అపరాధ పరిశోధన - పార్ట్ 15
- Seetharam Kumar Mallavarapu
- 3 days ago
- 6 min read
#MallavarapuSeetharamKumar, #మల్లవరపుసీతారాంకుమార్, #అపరాధపరిశోధన, #AparadhaParisodhana, #TeluguSuspenseStories, #TeluguCrimeStory, #TeluguDetectiveStory, #TeluguInvestigativeJournalism, #Apana, #అపన

Aparadha Parisodhana - Part 15 - New Telugu Web Series Written By Mallavarapu Seetharam Kumar Published In manatelugukathalu.com On 05/07/2025
అపరాధ పరిశోధన - పార్ట్ 15 - తెలుగు ధారావాహిక
రచన, కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కొత్తగా ఎస్ పీ గా బాధ్యతలు చేపట్టిన దీక్షిత్, చేరిన రెండోరోజే ప్రతిపక్ష నాయకుడు శివరాం శర్మ హత్య కేసు పరిశోధించాల్సి వస్తుంది. హత్య జరిగిన కొద్ది గంటల్లోనే ఆ కేసు తాలూకు నిందితులు దొరికినట్లు వార్త వస్తుంది. ఆ వార్త విని ఆనంద పడేలోగా, ముందురోజే పరిచయమైన శివరాం శర్మ గారి మేనకోడలు, యూట్యూబర్ నీతూ శర్మ పైన హత్యా ప్రయత్నం జరిగినట్లు తెలిసి దిగ్భ్రాంతి చెందుతాడు.
దీక్షిత్ ను చంపడం కోసం దాముకు సుఫారి ఇచ్చే ఏర్పాట్లు జరుగుతాయి. ఆ హత్యకు జాఫర్ ను ఉపయోగించు కోవాలనుకుంటాడు దాము. హంతకుడు రంగా, మునావర్ ను కాంటాక్ట్ చేస్తాడు. మరీ ఒత్తిడి వస్తే జాఫర్ నియమించినట్లు చెప్పమంటాడు మునావర్.
రెండో విడత విచారణలో నిందితులు తమను దాము నియమించినట్లు అంగీకరిస్తారు. దీక్షిత్ ఇంటికి డ్రైవర్ కోదండం సహాయంతో ఏసీ టెక్నీషియన్ లాగా వస్తాడు జాఫర్. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం దీక్షిత్ ను రబ్బర్ బులెట్ తో కాలుస్తాడు జాఫర్. అవి నిజం బులెట్ లు అనుకోని దీక్షిత్ కు అడ్డం వస్తుంది నీతూశర్మ.
ఆమెను తీసుకొని శివరాం శర్మ ఇంటికి బయలుదేరుతాడు దీక్షిత్. దారిలో యాక్సిడెంట్ చేసి, దీక్షిత్ ను చంపాలని ప్లాన్ చేస్తారు. కానీ ఒక బుల్ డోజర్ ను కవర్ గా వాడుకుని తప్పించుకుంటాడు దీక్షిత్. శివరాంశర్మ గారి ఇంటి దగ్గర తులసీనాథ్ అనే వ్యక్తి దీక్షిత్ ను కలుస్తాడు. తాము ఉన్న చోటికి పోలీస్ కార్ రావడంతో దాము, మునావర్ లు అక్కడి నుండి పారిపోతారు. మోనా, లూసీలను తీసుకురమ్మని మునావర్ ను పంపుతాడు దాము.
గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అపరాధ పరిశోధన - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అపరాధ పరిశోధన - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అపరాధ పరిశోధన - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అపరాధ పరిశోధన - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అపరాధ పరిశోధన - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అపరాధ పరిశోధన - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అపరాధ పరిశోధన - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అపరాధ పరిశోధన - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అపరాధ పరిశోధన - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అపరాధ పరిశోధన - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అపరాధ పరిశోధన - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అపరాధ పరిశోధన - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక అపరాధ పరిశోధన - పార్ట్ 15 చదవండి..
జేబులోంచి ఫోన్ తీయబోయాడు మునావర్. ఆ చేతి మీద లాఠీతో బలంగా కొట్టాడు సిఐ మురళి. చెయ్యి విదిలించుకుంటూ విలవిలలాడేడు మునావర్.
"దాము ఎక్కడున్నాడు చెప్పు మునావర్" అడిగాడు మురళి.
