#BVDPrasadaRao, #బివిడిప్రసాదరావు, #ప్రేమికుడు, #Premikudu, #He'sAnEx, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు
'Premikudu (He's an ex) - Part 21' - New Telugu Web Series Written By BVD Prasada Rao Published In manatelugukathalu.com On 02/10/2024
'ప్రేమికుడు (He's an ex) - పార్ట్ 21' తెలుగు ధారావాహిక
రచన: బివిడి ప్రసాదరావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
తల్లి అనసూయకి అనారోగ్యంగా ఉందని తెలియడంతో తన ఊరికి వెళతాడు శేషగిరి. అక్కడ అనుకోకుండా తన మాజీ ప్రేయసి పార్వతిని కలుస్తాడు. ఆమె సమస్యల్లో ఉందని తెలుసుకొని సహాయం చేయాలనుకుంటున్నట్లు భార్యతో చెబుతాడు. తల్లి సలహా మీద అంగీకరిస్తుంది అతడి భార్య గిరిజ.
జాతర కోసం ఊరికి వెళ్లిన శేషగిరి, భార్యతో కలిసి పార్వతిని కలుస్తాడు. శోభనం రోజునుండే భర్త విచిత్ర ప్రవర్తన ప్రారంభమైనట్లు చెబుతుంది పార్వతి. ప్రతిరోజూ తనని మానసికంగా హింసించేవాడని చెబుతుంది.
పార్వతి విషయంలో తన తలిదండ్రుల సహాయం తీసుకుందామంటుంది గిరిజ. మామగారి కారులో కుమార్ ని కలవడానికి వెళతాడు శేషగిరి.
డ్రైవర్ సుందరం తో కలిసి కుమార్ దగ్గరకు వెళ్తాడు.
ఇక ప్రేమికుడు పార్ట్ 21 చదవండి.
కుమార్ టైలరింగ్ షాపు ముందు సుందరం కారాపాడు.
శేషగిరి దిగాడు.
తర్వాత సుందరం దిగాడు.
ఇద్దరూ ఆ షాపులోకి నడిచారు.
సుందరమే అడిగాడు..
"కుమార్ ఎవరు."
కుమారే.. "నేనే." అన్నాడు.
సుందరం.. శేషగిరిని చూసాడు.
"మీతో మాట్లాడాలి." శేషగిరి చెప్పాడు.
"ఇంతకీ మీరు ఎవరు." అడిగాడు కుమార్.
కుమార్ స్టాఫ్.. శేషగిరిని.. సుందరంని చూస్తున్నారు.
అందులో ఒకడు..
"అప్పుడు పోలీసులు.. ఇప్పుడు వీళ్లు.. అన్న కోసం వస్తున్నారేటి. ఏం తకరాలు." గొణిగాడు.
పక్కోడు.. "పల్లకో" అన్నాడు చిన్నగా.
"గిరిజ కోసం మాట్లాడాలి." చెప్పేసాడు శేషగిరి.
కుమార్ గతుక్కు పడ్డాడు.
చుట్టూ చూసాడు.
తన స్టాఫ్.. పనులు ఆపి.. తననే చూస్తున్నారు.
కుమార్ వెంటనే జల్దు కున్నాడు.
"అలానా. రండి. బయటికి పోయి మాట్లాడుకుందాం." అక్కడి నుండి కదులుతూ అన్నాడు.
"ఏం. ఇక్కడే మాట్లాడదాం. బయట ఎందుకు." సుందరం కలగ చేసుకున్నాడు.
"వీళ్ల పనులకు ఇబ్బంది. పైగా మిమ్మల్ని నిలబెట్టి మాట్లాడడం నాకు ఇష్టం కాదు." చెప్పాడు కుమార్.
కుమార్ వాటం సుందరంలో అనుమానాన్ని రెక్కెత్తిస్తోంది.
అప్పుడే..
"ఇక్కడ కూర్చొని మాట్లాడే స్థలం లేదు." చెప్పాడు కుమార్.
"సరే. బయటికి రండి." కలగచేసుకున్నాడు శేషగిరి.
ఆ వెంబడే..
"మీ ఇంటికి పోయి మాట్లాడుకుందాం." చెప్పాడు.
కుమార్ ఏమీ అనలేదు.
ఆ తర్వాత..
ఆ ముగ్గురు..
కుమార్ చెప్పుతుండగా..
కారులో కుమార్ ఇంటిని చేరారు.
ఆ ముగ్గురు హాలు లాంటి స్థలంలో..
కుర్చీల్లో ఆ ఇంటిలో కూర్చున్నారు.
అంతకు ముందు కుమార్.. ఆ ఇంటి వీథి గుమ్మం తలుపు మూసేసాడు.
"మీ కారణాలు.. సంజాయిషీలు వద్దు." తొలుత శేషగిరే మాటలు మొదలు పెట్టాడు.
