top of page
Original.png

అమ్మ నాన్నల అద్భుత చిత్రకావ్యం

2 hours ago
9 min read

తల్లిదండ్రుల చిత్రాన్ని తాకుతూ కన్నీళ్లతో భావోద్వేగానికి గురైన అంధ వృద్ధుడు, పక్కన చిత్రకారుడు

Amma Nanala Adbutha Chitrakavyam | Telugu Emotional Story | Nallabati Raghavendra Rao

అమ్మ నాన్నల అద్భుత చిత్రకావ్యం | తెలుగు భావోద్వేగ కథ | నల్లబాటి రాఘవేంద్ర రావు

Published in manatelugukathalu.com on 08/10/2026


‘అమ్మ నాన్నల అద్భుత చిత్రకావ్యం’ తల్లిదండ్రులపై చెరిగిపోని ప్రేమను, జ్ఞాపకాల శక్తిని తెలిపే హృదయస్పర్శి మానవతా కథ.



(మానవతా విలువలు కలిగిన కథ)


శరదృతువు సంధ్య. అది ఆదిత్య స్టూడియో.


సాయంత్రం ఐదు గంటలు కావస్తోంది. ఆ సిటీలో అప్పటికే ఒక మోస్తరు వర్షం కురిసి వెలిసింది. సముద్రపు గాలిలో తేమ, మట్టి పరిమళం కలిసి స్టూడియో కిటికీల గుండా లోపలికి వస్తున్నాయి. బయట ఆకాశం ఇంకా దట్టమైన మబ్బులతో కమ్ముకుని ఉంది.


ప్రఖ్యాత చిత్రకారుడు ఆదిత్య తన పెద్ద మోడరన్ ఆర్ట్ స్టూడియోలో ఈజిలేట్ ముందు నిలబడి ఉన్నాడు. ఆయన బ్రష్ కదలికలలో ఒక ప్రశాంతత ఉంది. అంతలో ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ డోర్‌బెల్ మోగింది.


తలుపు తీసి చూసిన ఆదిత్యకు ఆశ్చర్యం వేసింది. రోజూ ఆయన వద్దకు వచ్చే కార్పొరేట్ ప్రముఖులు, ఆర్ట్ కలెక్టర్లు, విదేశీ పర్యాటకులు ఎవరూ కారతను. ఎదురుగా ఓ వృద్ధుడు.


వయసు డెబ్బై దాటి ఉంటుంది. ఒంటిపై చిరిగిపోయిన పాత కోటు, వర్షపు నీటితో తడిసిన బురద కాళ్ళు, వణుకుతున్న చేతులు, కళ్ళలో వర్ణించలేని ఒక తీవ్రమైన తపన. అతని భుజానికి నలిగిపోయిన ఒక పాత గుడ్డ సంచి ఉంది.


"నేను... నేను ఒక పెయింటింగ్ వేయించుకోవాలి బాబు... నా జీవితంలో దాచుకున్న ప్రతి పైసా కూడబెట్టి నీ ఫీజు తెచ్చాను." అంటూ ఆ వృద్ధుడు తన చొక్కా జేబులోంచి కొన్ని నలిగిపోయిన వంద నోట్లను తీసి వణుకుతున్న చేతులతో టేబుల్‌పై ఉంచాడు.


ఆదిత్య ఆ డబ్బును చూసి కదిలిపోయాడు. ఆయన గంభీరమైన స్వరాన్ని కాస్త మృదువుగా మార్చుకుంటూ, "కూర్చోండి తాతగారూ... డబ్బు గురించి తర్వాత మాట్లాడదాం. ఏం బొమ్మ వేయాలో చెప్పండి?" అని కుర్చీ చూపించాడు.


వృద్ధుడు కుర్చీలో కూర్చోకుండా తన గుడ్డ సంచిలోని ప్లాస్టిక్ కవరులోంచి జాగ్రత్తగా మడతలు విప్పిన ఒక పాత సగం చిరిగిపోయిన డ్రాయింగ్ షీట్‌ను బయటికి తీసి ముందుకు నెట్టాడు.