అంత బాధలోనూ చిన్నగా నవ్వాడు మునావర్. “ఇంత మాత్రానికే చెప్పేస్తే నేను మునావర్ ఎందుకు అవుతాను? నన్ను నమ్మిన బంటుగా దాము అన్న ఎందుకు పెట్టుకుంటాడు?" అన్నాడు.
అతనిని మళ్లీ కొట్టబోయి విరవించుకున్న మురళి దీక్షిత్ కు కాల్ చేశాడు. కాల్ లిఫ్ట్ చేయగానే "సార్, మీరు ఊహించింది కరెక్ట్. మునావర్ని ఇక్కడికి పంపించాడు దాము" అని చెప్పాడు.
"అతను చాలా డేంజర్. కాళ్లు చేతులు కట్టేసి ఉంచు. దాము ఎక్కడ ఉన్నాడో అడిగి చూడు. నాకు తెలిసి అతను సమాధానం చెప్పడు .నేను మరో 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను." అన్నాడు దీక్షిత్.
"మీరు చెప్పింది నిజమే సార్.వీడు అంత తేలిగ్గా చెబుతానా అంటూ ఛాలెంజ్ చేస్తున్నాడు" అని చెప్పి కానిస్టేబుల్స్ తో ఇతన్ని కుర్చీలో కూర్చోబెట్టి కాళ్ళు చేతులు కదలకుండా కట్టేయండి" అని చెప్పాడు. కడుతున్నంత సేపు రివాల్వర్ ను మునావర్ వంకే గురిపెట్టి ఉన్నాడు మురళి.
చెప్పినట్లుగానే 10 నిమిషాల్లో అక్కడికి వచ్చాడు దీక్షిత్.
"తప్పు చేస్తున్నారు ఎస్పీ గారు.. పాముతో చెలగాటమాడుతున్నారు" అన్నాడు మునావర్.
"ఈ పాము నోట్లో గుడ్డలు కుక్కండి. బుస కొట్టడం మాని కేకలు పెడుతోంది" అన్నాడు మురళి.
కానిస్టేబుల్స్ తో పాటు మునావర్ కూడా దీక్షిత్ వంక చూశాడు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో దీక్షిత్ వారిస్తూ ఉంటాడు. కానీ ఇప్పుడు మౌనంగా ఉండడంతో కానిస్టేబుల్స్ మునావర్ నోటిలో గుడ్డలు కుక్కి టేప్ అంటించారు. దీక్షిత్ మునావర్ కు దగ్గరగా వచ్చాడు.
"చూడు.. నీ కేకలు బయటకు వినపడకూడదని నోట్లో గుడ్డలు కుక్కలేదు. కొంతసేపు అడ్డు తగలకుండా మేము చెప్పేది వింటావని అలా చేసాము. దయచేసి పది నిమిషాలు మాకు సహకరించు" అన్నాడు.
చేసేదేమీ లేక సరేనన్నట్లు తల ఊపాడు మునావర్.
"మోనా గారు.. మీరు ఒకసారి బయటకు వస్తారా" ఒక గది వంక చూస్తూ పిలిచాడు దీక్షిత్.
వెంటనే మోనా బయటకు వచ్చి దీక్షిత్ కు, మురళికి విష్ చేసింది. తర్వాత తన చేతిలో ఉన్న మొబైల్ ను అతనికి అందించింది. ఆశ్చర్యంగా చూస్తున్నాడు మునావర్.
ఇదేమిటి.. మోనా మేడం పోలీసులతో చేరిపోయిందా.. అర్థం కానట్లు చూస్తున్నాడు.
ఆ ఫోన్ లో ఉన్న వాయిస్ క్లిప్ ను ప్లే చేశాడు దీక్షిత్.
వీళ్లను పిలుచుకు రమ్మని మునావర్ ను పంపాక హైడింగ్ స్పాట్ కు వెళ్తూ దాము చేసిన కాల్ అది.
దాము మోనాకి కాల్ చేసి "డార్లింగ్, నాకోసం పోలీసులు తిరుగుతున్నారు. సీక్రెట్ హైడింగ్ స్పాట్ కు వెళ్తున్నాను. మునావర్ను అక్కడికి పంపిస్తున్నాను. నువ్వు, లూసీ అతనితో కలిసి వచ్చేయండి. కొద్ది రోజులు రహస్యంగా ఉండాల్సి వస్తుంది" అన్నాడు.
