top of page
Original.png

పెళ్లి చూపులు

13 hours ago
3 min read

పెళ్లి కుదరని తర్వాత మరో పెళ్లి చూపులకు సిద్ధమవుతున్న విక్రాంత్

Pelli Chupulu - Telugu Comedy Story | Harish Babu Pondugula

పెళ్లి చూపులు - తెలుగు హాస్య కథ | హరీష్ బాబు పొందుగుల

Published in manatelugukathalu.com on 21/11/2026


పెళ్లి చూపులు, వివాహ సంబంధాలు, అపార్థాలు, పెళ్లికి ముందు జరిగే అనూహ్య పరిణామాల నేపథ్యంలో సాగే హాస్యభరితమైన తెలుగు కథ “పెళ్లి చూపులు”.


విక్రాంత్‌కి చాలా సార్లు పెళ్లి చూపులు జరిగాయి కానీ వేరు వేరు కారణాల వల్ల ఏ అమ్మాయితోనూ పెళ్లి కుదరలేదు. ఒకసారి అమ్మాయి నచ్చక.. 


లేదా కుటుంబం నచ్చక.... లేదా మాట్లాడే పద్ధతి నచ్చక.. లేదా వాళ్ళ పేరెంట్స్ ఆరోగ్య పరిస్థితి బాలేక.... ఆర్థిక పరిస్థితి బాలేక... 


ఇలా చాలా కారణాల వల్ల కుదరలేదు.... చివరికి చారుస్మిత (స్మిత) ఇతనితో పెళ్ళికి సరే అంది.... రెండు కుటుంబాలు సంతోషంగా ఒక నెలలో పెళ్ళికి ముహూర్తం పెట్టుకున్నారు..


పెళ్ళికి ఎక్కువ గ్యాప్ లేదు. విక్రాంత్ స్మిత నెంబర్ తీసుకుని... ఫోన్ చేసి ఒకటి రెండు సార్లు మాట్లాడాడు... బాగా మాట్లాడింది అనిపించింది...


కానీ ఎక్కువ సార్లు ఫోన్ చేసే సాహసం చేయలేదు... కారణం..... తను విన్న వేరు వేరు వార్తలు, కథనాలు... తన ఫ్రెండ్స్‌కి ఉన్న అనుభవాలు.. దృష్టిలో ఉంచుకుని... 


పెళ్లి నెలలో ఉంది అనగా గంటలు గంటలు ఫోన్‌లో ముచ్చటించటం... ఆ వాక్ ప్రవాహంలో ఏదో అనరాని మాట అనటం... పెళ్లికూతురు హర్ట్ అవటం... 


పెళ్లి రద్దు చేసుకోవటం... ఇలాంటి రిస్క్ విక్రాంత్ తీసుకోదలుచుకోలేదు... ముహూర్తాలు పెట్టుకున్న రెండు రోజుల తరువాత... స్మిత నుండి కాల్ వచ్చింది.. "మా ఆఫీస్‌కి రావచ్చు కదా... మా ఫ్రెండ్స్‌కి నిన్ను పరిచయం చేయాలి అని.."


విక్రాంత్ ఆలోచించాడు... "ఎందుకులే.. మన పెళ్లి దగ్గర్లోనే ఉంది కదా.. పెళ్లిలో కలవచ్చు... పెళ్లి అయ్యాక ఎన్ని సార్లు అయినా కలవచ్చులే" అని నవ్వుతూ చెప్పాడు.... అలా రెండు మూడు సార్లు తన ఇన్విటేషన్‌ని సున్నితంగా తిరస్కరించాడు....


ఇక్కడ స్మిత ఆలోచనలో పడింది... 'నేను రమ్మంటున్నా రావట్లేదు.. ఏదైనా ప్రాబ్లమ్ మనిషేమో.. శాడిస్ట్ ఏమో...' ఇలా తన ఫీలింగ్స్ అన్నీ ఫ్రెండ్స్‌తో డిస్కస్ చేయటం మొదలు పెట్టింది... ఇదిగో పులి అంటే... 


