top of page
Original.png

అయ్యా... సభ్యులందరికీ శతకోటి దండాలు


సోషల్ మీడియా టాస్క్ కోసం చెప్పులు పట్టుకుని ఫోటోలు దిగుతున్న సభ్యులు
సోషల్ మీడియా టాస్క్ కోసం చెప్పులు పట్టుకుని ఫోటోలు దిగుతున్న సభ్యులు

Ayya sabhyulandarikee Sathakoti Dandalu | Telugu Comedy Story | Nallabati Raghavendra Rao

అయ్యా... సభ్యులందరికీ శతకోటి దండాలు | తెలుగు హాస్య కథ | నల్లబాటి రాఘవేంద్ర రావు

Published in manatelugukathalu.com on 16/05/2026


విపరీతంగా పెరిగిపోయిన గ్రూప్స్‌లోకల్లా, రెండు లక్షల మంది ఫాలోవర్స్ ఆదరణతో అడ్డూఆపూ లేకుండా ముందుకు దూసుకుపోతున్న ప్రఖ్యాత గ్రూప్...

'కాయ్ రాజా కాయ్'


కొత్త కొత్త టాస్క్‌లు పెడుతూ సభ్యుల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తున్న ఆ గ్రూపు సంక్రాంతి పండుగ సందర్భంగా సభ్యులకు ఒక కొత్త టాస్క్ ఇచ్చింది. టాస్క్ పేరు...

'చెప్పు తీసుకుని కొడతా!'


ఆ గ్రూపు అడ్మిన్స్... ఎండుగడ్డి ఎలకలరావు అండ్ ఫ్రెండ్స్... టాస్క్‌కు సంబంధించిన వివరాలు ఈ విధంగా తమ గ్రూపులో పోస్ట్ చేశారు.


''సభ్యులకు నమస్కారం. ప్రతిసారిలాగే ఈ వారం కూడా ఒక కొత్త టాస్క్ మీ ముందుకు తీసుకు వచ్చాము. 


ఇప్పుడు సరికొత్త టాస్క్ ఏమిటంటే... మన తెలుగు రాష్ట్రాల్లో మన తాతముత్తాతల కాలం నుండి ఎన్నో నానుడులు, మరెన్నో సామెతలు, ఇంకెన్నో నీతివాక్యాలు, ఇంకా చాలా ఊతపదాలు మనం ప్రతిరోజూ దినచర్యలో ఆయా సందర్భాలలో ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరి నోట వింటూ ఉంటాం.


ఉదాహరణకు వీటిల్లో కొన్ని... 'నరికి పడేస్తాను.' ''


అయితే నిజంగా ఎవడు కూడా ఎవరిని నరకడు, నరకలేడు.


రెండవది... 'ఒరేయ్! నిన్ను చంపేస్తాను రా!' కోపం వచ్చినప్పుడు ఎవరైనా ఇలా అనుకుంటారు కానీ ఆ పని చేయరు!


తర్వాత..' క్షేమంగా వెళ్ల లాభంగా రండి'..  ఇది కూడా మాటవరసకు అంటుంటారు.. కానీ ఎలా వెళ్తారు ఎలా వస్తారు.. అంతా విధివ్రాత !

అలాగే...... "చెప్పు తీసుకుని కొడతాను!"... ఈ ఊతపద వాక్యం కూడా కోపం వచ్చినప్పుడు పల్లెటూర్లలో, పట్టణాలలో ఎవరో ఒకరు ఇలా అనుకుంటారు కానీ నిజానికి ఎవరూ కూడా చెప్పు తీసుకొని కొట్టరు.

అలాగే......''చెప్పు తీసుకుని  కొడతాను!''...ఈ   ఊతపద వాక్యం  కూడా  కోపం వచ్చినప్పుడు  పల్లెటూర్లలో  పట్ట ణాలలో  ఎవరోఒకరు ఇలా అనుకుంటారు కానీ నిజానికి ఎవరు కూడా చెప్పు తీసుకొని కొట్టరు.


