అపరాధ పరిశోధన - పార్ట్ 17
- Seetharam Kumar Mallavarapu
- Jul 24
- 6 min read
#MallavarapuSeetharamKumar, #మల్లవరపుసీతారాంకుమార్, #అపరాధపరిశోధన, #AparadhaParisodhana, #TeluguSuspenseStories, #TeluguCrimeStory, #TeluguDetectiveStory, #TeluguInvestigativeJournalism, #Apana, #అపన

Aparadha Parisodhana - Part 17 - New Telugu Web Series Written By Mallavarapu Seetharam Kumar Published In manatelugukathalu.com On 24/07/2025
అపరాధ పరిశోధన - పార్ట్ 17 - తెలుగు ధారావాహిక
రచన, కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కొత్తగా ఎస్ పీ గా బాధ్యతలు చేపట్టిన దీక్షిత్, చేరిన రెండోరోజే ప్రతిపక్ష నాయకుడు శివరాం శర్మ హత్య కేసు పరిశోధించాల్సి వస్తుంది. హత్య జరిగిన కొద్ది గంటల్లోనే ఆ కేసు తాలూకు నిందితులు దొరికినట్లు వార్త వస్తుంది. ఆ వార్త విని ఆనంద పడేలోగా, ముందురోజే పరిచయమైన శివరాం శర్మ గారి మేనకోడలు, యూట్యూబర్ నీతూ శర్మ పైన హత్యా ప్రయత్నం జరిగినట్లు తెలిసి దిగ్భ్రాంతి చెందుతాడు.
దీక్షిత్ ను చంపడం కోసం దాముకు సుఫారి ఇచ్చే ఏర్పాట్లు జరుగుతాయి. ఆ హత్యకు జాఫర్ ను ఉపయోగించు కోవాలనుకుంటాడు దాము.
రెండో విడత విచారణలో నిందితులు తమను దాము నియమించినట్లు అంగీకరిస్తారు.
నీతూ శర్మను తీసుకొని శివరాం శర్మ ఇంటికి బయలుదేరుతాడు దీక్షిత్. శివరాంశర్మ గారి ఇంటి దగ్గర తులసీనాథ్ అనే వ్యక్తి దీక్షిత్ ను కలుస్తాడు. తాము ఉన్న చోటికి పోలీస్ కార్ రావడంతో దాము, మునావర్ లు అక్కడి నుండి పారిపోతారు. మోనా, లూసీలను తీసుకురమ్మని మునావర్ ను పంపుతాడు దాము. వాళ్ళను ముందుగా దాము వద్దకు పంపి, తాను, మురళి కలిసి అతన్ని బంధించాలని ప్లాన్ వేస్తాడు దీక్షిత్. మోనా, లూసీలు దామును బంధిస్తారు.
గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అపరాధ పరిశోధన - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అపరాధ పరిశోధన - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అపరాధ పరిశోధన - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అపరాధ పరిశోధన - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అపరాధ పరిశోధన - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అపరాధ పరిశోధన - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అపరాధ పరిశోధన - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అపరాధ పరిశోధన - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అపరాధ పరిశోధన - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అపరాధ పరిశోధన - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అపరాధ పరిశోధన - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అపరాధ పరిశోధన - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అపరాధ పరిశోధన - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అపరాధ పరిశోధన - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక అపరాధ పరిశోధన - పార్ట్ 17 చదవండి..
దీక్షిత్ దాముకు ఎదురుగా నిల్చున్నాడు.
"చూడు దాము.. నిన్ను ఎవరు ఈ నేరానికి వినియోగించారో మాకు తెలుసు. కానీ అతన్ని అరెస్ట్ చెయ్యడానికి నీ స్టేట్మెంట్ కావాలి. మమ్మల్ని ఎక్కువ విసిగించకుండా ఆ పేరు చెప్పెయ్యి. ఇంతకు ముందు కేసుల్లాగా నాలుగు రోజులు జైలు లో కూర్చుని బయటికి వచ్చెయ్యవచ్చని కలలు కనకు. నిన్ను అన్ని రకాలుగా ఇరికించాము. రాజన్, శక్తీ మా వైపు వచ్చారు. శక్తితో నీ మాటలన్నీ హిడెన్ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. జాఫర్ మాకు సహకరించాడు. శివరాం శర్మ కేసు తో పాటు నా మీద హత్యాప్రయత్నం కేసులో కూడా తప్పించుకోలేవు. అందుకని నిన్ను ఆ హత్యకు వాడుకున్న వాళ్ళను పట్టుకోడంలో సహకరించు. నా పైన హత్యాప్రయత్నం కేసు వదిలేస్తాను" అన్నాడు దీక్షిత్.
