top of page
Original.png

వెర్రి

1 hour ago
3 min read

చీరల షాపులో సెల్ఫీ తీసుకుంటున్న జానకి, పక్కనే ఇబ్బందిగా నవ్వుతున్న శిరీష

Verri - Telugu Comedy Story | Mohana Krishna Tata

వెర్రితెలుగు హాస్య కథ | తాత మోహనకృష్ణ

Published In manatelugukathalu.com On 16/09/2026


వెర్రి ఒక సరదా తెలుగు హాస్యకథ. తాత మోహనకృష్ణ రాసిన ఈ కథలో జానకి, శిరీషల చీరల షాపింగ్ సందర్భంగా జరిగే నవ్వుల సంఘటనలు ఆసక్తికరంగా సాగుతాయి.

సోషల్ మీడియా లైక్స్‌పై జానకికి ఉన్న మోజు, చీర ధర విషయంలో జరిగే పొరపాటు కథకు మరింత హాస్యాన్ని జోడిస్తాయి.

స్నేహం, హాస్యం, సోషల్ మీడియా వ్యంగ్యంతో కూడిన ఈ కథను చదివి ఆనందించండి.


"హలో శిరీష..! షాపింగ్ కి వెళ్ళాలి.. వస్తావా? నాకు నీ కంపెనీ కావాలి... పైగా నీకు చీరల విషయంలో మంచి టేస్ట్ ఉందిగా?"


"అలాగే వస్తాను జానకి.." (రాను అంటే ఒప్పుకోదుగా.. బుర్ర తినేస్తుంది - శిరీష మైండ్ వాయిస్)


జానకి, శిరీష మంచి ఫ్రెండ్స్. జానకికి చీరలు అంటే పిచ్చి.. అలాగే ఎప్పుడూ ఫోన్ చూస్తూనే వుంటుంది. ఇద్దరు చీరల షాప్ కు చేరుకున్నారు. అక్కడ చీరలు నచ్చక.. మరో షాప్ కు వెళ్లారు.

"ఇదెలా ఉంది శిరీష?"


"ఒక వంద వేసుకోవచ్చు."


"మరి ఇదెలా ఉందో చెప్పు."


"ఒక నూటయాభై వేసుకో."


"మరిదో.. చెప్పు చెప్పు?"


"రెండు వందలు వేసుకో."


"అంతేనా.. చాలా తక్కువ!"


"మరి దీని విషయం చెప్పు..! నచ్చకపోతే, వేరే షాప్ లో చూద్దాము" అంటూ చీరలు చూపిస్తూ అడిగింది జానకి.


'ఏదో ఒకటి చెప్పి చీర కొనిపించేయాలి. లేకపోతే.. ఒక్క చీర కోసం ఊరంతా తిప్పుతుంది. నాకంత ఓపిక లేదు' అని అనుకుంది శిరీష.

"ఏది.. ఒకసారి అది కట్టి చూపించు... అప్పుడైతే క్లియర్ గా తెలుస్తుంది."


జానకి చీర కట్టిన తర్వాత... "చాలా బాగుందే!" అంది శిరీష.


"ఫైనల్ గా చెప్పవే... ఎంత?"


"ఐదొందలు దాటుతుంది... పక్కా... ఫిక్స్ చేసేసుకో."


"ఐదొందలే..! అయితే ఇదే ప్యాక్ చెయ్యండి" అని జానకి చీర ఓకే చేసింది.


"ఈ ఐదొందలు, ఆరొందల గోల ఏమిటో?" అక్కడ ఒక సేల్స్‌మ్యాన్ మరొక సేల్స్‌మ్యాన్ తో అన్నాడు.


"ఫేస్‌బుక్‌ లో లైక్స్ అవి.. ఇప్పుడు ఇవే లోకం.."


"100 లైక్స్ ఇచ్చిన చీరేమో వెయ్యి రూపాయలు.. 500 లైక్స్ ఇచ్చిన చీరేమో మూడు వందలే" ఏమిటో ఈ వెర్రి అనుకున్నారు ఇద్దరు.


