top of page
Original.png

ఎత్తుపల్లాలు

5 hours ago
3 min read

ఎత్తుపల్లాలు కథలో మోసాన్ని ఎదుర్కొని మళ్లీ విజయపథంలో నడుస్తున్న ధీరజ్

Yethupallalu - Telugu Emotional Story | Bhanupriya

ఎత్తుపల్లాలు - తెలుగు భావోద్వేగ కథ | భానుప్రియ

Published In manatelugukathalu.com On 10/10/2026


“ఎత్తుపల్లాలు” కథ ధీరజ్ అనే యువకుడి జీవితంలో ఎదురైన ప్రేమ, మోసం, కష్టాలు, విజయాలను ఆవిష్కరిస్తుంది.


ఆరడుగుల అజానుబావుడై, చూడచక్కని దేహదారుఢ్యంతో, చూడగానే 'అబ్బా ఎంత బాగున్నాడు!' అనిపించే రూపంతో ర్యాంపు పై అలా నడుచుకుంటూ వస్తుంటే ధీరజ్, ధీరజ్ అంటూ ఆ ప్రాంతమంతా మారుమోగిపోతుంది.


ఇక ధీరజ్ గతంలోకి వెళితే డబ్బుకు కొదవలేని ధనవంతుల ఇంట్లో పుట్టి విలాసవంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తుండగానే, తల్లిదండ్రుల మధ్య "నేను గొప్ప అంటే నేను గొప్ప" అనే అహం, డబ్బు విషయం కారణంగా మనస్పర్ధలు వచ్చి ఎవరికి వారు విడిపోయి, ధీరజ్‌ని పసివాడని కూడా జాలి లేకుండా వారి అహానికి వీధిపాలు చేయగా...


ఏ లోటు లేకుండా పెరిగిన ధీరజ్ ఒక్కసారిగా ఏమీ లేని అనాథగా మారి ఎన్నో కష్టాలను, ఎన్నో నిద్రలేని కాలి కడుపు ఆకలి కేకలను చవిచూశాడు.


అతని జీవన పయనంలో చేయని పని లేదు, పడని కష్టం లేదు. తన కష్టం ఫలితంగానే యవ్వనంలోకి అడుగుపెట్టగానే ఒక గొప్ప ఫ్యాషన్ కంపెనీని స్థాపించి కోట్లకు అధిపతిగా మారిపోయి, తనలాంటి ఎంతోమంది అనాథలుగా ఉన్న పిల్లలకు, అనాథాశ్రమాలకు సహాయం చేస్తూ, తన కంపెనీని నెంబర్ వన్ స్థానంలో నిలబెడతాడు.


"బెడ్ కాఫీ సార్" అంటూ సర్వెంట్ మాటలతో నిద్రలేచి, కాఫీ తాగి రెడీ అయ్యి ఆఫీస్‌కి వెళ్తాడు ధీరజ్.


"మే ఐ కమిన్ సార్" అని లోపలికి వచ్చి "గుడ్ మార్నింగ్ సార్" అంటూ తన చేతిలోని ఫైల్‌ని అందిస్తాడు తన మేనేజర్ మనోజ్...


"కొత్త పి.ఎ. అపాయింట్‌మెంట్ కదా!" అంటూ సంతకం పెట్టి "తాను రాగానే నన్ను కలవమను" అని చెప్పగా, మనోజ్ కొత్తగా జాయిన్ అయిన ప్రియను "బాస్‌ని కలవండి" అని ఛాంబర్ వైపు చూపించగా కొంత బెరుకుతో రూమ్‌లోకి వెళుతుంది ప్రియ.


ప్రియను చూడగానే మొదటి చూపులోనే ధీరజ్‌కు గుండెల్లో ఏదో అలజడి మొదలైంది...

"సార్... సార్..." అంటూ ప్రియ పిలుపుకు ధ్యాసలోకి వచ్చి "టేక్ యువర్ సీట్" అనగానే గబుక్కున కూర్చొని, చాలా కలివిడిగా, చలాకీగా సమాధానాలు చెప్పి, అతి తక్కువ కాలంలోనే చిన్నతనం నుంచి ప్రేమ, ఆప్యాయతలకు నోచుకోని ధీరజ్, ప్రియ చూపించే ప్రేమకు దాసోహమవుతాడు.


