top of page
Original.png

పులిని చూసి నక్క వాత

2 hours ago
4 min read

పులిని చూసి నక్క వాత తెలుగు హాస్య కథలో అతిగా మేకప్ చేసుకున్న మంగమ్మను చూసి భయపడుతున్న పిల్లలు, ఆశ్చర్యపోతున్న సుబ్బారావు

Pulini Chusi Nakka Vatha - Telugu Comedy Story| Addanki Lakshmi

పులిని చూసి నక్క వాత - తెలుగు హాస్య కథ | అద్దంకి లక్ష్మి

Published In manatelugukathalu.com On 02/11/2026

 

పులిని చూసి నక్క వాత అద్దంకి లక్ష్మి రచించిన సరదా తెలుగు నీతికథ. ఇతరులను చూసి గుడ్డిగా అనుకరించడం, ఆడంబరాలకు పోవడం వల్ల ఎదురయ్యే ఇబ్బందులను మంగమ్మ అనుభవం ద్వారా హాస్యభరితంగా తెలియజేసే కథ ఇది.


ఊరు: ముంబై


"ఇదిగో మంగీ! వచ్చే ఆదివారం నాడు మా ఆఫీసర్ గారి అమ్మాయి పెళ్లి. శుభలేఖ ఇచ్చారు, ఫ్యామిలీతో రమ్మని పిలిచారు, అందరమూ వెళ్లాలి గుర్తుపెట్టుకో" అన్నాడు సుబ్బారావు ఆఫీసు నుంచి వస్తూనే.


"మీ ఆఫీసులో పెద్దపెద్ద ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ల భార్యలు పిల్లలు అందరూ వస్తారు కదా?"


"ఆ, వస్తారు. అందరూ వెళ్లాలి కదా" అన్నాడు సుబ్బారావు.


"అయితే నాకు కూడా మంచి డ్రెస్సులు కొని పెట్టండి. అందరి ముందు బాగుండదు వెలసిపోయిన చీరలు కట్టుకుంటే" ఉత్సాహంగా అడిగింది మంగి.


"అదేమిటి, ఉన్నదేదో కట్టుకో. దానికి మళ్లీ ఒక ఖర్చా మనకి? అసలే పెళ్లికూతురికి పెద్ద గిఫ్ట్ ఇవ్వాలి, దానికే నాకు చాలా ఖర్చు అవుతుంది" అన్నాడు విసుగ్గా సుబ్బారావు.


"సరేలేండి, అన్నిటికీ మీకు కక్కుర్తే!"


"ఇదిగో ఈ శుభలేఖ చూడు ఎంత అందంగా వేయించారో" అంటూ చూపించాడు.


"అబ్బా! చాలా బాగుందండి. ఎన్ని పేజీలు ఉన్నాయో! పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఎంత బాగున్నారో!"


"ఈ కార్డు వేయించడానికి ఎంత అయిందో తెలుసా? ఒక్కొక్కటి రెండు వేల రూపాయలు" అన్నాడు సుబ్బారావు.


"అమ్మో! ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారో" అంటూ ఆశ్చర్యపోయింది మంగమ్మ.

ఇంతలో ఆదివారం రానే వచ్చేసింది.


మంగమ్మ ఒక ఐడియా వేసుకుంది. తాను కూడా చక్కగా తయారై వెళ్లాలని, ఆ పెళ్లి చాలా ఘనంగా చేస్తారు, ఎంతోమంది పెద్దపెద్ద వాళ్లందరూ వస్తారు. కానీ తాను సింపుల్‌గా ఉంటే అందరూ చూసి నవ్వుతారు అనుకుని, భర్తతో చెప్పింది:


"నేను బ్యూటీ పార్లర్‌కి వెళ్లి ఫేషియల్, హెయిర్ స్టైల్ అది చేయించుకొస్తానండి. అప్పుడు చీర కట్టుకుంటే అందంగా కనిపిస్తాను, మొహం కళకళలాడుతూ ఉంటుంది."


"ఎంత అవుతుంది?" అని అడిగాడు.


"ఏముందండి, 1000 రూపాయలు అవుతుంది అంతే. ఎక్కువ ఏమీ కాదండీ" ఉత్సాహపడుతోంది మంగి.


"అమ్మో! చాలా అవుతుందే! అయినా నువ్వు నల్లగా ఉంటావు కదా, ఆ రంగులు అవి పులిమితే నీకు నప్పుతుందో లేదో..." అనుమానంగా అన్నాడు సుబ్బారావు.


"ఏం లేదండి, బాగానే ఉంటుంది. నేను వెళ్లి చేయించుకుని వస్తాను" అంటూ డబ్బులు తీసుకుని మార్కెట్‌లోకి వెళ్లిపోయింది మంగి.


ఆవిడొచ్చేసరికి పిల్లలిద్దరికీ నీళ్లు పోసి, చక్కటి దుస్తులు వేసి తయారు చేశాడు. అమ్మాయికి ఐదేళ్లు, అబ్బాయికి మూడేళ్లు. ఇద్దరు పిల్లలని ముచ్చటగా తయారు చేశాడు. తాను కూడా తయారవుతున్నాడు పెళ్లికి వెళ్లేందుకు.