అది చూసి ఆదిత్య నివ్వెరపోయాడు. అది ఒక ఐదేళ్ల చిన్న పిల్లాడు రంగురంగుల క్రేయాన్స్‌తో గీసిన గజిబిజి బొమ్మలా ఉంది. అందులో ముగ్గురు మనుషులున్నారు: అమ్మ, నాన్న, ఆ చిన్న పిల్లాడు. కాగితం మూలన అస్పష్టంగా పిల్లవాడి చేతిరాతలో "అమ్మానాన్నకు ప్రేమతో..." అని రాసి ఉంది.


"ఈ బొమ్మలో ఉన్న అమ్మ, నాన్నలను నాకు లైఫ్‌సైజ్ ఆయిల్ పెయింటింగ్‌లా వేసివ్వాలి బాబు." అన్నాడు ఆ వృద్ధుడు గద్గద స్వరంతో.


ఆదిత్య నవ్వలేక ఏడ్వలేక, "తాతగారూ! ఇది చిన్నపిల్లల గీత. ఇందులో ముఖాల రూపురేఖలు లేవు. ఆకారం అసలే లేదు. కేవలం కొన్ని రంగుల గీతలు, మొద్దుబారిన ఆకారాలు మాత్రమే ఉన్నాయి. ఈ గీతలను చూసి నేను మనుషుల నిజమైన ముఖాలను ఎలా గీయగలను? వాళ్ల ఫోటో ఏదైనా ఉంటే ఇవ్వండి!" అంటూ అడిగాడు ఆదిత్య.


ఆ వృద్ధుడు కాస్త భయపడుతూ బేలగా ముఖం పెట్టి చూశాడు ఆదిత్య వైపు.


"కంగారు పడకండి, మీ వర్క్ నేను చేస్తాను. అయితే కొంచమైనా ఆధారం కావాలి కదా. ఎంత నలిగిపోయినా పర్వాలేదు. ముఖాలు అస్పష్టంగా ఉన్నా పర్వాలేదు నేను చేసి ఇవ్వగలను." అన్నాడు మళ్ళీ ఆదిత్య.


తాతగారు చిన్నగా నిట్టూర్చారు. ఆయన చూపు ఆ కాగితంపైనే నిలిచిపోయింది. "ఫోటో లేదు బాబు. ఒకవేళ ఉంటే నేను నీవద్దకు ఎందుకు వస్తాను? కానీ నా మాటలు విను.


నా కళ్ళతో చూడు... నీ కుంచెతో ప్రాణం పోయి. అప్పుడు నీకు నేను అడిగిన చిత్రం అద్భుతంగా తప్పకుండా వస్తుంది" అన్నాడు చాలా ప్రశాంతంగా, ప్రేమపూర్వక వదనం పెట్టి ఆ వృద్ధుడు.


అంతే... అక్కడినుంచి ఆ స్టూడియోలో ఒక అద్భుతమైన అసహజమైన కల్పన ప్రయాణం మొదలైంది.


తాతగారు ఒక్కో మాట చెప్తుంటే ఆదిత్యలో చిత్రకారుడు మేల్కొన్నాడు.


"ఆమె ముఖం శరదృతువు వెన్నెలలా ఉంటుంది బాబు. కళ్ళలో కొండంత ప్రేమ... ఎల్లప్పుడూ ఇతరుల కోసం పరితపించే మనసు ఆమెది. ఇక అతను... నల్లటి దట్టమైన కనుబొమ్మలతో కష్టాన్ని నవ్వుతూ స్వీకరించే మహా ధీరుడు. ఇద్దరి నవ్వులో ఒక స్వచ్ఛమైన అమాయకత్వం ఉంటుంది."


తాతగారు అలా వర్ణిస్తుంటే... ఆదిత్య చేతిలోని బ్రష్ దానంతట అదే కదలడం ప్రారంభించింది. ఎవరో వెనుక ఉండి నడిపిస్తున్నట్లుగా ఆ రూపాలు కాన్వాస్‌పై నిజంగానే మెదిలినట్లనిపించింది.


