top of page
Original.png

సిద్ధాంతం

Jul 19
2 min read

సిద్ధాంతం, సామ దాన దండ భేదం, చాణక్య నీతి, వ్యక్తిత్వ వికాసం, తెలుగు వ్యాసం, జీవన సూత్రాలు, మానసిక శాస్త్రం, ప్రేరణాత్మక రచన, మనస్తత్వం, స్వీయాభివృద్ధి, Telugu Article, Self Improvement, Human Behaviour, Mana Telugu Kathalu

సామ దాన దండ భేద సిద్ధాంతాలను సూచించే భావోద్వేగ తెలుగు కాన్సెప్ట్ చిత్రం
సామ దాన దండ భేద సిద్ధాంతాలను సూచించే భావోద్వేగ తెలుగు కాన్సెప్ట్ చిత్రం

Siddhantham - Telugu Inspirational Article | Kotha Viritha

సిద్ధాంతం - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత

Publishes in manatelugukathalu.com on 19/07/2026


మన జీవితంలో ప్రతి ఒక్కరినీ ఒకే విధంగా మార్చలేము. కొంతమంది ప్రేమతో చెప్పితే మారిపోతారు, మరికొందరు లాభం కనిపిస్తే స్పందిస్తారు, ఇంకొందరు శిక్ష భయంతోనే క్రమశిక్షణ పాటిస్తారు, మరికొందరు ఇతరులతో పోల్చినప్పుడే ముందుకు కదులుతారు. ప్రాచీన భారతీయ సామ, దాన, దండ, భేద సిద్ధాంతాలు నేటి కుటుంబ జీవితం, పిల్లల పెంపకం, ఉద్యోగం, నాయకత్వం, సమాజంలో కూడా ఎంత ప్రాసంగికంగా ఉన్నాయో ఈ ఆలోచింపజేసే వ్యాసం ఆసక్తికరమైన ఉదాహరణలతో వివరిస్తుంది.


ప్రపంచంలో అందరూ మంచి మాటతో మారిపోతారని అనుకోవడం అమాయకత్వం.

ప్రతి మనిషికి పని చేసే "సిద్ధాంతం" ఒక్కోటి ఉంటుంది.


కొంతమందికి ప్రేమగా చెప్పితే చాలు... వెంటనే మారిపోతారు. అదే సామం.

కొంతమందికి "ఇది చేస్తే నీకే లాభం" అని చెప్పాలి. అదే దానం.

ఇంకొందరికి నోటీసు, మెమో, ఫైన్, బ్లాక్ లిస్ట్ కనిపించకపోతే కదలరు. అదే దండం.

మరికొందరికి "నీ పక్కవాడు చేసేశాడు... నువ్వే వెనుకబడ్డావు!" అంటే చాలు. అదే భేదం.


పిల్లాడు చదవడు... "బాగా చదువు" అంటే వినడు. కానీ "ఫోన్ తీసేస్తా" అంటే పుస్తకం తెరుస్తాడు.

ఆఫీసులో మెయిల్‌కి రిప్లై ఇవ్వని వారు... "మేనేజర్‌ను లూప్ లో పెడతాను" అన్నాక ఐదు నిమిషాల్లో స్పందిస్తారు.


ట్రాఫిక్‌లో హెల్మెట్ పెట్టుకోని వారు... పోలీస్ కనిపించగానే రోడ్ సేఫ్టీ అంబాసిడర్లైపోతారు.

జిమ్‌కు వెళ్లని వారు... డాక్టర్ షుగర్ రిపోర్ట్ చూపించగానే ట్రెడ్‌మిల్‌తో ప్రేమలో పడతారు.


విచిత్రమేమిటంటే... మనం మనల్ని చాలా తెలివైన వాళ్లమని అనుకుంటాం.

కానీ మన ప్రవర్తనను నడిపించేది నాలుగు బటన్లలో ఏదో ఒకటే, అవే సామ, దాన, దండ మరియు భేద సిద్ధాంతాలు.


మంచి మాటతో మారితే గొప్పది.

లాభం కోసం మారితే సాధారణం.

శిక్ష భయంతో మారితే తప్పనిసరి.

పోలికతో మారితే... అది మన బలహీనత.


అందుకే ఇప్పుడు మనుషులను అర్థం చేసుకోవడం కంటే... వాళ్లకు ఏ 'సిద్ధాంతం' పని చేస్తుందో తెలుసుకోవడమే పెద్ద స్కిల్!


ఏదోకటి లెండి,పని పూర్తి అయిందా లేదా అంటారా, సరే కానివ్వండి.


కొత్త విరిత

సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్

ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్


***************************************


కొత్త విరిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



కొత్త విరిత
కొత్త విరిత

రచయిత్రి పరిచయం: కొత్త విరిత


నా పేరు కొత్త విరిత


B.sc B.ed Msc చేశాను

IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.

240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.

4 Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Radha R
Radha R
Jul 20
Rated 5 out of 5 stars.

Chala Bagundi viritha😍

Like

Rated 5 out of 5 stars.

👌 👌 👌 👌

Like

Rated 5 out of 5 stars.

True

Like

Rated 5 out of 5 stars.

నైస్.ఈ నాలుగింటిలో మనం ఏ స్థాయిలో ఉన్నామో చూసుకుంటే కొంచం బెటర్ అవ్వడానికి ప్రయతించచ్చు. మనిషి ఆ దిశగా ఆలోచింప చేయడానికి,ఈ శీర్షిక మంచి ఉపయోగ పడుతుంది

Like
bottom of page