ఇంతలో మంగమ్మ బ్యూటీ పార్లర్ నుంచి వచ్చింది. జుట్టు విరబోసుకుంది, మొహం మెరుస్తూ కనిపిస్తోంది. లిప్‌స్టిక్ వేసుకుంది, కనుబొమ్మలు, కళ్లు ఇంకోలా ఉన్నాయి. రంగులు వేశారేమో కొంచెం వికృతంగా కనిపిస్తున్నాయి. ఎవరో నాటకాల్లో వేసే వాళ్లలాగా కనిపిస్తోంది.


ఆమెను చూడగానే హాలులో ఆడుకుంటున్న పిల్లలిద్దరూ భయపడిపోయారు.


"నాన్న! నాన్న! ఎవరో ఒక ఆవిడ వచ్చారు ఇలా రా!"


"ఎవరు నువ్వు? ఎవరు కావాలి? మా ఇంటికి ఎందుకు వచ్చావు? పో పో నువ్వెవరో మాకు తెలియదు" అంటూ అరుస్తున్నారు పిల్లలిద్దరూ. వాళ్ల అమ్మ అని ఆ రూపులో బొత్తిగా గుర్తుపట్టలేదు పిల్లలు.


"నేను రా మీ అమ్మని" అంటోంది మంగి.


ఇంతలో గదిలో నుంచి సుబ్బారావు వచ్చి మంగమ్మ అవతారాన్ని చూసి అవాక్కయ్యాడు!

"ఎలా ఉందండి? బాగా చేసిందా? మా ఫ్రెండ్స్ ఇలాగే చేయించుకుంటారు పార్టీలకు వెళ్లడానికి" అంటూ అడుగుతోంది సంతోషంగా మంగమ్మ.


పిల్లలిద్దరూ భయపడిపోయి వాళ్ల డాడీని పట్టుకుని "ఎవరు డాడీ ఈవిడ?" అన్నారు.

"మీ అమ్మే రా రంగులు వేసుకుంది" అంటున్నాడు సుబ్బారావు.


"మా అమ్మ కాదు ఈవిడ" అంటున్నారు పిల్లలిద్దరూ తండ్రిని పట్టుకుని. ఆమె లోపలికి వస్తుంటే,


"నేనే రా బుజ్జి మీ అమ్మని" అంటోంది మంగమ్మ.

"మా అమ్మవు కాదు, పో అవతలకి! మా ఇంట్లోకి రావద్దు, మా అమ్మ ఇలా ఉండదు" అంటున్నాడు బుజ్జిగాడు.


"జుట్టు విరబోసుకున్నావు నువ్వు, మా అమ్మ చక్కగా జడ వేసుకుని పువ్వులు పెట్టుకుంటుంది. మా అమ్మవు కాదు, మా అమ్మ ఇలా పిచ్చి పిచ్చి రంగులు ముఖానికి పూసుకోదు. నువ్వెవరో మాకు తెలియదు, పో!" అంటూ అరుస్తోంది చిన్ని.


పిల్లలిద్దరూ భయపడిపోయారు. తండ్రి కాళ్లు పట్టుకుని వదలడం లేదు. తండ్రి ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు.


"మీ అమ్మని నేనే రా" అంటే,


"నువ్వు మా అమ్మవి కాదు, పో పో!" అంటున్నారు.


సుబ్బారావు తల మొత్తుకున్నాడు.


"చెప్పాను కదా తే నీకు! ఇవన్నీ నీకు సూట్ అవ్వవు. ఎందుకు వచ్చిన తిప్పలు... పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు! పిల్లలు కూడా నువ్వు తల్లి అని నమ్మడం లేదు. 


బుజ్జిగాడు నీ దగ్గరకు అసలు రావడం లేదు, నిన్ను చూసి భయపడిపోతున్నారు. ఎవరి గురించో మనం గొప్పలకు పోకూడదు. వెళ్లి ఆ రంగులన్నీ చెరిపేసుకుని మామూలుగా తయారై రా. లేకపోతే పిల్లలు నువ్వు తల్లివి కాదు పొమ్మంటారు" అంటూ సుబ్బారావు కేకలేశాడు.


"అయ్యో! ఈ మేకప్పులన్నీ తీసేస్తే మనకి డబ్బులు దండగండి! వెయ్యి రూపాయలు పోతాయి" అంటూ మొత్తుకుంది మంగమ్మ బాత్రూంలోకి వెళ్తూ.


సమాప్తం

***








📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y


అద్దంకి లక్ష్మి గారి కొన్ని ఇతర రచనలు:


అద్దంకి లక్ష్మి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


అద్దంకి లక్ష్మి

రచయిత్రి పరిచయం: అద్దంకి లక్ష్మి

నా పేరు శ్రీమతి అద్దంకి లక్ష్మి

జన్మ స్థలం:రాజమహేంద్రవరం

డేట్ అఫ్ బర్త్

3_6_1946.