కానీ, ప్రతిరోజూ సాయంత్రం ఆ వృద్ధుడు స్టూడియోకి వచ్చి ఆ పెయింటింగ్ పరిశీలించేవాడు. ఆయన చెప్పే చిన్న చిన్న మార్పులు ఆదిత్యకు దిగ్భ్రాంతి కలిగించేవి.


"అమ్మ నుదుటిపై ఆ చిన్న మచ్చ మరిచావు బాబు... కొద్దిగా కుడివైపు ఉంటుంది."

వివరించాడు ఒకరోజు.


"నాన్న కళ్ళ కింద ఆ అలసట రేఖలు ఇంకా రాలేదు... ఆయన్ని రోజూ శ్రమించే వ్యక్తిలా చూపించు.".. ఇలా చాలా భావోద్వేకంగా చెప్తుండేవాడు ఆ తాతగారు మరో రోజు.


ఆదిత్యకు వెన్నులో వణుకు పుట్టేది. అసలు ఫోటోనే లేని వ్యక్తుల నుదుటి మచ్చ, కళ్ళ కింద రేఖలు ఈ వృద్ధుడికి అంత ఖచ్చితంగా ఎలా గుర్తుంటాయి? పైగా ఆ వర్ణన వింటుంటే వాళ్ళు ఈ ప్రపంచానికి చెందిన మనుషుల్లా కాకుండా ఆకాశంలోంచి ఊడిపడ్డ దేవతల కథలా అనిపించింది.


"ఏంటి తాతగారూ... మీరు చెప్తున్నది ఏదో అభూత జానపద కథలా ఉందే తప్ప నిజమైన మనుషుల వర్ణనలా లేదు. ఇది అసలు సాధ్యమేనా?" అని ఆదిత్య ఒకరోజు విసుగ్గా, ఆశ్చర్యంగా అడిగాడు.


వృద్ధుడు మృదువుగా నవ్వి... "చదివేవాడికి, వినేవాడికి ఇది అభూత కల్పనలాగే ఉంటుంది బాబు. కానీ అనుభవించినవాడికి ఇదే జగత్సత్యం. గీయి... ఇంకొక్క రోజులో పూర్తవుతుంది." అన్నాడు.


పది రోజుల అవిశ్రాంత శ్రమ తర్వాత... ఆ పెయింటింగ్ పూర్తయింది.


పది రోజుల అనంతరం... ఆ కాన్వాస్ వైపు చూసిన ఆదిత్య షాక్ అయ్యాడు. అక్కడొక దివ్యమైన దంపతుల రూపం ఉంది. వాళ్ళ కళ్ళలోంచి ప్రేమ వర్షిస్తున్నట్లుంది. అది కేవలం పెయింటింగ్ కాదు... ప్రత్యక్షంగా ఆ మనుషులు స్టూడియోలో నిలబడ్డట్లే ఉంది.


అసలు ఇది తన చేతులతో తను గీసిన బొమ్మేనా? ఎలాంటి ఆధారం లేకుండా కేవలం మాటలతో ఇటువంటి జీవం ఉన్న చిత్రం వేయడం తన జీవితంలోనే అతిపెద్ద వింతగా భావించాడు ఆదిత్య.


మరుసటి రోజు సాయంత్రం తాతగారు వచ్చారు... కాన్వాస్‌పై ఉన్న చిత్రాన్ని తాకాడు. అతని కళ్ళలోంచి నీళ్లు ఆనందంతో, ఆవేదనతో ఆగకుండా కారిపోతున్నాయి. ముడుచుకుపోయిన తన వణుకుతున్న చేతులతో ఆ పెయింటింగ్‌ను నిమిరాడు.


"అమ్మా... నాన్నా..." అని వెక్కివెక్కి విలపించాడు... చాలాసేపు గుక్క తిప్పుకోకుండా అలసట వచ్చేవరకు రోదించాడు.


ఆదిత్య తట్టుకోలేకపోయాడు. ఇదేమిటి ఈ ముసలాయన ఆ పెయింటింగ్ వేసిన వారి ఫోటోలు చూసి "అమ్మానాన్న" అని పిలుస్తూ ఏడుపిస్తాడేమిటి... అంటూ అర్థం చేసుకోలేకపోయాడు.


