top of page

అపరాధ పరిశోధన - పార్ట్ 16

Updated: 6 days ago

#MallavarapuSeetharamKumar, #మల్లవరపుసీతారాంకుమార్, #అపరాధపరిశోధన, #AparadhaParisodhana, #TeluguSuspenseStories, #TeluguCrimeStory, #TeluguDetectiveStory, #TeluguInvestigativeJournalism, #Apana, #అపన


Aparadha Parisodhana - Part 16 - New Telugu Web Series Written By Mallavarapu Seetharam Kumar Published In manatelugukathalu.com On 17/07/2025

అపరాధ పరిశోధన - పార్ట్ 16 - తెలుగు ధారావాహిక

రచన, కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కొత్తగా ఎస్ పీ గా బాధ్యతలు చేపట్టిన దీక్షిత్, చేరిన రెండోరోజే ప్రతిపక్ష నాయకుడు శివరాం శర్మ హత్య కేసు పరిశోధించాల్సి వస్తుంది. హత్య జరిగిన కొద్ది గంటల్లోనే ఆ కేసు తాలూకు నిందితులు దొరికినట్లు వార్త వస్తుంది. ఆ వార్త విని ఆనంద పడేలోగా, ముందురోజే పరిచయమైన శివరాం శర్మ గారి మేనకోడలు, యూట్యూబర్ నీతూ శర్మ పైన హత్యా ప్రయత్నం జరిగినట్లు తెలిసి దిగ్భ్రాంతి చెందుతాడు. 


దీక్షిత్ ను చంపడం కోసం దాముకు సుఫారి ఇచ్చే ఏర్పాట్లు జరుగుతాయి. ఆ హత్యకు జాఫర్ ను ఉపయోగించు కోవాలనుకుంటాడు దాము. 


రెండో విడత విచారణలో నిందితులు తమను దాము నియమించినట్లు అంగీకరిస్తారు. దీక్షిత్ ఇంటికి డ్రైవర్ కోదండం సహాయంతో ఏసీ టెక్నీషియన్ లాగా వస్తాడు జాఫర్. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం దీక్షిత్ ను రబ్బర్ బులెట్ తో కాలుస్తాడు జాఫర్. అవి నిజం బులెట్ లు అనుకోని దీక్షిత్ కు అడ్డం వస్తుంది నీతూశర్మ. 


ఆమెను తీసుకొని శివరాం శర్మ ఇంటికి బయలుదేరుతాడు దీక్షిత్. శివరాంశర్మ గారి ఇంటి దగ్గర తులసీనాథ్ అనే వ్యక్తి దీక్షిత్ ను కలుస్తాడు. తాము ఉన్న చోటికి పోలీస్ కార్ రావడంతో దాము, మునావర్ లు అక్కడి నుండి పారిపోతారు. మోనా, లూసీలను తీసుకురమ్మని మునావర్ ను పంపుతాడు దాము. వాళ్ళను ముందుగా దాము వద్దకు పంపి, తాను, మురళి కలిసి అతన్ని బంధించాలని ప్లాన్ వేస్తాడు దీక్షిత్.



గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అపరాధ పరిశోధన - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అపరాధ పరిశోధన - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అపరాధ పరిశోధన - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అపరాధ పరిశోధన - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అపరాధ పరిశోధన - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అపరాధ పరిశోధన - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అపరాధ పరిశోధన - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అపరాధ పరిశోధన - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అపరాధ పరిశోధన - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అపరాధ పరిశోధన - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అపరాధ పరిశోధన - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అపరాధ పరిశోధన - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అపరాధ పరిశోధన - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అపరాధ పరిశోధన - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అపరాధ పరిశోధన - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇక అపరాధ పరిశోధన - పార్ట్ 16 చదవండి..


దాము ఉన్న పెంకుటింటి దగ్గరకు వెళ్ళాడు మునావర్. అక్కడ బీడీ ఆకులు చుడుతున్నవారిలో కొందరు అతనికి సలాం చేశారు. ఇద్దరు యువతులు వస్తారని, వారికి దాము ఉన్న గది చూపించమని చెప్పాడు. తరువాత వారిలో తనకు నమ్మకస్తుడైన వ్యక్తిని పిలిచి పోలీసులు వస్తే దాము ఇక్కడ లేదని పెద్దగా అంటూ, దగ్గరికి వెళ్లి అతను వున్న గదిని చూపించమన్నాడు. అతను సరే అన్నాక లోపలి వెళ్తూ దీక్షిత్, మురళిలకు లైవ్ లొకేషన్ షేర్ చేసాడు. 