"నా వెనక ఎవరూ లేరు. నేనే ఆయనను హత్య చేయించాను. నన్ను అరెస్ట్ చెయ్యండి" మొండిగా చెప్పాడు దాము.
అప్పుడు మురళి కల్పించుకున్నాడు."మిస్టర్ దాము.. మంచిగా చెబుతుంటే నీకు చెవికి ఎక్కడం లేదు. మేము నిన్నేమీ చెయ్యనక్కర లేదు. జస్ట్.. మేమిద్దరం బయటికి వెళ్ళిపోతే చాలు. మోనా, లూసీ, మునావర్ లు నిన్ను ఖతం చేస్తారు. కాస్సేపట్లో జాఫర్ కూడా ఇక్కడకు రాబోతున్నాడు. తనను వాడుకోవడమే కాకుండా, తన భార్య లూసీని లొంగదీసుకోవాలన్న నీ పాడు ఆలోచనను ముందే గ్రహించి మాకు సహకరించాడు. ఇక డబ్బు విషయానికి వస్తే నీ విరోధులకు నీ తలను బేరం పెడితే వీళ్లకు కోట్లలోనే ముడుతుంది. నిజాలను అంగీకరించి జైలుకు వెడితేనే నువ్వు ప్రాణాలతో ఉండగలవు." అన్నాడు మురళి.
కొంత ఆలోచనలో పడ్డాడు దాము. కాస్త విరామం తరువాత గొంతు సవరించుకొని, "నిజానికి నాకు ఆదేశాలు ఇచ్చే వ్యక్తి ఎవరో నాకు కూడా తెలీదు. అతని పేరు నేను అడగకూడదు. చేసిన పనికి డబ్బు నాకు ఎలాగోలా చేరుతుంది" అన్నాడు.
"సరే. ఈ విషయం చెప్పు. రేపు శివరాం శర్మ గారి అంత్యక్రియల సమయంలో ఎందరో ప్రముఖులు వస్తారు. అప్పుడు ఏదైనా ప్లాన్ చేసారా?" అడిగాడు దీక్షిత్.
"తెలీదు. వాళ్ళు ఒకొక్క పనికి ఒకొక్కరిని వాడుకుంటారు" చెప్పాడు దాము.
"ఇక్కడ ఒక సీక్రెట్ ఫోన్ ఉంది కదా. దాన్నుంచి కాల్ చేస్తే అతను మాట్లాడుతాడు కదా?" అడిగాడు దీక్షిత్.
"మాట్లాడుతాడు. కానీ అతనెవరో చెప్పడు. ఆ ఫోన్ తన మనుషులు ఎవరైనా లిఫ్ట్ చెయ్యొచ్చు" చెప్పాడు దాము.
"అలాగే ఇక్కడి ఫోను కూడా ఎవరైనా వాడొచ్చా?"
"వాడొచ్చు. ఒక పాస్ వర్డ్ చెప్పాలి"
ఆ పాస్ వర్డ్ అడిగి తెలుసుకున్నాడు దీక్షిత్. వెంటనే "ఇతని నోటికి ప్లాస్టర్ వెయ్యండి" అన్నాడు.
భయంగా చూస్తూ "సార్!" అన్నాడు దాము.
మురళి వంక చూసాడు దీక్షిత్.
మురళి వెంటనే దాము నోటికి ప్లాస్టర్ వేసాడు.
మునావర్ ను దగ్గరకు పిలిచి ఏం చెయ్యాలో చెప్పాడు దీక్షిత్.
మునావర్, అక్కడ టేబుల్ డ్రా లో ఉన్న సీక్రెట్ ఫోన్ తీసి స్విచ్ ఆన్ చేసాడు.
అవతలి వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేసి పాస్ వర్డ్ అడిగాడు. చెప్పాక, "ఎవరు నువ్వు?" అని అడిగాడు.