"తాతగారూ! ఏమిటిది? అసలు మీరెవరు? ఈ బొమ్మలు ఏమిటి? ఇవి ఎవరివి? ఇక నా ఉత్కంఠను దాచలేను. నాకు నిజం చెప్పండి. అసలు మీరు దాచిన ఆ కథ ఏమిటి? ఈ ఫోటోలో ఉన్న దంపతులు మీకేమవుతారు? ముఖ రూపాలే లేని చిన్న పిల్లల బొమ్మను చూపిస్తూ అంత ఖచ్చితంగా వీళ్ళ రూపాన్ని ఎలా వర్ణించగలిగారు? ఇది నాకు ఒక మాయలా, గారడీలా అనిపిస్తోంది!" అన్నాడు చాలా చిత్రంగా ముఖం పెట్టి ఆదిత్య.


తాతగారు నెమ్మదిగా కళ్ళు తుడుచుకుని ఆ పాత చిరిగిన డ్రాయింగ్ షీట్‌ను అతి జాగ్రత్తగా తీసి... చూపిస్తూ...

"బాబు.. దీని ఆధారంగా నువ్వు అద్భుత ప్రాణమున్న చిత్రంగా మలచిన ఈ చిన్నపిల్లలు గీసినట్టు ఉన్న బొమ్మను గీసింది ఎవరో తెలుసా? నేనే...


60 ఏళ్ల కిందట మాట. అప్పుడు నా వయసు ఐదేళ్ళు. ఐదేళ్ల వయసులో మా అమ్మానాన్నల కోసం నేను గీసిన బొమ్మ ఇది. దాని కిందే నా చేతితో... 'అమ్మానాన్నకు ప్రేమతో...' అని అప్పుడే వచ్చీరాని అక్షరాలు రాశాను చూడు..." అంటూ ఆదిత్యకు వేలు పెట్టి చూపించాడు.


ఆదిత్య కనుబొమ్మలు ముడిపడ్డాయి. గుండె వేగం పెరిగింది. "మీరు గీసారా? 60 ఏళ్ల క్రితం మీరే గీసిన ఓ గీతల బొమ్మ నాకు చూపించి నా చేత ప్రాణమున్న మీ తల్లిదండ్రుల రూపాన్ని వేయించుకున్నారు.


సరే అప్పుడు ఎలాగో గీసేశారు, బాగానే ఉంది. మరి వాళ్ళ రూపం మీకెలా ఇప్పుడు ఐదు పుష్కరాల తర్వాత, ఇంచుమించు మీ డభై ఏళ్ల వయసు తర్వాత కూడా ఎలా గుర్తుండిపోయింది? వాళ్ల ప్రతి ఆనవాళ్ళు నాకు చాలా గుర్తుగా చెప్పి ఈ చిత్రాలు వేయించుకున్నారు, ఇది ఎలా సాధ్యం?" విచిత్రంగా ముఖం పెట్టి అడిగాడు ఆదిత్య.


తాతగారు తలదించుకుని గొంతు పూడుకుపోతుండగా అసలు నిజం చెప్పాడు...

"నాకు ఆరేళ్ళ వయసున్నప్పుడు ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో నా రెండు కళ్ళు పోయాయి బాబు. ఈ 60 ఏళ్లుగా నేను వెలుగు చూడలేదు, చీకటిలోనే బతుకుతున్నాను..."


ఆదిత్య గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పని అయింది. షాక్‌తో ఆయన కాళ్ళు చచ్చుబడిపోయినట్లయిపోయాయి. నోటమాట రాలేదు. స్టూడియోలోని గడియారం టిక్‌టిక్ శబ్దం మినహా అక్కడ నిశ్శబ్దం తాండవించింది.


