AUGUST 2021 నాన్ స్టాప్ ( వారం వారం ) బహుమతుల ఫలితాలు
- Mana Telugu Kathalu - Admin
- Sep 15, 2021
- 1 min read

Results Of Non- Stop ( weekly ) Prizes For The Month Of AUGUST 2021
మనతెలుగుకథలు.కామ్ లో విజయదశమి మరియు నాన్ స్టాప్ ( వారం వారం ) బహుమతులు ప్రకటించిన విషయం విదితమే. ఆ ప్రకటన చూడని వారు క్రింద ఇవ్వబడిన లింక్ క్లిక్ చేయడం ద్వారా చూడవచ్చు.
రచయితలకు ముఖ్య గమనిక: మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే కథల పైన మనతెలుగుకథలు.కామ్ వారికి పూర్తి హక్కులు ఉంటాయి.
ఇప్పుడు కథతో పాటు పోడ్కాస్ట్ విడుదల చేస్తున్నాము.
అలాగే ప్రచురింపబడ్డ కథలను త్వరలో ప్రారంభించబోయే మా యు ట్యూబ్ ఛానల్ లో ఉంచాలనుకుంటున్నాము.
ఇందుకు అభ్యంతరం లేనివారే రచనలు పంపవలసినదిగా కోరుతున్నాం.
కానీ ఎవరన్నా రచయితలు స్వయంగా పోడ్కాస్ట్ చెయ్యాలనుకున్నా, వారి స్వంత చానెల్స్ లో ఉంచాలనుకున్నా మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాము.
jULY 2021 వరకు గెలుపొందిన కథలకు ఇదివరకే బహుమతులు అందజేశాము.
AUGUST 2021 నాన్ స్టాప్ ( వారం వారం ) బహుమతుల విజేతలను, వారి కథల లింక్ లను తెలియజేస్తున్నాం.
వారానికి ఒక కథనే ఎంపిక చేయాలనుకున్నాం. కానీ మా అంచనాలకు మించి, మంచి కథలు రావడంతో మరిన్ని కథలను ఎంపిక చేశాం.
విజేతల వివరాలు :
01/08/2021 కలియుగ ద్రౌపది కిరణ్ విభావరి
01/08/2021 పరాన్నజీవికి కరోనా గీత వసుంధర
01/08/2021 సీతా రామ్స్ దాసు రాధిక
08/08/2021 మహిళా ప్రస్థానం A. అన్నపూర్ణ
08/08/2021 సబల A. S. సుబ్రహ్మణ్యము
15/08/2021 లోకం తీరు.. పాపా ?? బాబా?? N. ధనలక్ష్మి
22/08/2021 ఇడ్లీ పాత్ర జీడిగుంట శ్రీనివాస రావు
22/08/2021 వారసుడు సుస్మితా రమణ మూర్తి
29/08/2021 స్నేహలతలు భాగవతుల భారతి
29/08/2021 వింత మనుషులు పిట్ట గోపి
29/08/2021 పంచ “పండు “ లు M R V సత్యనారాయణ మూర్తి
29/08/2021 నేను పిసినారోణ్ణి Dr. M. రామ మోహన రావు
(ఈ కథలన్నీ విజయదశమి బహుమతులకు పరిశీలించబడతాయి)
మనతెలుగుకథలు.కామ్ యాజమాన్యానికి సన్నిహితులైన వారి రచనలు బహుమతులకు పరిశీలించ లేదు ( మల్లవరపు సీతారాం కుమార్, మల్లవరపు సీతాలక్ష్మి మొ: వారి రచనలు)
రచయితలకు/రచయిత్రులకు మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. విజేతలకు వ్యక్తిగతంగా మెయిల్ చేస్తున్నాం. బహుమతులు 19/09/2021 న వారి ఖాతాలకు జమచేస్తాం. September 2021 నెలలో ప్రచురింపబడే కథల నుండి ఎంపిక చేసిన విజేతల వివరాలు 15 /10 /2021 న ప్రచురిస్తాము.
మనతెలుగుకథలు.కామ్ ను విశేషంగా ఆదరిస్తున్న పాఠకులకు, రచయితలకు మరోసారి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
Comments