"నేను దాము సర్ అసిస్టెంట్ ను. మునావర్ నా పేరు" చెప్పాడు.
"ఏమిటి విషయం?" అడిగాడు అవతలి వ్యక్తి.
"పోలీసులు వస్తారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాంతో ఫోన్ నా చేతికిచ్చి పాస్ వర్డ్ చెప్పి మీకు కాల్ చేయమన్నాడు. నేను బయటకు వచ్చి కాల్ చేస్తున్నాను." చెప్పాడు మునావర్.
"పోలీసులు వస్తారని ఇందాక ఫోన్ చేసాడు. భయపడాల్సిన అవసరం లేదనీ, నాకేం తెలీదనీ బుకాయించమన్నాము. మరీ అవసరమైతే శివరాం శర్మ మేనల్లుడి పేరు చెప్పమన్నాం" చెప్పాడు అవతలి వ్యక్తి.
"ఇప్పుడు పరిస్థితి అదుపులో లేదు. అతను మోసం చేసిన ఇద్దరు ఆడాళ్ళు అతన్ని చంపడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి అతను పోలీసులకు లొంగిపోవచ్చు"
"వాడి ఖర్మ. మాకు సంబంధం లేదు" అన్నాడు అవతలి వ్యక్తి. తిరిగి "అసలు నువ్వు చెప్పింది నిజమా కాదా తేల్చుకోవాలి. నేను పది నిముషాలాగి కాల్ చేస్తాను" అంటూ కాల్ కట్ చేసాడు.
ఓ ఐదు నిముషాలకు బయట ఉన్న మునావర్ సన్నిహితుడు మునావర్ కు కాల్ చేసాడు.
"భాయ్, ఇప్పుడే ఒక మనిషి లోపలి వచ్చి, పోలీసులు ఎవరన్నా వచ్చారా అని ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగాడు. ఇద్దరు ఆడాళ్ళు, నువ్వు, సీఐ మురళి వచ్చిన విషయం చెప్పారు" అన్నాడతను.
అతనికి కృతజ్ఞతలు చెప్పి కాల్ కట్ చేసాడు మునావర్.
కొంత సేపటికి సీక్రెట్ ఫోన్ మోగింది.
తిరిగి పాస్ వర్డ్ చెప్పాక "నువ్వు చెప్పింది నిజమే. కానీ మాకేం భయం లేదు. మా గురించి వాడికేమీ తెలీదు" అన్నాడా వ్యక్తి.
"కానీ దాము నోరు తెరిస్తే నేను జైలుకు వెళ్లడం ఖాయం. అతని అన్ని నేరాల్లోనూ నేను ఉన్నాను" చెప్పాడు మునావర్.
'అయితే ఏమిటి? వాడిని వేసేస్తానంటావా?" నవ్వాడు అవతలి వ్యక్తి.
"వెయ్యాలని ఉంది గానీ నాకు సపోర్ట్ ఎవరూ లేరు.." నసిగాడు మునావర్.
"ఐదు నిముషాలు ఆగు" అంటూ కాల్ కట్ చేసి తిరిగి కాల్ చేసాడతను.
"అవకాశం దొరికితే ఆ దాముని వేసేయ్. మీ గ్యాంగ్ లో నీ మాట వినేవాళ్ళని అల్తాఫ్ గ్యాంగ్ లో చేర్చు. నేను వాళ్లతో మాట్లాడాను." చెప్పి కాల్ కట్ చేసాడతను.
ఆ మాటలు విన్న దాము ముఖం పాలిపోయింది.
"చూసావా దాము.. వీళ్లకోసం శివరాం శర్మగారిని చంపావు. వీళ్లు ఇప్పుడు నీ ప్రాణం తీయమంటున్నారు. నేర జీవితంలో ఎవరి ప్రాణాలకు భద్రత లేదు. తిన్న తరువాత ఆకును పడేసినట్లు ఉంటుంది నీలాంటి వాళ్ళ బ్రతుకు.
నిన్ను కస్టడీలోకి తీసుకుంటున్నాము.నీకు తెలిసిన నిజాలు స్టేషన్ లో రాసి ఇవ్వు" దాముతో చెప్పాడు దీక్షిత్.