"అవసరం ఏముంది దాము డార్లింగ్? మేము ఇక్కడే ఉంటే సరిపోతుంది కదా. మనుషులు ఎక్కువయ్యే కొద్దీ బయటపడడానికి అవకాశం పెరుగుతుంది కదా. ఇంతకుముందు ఎప్పుడు కూడా నేను హైడింగ్ లోకి వెళ్ళింది లేదు కదా.." అంది మోనా.
"నువ్వు చెప్పింది నిజమే. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. ఇది పెద్ద కేసు. మా ఆచూకీ చెప్పమని నిన్ను, లూసీని పోలీసులు టార్చర్ పెట్టవచ్చు. ఇంకొక విషయం.. నేను బయట ఉన్నంతవరకే మీకు రక్షణ ఉంటుంది. నేను గనక అరెస్టు అయితే మీ పైన నా శత్రువులు గానీ లేదా మనవాళ్లలోనే కొందరు గాని అత్యాచారం చేయవచ్చు" చెప్పాడు దాము.
"అలా అయితే నేనొక్కదాన్నే వస్తాను. లూసీ ఇప్పుడు ఎందుకు?" అంది మోనా.
"నా నోటితో చెప్పించాలని చూస్తున్నావు కదా.. సరే విను. నేను ఈ కేసులో అరెస్ట్ అవుతానని అనుమానంగా ఉంది. అయ్యే లోపల ఒకసారి ఆ లూసీ తో గడపాలని ఉంది" చెప్పాడు దాము.
లూసి ఆ ఫోను వంక చెయ్యి చూపుతూ "ఇలాంటి వాడిని నువ్వు కాపాడాలనుకుంటున్నావా” అని మునావర్తో అంది. సిగ్గుతో తల దించుకున్నాడు మునావర్.
"అప్పుడే అయిపోలేదు మునావర్.. ఇంకా వినాల్సింది ఉంది" అంటూ మళ్ళీ ప్లే చేశాడు దీక్షిత్.
మోనా మాట్లాడుతూ "పొరపాటు చేశావు డార్లింగ్. ఆ జాఫర్ కు బదులు మునావర్ని పంపి ఉంటే దొరికేవాడు కాదు. పని జరిగిపోయేది. కానీ నీకేమో రిస్కుతో ఉండే పనులు చేయడానికి అందమైన భార్య ఉన్న అనుచరుడే కావాల్సి వస్తుంది" అంది.
"ఈర్ష పడకు మోనా. ఆ మాటకొస్తే.." అంటూ గొంతు తగ్గించి "పక్కన ఎవరూ లేరుగా" అన్నాడు.
"ఎవరూ లేరు. లూసీ వేరే గదిలో ఉంది" చెప్పింది మోనా.
"అయితే విను. మనలో మాట. మునావర్ భార్య కూడా చాలా అందంగా ఉంటుంది" అన్నాడు దాము.
వింటున్న మునావర్ ఆవేశంతో ఊగిపోతున్నాడు. తగ్గమనట్లు సైగ చేశాడు దీక్షిత్.
"మునావర్ నీకు నమ్మిన బంటు కదా.. అతని భార్య మీద కూడా కన్నేశావా?" అంది మోనా.
"తప్పేముంది? నేనేమైనా రేప్ చేయబోతున్నానా.. లేదు కదా. నమ్మిన బంటుకు ఏదైనా జరిగితే అతని భార్యకు న్యాయం చేస్తూ ఉంటాను. అంతే. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకులే. నువ్వు లూసీ ని తీసుకొని మునావర్ తో పాటు ఇక్కడికి వచ్చేయ్. ఇది చాలా ఇరుకైన ఇల్లు. ఇల్లు అనేకంటే ఒక చిన్న రూమ్ అని చెప్పొచ్చు. మరో 10 నిమిషాల్లో నేను అక్కడికి చేరుకుంటాను. ఈ లోపల ఫోన్లు చేయవద్దు" అని చెప్పి కాల్ కట్ చేశాడు దాము.