'దాముకు మోనా భార్య కాకపోయినా ఆమెకు తను ఎంతో గౌరవం చూపాడు. కానీ ఆ దాము తన భార్య గురించి తప్పుగా ఆలోచించాడు. అతన్ని చంపెయ్యాలన్నంత కసి ఉంది తనలో.. కానీ అతను అరెస్ట్ కాబోయే తరుణంలో తను ఆవేశపడకూడదు. ' అనుకుంటూ గదిలోకి వెళ్ళాడు మునావర్. 


లోపల దాము విస్కీ తాగుతూ అర్థనగ్నంగా ఉన్నాడు. మునావర్ ను చూడగానే కోపంగా "ఏమిటి మొద్దు మొహం వేసుకుని నువ్వు వచ్చావ్? నా డార్లింగ్స్ ఎక్కడ?" అన్నాడు. 


"వెనకే వస్తున్నారు. కానీ పోలీసులు ఫాలో చేస్తున్నారని అనుమానం" అన్నాడు మునావర్. 


"నీ ముఖం! ఆ మోనా మొగుడు కూడా నీలాగే ప్రతిదానికీ భయపడేవాడు. అందుకే మోనా నాలాంటి మగాడిని ఇష్టపడింది. ఆ పిరికి వెధవ పోలీసుల ఎన్ కౌంటర్ లో చనిపోయాడు" అన్నాడు దాము వికృతంగా నవ్వుతూ. 


"పోలీసులకు మనవాడే ఎవడో దుర్మార్గుడు అతని ఆచూకీ చెప్పారట కదా.. " అన్నాడు మునావర్. 


"అంతేనా.. పోలీసులు వస్తే లొంగి పోవద్దనీ, కాల్పులు జరపమనీ కూడా చెప్పింది నేనే. మోనా లాంటి అందగత్తె కోసం అలా చెయ్యక తప్పలేదు" అన్నాడు దాము, మత్తు, మదం తలకెక్కుతుండగా. 


"పాపం" అన్నాడు మునావర్. 


"పాపం పుణ్యం అనుకుంటే స్వర్గ సుఖాలు దొరకవు. ఇంతకీ వేరార్ మై లవర్స్?" అంటుండగానే మోనా, లూసీలు లోపలకు వచ్చి తలుపు గడియ పెట్టారు. 


"నువ్వు బయటకు వెళ్ళు మునావర్. నేను వీళ్ళతో ప్రైవేట్ గా మాట్లాడాలి" అన్నాడు దాము. 


"సరే సర్. కానీ పోలీసులు వస్తారేమో.. " నసిగాడు మునావర్. 


"నిన్ను సినిమాకు వెళ్ళమనలేదు. బయట కుక్కలా గాడిదలకు కాపలా కాయి. ఎవడైనా వస్తుంటే నన్ను అలర్ట్ చెయ్యి. వెనుకవైపు నుండి అవతలి గల్లీలోకి వెళ్ళిపోతాను" అన్నాడు దాము కోపంగా. 


‘ముందు వైపు నుండి మురళి అనే పులి, వెనుక వైపు నుండి దీక్షిత్ అనే సింహం నీ మీద దాడి చెయ్యబోతున్నాయి. అసలు ముందు ఈ ఇద్దరు ఆడాళ్ళు నీకు చుక్కలు చూపించబోతున్నారు' అని మనసులో అనుకుని గది బయటకు నడిచాడు మునావర్. 


 అతను బయటకు వెళ్లిన మరుక్షణం మెరుపులా వెళ్లి డోర్ మూసి గడియ పెట్టింది మోనా. 


"ఎంతైనా సీనియర్ అనిపించుకున్నావు. నీలో ఈ వేగమే నాకు బాగా నచ్చుతుంది" అన్నాడు దాము. అంతలో లూసీ నొచ్చుకుంటుందేమోనని ఆమె వంక చూశాడు. 


లూసీ దాము వంక చూసి కన్ను గీటి, "ఏం కాదు. నేను అంతకంటే ఫాస్ట్” అంటూ వేగంగా అతన్ని సమీపించింది. ఆమె దగ్గర నుంచి ఏదో తియ్యటి వాసన రావడం గమనించాడు దాము. అదేమిటో అర్థం చేసుకునే లోపే తన చేతిలో ఉన్న కర్చీఫ్ ను అతని ముక్కుకు అదిమి పెట్టింది లూసీ. తనకు స్పృహ తప్పుతున్నట్లు గ్రహించాడు అతను. కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. 