తాతగారు కన్నీళ్లతో కొనసాగించారు... "కళ్ళు పోకముందు, ఐదేళ్ల వయసు వరకు నా కంటిపాపల్లో ముద్రపడిపోయిన నా అమ్మానాన్నల రూపం అది. కొన్నేళ్ళకు అమ్మానాన్న కూడా గతించిపోయారు.


చూపు పోయినా నా మనోనేత్రంలో వాళ్ళ రూపం ఒక్క క్షణం కూడా చెరిగిపోలేదు. గడిచిన అరవై ఏళ్లుగా రోజూ కళ్ళు మూసుకుని నా మనస్సులో పదే పదే చూసుకున్న రూపాన్నే నీకు వర్ణించి చెప్పాను.


కళ్ళు ఉన్నవాళ్లు ఫోటోల్లో చూస్తారు బాబు... కళ్ళు లేనివాడు గుండెల్లో దాచుకుంటాడు."

వణుకుతూ చెప్పాడు ఆ వృద్ధుడు చెమర్చిన కళ్ళను తన భుజం మీది చిరిగిపోయిన టవల్‌తో తుడుచుకుంటూ.


ఆదిత్య కాళ్ళు వణికాయి. చూపు లేని ఒక వృద్ధుడు తన గుండెల్లో అరవై ఏళ్లుగా భద్రంగా దాచుకున్న 'ప్రేమ బొమ్మ' ఇది! "అదృశ్య చిత్రం" ఆ దేవతామూర్తుల చిత్రాలు పూర్తిగా వేయడం పూర్తయిన తర్వాత ఒక ఊహాజనిత కల్పనలా అనిపించిన ఆ వర్ణన వెనుక ఉన్నది ఒక అంధుడి పవిత్రమైన నిఖార్సయిన జ్ఞాపకం అనే నిజం తెలిసాక ఆదిత్య కళ్ళలోంచి వేడి నీళ్లు సుర్రున కారాయి.


తాతగారు ఆ పెయింటింగ్‌ను అత్యంత ప్రేమగా గుండెలకు హత్తుకుని ఆదిత్య వైపు చూశాడు.


"అమ్మానాన్నలు నాకు జన్మనిచ్చారు బాబు... కానీ నువ్వు నీ చేతి కుంచెతో వాళ్ళని నాకు మళ్ళీ తిరిగి ఇచ్చావు. ఎవరు గీయలేకపోయిన చిత్రాన్ని నాకు గీసి ఇచ్చావు. నేను స్పర్శిస్తే చాలు ప్రకృతిని చూడలేని నా కనుపాపలకు ఇప్పుడు వాళ్ళు నాకు స్పష్టంగా కనిపిస్తున్నారు.


నువ్వు కూడా నా దృష్టిలో దేవుడివేనయ్యా..." అని నమస్కరిస్తూ... ఆ దివ్యమైన పెయింటింగ్‌ను హత్తుకుని చిరుచినుకులు పడుతుండగా తన దగ్గర ఉన్న చిరిగిన టవల్‌తోనే ఆ చిత్రాన్ని కప్పి చీకట్లో మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఆ వృద్ధుడు.


ఆదిత్య... ఆ స్టూడియో చీకటి వెలుగులో అలా కదలకుండా నిలబడిపోయాడు.


లోకానికి తాను గొప్ప చిత్రకారుడననే గర్వం ఉండేది. కానీ ఆ వృద్ధుడి నిస్వార్థమైన ప్రేమ, అంతులేని జ్ఞాపకాల శక్తి ముందు... తన కుంచె, తన కళ ఎంత చిన్నదైపోయాయో అతనికి అర్థమైంది.


ఆ చీకటి సాయంత్రం... అతనికి జీవితపు అసలుసిసలు అర్థాన్ని నేర్పింది.


"చూపున్న కళ్లకు కనిపించేది రూపమే కావచ్చు కానీ ప్రేమ ఉన్న హృదయానికి కనిపించేది రూపంతో నిమిత్తం లేని దైవత్వం. జ్ఞాపకాలు చెరగనివి, అనుబంధాలు మరణం లేనివి." అన్న ఒక తాదాత్మ్య అనుభూతి చెందాడు ఆదిత్య.


