ప్రతిభకు ప్రతిరూపం
- Dr. Krishna Kumar Vepakomma

- Jun 13
- 3 min read
తెలుగు నీతికథ, ప్రేరణాత్మక కథ, కుటుంబ విలువలు, మహిళా శక్తి, నిజమైన ప్రతిభ, వ్యక్తిత్వ వికాసం, తెలుగు కథలు, మానవ విలువలు, కుటుంబ నిర్వహణ, మహిళ గొప్పతనం, జీవిత పాఠాలు, నీతి కథలు, తెలుగు సాహిత్యం, నాయకత్వం, బాధ్యత, ప్రేమ, కుటుంబ బంధాలు, మన తెలుగు కథలు
Prathibhaku Pratirupam - Telugu Inspirational Story | Dr. Krishna Kumar Vepepakomma
ప్రతిభకు ప్రతిరూపం - తెలుగు ప్రేరణాత్మక కథ | డా. కృష్ణ కుమార్ వేపకొమ్మ
Published in manatelugukathalu.com on 13/06/2026
ప్రతిభ అంటే కేవలం పుస్తకాల జ్ఞానం, సంపద లేదా అధికారమేనా? లేక ఇతరుల జీవితాలను ప్రేమతో, బాధ్యతతో, సమర్థంగా తీర్చిదిద్దగల సామర్థ్యమా? ఈ ప్రశ్నకు సమాధానంగా నిలిచే అద్భుతమైన కథే "ప్రతిభకు ప్రతిరూపం". ఒక సాధారణ గృహిణి ద్వారా నిజమైన మేధస్సు, నిర్వహణా నైపుణ్యం, ప్రేమ, బాధ్యతల విలువను గుర్తించిన రవివర్మ మహారాజు అనుభవం మనందరికీ జీవిత సత్యాన్ని తెలియజేస్తుంది. కుటుంబాన్ని నిలబెట్టే అజ్ఞాత శక్తులే సమాజానికి నిజమైన మార్గదర్శకులు అనే సందేశాన్ని ఈ కథ అందంగా ఆవిష్కరిస్తుంది.
ఒకప్పుడు మగధ దేశాన్ని పాలిస్తున్న రవివర్మ మహారాజు ఆలోచనలో పడ్డాడు.“పుస్తకాలలోని జ్ఞానమే మనిషిని గొప్పవాడిని చేస్తుందా? లేక యుద్ధాల్లో విజయం సాధించే వ్యూహాలా? లేక సంపదను సృష్టించే చాతుర్యమా?” అనే సందేహం అతని మనసును వేధించింది.
ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలనే ఉద్దేశంతో అతను రాజ్యం అంతటా ఒక ప్రకటన చేయించాడు. ఆ సందేశం నలుమూలలా వ్యాపించింది. “మనిషి గొప్పతనాన్ని నిర్ణయించేది జ్ఞానమా, చాతుర్యమా, లేక మరేదైనా విశిష్టమైన గుణమా?” అనే ప్రశ్న రాజ్యమంతా మారుమోగింది.
“తమ ప్రతిభా విశేషాలను నిరూపించగలవారు రాజసభకు విచ్చేయండి. వారిలో శ్రేష్ఠుడైన వ్యక్తికి అపూర్వమైన బహుమతి అందజేయబడుతుంది” అని కూడా రాజు చాటింపు వేయించాడు.
కొన్ని రోజుల తర్వాత రాజసభ కొలువు తీరింది. పండితులు, వ్యాపారులు, సేనాధిపతులతో సభ కిక్కిరిసిపోయింది.పండితులు తమ జ్ఞాన వైభవాన్ని ప్రదర్శించారు. వ్యాపారులు తమ విజయగాథలను వివరించారు. సేనాధిపతులు తమ యుద్ధ నైపుణ్యాన్ని చాటిచెప్పారు.
అయినా రవివర్మ మహారాజు గారి సందేహం పరిష్కారమవలేదు.
తక్షణమే కొలువులో ఉన్న ఒక పండితుడు లేచి, రాజు గారి సందేహాన్ని నివృత్తి చేయాలని సంకల్పించి వినయంగా ఇలా విన్నవించాడు:“మహారాజా! మనిషి గొప్పతనం, నిజమైన తెలివితేటల స్వరూపం ఏమిటో తెలుసుకోవాలంటే నాతో విచ్చేయండి,” అని పండితుడు రాజును సవినయంగా ఆహ్వానించాడు.
ఆసక్తితో రాజు ఆ పండితుడిని అనుసరించాడు. కొద్దిసేపటికి వారు ఒక చిన్న కుటీరం ముందు ఆగారు. లోపల ఒక మహిళ తన పనిలో నిమగ్నమై ఉంది.
