్ ఆర్ వాళ్ళకి చెప్పండి సార్!' అని అడిగాడు శంకరన్ వినయంగా. 'ఎంతిస్తున్నారు నీకు?' 'యాభై వేలు సర్ ' అన్నాడు. 'మోనికా కి ఎంతిస్తున్నారు ?' 'రెండు లక్షలు సర్ !' రెండు ని వొత్తి చెప్పాడు. మోనికా మల్లయ్య కి చాలా కాలం గా పీ ఏ గా పనిచేస్తోంది. 'మోనికా కి వయసు నలభై దాటిపోయింది. దాన్ని యెలాగైనా బయటికి పంపేసెయ్ !... నీ జీతం రెండు లక్షలకి పెంచేస్తా!... నువ్వు నాకు చాలా యూస్ ఫుల్ !...' అన్నాడు మల్లయ్య. గత్యంతరం లేక తలవూపి క్యాబిన్ నించి బయటికి వెళ్ళాడు శంకరన్. 'వీడికి పై సంపాదన బాగానే వుంది. అయినా జీతం పెంచమని దేబరిస్తున్నాడు !' అనుకున్నాడు మనస్సులో మల్లయ్య. మల్లయ్య డీ జీ ఎం ఫైనాన్స్ కి ఫోన్ చేసి, 'మీకు ప్రమోషన్ యివ్వడానికి టైం వస్తున్నది. మీ జీ ఎం రాజీనామా చేస్తున్నాట్ట కదా!... దగ్గిరుండి యేదో వొకటి చెప్పి నయానో, భయానో వాడి చేత నిజంగానే రాజీనామా చేయించు. రెండు రోజుల్లో వాడి రెజిగ్నేషన్ నా టేబుల్ మీద వుండాలి,' అన్నాడు మల్లయ్య. డీ జీ ఎం ఫైనాన్స్ పరమానంద భరితుడై, 'అలాగే సార్!' అన్నాడు. 'ఇప్పుడు లండన్ లో నా సోల్ ప్రొప్రయిటరీ కన్సర్న్ ఖాతాలో బాలన్స్ ఎంతైంది?' అడిగాడు మల్లయ్య. ఠక్కున చెప్పాడు డీజీఎం,' వందకోట్ల పౌండ్లకి చేరుకుంది సార్!' 'దట్స్ గుడ్,' అన్నాడు మల్లయ్య. వెంటనే లండన్లో తను నియమించిన బ్రోకర్ కి ఫోన్ చేసి, యిద్దరూ కలిసి ఫైనలైజ్ చేసిన యింటి రేట్ అడిగాడు. వాడు ఎనభై కోట్ల పౌండ్లు అని చెప్పాడు. వెంటనే ఆ బ్రోకర్ తో , 'గో ఎహెడ్ . రిజిస్ట్రేషన్ డేట్ ఫిక్స్ చెయ్యి. వచ్చేస్తాను!' అన్నాడు మల్లయ్య. ఒక అద్భుతమైన, విలాసవంతమైన, విశాలమైన బంగ్లా లండన్ లో తన సొంతం కాబోతోంది, అనుకుని మీసాలు మెలేసుకున్నాడు. ఏ బీ సీ బ్యాంకు చైర్మన్ మెహతా క్రెడిట్ జీ ఎం , క్రెడిట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూర్చుని మల్లయ్య కంపెనీ ల ఖాతాల విషయమై సీరియస్ గా చర్చిస్తున్నారు. 'కన్సార్టియం బాంకుల్లో మల్లయ్య కంపెనీ ల ఖాతాలన్నీ నిరర్ధక ఆస్తుల కింద మారిపోయాయి. మనం యింకా డిక్లేర్ చెయ్యలేదు. వాళ్ళు కనీసం ఐదు వందల కోట్లు కడితే మరో మూడు నెలలు లాగచ్చు...' జీ ఎం క్రెడిట్ వివరాలు చెప్పాడు. వెంటనే మెహతా మల్లయ్యకి ఫోన్ చేసాడు. రెస్పాన్స్ లేదు. రెండు నిముషాల గాప్ తో మళ్ళీ చేసాడు. మళ్ళీ నో రెస్సాన్స్. తర్వాత తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చిస్తున్నారు. ఇంతలో మల్లయ్య నించి ఫోన్ వచ్చింది. ''మల్లయ్యా జీ, మీ అకౌంట్స్ అన్నీ ఎన్ పీ ఏ లుగా మారిపోయాయి. మీరు మూడు నెలలుగా ఇన్స్టాల్మెంట్స్, ఇంటరెస్ట్ కట్టట్లేదు,' అన్నాడు మెహతా. 