పొందకు మతిగా వేదన…
- Bhattu Venkata Rao

- 22 hours ago
- 2 min read

Pondaku Mathigaa Vedana - Telugu Inspirational Poetry | Bhattu Venkata Rao
పొందకు మతిగా వేదన… - తెలుగు ప్రేరణాత్మక కవిత | భట్టు వెంకటరావు
Published in manatelugukathalu.com on 03/09/2026
క. పొందకు మతిగా వేదన;
చెందునని తలచిన వన్ని చెందక నీవి
బ్బందుల పాలైనా ని
న్నందరు చులకనగ చూసి నవ్విన గానీ!
క. అందరికీ వచ్చును యి
బ్బందులు, పెనుగాలి వీచి భయపెట్టెడు రీ
తిన్; దైవము తోడై యుం
డున్ దీనుల కెపుడు; భయపడుట తగనిదియౌ!
క. బ్రతుకంటే కేవలముగ
వెతలే ఉండవు గద! తెలి వెన్నెల వచ్చుం
గా తప్పక చీకటికి అ
వతలని మరువంగ నెపుడు వలదది మదిలోన్!
క. ఎవరెన్ని నింద లేసిన
సవరించుక వెళ్ళుటదియె సరియగు నదియౌ;
పవనానికి తల వంచు త
రువది గడచినంతనే మెరుగగును కాదా!
భట్టు వెంకటరావు గారి కొన్ని ఇతర రచనలు:
భట్టు వెంకటరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: భట్టు వెంకటరావు

నా పేరు భట్టు వెంకటరావు.
కేంద్ర ప్రభుత్వ విశ్రాంత అధికారిని.
సాహిత్యంపై అభిలాషతో విశ్రాంత జీవితంలో తెలుగు సంప్రదాయ సాహిత్యం చదవడం మొదలుపెట్టాను. అలా చదవడం మొదలుపెట్టిన కొన్నాళ్ళకి చిన్న చిన్న వ్యాసాలు వ్రాయడం ఆరంభించి, కొనసాగిస్తున్నాను.
నా రచనా వ్యాసంగం ప్రథానంగా పూర్వ కవుల రచనలలోని ఆసక్తికరమైన విషయాలపై సాహిత్య సంబంధమైన వ్యాఖ్యలతో కూడినదిగా ఉంటుంది. అన్ని ప్రథాన దినపత్రికల సాహిత్యం పేజీలలో నా వ్యాసాలు గత ఆరేడు సంవత్సరాలుగా ప్రచురితమయ్యాయి, అవుతున్నాయి. వాటితో పాటు అప్పుడప్పుడు ఛందోబద్ధమైన పద్యాలను, కంద పద్యం వ్రాయడంతో మొదలుపెట్టి, వ్రాస్తున్నాను.
ప్రస్తుతానికి నా రచనా వ్యాసంగం గురించి చెప్పుకోగలిగినది ఇంతవరకే. ధన్యవాదములు!
నమస్కారములతో,
భట్టు వెంకటరావు,
హైదరాబాదు.






Comments