రాజు గారు ఆమెను గమనిస్తూ ఉండిపోయారు. ఆమె ఒకవైపు వంట చేస్తూ, మరోవైపు పిల్లలకు పాఠాలు చెబుతోంది. వృద్ధ తల్లికి మందులు అందిస్తూ, ఇంటి ఖర్చులను కూడా చూసుకుంటూ, వచ్చిన అతిథులకు ఆతిథ్యం ఇస్తోంది. అన్ని పనులు ఒకేసారి చేస్తున్నా కూడా, ఆమె ముఖంలో ఏ మాత్రం అలసట కనిపించకుండా, చిరునవ్వు మాత్రం కొనసాగుతూనే ఉంది.
రాజు పండితుడి వైపు చూసి, “ఇందులో అసాధారణమైన అంశం ఏముంది?” అన్నాడు.
పండితుడు చిరునవ్వుతో చిన్న ప్రశ్నను జోడించాడు:“మహారాజా, ఒక రాజ్యాన్ని నడపడానికి మీకు ఎంతమంది మంత్రులు, అధికారులు అవసరం?”
“చాలామంది అవసరం అవుతుంది,” అన్నాడు.
“చూడండి మహారాజా, ఇక్కడ ఈమె ఒక్కతే తన కుటుంబాన్ని నడుపుతోంది. గణిత శాస్త్రవేత్తలా ఖర్చులను లెక్కిస్తోంది, వైద్యురాలిలా ఆరోగ్యాన్ని కాపాడుతోంది, ఉపాధ్యాయురాలిలా పిల్లలను తీర్చిదిద్దుతోంది, నిర్వాహకురాలిలా ప్రతి పనిని సమయానికి పూర్తి చేస్తోంది. అయినా తన గొప్పతనాన్ని ఎప్పుడూ బాహాటంగా ప్రదర్శించదు. అదే ఆమెకున్న గొప్ప లక్షణం,” అని అన్నాడు.
పండితుడి మాటల వెనుక ఉన్న లోతైన భావం, ఆ స్త్రీలోని గుణాలు రాజు మనసును సంతృప్తి పరిచాయి. అవి అతని హృదయంలో చెరగని ముద్ర వేశాయి.
రాజు అర్థం చేసుకున్నాడు; జ్ఞానం కేవలం పుస్తకాల్లో ఉండేదే కాదు. ఇతరుల జీవితాలను ప్రేమతో, బాధ్యతతో, సమర్థంగా నడిపించగలగడమే నిజమైన తెలివితేటల గొప్పతనం అని.
పండితుడు గ్రహించాడు—మహారాజు నిజమైన తెలివితేటల స్వభావాన్ని ఇట్టే అర్థం చేసుకున్నాడని.
అదే సత్యం యుగయుగాలకు మార్గదర్శక సందేశంగా నిలిచింది—
కుటుంబాన్ని ప్రేమతో నిలబెట్టగల హృదయమే ప్రపంచానికి మార్గదర్శనం చేయగలదు.
పుస్తకాలు జ్ఞానాన్ని అందిస్తాయి; కానీ జీవితాన్ని సార్థకంగా మలిచే సామర్థ్యమే అసలైన మేధస్సు.అదే ప్రతిభకు అసలైన రూపం.
———————————
డా. కృష్ణకుమార్ వేపకొమ్మ
***
డా. కృష్ణ కుమార్ వేపకొమ్మ గారి కొన్ని ఇతర రచనలు:
డా. కృష్ణ కుమార్ వేపకొమ్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నమస్కారం,
నేను డా. వేపకొమ్మ కృష్ణకుమార్, జువాలజీ లో డాక్టరేట్ పొందిన విశ్రాంతి ప్రొఫెసర్; మాజీ ప్రిన్సిపల్. విద్యారంగంలో 30 సంవత్సరాల పైగా అనుభవం కలిగి, పుస్తక రచయిత, పరిశోధక, విద్యా నిపుణుడిగా సేవలందించాను. ప్రస్తుతం పలు ప్రముఖ పత్రికల్లో కాలమిస్టుగా సామాజిక, విద్యా, సమకాలీన అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రాస్తూ ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నాను.
మీ సంస్థలో నా అనుభవాన్ని ఉపయోగించి గుణాత్మక, ఆసక్తికర వ్యాసాలు అందించగలనని తెలియజేయడం నాకు సంతోషంగా ఉంది.
డాక్టర్ కృష్ణ కుమార్ వేపకొమ్మ
ప్రొఫెసర్ & ప్రిన్సిపాల్ (రిటైర్డ్)
వార్తాపత్రిక కాలమిస్ట్
రాజీవ్ నగర్, హైదరాబాద్








Comments