'మెహతాజీ, రేపు అన్నీ అకౌంట్స్ లో ఇంటరెస్ట్ చెల్లిస్తున్నాను. పొతే, నూట ఎనభై కోట్లు ఇన్స్టాల్మెంట్స్ వుంటాయి. వాటి సంగతి మీరే చూసుకోవాలి ....' అన్నాడు మల్లయ్య, కొంచం దీనంగా [నటిస్తూ]. ' 'నేనేం చేస్తాను? మా అందరి జీతాలు కట్టినా అది పిట్టన్స్! ' అన్నాడు మెహతా. ఒక నిముషం గాప్ తర్వాత అన్నాడు మల్లయ్య, ' మా మెయిన్ కంపెనీ షేర్స్ కొన్ని తాకట్టు పెడతాను. మార్కెట్ లో వాటి విలువ, అంటే వొక సంవత్సరం సగటు విలువ వెయ్యి కోట్లు వుంటుంది. మీరు ఐదొందల కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ యివ్వండి. ముందు ఇన్స్టాల్మెంట్స్ కట్టేస్తాను. మీకు తెలుసుగదా, మా ఎయిర్ లైన్స్ సంస్థ యింకా పుంజుకోలేదు. కొంత సమయం పడుతుంది. ఆ తర్వాత వొకసారి పుంజుకుంటే, యిక తిరిగి చూసుకునే అవసరం వుండదు.' 'మళ్ళీ కొత్త పిడి పెడుతున్నారే !... రేపు ప్రపోసల్ పంపండి. చూస్తాం,' అన్నాడు మెహతా. బయట ఏదో గొడవ జరుగుతున్నట్టు వినిపిస్తోంది. మెహతా అడిగాడు, 'వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ?' జీ ఎం చెప్పాడు, 'శాలరీ పెంపు కోసం స్టాఫ్ ధర్నా చేస్తున్నారు సార్!' 'ఓహో! మర్చిపోయాను!... ఓకే. రేపు ఇంటరెస్ట్ కడతాడట. మళ్ళీ ప్రోమోటర్ల షేర్స్ మీద ఓడి అడుగుతున్నాడు. ' అన్నాడు మెహతా. 'ఇంకో బాంక్ దగ్గిరకి పొమ్మందాం సార్! మన నాలుగు బాంకుల్లో మనం యివ్వగలిగినంతా యిచ్చేసాం . ఇంక యివ్వలేం !' అన్నాడు కార్పొరేట్ లోన్స్ ఆఫీసర్. 'ఓకే . చూద్దాం...' అంటూ మెహతా మీటింగ్ ముగించాడు. బయటి నించి స్లొగన్స్ వినిపిస్తున్నాయి : 'వియ్ డిమాండ్ ...శాలరీ రివిజన్ 'వియ్ డిమాండ్ ..... శాలరీ ఇంక్రీజ్ అఫ్ 40%... 'వియ్ డిమాండ్.... హెచ్ ఆర్ యే 40% 'సీతాఫల్ కచ్చా హయ్ ... మెహతాసాబ్ లుచ్చా హయ్ ...' ఇంకా దారుణంగా స్లొగన్స్ యిస్తున్నారు. ఆఫీస్ లో మల్లయ్య ముఖ్యమైన స్టాఫ్ తో చర్చిస్తున్నారు. 'ఏడాది కిందటే దూరదృష్టి తో మన స్టాక్ బ్రోకర్లతో చెప్పాను. మన కంపెనీ షేర్స్ అన్నీ వంద రెట్లు పెంచమని. మన ఆడిటర్స్ ని మేనేజ్ చేసాం. ఆర్ధిక గణాంకాల్ని మార్చేసాం. అందుకే మన మెయిన్ షేర్ పద్దెనిమిది రూపాయాల్నించి పన్నెండొందలకి పెరిగింది. ఇప్పుడు ఆ షేర్స్ మీద కనీసం వెయ్యి కోట్ల ఓడీ నో, లోనో తీసుకోవచ్చు. ఇంకా కొంతకాలం మనం యీ కష్టాలు భరించాలి. వెంటనే ఎక్స్ వై జడ్ బాంక్ కి వెళ్ళి వెయ్యి కోట్ల