మునావర్ ను పిలుద్దామని అనుకున్నాడు కానీ గొంతు పెగలలేదు. దగ్గరకు రమ్మని మోనాకు సైగ చేశాడు. మోనా అతని దగ్గరకు వచ్చింది. లూసీని నెట్టివేయాలని ప్రయత్నిస్తున్న అతని చేతుల్ని కదలకుండా పట్టుకుంది. స్పృహ తప్పి పక్కనే ఉన్న సోఫాలో కూలబడిపోయాడు దాము. 


మోనా తన హ్యాండ్ బ్యాగ్ లోంచి నైలాన్ తాడు బయటకు తీసింది. ఇద్దరూ కలిసి అతని కాళ్లు చేతులు కట్టేశారు. 


తర్వాత లూసి పక్కనే ఉన్న వాటర్ బాటిల్ లోని నీళ్లు దాము ముఖం మీద ఒక్కసారిగా కుమ్మరించింది. మెల్లగా కళ్ళు తెరిచాడు దాము. 


"ఎంత మత్తయినా ఈ దామును ఎక్కువసేపు ఆపలేదు" అన్నాడు. 


మోనా చిన్నగా నవ్వుతూ "అదేం కాదు. నీతో తేల్చుకోవాల్సింది చాలా ఉంది. అందుకే చాలా తక్కువ డోస్ ఇచ్చాము" అంది. 


మత్తు పూర్తిగా వదలని దాముకు జరిగింది సరిగ్గా అర్థం కాలేదు. 


"ఇంతకీ ఇదేదో వెరైటీ సెటప్ లాగా ఉంది. ఏదో సినిమాలో చూసినట్లు గుర్తు" అన్నాడు మోనా వంక చూస్తూ. 


తన కాలి చెప్పు తీసి అతని ముఖం పగిలేటట్లు గట్టిగా కొట్టింది మోనా. నోటి నుంచి రక్తం కారడం తెలుస్తోంది దాముకు. కానీ తుడుచుకోవాలంటే చెయ్యి కట్టేసి ఉంది. 

 తలను ఒక పక్కకు వాల్చి భుజాన్ని పైకి లేపి మూతి తుడుచుకున్నాడు దాము. అయినా రక్తం కారడం ఆగలేదు. మోనా వంక కోపంగా చూస్తూ "ఎంత దెబ్బ కొట్టావే.. " అంటూ బూతు మాటలు మాట్లాడాడు. 


"చెప్పు దెబ్బ తగిలినా బుద్ధి రాలేదు రా" అంటూ ఈసారి లూసి పిడికిలి బిగించి అతని ముఖం మీద కొట్టింది. మద్యం మత్తు ఒక వైపు, మత్తుమందు ప్రభావం మరొకవైపు, ఆపైన ఇద్దరు ఆడాళ్ళ దెబ్బలు.. తల గిర్రున తిరుగుతున్నట్లు అయింది దాముకు. 


"ఎంత ధైర్యం చేస్తున్నారే.. ఒక్కసారి నా కట్లు విడదీసుకున్నానంటే మీరిద్దరూ నా చేతిలో హతమైపోతారు" అన్నాడు. 


"అలాగా.. అదీ చూద్దాం" అంటూ అతని కట్లు విప్పబోయింది లూసి. 


"ఆగు. అతని మాటలకు టెంప్ట్ కావొద్దు. " అంది మోనా. 


తన బొడ్డులో దాచుకున్న బాకును బయటకు తీసింది లూసి. "అలా అయితే ముందు వీడి పీక కోసి, ఆ తర్వాత కట్లు విప్పుతాను" అంది. 


మొదటిసారిగా దాము కళ్ళల్లో భయం తొంగి చూసింది. 


అతడు ఎన్నో కొట్లాటల్లో పాల్గొన్నా పక్కన మునావర్ లేకపోవడం ఇదే మొదటిసారి. 


"మునావర్! లోపలికి రా.. " గొంతు పెగుల్చుకొని అరిచాడు. 


"బయట గాడిదలు కాయమన్నారు. కాస్తున్నాను. మీ సరసాలకు అడ్డు రాను లెండి. అయినా మోనా.. సారీ.. మోనా మేడం పక్కనే ఉన్నారుగా. భయం ఎందుకు?" అన్నాడు బయటనుంచి. 