అంతే కాదు అక్కడ అక్కడ కొందరు కోపిష్టి భర్తలు తమకు బిపి పెరిగినప్పుడు తమ తమ భార్యలను నోరెత్తితే..

"చెప్పు తీసుకుని కొడతాను!" అంటూ అరవడం కూడా మనం తరచూ చూస్తున్నాం.. వింటున్నాం. కొండొకచో

పెళ్లాలు కూడా మొగుళ్లను ఇలా బెదిరించటం వింటుంటాం.. ఐతే అది నిజంగానో ఉత్తుత్తిదిగానో ప్రస్తుతం మనకనవసరం.. అప్రస్తుతం. పోతే గీతే...


అదిగో ఈ ఊతపదవాక్యమే మన టాస్క్ కు ఇప్పుడు ప్రాణం..


మీరు చేయవలసిందల్లా...


"చెప్పు తీసుకుని కొడతాను!"... అన్నది మీ వంశంలో అనగా మీ తాతముత్తాతలలో ఎవరు ఎప్పుడు ఏ సందర్భంలో మొట్టమొదటగా ప్రారంభించారు అన్నది మీ పెద్దోళ్లను అడిగి 300 పదాలలో ఈ గ్రూపులో పోస్ట్ చేయాలి. దానితో పాటు మీ కాలిచెప్పు ఒకదానిని చక్కగా కడిగి మీ కుడి చేతితో పట్టుకుని కొత్తరకం కోతిపోజుతో ఉన్న కలర్ పాస్పోర్ట్ సైజు ఫోటో, దానితో పాటు మీ పూర్తి అడ్రసు తప్పనిసరిగా పోస్టులో పెట్టాలి.


కొత్తరకం కోతిపోజు అన్నామని కోప్పడకండి, ప్రాస బాగుందని అలా పెట్టాము.. ఇది ఎంతమాత్రం తప్పు కాదని మీరు కూడా అంగీకరించి తీరాలి.. మరి... ఇదీ టాస్క్ అన్నమాట...


అలా మీరు పంపగా మాకు వచ్చిన వందలాది పోస్టులలో మా కమిటీ సభ్యులైన పిండం, అండపిండ, బ్రహ్మాండ పిండం... అను ముగ్గురు కలసి ఒక ఉత్తమ మహాఉత్తమ సభ్యుడిని సెలెక్ట్ చేస్తారు. అప్పటి నుండి ఇక మీరే రాజు.. రారాజు.. రాజాధిరాజు.


త్వరపడండి..సమయం 48 గంటలు  మాత్రమే!


మరొకసారి చదువుకోండి బహుమతి 1000 రూపాయలు.

బోల్డన్ని డబ్బులు. సరదాలు చేసుకోవచ్చు.. షికార్లు తిరగొచ్చు.. అలవాటుంటే మందుగిందు.. ఇంకే.. త్వరపడండి... అంటే త్వరగా పడమని కాదు, త్వరగా ప్రయత్నించమని అర్ధం చేసుకోండి."


ఇదీ.. కాయ్ రాజా కాయ్..  గ్రూపు అడ్మిన్ శ్రీయుత ఎండుగడ్డి ఎలకలరావు  తన గ్రూపు చానల్లో ప్రచురించిన  ఆనాటి టాస్క్.


                             **


అంతా బాగానే ఉంది కానీ.. ఆవకాయ పచ్చడిలో అరటిపండు తొక్క అన్నట్టు.. సమయం నలభై ఏడు గంటలు ముగిసిపోయినప్పటికీ.. రెండు లక్షల మందిలో ఒక్క సభ్యుడు కూడా గ్రూపులో పోస్ట్ పెట్టలేదు.


ఇంతిలా కాయ్ రాజా కాయ్ గ్రూపు సూచిక  పతనమై పోవడానికి కారణం ఏమిటి ? అర్థం కాలేదు ఎండుగడ్డి ఎలకలరావుకు. దాంతో ఈ టాస్క్ కు  సభ్యులు  తమ పోస్ట్ పెట్టడానికి ఎందుకు కంగారు పడ్డారు అన్న విషయం గురించి కారణాలు వెతకడం ప్రారంభించాడు.