జానకి ఆ రూ.300 చీరను రూ.500 అనుకుని ఆనందంగా కొనేసింది. బిల్ కౌంటర్ దగ్గరకు వెళ్ళినప్పుడు..


"మేడమ్.. మీ బిల్ రూ.300" అంటూ బిల్ ఇచ్చాడు సేల్స్ మ్యాన్.


ఆ మాట వినగానే జానకి ఆశ్చర్యపోతూ, "అదేంటి? నా ఫ్రెండ్ శిరీష చీరల స్పెషలిస్ట్. తను చూసి ఇది రూ.500 దాటుతుంది అంది. మీరేంటి రూ.300 అంటున్నారు? డిస్కౌంట్ ఏమైనా ఉందా?" అని అడిగింది.


పక్కనే ఉన్న శిరీష జానకి నోరు నొక్కి, బిల్ కట్టి, అక్కడ నుంచి వేగంగా బయటకు లాక్కొచ్చేసింది.


బయటకు వచ్చాక...

"ఏంటి శిరీష! అంత మంచి చీరను రూ.300 కే ఇచ్చారు.. మనకే లాభం. నీ టేస్ట్ సూపర్!" అంది జానకి.


"!!!"


"అయినా షాప్ లో అంత కంగారు పడ్డావేంటి?" అని జానకి నిలదీసింది.


దానికి శిరీష నవ్వుతూ..

"షాప్ వాడు అంత తెలివి తక్కువ వాడేం కాదు.. నీకు చీర తక్కువకి ఇచ్చెయ్యడానికి. అసలు విషయం అది కాదు జానకి! నువ్వు చీర కట్టుకుని అడిగినప్పుడు నేను చెప్పింది దాని ధర కాదు. ఆ చీర కట్టుకుని నువ్వు ఫేస్‌బుక్‌ లో ఫోటో పెడితే వచ్చే లైక్స్ సంఖ్య! నీకు ఎలాగూ లైక్స్ అంటేనే ప్రాణం కదా.. అందుకే 500 లైక్స్ దాటుతాయి అన్నాను. నువ్వేమో ధర అనుకున్నావు!" అని నిజం చెప్పేసింది.


ఆ మాట వినగానే జానకి షాక్ తింది. కానీ వెంటనే స్మార్ట్ ఫోన్ తీసి, ఆ చీరతో సెల్ఫీ దిగి.. "నా బెస్ట్ ఫ్రెండ్ శిరీష సెలెక్ట్ చేసిన చీర.. కేవలం రూ.300 కే! ఎలా ఉంది ఫ్రెండ్స్?" అని క్యాప్షన్ పెట్టి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ఐదు నిమిషాల్లోనే ఆ పోస్ట్‌కి వంద లైక్స్ వరదలా వచ్చేసాయి.


అది చూసి జానకి మురిసిపోతూ, "ధర రూ.300 అయినా.. లైక్స్ మాత్రం రూ.500 రేంజ్ లో వస్తున్నాయి శిరీష! నువ్వు చెప్పింది నిజమే! అయినా మనకి కావాల్సింది రేట్ కాదు... లైక్స్" అంటూ సంబరపడిపోయింది.


శిరీష తన తల బాదుకుంటూ.. "దీని సోషల్ మీడియా పిచ్చి బాగా ముదిరింది. ఎలాగైతేనేం.. చీర కొనేసి, నా బుర్ర తినకుండా ఇంటికి నడిచింది.. అంతే చాలు!" అని మనసులో అనుకుంటూ నవ్వుతూ సాగిపోయింది.


సమాప్తం. 

***********


పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.



 తాత మోహనకృష్ణ గారి కొన్ని ఇతర రచనలు:


తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 




మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

తాత మోహనకృష్ణ

రచయిత పరిచయం:

Profile Link:

YouTube Playlist Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page