అదిగో తోక అని ఫ్రెండ్స్ కూడా తన బ్రెయిన్ బాగా వాష్ చేశారు... విక్రాంత్ తన ఫీలింగ్స్ చెప్పలేక మదన పడుతున్నాడు... 'మన మ్యారేజ్ ఎక్కడ కాన్సిల్ అవుతుందో అనే భయంతో నిన్ను కలవట్లేదు' అని చెప్పలేని పరిస్థితి... 


ఎక్కడ చీప్ అవుతానో అని! వారం రోజులు గడిచాయి.. స్మిత బ్రెయిన్ బాగా వాష్ అయిపోయింది... డెసిషన్‌కి వచ్చేసింది.. ఇతనితో పెళ్లి వద్దులే అని చెప్పాలనుకుంది... 


కానీ ఎలా? పెళ్లి డేట్ దగ్గర పడుతోంది.. వన్ ఫైన్ మార్నింగ్.... విక్రాంత్‌కి స్మిత నుండి ఫోన్ వచ్చింది.. "విక్రాంత్ నీకు ఒక విషయం చెప్పాలి.. 


నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు... నువ్వు ఎలాగో అలా ఈ పెళ్లి కాన్సిల్ చేయి..." అని ఆ కాల్ సారాంశం.. తను ఏం జరగకూడదు అనుకున్నాడో... అదే జరిగింది.. 


విక్రాంత్ జవాబు ఇచ్చాడు.. "నాకు అదంతా తెలీదు... నువ్వే పెళ్ళికి సరే అని ఒప్పుకున్నావ్ గా... ఇప్పుడు కూడా నువ్వే ఇంట్లో చెప్పు... 


లేదంటే నేనే నిన్ను పెళ్లి చేసుకుంటా" అని ఫోన్ పెట్టేశాడు... ఎందుకో హీరోలాగా బిల్డప్ ఇచ్చి పోజు కొట్టాలి అని అనిపించలేదు విక్రాంత్‌కి! తరువాత ఏం జరిగిందో తెలీదు కానీ వాళ్ళ పేరెంట్సే ఒక రోజు... 


"మా అమ్మాయి పెళ్లి వద్దు అంటోంది" అని ఫోన్ చేసి చెప్పారు.. విక్రాంత్ చాలా బాధపడ్డాడు.... విక్రాంత్‌కి ఎప్పుడో విన్న పాత సినిమా డైలాగ్ గుర్తొచ్చింది: "జరిగేది జరగక మానదు జరగనిది ఎప్పటికీ జరగదు" అని.. మరుసటి నెల... అద్దంలో చూసి తల దువ్వుకుని రెడీ అవుతున్నాడు...


ఇంకో అమ్మాయిని చూడటానికి బయలుదేరుతున్నాడు మరి...


— సమాప్తం —








📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y


హరీష్ బాబు పొందుగుల గారి కొన్ని ఇతర రచనలు:




హరీష్ బాబు పొందుగుల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



హరీష్ బాబు పొందుగుల

పరిచయం: హరీష్ బాబు పొందుగుల


ఆయన పుట్టింది పెరిగింది హైదరాబాదు. కంప్యూటర్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన హరీష్ గారు వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్. అయితే ఆయన తన వృత్తే కాకుండా చిత్రలేఖనంలోనూ మరియు కథలు, నవలా సాహిత్యం మీద ఎంతో ఆసక్తి కనబరుస్తూ వచ్చారు. యండమూరి గారు, మరియు మాలతీ చందూర్ గారి రచనలని ఇష్టపడతారు. ఆ ఆసక్తితోనే రెండు కథల సంపుటాల్ని అమెజాన్లో "షార్ట్ స్టోరీస్ ఆన్ పాజిటివ్ థింకింగ్" మరియు "నువ్వు అనుకుంటే ఏదయినా సాధ్యమే" పేరిట పబ్లిష్ చేసి ఉన్నారు. కథారచనే కాకుండా మోటివేషనల్ స్పీకర్ గా కూడా ఈయన నెటిజన్లకి సుపరిచితులు.   వ్రాసినవి కొన్ని కథలే అయినప్పటికీ కథా రచన మీద ఆసక్తితో ఇంకా మరెన్నో కథలు వ్రాసి మెప్పించాలని అభిలాష . 


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page