top of page

అపరాధ పరిశోధన - పార్ట్ 18

#MallavarapuSeetharamKumar, #మల్లవరపుసీతారాంకుమార్, #అపరాధపరిశోధన, #AparadhaParisodhana, #TeluguSuspenseStories, #TeluguCrimeStory, #TeluguDetectiveStory, #TeluguInvestigativeJournalism, #Apana, #అపన

ree

Aparadha Parisodhana - Part 18 - New Telugu Web Series Written By Mallavarapu Seetharam Kumar Published In manatelugukathalu.com On 06/08/2025

అపరాధ పరిశోధన - పార్ట్ 18 - తెలుగు ధారావాహిక

రచన, కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కొత్తగా ఎస్ పీ గా బాధ్యతలు చేపట్టిన దీక్షిత్, చేరిన రెండోరోజే ప్రతిపక్ష నాయకుడు శివరాం శర్మ హత్య కేసు పరిశోధించాల్సి వస్తుంది. హత్య జరిగిన కొద్ది గంటల్లోనే ఆ కేసు తాలూకు నిందితులు దొరికినట్లు వార్త వస్తుంది. ఆ వార్త విని ఆనంద పడేలోగా, ముందురోజే పరిచయమైన శివరాం శర్మ గారి మేనకోడలు, యూట్యూబర్ నీతూ శర్మ పైన హత్యా ప్రయత్నం జరిగినట్లు తెలిసి దిగ్భ్రాంతి చెందుతాడు. 


దీక్షిత్ ను చంపడం కోసం దాముకు సుఫారి ఇచ్చే ఏర్పాట్లు జరుగుతాయి. ఆ హత్యకు జాఫర్ ను ఉపయోగించు కోవాలనుకుంటాడు దాము. రెండో విడత విచారణలో నిందితులు తమను దాము నియమించినట్లు అంగీకరిస్తారు. 


నీతూ శర్మను తీసుకొని శివరాం శర్మ ఇంటికి బయలుదేరుతాడు దీక్షిత్. శివరాంశర్మ గారి ఇంటి దగ్గర తులసీనాథ్ అనే వ్యక్తి దీక్షిత్ ను కలుస్తాడు. తాము ఉన్న చోటికి పోలీస్ కార్ రావడంతో దాము, మునావర్ లు అక్కడి నుండి పారిపోతారు. మోనా, లూసీలను తీసుకురమ్మని మునావర్ ను పంపుతాడు దాము. వాళ్ళను ముందుగా దాము వద్దకు పంపి, తాను, మురళి కలిసి అతన్ని బంధించాలని ప్లాన్ వేస్తాడు దీక్షిత్. మోనా, లూసీలు దామును బంధిస్తారు. అసలు నేరస్థుడ్ని బంధించడానికి బయలుదేరుతాడు  దీక్షిత్.




గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అపరాధ పరిశోధన - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అపరాధ పరిశోధన - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అపరాధ పరిశోధన - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అపరాధ పరిశోధన - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అపరాధ పరిశోధన - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అపరాధ పరిశోధన - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అపరాధ పరిశోధన - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అపరాధ పరిశోధన - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అపరాధ పరిశోధన - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అపరాధ పరిశోధన - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అపరాధ పరిశోధన - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అపరాధ పరిశోధన - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అపరాధ పరిశోధన - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అపరాధ పరిశోధన - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అపరాధ పరిశోధన - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అపరాధ పరిశోధన - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అపరాధ పరిశోధన - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇక అపరాధ పరిశోధన - పార్ట్ 18 చదవండి..


కారులో పారిపోబోతున్న తులసీనాథ్ ను చుట్టుముట్టారు దీక్షిత్ , మురళి బృందం.


"రండి ఎస్పీ  గారూ! గుడికి బయలుదేర  బోతున్నాను. ఇంతలో వచ్చారు. చాలా  సంతోషం. లోపలి రండి. మాట్లాడుకుంటాము." అన్నాడు తులసీనాథ్ కంగారును కప్పి పుచ్చుకుంటూ.


"గుడికి సూట్కేస్ ఎందుకో.." వ్యంగంగా అన్నాడు మురళి.