అతడినే కుమార్ చూస్తున్నాడు.
"అంతే." అనేసాడు సుందరం.
కుమార్ నే చూస్తున్నాడు సుందరం.
"అలాగే.. సెక్షన్ లు.. శిక్షలు చెప్పకుండా సూటిగా విషయమే చెప్తాను." చెప్పాడు శేషగిరి.
కుమార్ లోలోన అలజడవుతూనే ఉన్నాడు.
"మీది అతి నీతిమాలినతనం. భార్య పట్ల మీ ప్రవర్తన నిలువునా ఖండించ తగ్గది. భర్త.. భార్యని సక్రమంగా శారీరక తృప్తి పరచాలి తప్పా.. భార్యని అక్రమంగా మానసిక వ్యధ పరచడం ఘోరం. నేరం కూడా." ఆగాడు శేషగిరి.
శేషగిరినే చూస్తున్నాడు సుందరం.
కుమార్ నిలకడగా ఉండే ప్రయత్నం చేస్తున్నాడు.
"మీకు ఎవరూ లేరు. కానీ మీ భార్యకు మేము ఉన్నాం. తను ఇక భరించేది లేదు. మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదు." గట్టిగానే చెప్పాడు శేషగిరి.
శేషగిరి వాగ్దాటికి సుందరం సంభ్రమాశ్యర్యమవుతున్నాడు.
కుమార్ కుతకుతలాడి పోతున్నాడు.
"మీరు ఏం చేసారో.. మీ భార్య ఏం అనుభవించిందో.. నా నోట తిరిగి అక్కర లేదు. మీరు సరిదిద్దు కోవాలి. మీ భార్య స్వస్థత పొందాలి. ఈ మోటివ్ తోనే వచ్చాం." ఆగాడు శేషగిరి.
సుందరం కలగ చేసుకోబోయాడు.
"వద్దు. మనం ఇక చెప్పేది లేదు." ఖండితంగా చెప్పేసాడు శేషగిరి.
కుమార్ నే చూస్తున్నారు ఆ మిగతా ఇద్దరు.
అది కుమార్ గుర్తించ గలుగుతున్నాడు.
'నేను మాట్లాడందే.. ఇక వీళ్లు మాట్లాడరు.' అనుకున్నాడు కుమార్.
అలా అనుకున్న తర్పాత..
"నేను చేసినవి.." చెప్పబోయాడు.
"వద్దు. చెప్పాగా. మాకు మీ విచారంలు.. మీ వివరణలు అక్కర లేదు. కమ్ టు ద పాయింట్." విసురుగా అనేసాడు శేషగిరి.
శేషగిరి తీరుకు చేష్టలుడిగి అతడినే చూస్తూ ఉండిపోయాడు సుందరం.
"ఆడదానికే కాదు.. మగాడికీ పరువు.. మర్యాద వర్తిస్తోంది." చెప్పాడు శేషగిరి.. అప్పుడే గుర్తుకు వచ్చినట్టు.
ఆ వెంబడే..
"ఆడది కుక్కిన పేను అనుకుంటే మహా తప్పు. రోడెక్కేక అడదిని ఆపడం ఎవరి వల్ల కాదు." తీవ్రంగా చెప్పాడు.
కుమార్ చిన్నగా కదిలేసాడు.
నిజంగా అతడు బెదురులో ఉన్నాడు.
"నేనేం చేయను." అడిగేసాడు.
వెంటనే చెప్పలేక పోయినా.. నిముషం వ్యవధిలోనే..
"మీరు.. మీ భార్య గతం తవ్వుకోక.. తల్చుకోక.. కలిసి పోండి. భార్యాభర్తలుగా మెసులుకోండి." చెప్పాడు శేషగిరి.
ఆ వెంబడే..
"మీ భార్య మీ వద్దకు రాదు. మీరే మీ భార్య వద్దకు రావాలి." చెప్పాడు.
కుమార్ తేలు కాటుకు గురైన దొంగ మాదిరిన ఉన్నాడు.
సుందరం మరాగలేక పోయాడు.
"మహా తీర్పు ఇచ్చారు అల్లుడు సార్. శభాష్." చప్పట్లు చరిచేసాడు.
శేషగిరి ఏమీ పట్టించుకోక..
కుమార్ ని చూస్తూ..
"మీ మీద మీ భార్యకి నమ్మకం మీరే కుదిర్చి పెట్టాలి” అన్నాడు.
తడబడుతున్నాడు కుమార్.
'నా తప్పులకు నాకు ఇంతే కావాలి.' కసిగానే అనుకున్నాడు.
తన తండ్రిని కటువుగా తిట్టుకుంటున్నాడు.
పారిపోవడం కుమార్ కి ఇష్టం లేదు.
మారి.. నిలబడాలని కోరుకుంటున్నాడు.
తల విదిలించుకున్నాడు.