ఈ రకమైన టాస్క్‌కు పోస్టు పెడితే తమను ప్రపంచమంతా చులకన చేసి....... "ఛీ వీడి మొఖం మండ.. ఛీ ఛీ వీడి వంశం తగలడ.." అన్నట్టుగా తమ పోస్టులను చదివిన ప్రపంచమంతా భావించి ఉండొచ్చు. తమ పోస్టు క్రింద భయంకరంగా తిడుతూ చెత్తాచెదారపు కామెంట్స్ పెడతారేమో అని సభ్యులు బేజారు పడి ఉండవచ్చు అనిపించింది 'కాయ్ రాజా కాయ్' గ్రూపు అడ్మిన్ ఎండుగడ్డి ఎలకలరావుకు.


వెంటనే స్పందించి మరొక ప్రకటన చేయవలసి వచ్చింది అతను. అది.. ఏమిటంటే....


'' ఏవండోయ్ సభ్యుల్లారా...నిద్రమత్తు  వదలండి.


మీకు ఒక తాయిలం  పెట్టాలనుకుంటున్నాము.


"చెప్పు తీసుకుని కొడతాను!"... టాస్క్‌లో గెలిచిన ఒకే ఒక రాజాధిరాజు సభ్యునికి 4 వేల రూపాయలు.. అక్షరాల నాలుగు వేల రూపాయలు.. ప్రైజ్ మనీ పెంచాము. దానితో పాటు కంపెనీ వారి ఒక కొత్త చెప్పుల జత కూడా పంపిస్తాము. ఆ చెప్పుల జత వేసుకొని బైటికెళ్తే ఖచ్చితంగా

జారిపడతారు మాదీ గ్యారంటీ.. సారీ..పొరపాటు..

ఖచ్చితంగా డాన్స్ కడతారు.  ఇదే విషయం. 


మరి ఇంకా ఆలస్యం దేనికి.. త్వరపడండి సమయం  ఒక గంట మాత్రమే..60 నిమిషాలు మాత్రమే! త్వరపడండి.... ఆగండాగండి.. త్వరపడండి అంటే త్వరగా కింద పడమని కాదు త్వరగా మాకు పోస్టులను పంపమని అర్థం."


ఇదీ... ఆ ప్రకటన  సారాంశం.


                             **


ఇంకేముంది సంబడం... విత్తనం వేయకుండానే పంట పండినట్లు అయిపోయింది.. ఆ గ్రూపు వాళ్ళ పరిస్థితి.


ఇక సమయం 1 గంట.. మిగిలి ఉన్న ఆ గంట కాలవ్యవధిలో టప టప టప.. రకరకాల కథనాలు రాసి చెప్పు చేతితో పట్టుకున్న తమ కొత్తరకం కోతిపోజు పాస్పోర్ట్ సైజు ఫోటోలతో సహా.. 8 వేల మంది సభ్యులు పోస్టులు పెట్టేసారు.


అదిరిపోయి బెదిరిపోయి  చెదిరిపోయినట్లు అయి పోయారు ఎండుగడ్డి ఎలకలరావు అండ్  ఫ్రెండ్స్. అయినా బెదిరేది అణుమాత్రం కూడా లేదు అన్నట్లు  నిబ్బరంగా నిలబడ్డారు.


అందులో ఒక పోస్టు చదవడం ప్రారంభించారు.


''నాపేరు చీమిడిముక్కు  చిప్పేశ్వరరావు..


మీరు చెప్పింది అక్షరాలా సత్యం. మా వంశంలో గత ఐదు వందల సంవత్సరాల నుండి భర్తలందరూ భార్యలను 'నోరెత్తితే చెప్పు తీసుకుని కొడతాను...' అంటూ నిమిషం నిమిషం తిడుతూ భయపెడుతున్నట్టుగా నా పరిశోధనలో తేలింది.