"ఒరేయ్! ఇది తమాషాలాడే సమయం కాదు. నేను నిజంగా ఆపదలో ఉన్నాను" అన్నాడు దాము. 


తలుపు తెరుచుకొని లోపలికి వచ్చాడు మునావర్. దాము ముఖంలో కొంచెం రిలీఫ్ కనబడింది. ఇక తను తప్పించుకున్నట్లే అనుకున్నాడు. 


"దాము సార్! చిన్న మాట" అన్నాడు మునావర్. 


"మాటలు తర్వాత. ముందు వీళ్ళిద్దరిని కంట్రోల్ చెయ్యి" అన్నాడు దాము. 


"అలాగే సార్. కానీ ఒకవేళ నాకు ఏదైనా ఆపద జరిగితే నా భార్య ఒంటరిగా అయిపోతుంది. మీరు పెద్దమనసు చేసి చూసుకోవాలి" అన్నాడు మునావర్. 


"అదెంత పని? ఖచ్చితంగా చూసుకుంటాను" అంటూ ఉండగానే ఏదో అనుమానం వచ్చింది దాముకు. "నీ భార్యను నా చెల్లెల్లా చూసుకుంటాను" అన్నాడు తన మాటను సవరిస్తూ. 


"ఆ బుద్ధి ముందే ఉండాలి రా" అన్నాడు మునావర్ కోపంగా. 


"నన్ను రా అన్నావా?" అన్నాడు దాము. 


"అవున్రా. నీలాంటి కుక్కను ఏమన్నా తప్పులేదు. కుక్కకు అవమానం జరుగుతుందన్న బాధ తప్పితే" అన్నాడు మునావర్. 


"ఓహో.. అందరూ కలిసి నా మీద కుట్ర ప్లాన్ చేశారన్నమాట. ఒక్కొక్కడి అంతు చూస్తాను. దామును అంత తేలిగ్గా అనుకోవద్దు" కేకలు పెట్టాడు. 


ఇంతలో మునావర్ మిస్డ్ కాల్ అందుకున్న సిఐ మురళి లోపలికి ప్రవేశించాడు. 


"మునావర్! నన్ను తప్పించు. ఈ పోలీసులు నిన్ను కూడా వదిలిపెట్టరు. ఈ సి ఐ ని గది బయటకు నెట్టి తలుపు వేసేయి. మనం వెనక డోర్ నుండి ఆ గల్లీలోకి వెళ్లిపోదాం. నువ్వు కోరినంత డబ్బు ఇస్తాను" అన్నాడు. 


వెనకవైపు గల్లీలో ఎదురుచూస్తున్న దీక్షిత్, మురళి నుండి మెసేజ్ రావడంతో తను కూడా ఆ గదిలోకి వచ్చాడు. 


"ఆడవాళ్లను అడ్డం పెట్టుకొని నన్ను బంధించాలని చూస్తున్నారా?" అన్నాడు దాము. 


"కాదు. డైరెక్ట్ గా మేము అటాక్ చేస్తే తప్పించుకుపోతున్న నిన్ను మేము షూట్ చేయాల్సి వస్తుంది. కానీ నీకు అంత సులభంగా చావు రాకూడదు. నీవల్ల మాకు తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అందుకే నిన్ను ప్రాణాలతో పట్టుకోవాలనుకున్నాము" అన్నాడు మురళి. 


"ఇదిగో ఎస్పీ సార్. ఒక్కసారి నా మాట వినండి. ఇక్కడ బయటి వాళ్లు ఎవరు లేరు. మీకు ఎంత కావాలో చెప్పండి. మునావర్! ఈ ఆడాళ్ళిద్దరినీ ఒప్పించు. మీ ముగ్గురికి కూడా ఊహించలేనంత డబ్బు ఇప్పిస్తాను. " ఆఖరి ప్రయత్నంగా అన్నాడు దాము. 


మునావర్ మాట్లాడుతూ "నేరస్తులలో కూడా కొందరిలో నిజాయితీ ఉంటుంది. తమ దగ్గర పనిచేసే వాళ్ళను జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ అవసరం కోసం, ఆడదాని కోసం నమ్మిన వాళ్ళని కూడా బలిచ్చే నీచులు కొద్దిమందే ఉంటారు. నీలాంటి వాళ్ళు కనికరానికి అనర్హులు" అన్నాడు. 

=========================================================

ఇంకా ఉంది


=========================================================


మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ మల్లవరపు సీతారాం కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ నిర్వహిస్తున్నాము.

 







Comentários


bottom of page