ఓడీ కి అప్లై చేయండి. పది విమానాలు అద్దెకి అయ్యే ఖర్చు , రీసేల్ ఎయిర్ బస్సు లు రెండు కొనడానికి, నాలుగు ఎయిర్ పోర్ట్స్ లో పార్కింగ్ స్పేస్ కోసం అని రాయండి. మన ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇన్వాయిస్ లు రెఢీ చేసిపెట్టింది. శాంక్షన్ సంగతి నేను చూసుకుంటాను.' మల్లయ్య మాటల్తో జీ ఎం, డీ జీ ఎం హాపీ గా వున్నారు కానీ, మిగిలిన నలుగురు కింది వుద్యోగులు భయపడ్డారు. షేర్స్ ప్లెడ్జ్ చేసేవరకు వెళ్ళామంటే, యింక మిగిలిందేముంది? తాము కూర్చుంటున్న కుర్చీలు కూడా బ్యాంకులకి తాకట్టు లో వున్నాయి. ఈ కంపెనీలు యింకా యెంతకాలం నడుస్తాయో అనే శంక వాళ్ళని తొలిచేస్తోంది. వేరే కంపెనీ కి షిఫ్ట్ అయిపోవడం మంచిదనుకున్నారు. పదిహేను రోజుల్లో లోన్ కం ఓడీ శాంక్షన్ అయ్యింది. బోర్డు మెంబెర్స్ కి కోట్లలో, బ్యాంకు ఆఫీసర్లకు లక్షల్లో ముడుపులు వెళ్ళిపోయాయి. ఈ వ్యవహారాల్లో ఆరితేరిన బ్రోకర్లు ముగ్గుర్ని పెట్టుకున్నాడు మల్లయ్య. వాళ్ళు మినిస్టర్ యెవరైనా సరే, వాళ్ళ క్యాబిన్ల లోకి యెవరి పర్మిషన్ అవసరం లేకుండా వెళ్ళగలరు. బాంక్ చైర్మన్లని, బోర్డు మెంబెర్స్ ని మానేజ్ చేయగలరు. ఆరు నెలల్లో మల్లయ్య కంపెనీలు అన్నీ నిరర్ధక ఆస్తులుగా బాంక్ వాళ్ళు వర్గీకరించారు. మొదటి క్వార్టర్ లో లాభాల బాటలో వున్న మూడు బాంకులు నష్టాల బాట పడ్డాయి. స్థూల లాభం నించి మల్లయ్య లోన్ మొత్తాల్లో కొంత భాగాన్ని విడిగా రిజర్వు లో పెట్టేసరికి నికరంగా నష్టం లోకి బాంకులు పడిపోయాయి. ఏ బీ సి బాంక్ లో బోర్డ్ రూమ్ లో చర్చలు నడుస్తున్నాయి. అప్పటికి మూడుగంటలు గడిచాయి. కొలిక్కి రావట్లేదు. టేబుల్ కి వొక వైపు చైర్మన్ మెహతా, జీ ఎం హెచ్ ఆర్ ఎన్ రావు, వాళ్ళ టీం. మరో వైపు మూడు యూనియన్ల ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, యితర నాయకులు. రెండు రోజుల స్ట్రైక్ అనంతరం మానేజ్మెంట్ యూనియన్లని చర్చలకు పిలిచింది. యూనియన్ల డిమాండ్ శాలరీ పెంపు 40%. మూడు గంటల చర్చల తర్వాత యూనియన్లు 30% కి దిగారు. మెహతాకి విసుగొచ్చింది. ' చూడండీ, మన బాంక్ పరిస్థితి చెప్పాను. వందకోట్ల నికర లాభం నించి, ఒక కోటి నికర నష్టానికి వచ్చాము. మూడు నెలల తర్వాత నష్టం వంద కోట్లకి పెరుగుతుంది. అప్పుడు శాలరీ రివిషన్ అనేది మీరు అడగలేరు, మేము యివ్వలేము. ఇంకో ఆరు నెలలు పొతే నష్టం వెయ్యి కోట్లకి చేరుతుంది. అప్పుడు వచ్చే నెల శాలరీ వస్తే చాలనుకుంటారు. నేను లాస్ట్ గా 10% పెరుగుదల కి అంగీకరిస్తున్నాను. అంటే నేను ముందు చెప్పిన 5% నించి 10% కి అంటే డబుల్ ఆఫర్ చేస్తున్నాను. ఒప్పుకోండి. ఇప్పటికే వుద్యోగులందరూ రెండురోజుల శాలరీ పోగొట్టుకున్నారు, మీరిచ్చిన స్ట్రైక్ కాల్ వల్ల,' అన్నాడు మెహతా తను కూర్చున్న చైర్ లో అసహనంగా కదులుతూ. 