నివాసం: నవీ ముంబయి

విద్యార్హతలు:

బి.ఎ; బి. ఇడి

**వృత్తి:విశ్రాంత ఉపాధ్యాయిని,

బాంబే మునిసిపల్ కార్పొరేషన్


**తల్లిదండ్రులు: శ్రీమతి రత్నమ్మ గారు_శ్రీరామ మూర్తి గారు.

భర్త:శ్రీ వేంకటేశ్వర రావు;

విశ్రాంత జాయింట్ కమిషనర్, ఆదాయపు పన్ను శాఖ

**కుమారుడు:

గిరిధర్ సిఏ;ఎంబీఏ; శాక్రమెంటో కాలిఫోర్నియా,


**కూతురు:మాధురి వెబ్ మేనేజర్ న్యూయార్క్ స్టేట్ అమెరికా.

అల్లుడు మధుసూదన్ అమెరికా

వృత్తి/ప్రవృత్తిలో ముఖ్య ఘట్టాలు


**నూతన విద్యా విధానం గురించి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి,ఉత్తమ రిసోర్స్ పర్సన్ టీచర్ గా పురస్కారం పొందాను,


నిరక్షరాస్యతను నిర్మూలించుటకు

సేవా కార్యక్రమాలు నిర్వహించాను,,


నాటకాలు వ్రాసి

విద్యార్థుల నాటకాలు

వేయించాను బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ రైటర్ అవార్డులు పొందాను,

సౌత్ ఇండియన్ భాషలలో వేయించిన నాటకాల్లో, పిల్లలకు బెస్ట్ యాక్టర్ గా పురస్కారాలు లభించాయి


చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు ప్రత్యేకంగా పాఠాలు చెప్పి వారి విద్యాభివృద్ధికి తోట్పడినాను,


**తెలుగు రచయితల సంఘం మహారాష్ట్ర వారి సంకలనాలలో కథ,కవిత రాసి పురస్కారాలు పొందాను,


**ఆల్ ఇండియా రేడియో తెలుగు కేంద్రంలో ఢిల్లీలో నాలుగేండ్లు తెలుగులో వార్తలు చదివిన అనుభవం


**ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ లో నాలుగేండ్ల అనుభవం


సాహితీ జీవితం_రచనలు

**వివిధ సాహితీ సమూహాల్లో కథలు,కవితలు రాస్తుంటాను

**ఆంధ్ర ప్రభ,ఆంధ్ర పత్రికల్లో కథలు, వ్యాసాలు ప్రచురించ బడ్డాయి


ఆంధ్రప్రభ పత్రికలో కథలకు బహుమతులు పొందాను


**అనేక సమూహాల్లోని

ఇ-సంకలనాలలో నా కథలు,కవితలు,

పద్యాలు ప్రచురించ బడినవి

కవితలకు కథలకు బహుమతులు పొందినాను


నేను రాసిన

కవితలు మరియు ప్రక్రియలు 4000 పైగా

**మినీ కవితలు

పంచపదులు

సున్నితాలు

ఇష్టపదులు

**గేయాలు

**వ్యాసాలు

**నాటకాలు

పద్యాలు

గజల్స్

కథలు

రుబాయీలు

బాల సాహిత్యం

**పేరడీ పాటలు 20 వివిధ దిన పత్రికలలో ప్రచురించబడ్డాయి


*సాహిత్య సేవ

తేనియలు,

తొణుకులు,

చిలక పలుకులు,

పరిమళాలు,

మధురిమలు,

ముత్యాలహారాలు,ఇష్టపదులు,

సకినాలు,

సున్నితాలు,

పంచ పదులు, బాల పంచ పదులు, నానీలు అనేక లఘు కవితా ప్రక్రియల్లో అన్నిట్లోనూ శతాధికంగా కవితలు రాసి, ప్రశంసా పత్రాలను పొందినాను,


**1500 వందలకు పైగా ప్రశంసా పత్రాలు పొందాను

**సాహితీ చక్రవర్తి, ఇష్టపది శ్రేష్ఠ,కవన కిరణం, అక్షర ఝరి , పంచపది కవి రత్న లాంటి , సాయి వనములో సాహిత్యం నుంచి కవన రత్న, కథా భూషణ్, మెదక్ జిల్లా విశిష్ట పురస్కారం, ఏకె మీడియం ముంబై వారి పురస్కారం, నారీ శ్రీ, సున్నితార పురస్కారం,,

అన్ని గ్రూపుల నుంచి,

15 బిరుదులు పొందడం జరిగినది,


ఆగస్టు 2022లో అమ్మ అంశముపై నేను రాసిన పద్యములకు,,

2 సున్నితాల ప్రక్రియ లో కవితకు కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైనను,


రెండుసార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యాను,


1.ప్రచురణ,,,


1 ,కవితా కుసుమాలు పుస్తకాన్ని ప్రచురించుకున్నాను,


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page