అంతెందుకు నేను సైతం  నా పెళ్ళాన్ని రోజుకు పదిసార్లు ఇలా  తిడుతూ ఉంటాను. చెప్పుతో మాత్రం కొట్టను.. కొట్టలేను . ఎందుకంటే  కొడితే ఏమవుతుందో  నాకే కాదు మీకు కూడా తెలుసు. అని నాకు ఖచ్చితంగా తెలుసు.


ఇక ఆ విషయం పక్కన పెడితే... ఈ యొక్క చెప్పు తీసుకుని కొట్టడం విషయంలో మా వంశపు చరిత్ర ఇంత మహా గొప్ప ప్రసిద్ధి చెందిన సువర్ణ అక్షరాల చరిత్ర అని ఈ విషయం ఇప్పుడే మా పెద్దలు చెప్పారు. కనుక నాలుగు వేల రూపాయలు ప్రైజ్ మనీ నాకే పంపండి. ఈ వాక్యం మీద సర్వహక్కులు అనగా పేటెంట్ హక్కులు ఘన చరిత్ర కలిగిన మా వంశం వారికే చెందాలి.. చెందుతాయి."

అదీ ఆ పోస్ట్ సారాంశం


ఎండుగడ్డి ఎలకలరావు అండ్  ఫ్రెండ్స్ మొదటి పోస్టు చదివి సంతృప్తికరంగా  ఉందనిపించి  రెండవ పోస్టు  చదవడం ఆరంభించారు.


అయ్యా నా పేరు   చెప్పులపాటి  పిచ్చిమాలోకం


ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నాలుగు వేల రూపాయలు ప్రైస్ మనీ నాకే చెందాలి సార్.


ఎందుకంటే మా వంశం లో జరిగిన 5 వేల సంవత్సరాల నాటి సంఘటన మీకు చెప్పాలి..అప్పట్లో..


మా వంశంలో అందరూ చెప్పులు కుట్టేవారట. ఎవరైనా వ్యక్తులు చెప్పులు కుట్టించుకొన్నాక డబ్బులు ఇవ్వకపోతే వెంటనే వాళ్ళను చెప్పు తీసుకొని కొట్టేవారట. అందుకనే మా ఇంటి పేరు అలా అలా అలా రూపాంతరం చెంది చెప్పులపాటిగా మారిందని సాక్షాధారాలు నా దగ్గర ఉన్నాయి కనుక.. చెప్పు తీసుకుని కొడుతున్నట్టు కొత్తరకం కోతి ఫోటో మరియు నా పూర్తి అడ్రస్ క్రింద పోస్ట్ చేశాను. దయచేసి వెంటనే నాలుగు వేల రూపాయలు పంపండి...

ఇదంతా మా ముని ముని తాతల గురించి ఎరకాలమ్మ సోదిలో ఇప్పుడే అడిగి తెలుసుకున్న యధార్ధ విషయమని మీకు నా స్వహస్తాలతో మీ గ్రూప్ లో ఈ పోస్ట్ షేర్ చేసినాను...పంపినానని హామీ.'


ఇదీ ఆ పోస్టు సారాంశం.


బాహు పసందుగా నచ్చేసింది ఈ పోస్టు ఆ గ్రూపు నిర్వాహ కులకు..


వెంటవెంటనే అలా అలా సభ్యులు పంపిన 8 వేల పోస్టులు చదివి పడేశారు. చెప్పుతో తీయించుకున్న ఫోటోలు

బాహు అందంగా ఉన్నాయని.. సంబరపడిపోయారు ఎండుగడ్డి ఎలకలరావు అండ్  ఫ్రెండ్స్.


ఇప్పుడే అసలు కథ పసందుగా ప్రారంభమయింది


రెండు రోజులు పోయాక  పోటీ ఫలితాలు ప్రకటించారు.. గ్రూపు అడ్మిన్స్.. దాని సారాంశం  ఇది.