'మన బాంకుల్లో వొకప్పుడు టాప్ శాలరీస్ యిచ్చేవాళ్ళు సార్! బాంకుల్ని 'హై వేజ్ ఐలాండ్' అనేవారు! ఇప్పుడు ఈ జీతాలు చూసి అబ్బాయి లకి పిల్ల నివ్వట్లేదు సార్!... పరిస్థితి అంత దారుణంగా వుంది,' అన్నాడో చిన్న లీడర్. నవ్వాడు మెహతా. 'మన రిక్రూట్ మెంట్ పాలసీ మారుద్దాం. అబ్బాయిల్ని, అమ్మాయిల్నీ ఈక్వల్ గా రిక్రూట్ చేద్దాం. మీరు వొక మ్యారేజ్ బ్యూరో పెట్టి మన ఎంప్లాయిస్ లోనే మ్యారేజ్ ఫిక్స్ చేయండి, ' అన్నాడు హేళనగా. నవ్వలేక నవ్వారు అందరూ. యూనియన్ లీడర్లందరూ లేచి నిలబడ్డారు. 'మాకు 10% పెరుగుదల ఆమోదయోగ్యం కాదు. కనీసం 20% యివ్వండి . లేకపోతే మమ్మల్ని వుద్యోగులు చెప్పులతో కొడతారు. ప్రస్తుతం మేము మీ ఆఫర్ కి నిరశన తెలుపుతూ వాక్ అవుట్ చేస్తున్నాం,' అంటూ వెళ్ళబోయారు. మెహతా కూడా లేచి నిలబడి వాళ్ళతో అన్నాడు, 'యిప్పుడు మల్లయ్య లోన్లు ఎన్ పీ యే లైనందుకే బ్యాంకు కి యింత లాస్ వచ్చింది. రేపు వజ్రాల వ్యాపారి బొక్సి అకౌంట్లు బాడ్ అయ్యేట్లు కనిపిస్తున్నాయి ... మీ యిష్టం!' యూనియన్ నాయకులందరూ వెనక్కి తిరిగి, 'మీరంతా ఆ దొంగ వ్యాపారస్తుల దగ్గిర కోట్లు తిని, బాంక్ కి నష్టాలు తెస్తున్నారు. మా దగ్గిర అన్నీ ఆధారాలూ వున్నాయి. రేపో, మాపో సీ బీ ఐ కి ఆ వివరాలన్నీ యిస్తాం , మిమ్మల్ని అందరినీ జైల్లోకి తోయిస్తాం!' అని చూపుడు వేలు తిప్పుతూ హెచ్చరించారు. చిన్న గా నవ్వాడు మెహతా. 'నేను వచ్చి రెండేళ్లయింది. అంతకు ముందు నించే మల్లయ్యకి, బొక్సి కి లోన్లు వున్నాయి. మీ యూనియన్ల ప్రతినిధులు బ్యాంకు బోర్డు లో వున్నారు. వాళ్ళకి కూడా జవాబుదారీ తనం వుంటుంది . ఇంకో విషయం. మనం పదేళ్ళు కోర్టుల్లో పోరాడి, వాళ్ళ ఆస్తుల్ని వేలం వేస్తె యెంత వస్తుందో తెలియదు. అప్పుడు ప్రభుత్వం మల్లయ్య మాకు యింత పన్నుల బకాయిలున్నాడు, దాని మీద వడ్డీ యింత అని ఉత్తర్వులు యిస్తారు. మనం కష్టపడి సంపాదించిన మొత్తంలో ప్రభుత్వానికి పన్ను బకాయిలు యిచ్చేయాలి . వాడి కంపెనీ వుద్యోగులకి బకాయిలుంటాయి. వాటిని చెల్లించాలి. అవి పోగా మనకి యెంత మిగులుతుందో, యెంత నష్టపోతామో యిప్పుడు చెప్పలేం. ఆలస్యాత్ అమృతం విషం! ఆలోచించుకోండి ' అని మెహతా బోర్డు రూమ్ నించి బయటికి వెళ్ళిపోయాడు. రెండు రోజుల తర్వాత యూనియన్లు చర్చలకు పిలిపించుకుని వచ్చారు. 