తరువాత మోనా, లూసీల వంక తిరిగి, "ఇతన్ని శిక్షించే పని మేము చేసుకుంటాము. మీరు ఆవేశపడి, కక్షలు పెంచుకోవద్దు. మీరు గౌరవ ప్రదంగా బతికే ఏర్పాట్లు నేను చేస్తాను." అన్నాడు.
తరువాత మునావర్ తో "ఆలస్యంగానైనా నీలో మార్పు వచ్చింది. సంతోషం. నిన్ను అప్ప్రూవర్ గా పరిగణిస్తాం." అన్నాడు.
మురళి కాల్ చెయ్యడంతో పోలీసులు వచ్చి, దాము, మునావర్ లను అదుపులోకి తీసుకున్నారు. మోనా లూసీలను కూడా స్టేషన్ కు వెళ్లి స్టేట్ మెంట్ రాసివ్వమన్నాడు దీక్షిత్.
***
ఆ డెన్ లోనుండి బయటకు వచ్చి కారులో కూర్చున్న తరువాత ఒక నంబర్ కు డయల్ చేసాడు దీక్షిత్.
అవతలి వ్యక్తి కాల్ కట్ చేసాడు.
కొంతసేపటికి మరో నంబర్ నుండి కాల్ వచ్చింది.
"ఏమిటి..మా బాస్ కు కాల్ చేసావు?" దబాయిస్తున్నట్లు అన్నాడు అవతలి వ్యక్తి.
"నువ్వే ఆ బాస్ అని నాకు తెలుసు. వేరే నంబర్ నుండి చేస్తున్నావ్" అన్నాడు దీక్షిత్.
"నేనెక్కడికి పారిపోను. ఆధారాలు వుంటే ఎప్పుడైనా అరెస్ట్ చెయ్యవచ్చు. ముందు రేపు జరగబోయే బ్లాస్ట్ గురించి ఆలోచించు. శివరాం శర్మ అంత్యక్రియలకు ఎంపీలు, ఎం ఎల్ ఏ లు,, గవర్నర్ వస్తున్నారు. ఏమాత్రం తేడా వచ్చినా నీ ఉద్యోగం ఉండదు. తరువాత వచ్చే ఎస్పీని మేము మేనేజ్ చేస్తాం" అన్నాడు అవతలి వ్యక్తి..
"అవన్నీ తరువాత. నీ అరెస్ట్ కు పై అధికారుల అనుమతి తీసుకున్నాను. శివరాం శర్మ గారి హత్య జరిగి 24 గంటలు కావడానికి ఇంకా పది నిముషాలు ఉంది. మరో ఐదు నిముషాల్లో నీ ఇంటి ముందు ఉంటాను. నిన్ను అరెస్ట్ చేస్తాను " చెప్పాడు దీక్షిత్.
"నన్ను అరెస్ట్ చేస్తే నా మనుషులు రేపు విధ్వంసం సృష్టిస్తారు. తరువాత నువ్వే బాధ పడతావు." బెదిరించాడు అటువైపు ఉన్న వ్యక్తి.
"ఆ బ్లాస్ట్ ఎవరి ద్వారా ప్లాన్ చేసావో మాకు తెలిసిపోయింది. వాళ్ళను కూడా ఈ రోజే అరెస్ట్ చేస్తాను" అన్నాడు దీక్షిత్.
"అంటే .. మునావర్ దగ్గర కాల్ చేయించింది నువ్వేనా" అన్నాడు అతను.
""అవును. దట్ ఈజ్ దీక్షిత్" పక్కనుంచి పెద్దగా అరిచాడు మురళి.
అవతలి వ్యక్తి కోపంతో ఫోన్ పెట్టేసాడు.
"డ్రైవర్. ఈ సూట్కేస్ కార్ లో పెట్టు. మనం వెంటనే బయలుదేరాలి" అన్నాడు.
డ్రైవర్ సూట్కేస్ ను కార్ డిక్కీలో పెట్టాడు. అతను కార్ లో ఎక్కబోతూ ఉండగా పోలీస్ కార్ ఆ ఇంటి ముందు ఆగింది.
=========================================================
ఇంకా ఉంది
అపరాధ పరిశోధన - పార్ట్ 18 - చివరి భాగం త్వరలో..
=========================================================
మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ మల్లవరపు సీతారాం కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ నిర్వహిస్తున్నాము.
Comments