"అయ్యా..సభ్యులందరికీ శతకోటి దండాలు


విషయం ఏమిటంటే.. ప్రపంచంలో ఏ పోటీలు నిర్వహించినప్పటికీ సర్వహక్కులు నిర్వాహకులకు ఉంటాయి కనుక... మేము నాలుగు వేల రూపాయల ప్రైజ్ మనీని అన్న మాట ప్రకారం చీపురుపుల్ల గీత దాటకుండా పంపదలచాము.. ఆ విధంగా మా నిజాయితీ నిరూపించుకోదలిచాం.

అయితే చిన్న సవరణ... మాకు మీ అందరి నుండి వచ్చిన 8 వేల పోస్టులు కూడా ఉత్తమంగా, అత్యుత్తమంగా కనిపించాయి. ఒకరి కన్నా ఒకరు మీ వంశపు చెప్పుల చరిత్రలు మీ పెద్దలను అడిగి తెలుసుకుని మరీ మీ తలతిక్క కొత్తరకం కోతిఫోటోలతో సహా పంపినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు.

అయితే చిన్న సవరణ...మాకు మీ  అందరినుండి వచ్చిన 8 వేల పోస్టులు  కూడా ఉత్త మంగా అత్యుత్తమంగా కనిపించాయి.   ఒకరుకన్నా ఒకరు మీ వంశపు  చెప్పుల చరిత్రలు మీ పెద్దలను అడిగి తెలుసుకుని మరీ మీ తల తిక్క  కొత్తరకం కోతిఫోటోలతో సహా పంపినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు.


ఇప్పుడు లెక్కలు చూసుకుందాం...


మా దృష్టిలో సభ్యులంతా గౌరవనీయులే కనుక మా టాస్క్‌కు పోస్టు పంపించిన ఎనిమిది వేల మంది సభ్యులు కూడా విజేతలే! ఇప్పుడు ఎనిమిది వేల మందికి సమానంగా ప్రైజ్ మనీ ఇవ్వాలని నిర్ణయించాం.. ఎవరినీ అప్సెట్ చేయడం మా ఉద్దేశం కాదు. ఆ విధంగా నాలుగు వేల రూపాయలు ఎనిమిది వేల మందికి పంచితే ఒక్కొక్కరికి 50 పైసలు కచ్చితంగా ముట్ట చెప్పవలసి వస్తుంది. క్షమించాలి.


కచ్చితంగా అన్న పదంలో  'వత్తు ..ఖ''.. అన్న  ఈ అక్షరం... మా కీబోర్డులో అచ్చు పడటంలేదు.


అందుకని మామూలు 'క' వాడవలసి వచ్చింది, ప్రతిదానికీ సభ్యులు తప్పుపట్టరు అని మనవి చేసుకుంటున్నాము.


అందుచేత ఈ 50 పైసలు పోస్టు ద్వారా మీ అడ్రస్‌కు మనీ ఆర్డర్ చేయడానికి ఖర్చులు మేము భరించడం కుదరదు. కనుక సదరు ఖర్చుల నిమిత్తం ప్రతి ఒక్క సభ్యుడు పది రూపాయల చొప్పున మా అడ్రస్‌కు పంపవలసిందిగా వినయపూర్వకంగా కోరి ప్రార్థించడం ఐనది.



ఇట్లు....'' కాయ్ రాజా కాయ్''.. గ్రూపు  అడ్మిన్స్.


                             *


"చెప్పు తీసుకొని కొడతా..!" టాస్క్ కొరకు పోస్టు పంపించిన విజేతలైన 8 వేల మంది సభ్యులు రిజల్ట్ చదివారు.


వాళ్ళెవరూ అప్ సెట్  కాలేదు. మనసారా హాయిగా నవ్వుకుందాం అంటే నువ్వు కూడా  రాలేదు.


సరే..విపరీతమైన కోపం వచ్చి.. అది నషాలం కు ఇతర పార్ట్ లకు చేరి... "ఓరి మీ అసాధ్యం కూలా .."అని తిరిగి మెసేజ్ లు కూడా పెట్టలేదు.