"సరే. మీరు చెప్పినట్టు చేస్తాను. పార్వతికి భరోసా అవుతాను." కుమార్ ఒపేసుకున్నాడు.
శేషగిరి చలించాడు.
కుమార్ ఇంత ఇదిగా పాజటివ్ రియాక్ట్ కావడం అతడిని విస్మయ పరుస్తోంది.
ఐనా.. నిలకడ కోల్పోక..
"ఐతే.. ఉన్నపాళంగా మీకు రాని పని కనుక. అన్నీ సర్దుకొని ఉండండి. మేము వారం రోజుల్లో వచ్చి మిమ్మల్ని తీసుకు వెళ్తాం." చెప్పాడు శేషగిరి.
ఆ వెంబడే..
"ఈ లోగ.. ఏమైనా జారుకున్నారో.. ఎక్కడ ఉన్నా పట్టుకుంటాం. మిమ్మల్ని వదలే ప్రసక్తి ఉండదు." హెచ్చరికలా కాక.. సున్నితంగానే చెప్పగలిగాడు.
ఆ వెంబడే..
"నా పేరు శేషగిరి. నా ఫోన్ నెంబర్ చెప్తాను. మీ ఫోన్ లో నోట్ చేసుకోండి. నా నుండి ఫోన్ రాగానే మీరు ఎత్తాలి.. లేదు ఎత్తి తీరాలి. లేదా.. నా తడక తట్టుకోలేరు." చెప్పాడు. ఈ మారు మాత్రం కొంత కఠినంగానే మాట్లాడే ప్రయత్నం చేసాడు.
కుమార్.. తన ఫోన్ నెంబర్ ని తీసుకున్నాక..
సుందరంతో కలిసి కారు వైపుకు కదిలాడు శేషగిరి.
***
ఆ రాత్రి..
కుమార్ ఇంటిలో..
కుమార్ మంచం మీద పడుకున్నాడే కానీ..
అతడికి నిద్ర పట్టడం లేదు.
కళ్లు మూసుకున్నాడు.. అంతే..
కానీ..
తన తండ్రిని నెమరు వేసుకుంటున్నాడు..
తన తండ్రి ఆలోచనలు గింగిర్లు అవుతున్నాయి..
ఒక ఆలోచన..
'మీ అమ్మ మా దొడ్డదిరా. నోటిలో పన్ను అగుపడనీయకుండా చెప్పింది చేసేదిరా. నీకు తెలుసుగా. అది చచ్చింది. నేను బతుకీడుస్తూ చస్తున్నాను.'
ఒక ఆలోచన..
'నీకు బోధవ్వాలనే.. నిన్ను.. అమ్మా.. నేను ఉన్న కాడ.. కోరి కూర్చుండ పెడుతున్నాను.'
ఒక ఆలోచన..
'సొంత ఆడది గట్టి సొత్తురా. దాన్ని బుజ్జగించ కూడదు. దాన్ని గిచ్చి ఆనంద పడాలి. నేను మొదట్లో నీ అమ్మతో కలిసేసాను. దాంతో నీ అమ్మ కడుపు అడ్డొచ్చి నీ అమ్మని చాలా నెలలు గిచ్చ లేక పోయాను. నువ్వు పుట్టేక నీ అమ్మని గిచ్చ గలిగాను. ఆ తప్పు నువ్వు చేయకు. ఆడదాన్ని అనుభవించాలనుకుంటే.. డబ్బుకు పడుకునేది దొరుకుతోంది. భార్య అందుకు ఎందుకు.'
ఒక ఆలోచన..
'డబ్బు పుచ్చుకున్న ఆడది.. ఒళ్లుకే సుఖమిస్తోంది. అదే భార్య ఐతే.. కోరుకున్నట్టు వింటుంది.. అబ్బో.. గుండెకి తెగ గిలిగింతలిస్తుంది. అందుకే భార్యని రోజుకోలా వాడుకోవాలి. గుండెకు నచ్చినట్టు తిప్పుకోవాలి. భార్య ఐతేనే కడుపు నింపుతుంది.. ఇంటికి కాపలా అవుతుంది.. గుండెని నింపుతుంది.'
అంతలోనే అతడి చెంప చెళ్లుమన్నటయ్యింది.
లేచి కూర్చుండి పోయాడు.
అతడి ఒళ్లు చెమటతో ముద్దలయ్యి పోతోంది..
'చచ్చావు నాన్నా.. లేదంటే.. ఇప్పుడు నేనే నిన్ను చంపేసేవాడ్ని.' అనుకున్నాడు.
కసి కసిగా తన గుండెని పిడిగుద్దులతో హింసిస్తున్నాడు.
========================================================================
ఇంకా వుంది..
========================================================================
బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ బివిడి ప్రసాదరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.
రైటర్, బ్లాగర్, వ్లాగర్.
వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్
వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్
వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
コメント