'సార్! మా సంగతి, మా ఇజ్జత్ గురించి కొంచం ఆలోచించండి. మన బాంక్ వుద్యోగులందరూ రాత్రనక, పగలనక కష్ట పడుతున్నారు. డిఫాల్టర్స్ చేసే హరాస్మెంట్, అవమానాలు, హెచ్చరికలు, దాడులు అన్నీ భరించి కింది స్థాయిలో వుద్యోగులు రికవరీ చేస్తున్నారు. వారి పట్ల కనీస సానుభూతి చూపండని వేడుకుంటున్నాం. కనీసం 15% పెంచండి,' బతిమాలారు నాయకులు. 'మీరు అంతగా అడుగుతున్నారు కాబట్టి, 10.25% కి వొప్పుకుంటాను,' అన్నాడు మెహతా. 'ఎంత అన్యాయం సార్! పావు శాతం పెంచుతున్నారా! కనీసం 11% కూడా వొప్పుకోరా?' అన్నారు నాయకులు. 'లాస్ట్ అండ్ ఫైనల్ 10.5%. సెటిల్మెంట్ సైన్ చేసుకోండి. జీ ఎం హెచ్ ఆర్ మిగతా ఫార్మాలిటీస్ చూసుకుంటారు. థాంక్ యు అల్. ఆలస్యమౌతున్న కొద్దీ పెరిగేది తగ్గుతుంది! ' 'ఓకే సార్! ... థాంక్ యు,' అన్నారు నాయకులు. కనీసం 20% పెరగాల్సిన జీతాలు అందులో సగం పెరుగుతున్నాయి. ఎవర్ని తిట్టుకోవాలో అర్ధం కాలేదు నాయకులకి. విషణ్ణ వదనాలతో సంతకాలు చేసి, బయట వుద్యోగుల ముందు మేక పోతు గాంభీర్యం ప్రదర్శించారు. అక్కడ మల్లయ్య కంపెనీలన్నీ మూత పడ్డాయి. ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ప్రభుత్వం ఆ కంపెనీ లని పునరుద్ధరించే ప్రయత్నం లో వుంది. మల్లయ్య పీ యే జీతం రెండు లక్షలకి పెరగక ముందే, వుద్యోగం పోయి, తక్కువ జీతానికి మరో వుద్యోగం చూసుకున్నాడు! విచిత్రం గా అవినీతి, దానితో ప్రత్యక్ష సంబంధం లేని వాళ్ళని శిక్షిస్తుంది యీ దేశంలో. [సమాప్తం]

[సమాప్తం]

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత పరిచయం :

అందరికీవందనాలు.

చిన్నతనంనించి కథలురాయడం నాహాబీ. 15 వయేట మొదటికథ అచ్చయితే, 18 వయేట ఆంధ్రపత్రిక వారపత్రిక దీపావళికథల పోటీలోనా కథ 'విప్లవం' కి బహుమతి వచ్చింది. తర్వాత కొన్ని కథలు పత్రికల్లో వచ్చాయి. అక్కడితో సాహితీ ప్రస్థానం ఆగిపోయింది. కొన్నిసంవత్సరాల తర్వాత యీ మధ్య మళ్ళీ రాయడం మొదలెట్టాను. అయితే డిజిటల్ మీడియాలోనే రాస్తున్నాను. 2020 సంక్రాంతి సమయం లో ఒక కథకి [చెన్నైఅనే నేను] ప్రతిలిపిలో మూడో బహుమతి వచ్చింది. ఈమధ్య అందులోనే మరో కథ10 ఉత్తమ కథల్లో వొకటిగా నిలిచింది. గోతెలుగు డాట్కామ్ లో వొక హాస్య కథ ప్రచురింపబడింది. కొన్నిసంవత్సరాల విరామం తర్వాత మళ్ళీ రాయగలననే ఆత్మవిశ్వాసం కలిగింది.

'శిరిప్రసాద్' అనేకలం పేరుతో రాస్తుంటాను.

ఇంతకంటే చెప్పుకోతగ్గ విషయాలు లేవు. కృతజ్ఞతలు.


92 views0 comments
bottom of page