"ఎప్పుడు ఏ  అవసరం వస్తుందో అని దగ్గరే ఉంచుకుంటాను. అవసరమైన వాళ్లకు సహాయం చెయ్యాలి కదా. ముందు లోపలి రండి." అన్నాడతను. 


"నీ మర్యాదలు మాకక్కర లేదు. స్టేషన్ కు వచ్చి, మా మర్యాదలు స్వీకరించు" అన్నాడు దీక్షిత్.


"నా జోలికి వస్తే శివరాం శర్మ అంత్యక్రియల్లో పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. నన్ను వదిలేస్తే ఎవరికీ ఏ ఆపద ఉండదు. వేరే దేశానికీ పారిపోతాను" అన్నాడు తులసినాథ్.


"ఇలాంటి మాటలు మాట్లాడితే శిక్ష ఎక్కువవుతుంది. నువ్వు డీల్ మాట్లాడుకున్నవాళ్ళు మాకు లొంగి పోయారు. ఇక స్టేషన్ కు పద" అన్నాడు దీక్షిత్.


పోలీసులు అతనికి బేడీలు వేశారు.

స్టేషన్ లో కొంత విచారణ తరువాత నేరాన్ని అంగీకరించాడు తులసినాథ్.

***

ఒక వారం తరువాత పోలీసు ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. దీక్షిత్ ను అభినందించి అతను కేసును ఛేదించిన విధానం వివరించమన్నారు పై అధికారులు.


ముందుగా అందరికీ కృతజ్ఞతలు చెప్పాడు దీక్షిత్. తరువాత తన దర్యాప్తు వివరాలు ఇలా తెలియజేశాడు.


“నేను డ్యూటీలో చేరిన రెండో రోజే శివరాం శర్మ గారి హత్య జరిగింది. హత్య జరిగే సందర్భంలో ఒక వ్యక్తి ఫోటోలు తీశాడు. ఆ ఫోటోలలో బైక్ నంబర్, హత్య చేసిన వ్యక్తి ముఖం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఊరి నుండి బయటకు వెళ్లే అన్ని రహదారుల్లోనూ చెక్పోస్టులు ఏర్పాటు చేసి నిఘా పెట్టించాను. కొంతసేపటికి నిందితులు దొరికినట్లు వార్త వచ్చి రిలీఫ్ గా ఫీల్ అయ్యాను. 


అయితే ఆ న్యూస్ టీవీలలో వచ్చిన గంట సేపటికి యూట్యూబ్ నీతూశర్మ తన ఛానల్ లో ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆవిడ శివరాం శర్మ గారికి స్వయానా మేనకోడలు. ఆ వీడియోలో ఆమె నేరస్తులు అంత తొందరగా దొరకడం పట్ల అనుమానం వ్యక్తం చేశారు. కేసు దర్యాప్తు లోతుగా జరగకూడదని వాళ్లు దొరికిపోయేలా ప్లాన్ చేసి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. సరిగ్గా నాకు కూడా అలాంటి అభిప్రాయమే వచ్చింది.


ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో శివరాం శర్మ గారి ఆధ్వర్యంలోని ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అదే జరిగితే శివరాం శర్మ గారే తదుపరి ముఖ్యమంత్రి అవుతారు. 