కుర్చీలో కట్టబడి ఉన్న మునావర్ ఒళ్లంతా చెమటతో తడిసిపోయింది. దీక్షిత్ సైగ చేయడంతో మునావర్ నోటికి వేసిన టేపును తీసేసి నోట్లో కుక్కిన గుడ్డలను బయటకు లాగేడు మురళి. దామును బూతులు తిడతాడనుకున్న మునావర్, బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టాడు. లూసి వంక చూస్తూ "నువ్వు నా చెల్లెమ్మ లాంటి దానివి. నీమీద అతను చెడు దృష్టితో ఉన్నట్లు నిజంగా నాకు తెలియదు" అన్నాడు.
"దీక్షిత్ మురళితో మునావర్ కట్లు విప్పమన్నాడు. సందేహంగా చూస్తున్న మురళితో "తన భార్య మీద దాముకి చెడు దృష్టి ఉన్నట్లు తెలిశాక కూడా మునావర్ దాముకి సహకరిస్తాడని అనుకోను. అలా చేస్తే అతడు మనిషిగా పుట్టడమే వృధా అవుతుంది" అన్నాడు.
మురళి అతని కట్లు విప్పాడు. పైకి లేచిన మునావర్ ఒకసారి కాళ్లు చేతులు విదిలించుకొని దీక్షిత్ కు నమస్కారం పెట్టాడు.
"నువ్వు దాము చెప్పినట్లుగానే మోనా, లూసీలను తీసుకొని అతని దగ్గరకు వెళ్ళు. మేము కాస్త వెనగ్గా మిమ్మల్ని ఫాలో చేస్తాము" అన్నాడు దీక్షిత్.
"అన్నట్లు శివరాం శర్మ హత్య కోసం దాముని ఎవరు కాంటాక్ట్ చేశారు? నీకు తెలిసే ఉంటుంది" అడిగాడు మురళి.
"నిజంగా నాకు తెలియదు సార్. సర్ పైన అటాక్ చేయడం కోసమైతే శక్తి అనే మనిషి వచ్చాడు. అతన్ని రాజన్ సార్ రెకమెండ్ చేశారు. శివరాం శర్మ గారి హత్యకు ఎవరు ప్రేరేపించారో నిజంగా నాకు తెలియదు. అది థర్డ్ డిగ్రీ ఇంటరాగేషన్లో దాము చెప్పాలి. ఒక విషయం గుర్తుకొచ్చింది. ఆ హైడింగ్ స్పాట్లో ఒక ఫోన్ ఉంది. దాన్నుంచి ఎవరికో ఫోన్ చేస్తూ ఉంటాడు. వేరే వాటికోసం ఆ ఫోన్ ఉపయోగించడు" అని చెప్పాడు.
"సరే ఇక బయలుదేరు. దాము ఎదురు చూస్తూ ఉంటాడు" అన్నాడు దీక్షిత్.
"అక్కడ లూసీ మీద చేయి వేస్తే నేను చూస్తూ ఊరుకోను" అన్నాడు మునావర్.
"థాంక్స్ మునావర్ అన్నా! ఆ మాట అన్నావు చాలు" అంది లూసీ కళ్ళు తుడుచుకుంటూ.
తమ కారులో ఫాలో చేస్తూ బయలుదేరారు దీక్షిత్ మురళి.
కొన్ని చిన్న చిన్న సందులు తిరిగాక ఆటో కూడా వెళ్లలేనంత వీధి దగ్గర ఆటో దిగారు మునావర్, లూసి, మోనాలు.
"ముందు నేను వెళ్తాను. మీరిద్దరూ కాస్త వెనక రండి" అంటూ ఆ గల్లీలోకి వెళ్ళాడు మునావర్.
అతనికి కాస్త వెనక మోనా లూసీలు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. దీక్షిత్ స్టేషన్ కు ఫోన్ చేసి రెండు బైక్లు తెప్పించాడు. దారిలో కారు ఆపేసి చెరొక బైక్ మీద ఎక్కారు మురళి దీక్షిత్ లు.
"అక్కడికి వెళ్ళగానే మునావర్ లొకేషన్ షేర్ చేస్తాడు. మనం కాస్త దూరంగా ఉండి అతను మిస్డ్ కాల్ ఇవ్వగానే వెళ్దాం. నువ్వు ఆ గల్లీ నుండి వెళ్తే నేను వెనకవైపు నుండి వెళ్తాను" అన్నాడు దీక్షిత్.
=========================================================
ఇంకా ఉంది
అపరాధ పరిశోధన - పార్ట్ 16 త్వరలో..
=========================================================
మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ మల్లవరపు సీతారాం కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ నిర్వహిస్తున్నాము.
Comments