అతి తక్కువ సమయంలో ధీరజ్, ప్రియను వదిలి ఉండలేనంతగా ఒకటవుతారు... అలా నెల రోజులలోనే తన విషయాలు, ముఖ్యమైన ఆఫీస్ విషయాలు అన్నీ ధీరజ్ ప్రియతో పంచుకుంటాడు తన మనిషి అని...


అలా వారి ప్రేమ చిగురిస్తుండగా...


"ఈరోజు ముఖ్యమైన టెండర్ ఉంది, కలిసి వెళ్దాం" అని ప్రియకి ఫోన్ చేసి చెప్పగా, తాను రాలేనని "నువ్వు వెళ్లి రా!" అని చెప్పడంతో ధీరజ్ తన కారులో బయలుదేరుతాడు...


అక్కడికి వెళ్లిన ధీరజ్ టెండర్ కోల్పోవడం, "సార్ మీ ఆస్తులన్నీ, బ్యాంక్ బ్యాలెన్స్ అంతా వేరే అకౌంట్‌లోకి చేరిపోయాయి" అని కంగారుగా మనోజ్ ఫోన్ చేయగా...


ప్రియ తన ప్రత్యర్థితో కలిసి రావడంతో, ప్రియ నన్ను మోసం చేసిందని ధీరజ్ తెలుసుకొని...

"నువ్వు నన్ను మోసగించానని సంతోషపడుతున్నావు కానీ, నేను మోసపోయినందుకు నీ మీద ఎలాంటి కోపం రావడం లేదు.


ఎందుకంటే ఒక నెల రోజులలోనే నేను కోల్పోయిన తల్లిదండ్రుల ప్రేమను, ప్రియురాలి ప్రేమను నువ్వు నాకు చవిచూపించావు. ఇక కష్టాలు, మోసాలు అంటావా! అవి నా చిన్నతనంలోనే నన్ను కౌగిలించుకుని ఉన్నాయి.


నా జీవన పయనంలో ఇలాంటి ఎత్తుపల్లాలు ఎన్నో చూశాను కాబట్టి వాటి గురించి నాకు బాధ లేదు. ఎలా కష్టపడాలో, ఎలా పైకి రావాలో నాకు అన్నీ తెలుసు.


నేనేంటో నేను నిరూపించుకోగలను" అంటూ... "నెల రోజులలో నాకు నీ ప్రేమను అందించావు, దానికి బహుమతిగా..." అంటూ తన చేతి ఉంగరాలను, మెడలో ఉన్న బంగారు గొలుసును తీసి తలదించుకున్న ప్రియ చేతిలో పెట్టి తన దారిలో వెళ్తాడు..


మళ్లీ తన లక్ష్యసాధన దిశగా....



📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y



భానుప్రియ గారి కొన్ని ఇతర రచనలు:


భానుప్రియ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 




మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

 

భానుప్రియ

రచయిత్రి పరిచయం:

నేను కొత్త ప్రియాంక (భానుప్రియ) హైదరాబాద్ ఆరు సంవత్సరాల నుంచి కవితలు రాయడం ప్రారంభించినాను. తర్వాత కథలు రాయడం మొదలుపెట్టాను. ఒక మంచి కవయిత్రిగా రచయిత్రిగా నాకంటూ సాహితీ సామ్రాజ్యంలో ఒక పేజీ ఉండాలని , సమాజాన్ని జాగృతి పరిచే విధంగా నా కలం సాగిపోవాలనే తలంపుతో ముందుకు సాగిపోతున్నాను.🙏




Recent Posts

See All
నాన్న కోరిక

భర్త చివరి కోరికను నెరవేర్చేందుకు రంగి పడిన కష్టాలు, కొడుకు శేఖర్‌ను ఉన్నత విద్యావంతుడిగా తీర్చిదిద్దిన తల్లి త్యాగం ఈ కథలో హృదయాన్ని హత్తుకునేలా కనిపిస్తాయి. తల్లిదండ్రుల ప్రేమ, త్యాగం, విద్య విలువను

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page