పార్టీలో రెండవ స్థానంలో సునీల్ వర్మ గారు ఉన్నారు శివరాం శర్మ గారు మరణిస్తే సునీల్ వర్మ గారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక రాజకీయ వారసత్వం గురించి ఆలోచిస్తే శివరాం శర్మ గారి భార్య పిల్లలు రాజకీయాలకు చాలా దూరం. శర్మ గారి మేనల్లుడు ప్రణవ్, మేనకోడలు నీతూ శర్మ లకు కూడా అవకాశం ఉంటుంది. వాళ్ళిద్దరూ మంచి విద్యావంతులు. శర్మ గారి పట్ల సానుభూతి వీళ్ళకు ఉపయోగపడుతుంది. ఇక పార్టీలో మూడవ స్థానంలో ఉన్న వ్యక్తి తులసీనాథ్. ప్రజలలో గాని పేపర్లలో గాని ఎక్కువగా కనబడడు. కానీ తెర వెనుక కుట్రలు చేయడంలో సుప్రసిద్ధుడు. సునీల్ వర్మను రెచ్చగొట్టి పోలీస్ స్టేషన్ పైకి పంపించాడు. అందువల్ల పోలీసులకు సునీల్ వర్మ పైన అనుమానం కలుగుతుందనేది ఇతడి అంచనా. అలాగే నీతూ శర్మ పైన దాడికి ప్రయత్నించిన వ్యక్తులను విచారణలో సునీల్ వర్మతో పరిచయం ఉన్న వ్యక్తుల పేర్లు చెప్పమన్నాడు. శివరాం శర్మ గారి హంతకుడు, ఆయన మేనల్లుడు ప్రణవ్ తో ఉన్న ఫోటోలు నాకు పంపించాడు. అజ్ఞాత వ్యక్తి పేరుతో నాకు కాల్ చేయించాడు. గతంలో సునీల్ శర్మ దగ్గర పని చేసిన డ్రైవర్ను లొంగదీసుకున్నాడు. అతని ద్వారా ఎస్పీ ఆఫీసులో డబ్బులకు ఆశపడేవారు ఎవరైనా ఉన్నారా అని విచారించాడు. అది పసిగట్టిన మేము మా కానిస్టేబుల్ మధును లంచాలకు ఆశపడే వ్యక్తిగా ప్రొజెక్ట్ చేశాము. మధుని మా కదలికలను తెలియజేయమని కోరాడు, అతన్ని కలిసిన సునీల్ వర్మ మాజీ డ్రైవర్. మా అనుమతితో ఆ వివరాలను తెలియజేసేవాడు మధు. ఫోన్ చేసి మెసేజెస్ పంపించి నీతూశర్మ పైన, ప్రణవ్ పైన అనుమానం కలిగించాలని ప్రయత్నించాడు. అయితే సునీల్ వర్మ మాజీ డ్రైవర్ కాల్ రికార్డ్స్ పరిశీలిస్తే అతను రౌడీ షీటర్ దాముకు సంబంధించిన మనుషులతో టచ్ లో ఉన్నట్లు తెలిసింది. ఇక కానిస్టేబుల్ మధు ద్వారా నేరస్తులకు ఫోన్ చేసుకునే అవకాశం కల్పించాము. ఆఫీసు బయట టీ కొట్టు నడుపుతున్న బషీర్ మనకు ఇన్ ఫార్మర్ గా పని చేస్తూ ఉంటాడు. వాళ్లు దాము అనుచరుడు మునావర్ ను కాంటాక్ట్ చేశారు. అప్పటినుంచి దాము మీద నిఘా ఉంచాము. గతంలో ఓ కేసులో పోలీసులకు లొంగిపోయి అప్రూవర్ గా మారిన శక్తిని,  రాజన్ ను దామును ట్రాప్ చేయడానికి ఉపయోగించాము.


 నా హత్య విషయంగా దాముతో తను మాట్లాడుతున్న సందర్భంగా హిడెన్ కెమెరాతో రికార్డ్ చేశాడు శక్తి. స్త్రీలోలుడైన దాము గతంలో మోనా భర్త పోలీస్ కాల్పుల్లో చనిపోయేలాగా చేశాడు. దాంతో మోనా సరైన అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంది. దాము- మునావర్, జాఫర్ ల భార్య ల పైన కూడా కన్ను వేసిన విషయం ఇటీవలే వారికి తెలియజేసింది మోనా. దాంతో వారు కూడా మాకు సహకరించడంతో దామును పట్టుకున్నాము. సీక్రెట్ ఫోన్లో మునావర్ ద్వారా తులసీనాథ్ కు కాల్ చేయించాము. దొరికిపోయే పరిస్థితి వస్తే దామును చంపేయమని చెప్పాడు తులసీనాథ్. ఆ మాటలు విన్న దాము మాకు సహకరించడానికి అంగీకరించాడు. మునావర్ తులసీనాథ్ మాటల వల్ల తులసీనాథ్ చేయబోయే బాంబు బ్లాస్ట్ గురించి తెలుసుకున్నాము. అందుకు కాంట్రాక్ట్ తీసుకున్న క్రిమినల్స్ ను అరెస్టు చేశాము. పారిపోవడానికి ప్రయత్నిస్తున్న తులసి నాథ్ ను అరెస్టు చేసాము” వివరించాడు దీక్షిత్. 