'' మనం కూడా ఒక గ్రూపు పెడితే  పోలా...''..అని

అనుకుంటున్నారు అందరూ... అనుకోవడమే కాదు నిర్ణయించుకున్నారు కూడా.


అంతే .. ఆ మర్నాడే 8000  సరికొత్త గ్రూపులు తయా రయ్యాయి!


           ***********    


నల్లబాటి రాఘవేంద్ర రావు గారి కొన్ని ఇతర రచనలు:


నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 




మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.







రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ముందుగా  " మన తెలుగు కథలు"  నిర్వాహకులకు నమస్సులు..

"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.

రచయిత తన  గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.

పునాది....

-----------

ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు  ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం  నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద  దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.


ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా..   రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.


తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో

టెన్త్ క్లాస్ యానివర్సరీ కి  15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.

అప్పుడే నేను రచయితను కావాలన్న

ఆశయం   మొగ్గ తొడిగింది.

నా గురించి..

---------------

50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.

450  ప్రచురిత కథల రచన అనుభవం.

200 గేయాలు  నా కలం నుండి జాలువారాయి

200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి

20 రేడియో నాటికలు ప్రసారం.

10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.

200 కామెడీ షార్ట్ స్కిట్స్

3  నవలలు దినపత్రికలలో


" దీపావళి జ్యోతి "అవార్డు,

"రైజింగ్స్టార్" అవార్డు

" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.


ప్రస్తుత ట్రెండ్ అయిన  ఫేస్బుక్ లో  ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు  నాకథలు,  కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..

రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం  కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!

ఇదంతా ఒక్కసారిగా  మననం చేసుకుంటే...  'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.

ఇక నా విజయ ప్రయాణగాధ....

------+------------------------------

పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన  నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ  నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!


తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ...   నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి  ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి  వారైన  సినీ గేయరచయిత

" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.


1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి  కథ.


2. రేడియో నాటికలు  గొల్లపూడి మారుతీ రావు    గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.


3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర"  ద్వితీయబహుమతి కథ..  "డిసెంబర్ 31 రాత్రి"


4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ


5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ


6.  దీపావళి కథలు పోటీలో  "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.


7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ


8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"


9. "స్వాతి "   తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."


10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్  "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"


11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం  కురిసింది"


12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ


13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..


14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం"  న్యాయనిర్ణేత   జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.


15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .


16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ

" ఇంద్రలోకం".


17.  కొమ్మూరి సాంబశివరావు స్మారక  సస్పెన్సు కథల పోటీలో  "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.


18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ "  గాంధీ తాత"  రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.


19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్  రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.


20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".


21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".


22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి  కథ "ఆలస్యం అమృతం విషం"


23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ  "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.


24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.


25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.


26.  రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ  పోటీ లో ఎన్నికైన కథ.


27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".


28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.


29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.


30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం"  వారం వారం 30 కథలు.


31. "కళా దర్బార్"  రాజమండ్రి.. రాష్ట్రస్థాయి  కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ  కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.


32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన  "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి"    కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు  ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.


33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో  సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో  ప్రథమ బహుమతి  పాటకు వారి నుండి  పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక   రంగస్థల ప్రదర్శనలు పొందడం.


34. విశేష కథలుగా  పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు

  నలుగురితోనారాయణ

  కొరడా దెబ్బలు

  అమృతం  కురిసింది.

  వైష్ణవమాయ

  ఐదేళ్ల క్రితం

  ఇంద్రలోకం

  బిందెడు నీళ్లు

  చంద్రమండలంలో స్థలములు అమ్మబడును

  డిసెంబర్ 31 రాత్రి

  మహాపాపాత్ముడు

 

35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.


ప్రస్తుతం...


1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం


2. పరిషత్ నాటికలు జడ్జిగా..


3.  కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..

సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.


4. ..  4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.


5. ఒక ప్రింటెడ్ పత్రిక  ప్రారంభించే ఉద్దేశ్యం.


భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.

కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.

కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.

కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.

మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.

నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.

నల్లబాటి రాఘవేంద్ర రావు 


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page