top of page

సైనైడ్ - ఎపిసోడ్ 10


'Cyanide Episode 10' New Telugu Web Series

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)గత ఎపిసోడ్ లో


ఏ-వన్, తనను తప్పించమని బి-వన్ ని కోరుతాడు.

అతనికి కావలసిన టికెట్స్ ఆరెంజ్ చేస్తానని, న్యూఢిల్లీ ఏపీ ఎక్స్ప్రెస్ ఎక్కమని చెబుతుంది బి-వన్.

స్టేషన్ కి వెళ్లే దారంతా బలమైన నిఘా ఉంటుంది.


ఇక సైనైడ్ చివరి భాగం చదవండి


ఆరోజు ఏ-వన్ కి సాయంత్రం చీకటి పడుతున్న వేళ, ఒక వ్యక్తి వచ్చి ఒక కొరియర్ ఇచ్చాడు. కొరియర్ విప్పి చూసుకునే సరికి, తాను వెళ్లబోయే డెస్టినేషన్ కి అన్ని రైల్వే టికెట్స్, ఫ్లైట్ టికెట్స్ కూడా వచ్చాయి. అంతకు ముందు రోజే ఏ-వన్ అకౌంట్లోకి చాలా పెద్ద మొత్తంలో లో మనీ ట్రాన్స్ఫర్ కూడా అయింది. ఇలా అన్ని విధాల బి-వన్ పంపించే సరికి ఎక్కడలేని ధైర్యం, ఉత్సాహం వచ్చాయి ఏ -వన్ కి. అయినా అంచెలంచెలుగా ఉన్న పోలీసు భద్రత వలయాన్ని ఎలా చేధించుకుని విశాఖపట్నం రైల్వే స్టేషన్ చేరుకోవాలో.. అన్న విధంగా ఆలోచిస్తూ, గ్లాసు లో ఉన్న విస్కీ తాగుతూ ఆలోచించసాగాడు ఏ-వన్.


ఆ మర్నాడు తెల్లవారుజామున ఏ-వన్ తయారై, తన ఉనికి తెలియకుండా మంచి క్యాప్ పెట్టుకున్నాడు. ఒక అఫీషియల్ లాగా వైట్ షర్టు టక్ చేసుకుని, నీటుగా తను కొన్న షూస్ వేసుకుని, తన కుంటినడక ను చాలా వరకు తగ్గించి, మెల్లగా నడుస్తూ మధ్య మధ్యలో అటు ఇటు గమనిస్తూ, షేర్ ఆటో కోసం మధురవాడ హైవే కి వచ్చాడు.


అప్పటికే రాత్రంతా గస్తీ తిరుగుతున్న పోలీసులు అలిసిపోయి, తమ తమ జీపుల్లోనే కూర్చుని NH-16, హైవే లో పోతున్న అన్ని వెహికల్స్ ని, "విశాఖపట్నంలో సిటీ లోకి ఎంటర్ అవుతున్న ప్రతి బస్సును, కార్లను , తనిఖీ చేస్తూ ఉండగా, సరిగ్గా అదే సమయానికి కి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ డ్యూటీ కి వెళ్ళవలసిన వారు, కనబడిన షేర్ ఆటోలను ఎక్కుతూ, తెల్లవారుజామున ఎంతో సందడిగా ఉంది మధురవాడ హైవే.


ఏ-వన్ మధురవాడ హైవే మీద ఉన్న బోర్డులకు తన ఊహ ముఖచిత్రం తానే చూసుకుంటూ, మనసులో బెంగగా ఉన్నా, అప్పుడే వచ్చిన ఒక షేర్ ఆటో ఎక్కి, తనకు తెలిసిన మద్దిలపాలెం జంక్షన్ దగ్గర దిగి పోయాడు. ఒకవేళ తనను ఎవరైనా పోల్చి పోలీసులకు చెబితే, ఆ షేర్ ఆటో ను వెంబడిస్తారు! కనుక మద్దిలపాలెం డిపో నుంచి NAD కొత్త రోడ్ వరకు, మరో షేర్ ఆటో ఎక్కి అలా ఎవరికీ అనుమానం రాకుండా, NAD జంక్షన్ నుంచి మళ్లీ విశాఖపట్నం రైల్వే స్టేషన్ కు మరో షేర్ ఆటో గాభరాగా ఎక్కుతున్న సమయంలో , కాలు సరిగ్గా పడక ఆటోలో కూర్చో లేకపోవడం వలన, రోడ్డు మీద పడిపోయాడు.


వెంటనే అక్కడ ఉన్న జనాలు అతని లేపి చూశారు. చెవి వెనుక భాగాన రక్తం కారడం గమనించి వెంటనే 108కి ఫోన్ చేశారు. అప్పటికే స్పృహతప్పి పడిపోయిన ఏ-వన్ ను గవర్నమెంట్ హాస్పిటల్ (K G H) కు తీసుకువచ్చారు అంబులెన్స్లో.


యాక్సిడెంట్ కేస్.. డాక్టర్ ఇమీడియట్ గా అటెండ్ అయి, ప్రధమ చికిత్స జరిపి, వివరాల కోసం ఏ వన్ తో పాటు వచ్చిన చిన్న బ్యాగ్ ను చూశారు. వెంటనే పోలీసులకు కబురు పంపించి, ఆ బ్యాగును తెరిచి చూసి బంధువులకు ఫోన్ చేయమన్నారు.

