top of page
Original_edited.jpg

బుద్ది వచ్చింది

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link

ree

'Buddhi Vachhindi' New Telugu Story Written By Jidigunta Srinivasa Rao


రచన : జీడిగుంట శ్రీనివాసరావు


సుబ్బారావు గవర్నమెంట్ ఆఫీస్ నుంచి రిటైర్ అయిన తరువాత, పేపర్లు, tv న్యూస్, వెబ్ పత్రికలు చదవటం మొదలుపెట్టాడు. వెబ్ పత్రికలో వచ్చిన ప్రతీ కథలో తప్పులు వెతకడం, ఆ కథ రాసిన వారి గురించి, కథ గురించి కామెంట్స్ పెట్టి వాళ్ళని బాధపెట్టాను అని తనంత తెలివితేటలు వున్నవాడు లేడని గర్వం తో వున్నాడు.

చాలామంది ఆ కథ రాయడం లోని ఉద్దేశ్యం విపులంగా చెప్పినా వినకుండా వాళ్ళ కథ కి అర్ధం లేదని వాదిస్తో కామెంట్స్ పెట్టేవాడు.

చివరికి ఒక రచయిత, దమ్ముంటే నువ్వే మంచి కథ రాసి చూపించు,అంతేగాని అందరిని కించపరచడం తప్పు అని చివాట్లు పెట్టాడు.

దానితో సుబ్బారావు కి పంతం పెరిగి ఎలాగైనా ఒక కథ రాసి, అందరి చేత శభాష్ అనిపించుకుంటా అనుకుని, "అవకతోకలు " అనే పేరు తో ఒక కథ రాసి, చదవకుండానే అప్రూవల్ యిచ్చి వేసుకునే ఒక వెబ్ పత్రికకి పంపడం, అది చదివిన పాఠకులు, తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టడం జరిగిపోయింది.

ఉదయంనే కాఫీ తాగుతో తన కథ ని ఎంత రెస్పాన్స్ వచ్చిందో చూద్దాం అని ఫేస్బుక్ ఓపెన్ చేసి చూస్తోవుంటే, ఆ కామెంట్స్ కి మొహం ఎర్రబడి, వాళ్ళని మీకు అర్థం చేసుకునే అంత తెలివి లేదు అని రాద్దామనుకుని, అసహనం గా కూర్చున్నాడు.

అతనిని చూసి అతని భార్య “ఉదయాన్నే ఏమైంది, ఆలా మొహం కందిపోయింది, మళ్ళీ ఎవరైనా మంగళహారతి పాడారా?” అంది నవ్వుతూ.

“నేను ఎంతో అలోచించి మంచి కథ రాసి పంపిస్తే, బొడ్డు వూడని ప్రతి వెధవ నా కథ కి వంక పెడుతున్నారు” అన్నాడు.

“మరి, ఇన్నాళ్లు మీరు చేసింది అదేగా? మరి వాళ్ళు ఎంత బాధపడి వుంటారో ఆలోచించారా. నేనూ ఫేస్బుక్ లో మెంబెర్ నే, మీ అర్థం పర్ధం లేని కామెంట్స్ చదివి, ‘అవునులే గవర్నమెంట్ ఉద్యోగం లో తప్పులు వెతకడం అలవాటు అయ్యి, మనలేక అందరిని ఏదోవిధంగా యిబ్బంది పెట్టడం అలవాటైపోయింది’ అనుకున్నాను” అంది.

“ఏడ్చావ్, పోపు పెట్టుకునే నువ్వు కూడా నన్ను అనేదానివా?” అన్నాడు సుబ్బారావు.

“ఈ నోటి దురదే మిమ్మల్ని ఈ రోజు యింత అవమానానికి గురిచేసింది. నేను భార్య ని కాబట్టి మనసులో తిట్టుకుంటాను, బయటవాళ్ళు కాబట్టి నానా తిట్లు తిట్టారు. అయినా నాకెందుకు..” అంటూ కాఫీ గ్లాస్ తీసుకుని వంటగది లోకి వెళ్ళిపోయింది.

సుబ్బారావు కొద్దిసేపు కళ్ళు మూసుకొని ఆలోచిస్తో, ‘అవును నేను రాసిన కథ ని చెత్త కథ అన్నందుకు యింత బాధపడుతున్నాను. మరి పనిగట్టుకుని, అందరి రచనలని విమర్శించినప్పుడు, వాళ్ళు కూడా ఇంతే బాధ పడి వుంటారు కదా! ఛీ చాలా పొరపాటు చేసాను. విమర్శలు సహేతుకం గా వుండాలి కానీ, కించపరిచే విధంగా రాయడం తప్పు’ అనుకుని, గబగబా ఆ వెబ్ పత్రికకి ఒక ప్రకటన పంపించాడు.

‘ఇన్నాళ్ళు అందరి రచయితల రచనలను నా విమర్శలతో బాధ పెట్టినందుకు క్షమించండి. నేను చేసింది తప్పు అని, నా కథల మీద వచ్చిన కామెంట్స్ ని చదివి బాధ పడినప్పుడు తెలిసింది. బుద్దివచ్చింది’ అని ప్రకటన యిచ్చాడు.

యిచ్చిన గంటలోనే లెక్కలేనన్ని కామెంట్స్, ‘పెద్దవాళ్ళు మీరు క్షమించండి అనటం తగదు, మాలాంటి రచయితలని మీ లాంటి వాళ్ళు ప్రోత్సహించాలి’...

ఇన్ని కామెంట్స్ చూసుకుని సుబ్బారావు సంతోషపడిపోయాడు చిన్నపిల్లాడిలా.

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలు చదవాలంటే కథ పేరు పైన క్లిక్ చేయండి.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page