నమస్కారం

పై కథ ఎవరి కథలకు కాపీ కాదని హామీ ఇస్తున్నాను.


సమాప్తం



📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y


నల్లబాటి రాఘవేంద్ర రావు గారి కొన్ని ఇతర రచనలు:




నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 




మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


నల్లబాటి రాఘవేంద్ర రావు



నల్లబాటి రాఘవేంద్ర రావు


నల్లబాటి రాఘవేంద్ర రావు

రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ముందుగా  " మన తెలుగు కథలు"  నిర్వాహకులకు నమస్సులు..

"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.

రచయిత తన  గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.

పునాది....

-----------

ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు  ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం  నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద  దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.


ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా..   రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.


తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో

టెన్త్ క్లాస్ యానివర్సరీ కి  15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.

అప్పుడే నేను రచయితను కావాలన్న

ఆశయం   మొగ్గ తొడిగింది.

నా గురించి..

---------------

50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.

450  ప్రచురిత కథల రచన అనుభవం.

200 గేయాలు  నా కలం నుండి జాలువారాయి

200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి

20 రేడియో నాటికలు ప్రసారం.

10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.

200 కామెడీ షార్ట్ స్కిట్స్

3  నవలలు దినపత్రికలలో


" దీపావళి జ్యోతి "అవార్డు,

"రైజింగ్స్టార్" అవార్డు

" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.


ప్రస్తుత ట్రెండ్ అయిన  ఫేస్బుక్ లో  ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు  నాకథలు,  కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..

రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం  కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!

ఇదంతా ఒక్కసారిగా  మననం చేసుకుంటే...  'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.

ఇక నా విజయ ప్రయాణగాధ....

------+------------------------------

పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన  నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ  నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!


తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ...   నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి  ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి  వారైన  సినీ గేయరచయిత

" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.


1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి  కథ.


2. రేడియో నాటికలు  గొల్లపూడి మారుతీ రావు    గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.


3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర"  ద్వితీయబహుమతి కథ..  "డిసెంబర్ 31 రాత్రి"


4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ


5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ


6.  దీపావళి కథలు పోటీలో  "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.


7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ


8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"


9. "స్వాతి "   తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."


10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్  "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"


11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం  కురిసింది"


12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ


13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..


14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం"  న్యాయనిర్ణేత   జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.


15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .


16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ

" ఇంద్రలోకం".


17.  కొమ్మూరి సాంబశివరావు స్మారక  సస్పెన్సు కథల పోటీలో  "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.


18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ "  గాంధీ తాత"  రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.


19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్  రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.


20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".


21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".


22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి  కథ "ఆలస్యం అమృతం విషం"


23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ  "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.


24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.


25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.


26.  రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ  పోటీ లో ఎన్నికైన కథ.


27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".


28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.


29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.


30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం"  వారం వారం 30 కథలు.


31. "కళా దర్బార్"  రాజమండ్రి.. రాష్ట్రస్థాయి  కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ  కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.


32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన  "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి"    కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు  ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.


33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో  సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో  ప్రథమ బహుమతి  పాటకు వారి నుండి  పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక   రంగస్థల ప్రదర్శనలు పొందడం.


34. విశేష కథలుగా  పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు

  నలుగురితోనారాయణ

  కొరడా దెబ్బలు

  అమృతం  కురిసింది.

  వైష్ణవమాయ

  ఐదేళ్ల క్రితం

  ఇంద్రలోకం

  బిందెడు నీళ్లు

  చంద్రమండలంలో స్థలములు అమ్మబడును

  డిసెంబర్ 31 రాత్రి

  మహాపాపాత్ముడు

 

35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.


ప్రస్తుతం...


1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం


2. పరిషత్ నాటికలు జడ్జిగా..


3.  కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..

సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.


4. ..  4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.


5. ఒక ప్రింటెడ్ పత్రిక  ప్రారంభించే ఉద్దేశ్యం.


భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.

కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.

కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.

కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.

మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.

నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.

నల్లబాటి రాఘవేంద్ర రావు 


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page