అందరూ అతన్ని అభినందిస్తూ చప్పట్లు కొట్టారు. 


దీక్షిత్ వినయంగా మాట్లాడుతూ “ఇది నా ఒక్కడి వల్ల జరిగింది కాదు. నా మనసులో ఉన్న విషయాన్ని గ్రహిస్తూ అందుకు అనుగుణంగా నడుచుకునే సీఐ మురళి పాత్ర ఎంతో ఉంది. ఇక లంచగొండి పోలీసుగా నటిస్తూ నేరస్థులతో డీల్ చేస్తూ ఆ విషయాలు ఎప్పటికప్పుడు మాకు తెలియజేస్తున్న కానిస్టేబుల్ మధు గారి సహాయం కూడా ఈ కేసు సాల్వ్ చేయడంలో ఎంతో ఉంది. ఇక ఈ కేసును, ‘నేరస్తులు దొరికారు అంటూ కొట్టి వేయకూడ’దని మొదట్లోనే నాకు సూచించిన నీతూశర్మ గారిని ప్రత్యేకంగా అభినందించాలి. ఇంకా కుటుంబ సభ్యుడి లాగా మెలిగిన మా డ్రైవర్ కోదండమ్ అందించిన సహకారం మరువలేనిది. నేరస్తులుగా ఉన్నా, పరివర్తన చెందిన మునావర్ జాఫర్ ల విషయంలో వీలైనంత సానుభూతి చూపమని నాపై అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. మోనా లూసీలకు సరైన జీవనోపాధి కల్పించే విషయంలో కూడా సహకరించమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను” చెప్పడం ముగించాడు దీక్షిత్.


మరుసటి రోజు నీతూశర్మ తల్లిదండ్రులు, సోదరుడు ప్రణవ్ దీక్షిత్ ను ఇంటిదగ్గర కలిశారు. వారిని సాదరంగా ఆహ్వానించారు దీక్షిత్ తల్లిదండ్రులు నందితm రామ్మోహన్ లు. ప్రణవ్ ఒక చేతిలో గొడుగు, మరొక చేతిలో పాదుకలు పట్టుకొని ఉండడం చూసి ముసిముసిగా నవ్వుకున్నారు.


దీక్షిత్ అతని వంక ఆశ్చర్యంగా చూస్తూ “అదేమిటి? ఇప్పుడు ఎండగాని వానగాని లేవే.. మరి ఆ గొడుగు ఎందుకు” అన్నాడు. 


“మీ ఐపీఎస్ పరీక్షలో ఇండియన్ ట్రెడిషన్స్ గురించి అడగరా?” అన్న గొంతు వినిపించి గుమ్మం వైపు చూశాడు.


లోపలికి వచ్చింది నీతూ శర్మ. 


“నిన్ననే కదా మీ ఇంటికి వెళ్లావు? అప్పుడే మళ్ళీ ఎంట్రీ ఇస్తున్నావా.. ఈసారి కూడా గవర్నర్ గారి రికమండేషన్ తో వచ్చావా” అడిగాడు దీక్షిత్ కొంటెగా. 


“కాదు, మా అత్తమామలు రమ్మంటే వచ్చాను” చెప్పింది నీతూ శర్మ. 


“బావా! ఈ గొడుగు కమండలం పట్టుకొని మీరు కాశీ యాత్రకు వెళుతూ ఉంటే నేను ఆపుతాను: అన్నాడు ప్రణవ్. 


“మీ అక్కయ్య పరిచయమయ్యాక కూడా నేను కాశీకి ఎందుకు వెళ్తాను? వెళ్తే గెలిస్తే పెళ్లయ్యాక హనీ మూన్ కు వెళ్తాను” అన్నాడు దీక్షిత్. 

అందంగా సిగ్గు పడింది నీతూశర్మ. 

అందరూ ఆనందంగా నవ్వుకున్నారు.


=========================================================

సమాప్తం

ఈ ధారావాహికను ఆదరించిన పాఠకులకు

మనతెలుగుకథలు.కామ్ తరఫున,

రచయిత శ్రీ మల్లవరపు సీతారాం కుమార్ గారి తరఫున

ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

=========================================================


మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ మల్లవరపు సీతారాం కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ నిర్వహిస్తున్నాము.

 







Comments


bottom of page