top of page

అమ్మ

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.





Video link

'Amma' written by Bhagavathula Bharathi

రచన : భాగవతుల భారతి


తల్లి ప్రేమకు అంతు ఉండదు.

పిల్లలు కష్ట పడుతుంటే అమ్మ కదిలి వస్తుంది.

కాపాడుతుంది.

తల్లి ప్రేమ గురించి భాగవతుల భారతి గారు ఈ కథలో చాలా చక్కగా రాశారు.


"రేణుకా! టిఫిన్ కూడా తినకుండా వచ్చేసావేమే!?" గుమిగూడిన పదిమంది కుర్రాళ్ళనీ తోసుకుంటూ, వచ్చి రేణుక పక్కన కూర్చుంది విశాలాక్షి.

బిత్తరచూపులు చూసింది రేణుక.

విశాలాక్షి రేణుకను చూసి కన్నుకొట్టి, "మాట్లాడవేం" అని గదమాయించింది.

రేణుక సంభాళించుకుని, " అమ్మా! బస్ మిస్సవుతుందనీ... " నసిగింది.

"ఇదికాకపోతే ఇంకోబస్సు. అంత తొందరెందుకూ " అంది విశాలాక్షి.

"నీకేం నువ్వు ఎన్నయినా చెబుతావ్! ఒక్కరోజు క్లాస్ మిస్సయితే, పెండింగ్ వర్కు

ఎంతుంటుందో తెలుసా? " బుంగమూతి పెట్టింది రేణుక.

"ఐతే మాత్రం...? 'ఓ బాబూ! నువ్వు మీ అమ్మమాట వినకుండా, ఇలాగే వచ్చేస్తావా'? "

అని అడిగింది విశాలాక్షి అక్కడే కదలకుండా నుంచున్న ఓ కుర్రాడితో.


ఆ అపరిచిత కుర్రాడు తెల్లముఖం వేసుకుని పక్కనున్న స్నేహితుణ్ణి చూసాడు.


అదిగమనించి విశాలాక్షి " అంటే నువ్వూ అంతేనా? మీరే కాదులే ఈ కాలం పిల్లలంతా అంతే! అమ్మ మనసు మీకెలా తెలుస్తుందీ?! మీకడుపులు నింపటానికి మేంపడే ఆరాటం అర్ధమయితే, మీరిలా ప్రవర్తించరు. "

విశాలాక్షి వాక్ప్రవాహం సాగుతూ, ఏదో మాట్లాడుతూ ఉండగానే, అప్పటివరకూ అక్కడే నిలబడి ఉన్న కుర్రాళ్ళు మెల్లగా జారుకుని, ఆడవాళ్లు రావటం మెుదలయింది.


అదో సిటీ బస్ స్టాప్ . బస్టాండులో బయలుదేరిన బస్సు అక్కడక్కడా ఆగుతూ వచ్చి, ఈ బస్ స్టాప్ దగ్గర కొచ్చేటప్పటికి లేటయి, కాలేజీలన్నీ చుడుతూ, ఎలాగోలా గమ్యం చేరుతుంది. ఆ స్టాప్ లో ఈ రోజు జనసంచారం అంతంత మాత్రంగానే ఉండటం వల్ల

కుర్రాళ్ళ ఆకతాయితనానికి ఆలవాలమైంది.


ప్రయాణికులంతా ఒక్కొక్కరూ వచ్చి చేరటంతో, ఆ ప్రాంతమంతా కిటకిటమెుదలై

వారి సంభాషణ వింటున్నారంతా.


"ఏం పిల్లలో ఏంటో, ఉరుకులూ పరుగులతో తినటానికి సంపాదించుకోవడానికి, తినకుండా పరుగెత్తటం... నాకు విచిత్రంగా తోస్తుంది.. అంది విశాలాక్షి చేతులు తిప్పుకుంటూ.


"అవునండీ! మా బాబు కూడా అంతే. నేనెంత చెప్పినా, అర్ధరాత్రిలో గానీ ఇంటికి జేరడు" ఓ ఆవిడ చెబుతోంది.


"అందుకే ఆడపిల్లలను ఓ తీరుగ మెుగపిల్లలను ఓ రీతిగ పెంచబట్టే, ఇన్ని అరాచకాలూ .. టైంకి ఇంటికిరాని ఆడపిల్లలను ఎలా నిలదీస్తున్నామో, మెుగపిల్లలనూ, అలాగే నిలదీస్తే, సమాజం వేరేగా ఉండేదేమో! " ఓ అక్క తీర్మానం.


ఇలా ఒకరి సంభాషణలో ఒకరు పాలుపంచుకుంటూ ఆడవాళ్ళంతా నిలబడి ఉండగా ,

విశాలాక్షి పైటచెంగుతో కళ్ళు ఒత్తుకోటం చూసి, "ఏమయిందమ్మా " అనడిగారు చుట్టూ ఉన్నవాళ్లు.


"ఇదిగో ఇప్పుడు మనం వచ్చేముందు ఇక్కడే నిలబడ్డ పోకిరీల్లాంటి వారివల్లే నా కూతురు అన్యాయం ఐపోయింది.... " అంటూండగానే విశాలాక్షి ఎక్కాల్సిన

బస్సు వచ్చింది.


"నువ్వు జాగ్రత్తగా వెళ్ళమ్మాయ్" వెనుదిరిగి రేణుక అనబడే ఆ అమ్మాయికి చెప్పి, ఏడుస్తూనే బస్ ఎక్కేసింది విశాలాక్షి.


తెల్లముఖం వేసుకుని చూసారంతా, రేణుక అనబడే ఆ అమ్మాయిని.


"అదేమిటీ! ఆమె మీ అమ్మకాదా? మరి ఇందాకట్నించీ.... "


"ఆమె మా అమ్మకాదు. నేనొక్కదాన్నే అక్కడ కూర్చుని ఉంటే ఎవరో పదిమంది కుర్రాళ్ళు నా చుట్టూ చేరి, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. నేను ఏమీ అనలేక ఏడుస్తుంటే, ఎక్కడినుంచో ఆమెవచ్చి, 'రేణుకా' అని పిలుస్తూ నన్ను రక్షించింది.


నేనూ అమ్మా! అంటూ దగ్గరకు జరిగాను. నాపేరు రేణుక కాదు, విశ్వేశ్వరి " అంది.


"అదావిషయం! అమ్మ ఎవరికైనా అమ్మేగా!

ఇంకోసారి నిరూపించింది ఆ అమ్మ" నిట్టూర్చారంతా .

///////////////

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం : నావివరములు.... పేరు భాగవతుల భారతి Double M.A., B. Ed భర్త... శ్రీనివాస్ గారు (లెక్చరర్) వృత్తి... గృహిణి, నిత్యాగ్నిహోత్రము, వేదాధ్యయనము, స్వాధ్యాయం

ప్రవృత్తి... రచనలు.. పద్యాలూ, వ్యాసాలు, కథలు, కవితలు, వచనకవితలు.

ప్రచురణలు.... అనేక ప్రముఖ పత్రికలలో

బహుమతులు... ప్రైజ్ మనీ తో కూడిన అనేక బహుమతులు.


2 commentaires


Mana Telugu Kathalu
Mana Telugu Kathalu
22 déc. 2021

gsn sharma • 6 hours ago

కథ బాగుంది భారతి గారూ👌👍💐

J'aime

Mana Telugu Kathalu
Mana Telugu Kathalu
22 déc. 2021

MOuli nidumolu • 1 hour ago

హ్రృద్యంగా .. చాలా బావుంది

J'aime
bottom of page