top of page
Original.png

'..ట'

ట, అంట అట, గాసిప్, పుకార్లు, కొత్త విరిత, తెలుగు వ్యంగ్య వ్యాసం, సామాజిక వ్యాసం, గాసిప్ సంస్కృతి, ఆధారం లేని వార్తలు, తెలుగు ఆర్టికల్, social satire Telugu, gossip article Telugu, rumours Telugu,Telugu writing, Telugu literature

www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ '..ట' వ్యాసంలో ఒకరి నుంచి మరొకరికి రహస్యంగా మాటలు చేరుతూ గాసిప్ ఎలా వ్యాపిస్తుందో సూచించే గ్రామీణ దృశ్యం.
www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ '..ట' వ్యాసంలో ఒకరి నుంచి మరొకరికి రహస్యంగా మాటలు చేరుతూ గాసిప్ ఎలా వ్యాపిస్తుందో సూచించే గ్రామీణ దృశ్యం.

'Ta'Telugu Inspirational Article | Kotha Viritha

'..ట' తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత

Publishes in manatelugukathalu.com on 01/07/2026



"ఎవరో చెప్పారు...", "అంట...", "అట..." అంటూ ఆధారం లేని వార్తలను నిజాలుగా మార్చేసే గాసిప్ సంస్కృతి నేటి సమాజంలో సాధారణమైపోయింది. చిన్న అనుమానం ఎలా పెద్ద కథగా మారుతుందో, ఒక "ట" ఎలా అసత్యానికి రెక్కలు తొడుగుతుందో చమత్కారంగా, వ్యంగ్యంగా విశ్లేషించిన ఆలోచింపజేసే వ్యాసం ఇది.


"ఆమె ఆఫీసుకి వచ్చే వారం అంతా రాదట"

"ఈసారి మనకి పండగ బోనస్ లేదంట"

"ఆమెకి విడాకులు అయిపోతాయంట"

"వాడికి రెండో పెళ్లి కుదిరిందట"


ఇలాంటి వార్తలతో కొందరి రోజు మొదలై, మరికొందరి రోజు ముగుస్తుంది. వీరికి బ్రేకింగ్ న్యూస్ లేకపోతే తల బ్రేక్ అవుతుంది.


విచిత్రం ఏమిటంటే, ఈ వార్తలన్నింటికీ ఆధారం అడిగితే "ఎవరో చెప్పారు" అనే సమాధానం తప్ప ఇంకేమీ ఉండదు. ఆ "ఎవరో" ఎవరో మాత్రం ఎప్పటికీ తెలియదు.


ఒక చిన్న అనుమానం వీరి చేతిలో పడితే చాలు, అది గంటలో కథగా,

సాయంత్రానికి సీరియల్‌గా, మరుసటి రోజుకి చరిత్రగా మారిపోతుంది.


నిజం తెలుసుకోవాలనే ఆసక్తి కంటే, ఊహించి చెప్పాలనే ఉత్సాహం ఎక్కువ.


చూసింది తక్కువ, విన్నది ఎక్కువ.

తెలిసింది తక్కువ, చెప్పింది ఎక్కువ.


వాక్యం మొదలుపెట్టడానికి విషయం అవసరం లేదు,

చివర్లో ఒక "ట" ఉంటే చాలు.


తెలుగులో వీరికి అత్యంత ఇష్టమైన గుణింతం ఏదని అడిగితే, "ట" అని టక్కున చెప్పేస్తారు.

ఎందుకంటే, వీరి ప్రపంచంలో ప్రతి వాక్యం చివర "అంట", "ట", "అట" లేకపోతే వార్తకు విలువే ఉండదు.


ఆధారం లేని వార్తకు ప్రాణం పోసేది ఊహ అయితే, ఆ ఊహకు తోక కట్టేది ఈ "ట".


విన్నది వార్త కాదు, విన్నదానికి "ట" తగిలించి చెప్పేదే వీరి ప్రత్యేకత.


కొత్త విరిత

సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్

ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్


***************************************


కొత్త విరిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



కొత్త విరిత
కొత్త విరిత

రచయిత్రి పరిచయం: కొత్త విరిత


నా పేరు కొత్త విరిత


B.sc B.ed Msc చేశాను

IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.

240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.

4 Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Rated 5 out of 5 stars.

Super write up

Like

Rated 5 out of 5 stars.

Illusions will shape repeated spreading of gossips😁

Like

Rated 5 out of 5 stars.

Nice👌👌

Like

Rupesh
Rupesh
Jul 01
Rated 5 out of 5 stars.

Super mam.

Good article about gossips nowadays in our society 👏🏼.


Like
bottom of page