పోలీసులు వచ్చి ఆ బ్యాగ్ తెరిచి చూసేసరికి ఆశ్చర్యపోయి, పోలీస్ కమిషనరేట్ కి ఫోన్ చేసి “సార్! రాజశేఖర్ గారిని వెంటనే కేజీహెచ్ హాస్పిటల్ కి తీసుకు రండి. మనం వెతుకుతున్న హంతకుడి ఆచూకీ తెలిసినట్లుంది” అని చెప్పారు. రాజశేఖర్ గారు ఉన్నపళంగా, చాలా హడావిడిగా బయలుదేరి కింగ్ జార్జ్ హాస్పిటల్ కు చేరుకున్నారు.


రాజశేఖర్ గారు తనకు వచ్చిన సమాచారంతో, కేజీహెచ్ ఆసుపత్రిలో యాక్సిడెంట్ కి గురైన వ్యక్తిని చూసి, అచ్చు ఊహ ముఖచిత్రం లాగా ఉన్న వ్యక్తిని చూస్తూ, తన పక్కనే నిలబడి ఉన్న డాక్టర్ గారితో, ఆ పక్కన నిలబడి ఉన్న పోలీస్ కమిషనర్ గారిని ఉద్దేశించి, "yes, we got the accused, cyanide capsule killer, atlast, thank god! we r now safe from terrorism, our indians should be proud of deceased Sekhar! అంటూ ఎంతో హాయిగా ఊపిరి పీల్చారు.


నలుగురు పోలీస్ కానిస్టేబుల్ ని అక్కడే ఉంచి, “చూడండి! డాక్టర్లు ఇతనికి ట్రీట్మెంట్ చేసి తెలివి లోకి రాగానే, నాకు తెలియజేయండి!” అంటూ హడావిడిగా ఫోన్ లో హోమ్ మినిస్టర్ తో మాట్లాడుతూ “సార్! హంతకుడు దొరికాడు, నేను పూర్వాపరాలు ఆ వ్యక్తి తెలివి లోకి వచ్చాక మాట్లాడి, అతనిని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ కి ఇన్వెస్టిగేషన్ కోసం తీసుకు వస్తాను” అని చెప్పారు.

"Welldone mr raj. Pl do it, we will make arrangements. We should know, which terrorist group is behind the cyanide capsule murder in vizag, అని జవాబు రాగానే తిరిగి తన గెస్ట్హౌస్కి వెళ్లిపోయారు రాజశేఖర్ గారు.

రెండు రోజుల తర్వాత ఏ-వన్ కు ట్రీట్మెంట్ జరిగి కోలుకున్నాక, స్పెషల్ ఫ్లైట్ లో రాజశేఖర్ గారు, పోలీస్ సిబ్బంది, . ఏ-వన్ ను ఢిల్లీకి తీసుకు వెళ్లారు.


న్యూఢిల్లీలోని క్రైంబ్రాంచ్ ఇన్వెస్టిగేషన్లో ఏ-వన్ ఎన్నో థర్డ్ డిగ్రీ పనిష్మెంట్ లు ఎదురకొన్నాక అసలు నిజాలు బయట పెట్టాడు.


అతడు చెప్పిన వివరాల ప్రకారం బి-వన్ ఒక అంతర్జాతీయ ఉగ్రవాది ముఠాకు టెక్నికల్ ట్రైనర్ గా పనిచేస్తోంది. విదేశాల్లో మంచి పోస్టుల్లో ఉన్న ఉన్నతాధికారులను, తన ప్రణయ కలపాలతో వశపరచుకుని, ఆ దేశాలలో ఎలా ఉగ్రవాద దాడులు జరపాలో ప్లాన్ చేసేది బి-వన్. ఈవిడ ఒక కరుడుగట్టిన ఉగ్రవాది. వేరే పేర్లతో ప్రస్తుతం కెనడా లో ఉంటూ, భారతదేశంలో ఉన్న అత్యంత కీలక రహస్యాలు తెలుసుకోవడానికి, DRDO ఉన్నత అధికారి అయిన శేఖర్ ను తన ప్రేమ వలయంలో పడేసింది. వివరాలు సేకరించడానికి కుట్ర పన్నడం, అది విఫలమవడం చాలా సార్లు జరిగింది.


ఏ-వన్ ఆమెకు చాలా కాలం నుండి అసిస్టెంట్గా పనిచేస్తూ, ఇక్కడ ఇండియాలో కూడా శేఖర్ తో స్నేహం నటించాడు. బి-వన్ సలహా మేరకు శేఖర్ ద్వారా రక్షణ రహస్యాలు సేకరించాడు.


శేఖర్ సేకరించిన వివరాలు ఇవ్వడానికి నిరాకరించి, తన దేశభక్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకోవాలని మొండికేశాడు.

దాంతో అతన్ని నా దగ్గర ఉన్న సైనైడ్ క్యాప్సిల్ తో చంపెయ్యమని, కెనడా లో ఉన్న లీడర్ బి-వన్ ఆర్డర్ వేసింది.


అతడు చెప్పిన వివరాలు విన్న రాజశేఖర్ గారు, అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్స్ అందరూ ఆశ్చర్యపోతూ, ఒక అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నం నగరంలో ఇంత పెద్ద దేశ కుట్ర! అంటూ నమ్మలేక అందరూ నోళ్ళు వెళ్ళబెట్టారు. ఆ తర్వాత ఏ-వన్ కెనడాలోని మాంట్రియల్ లో బి-వన్ వుండే రహస్య ప్రదేశాన్ని, దాని చిరునామా తో సహా అందజేశాడు.

వెంటనే ఢిల్లీలోని హోంమినిస్త్రీ డిపార్ట్మెంట్, ఎంబసీ రోడ్ లోని Canadian embassy ని కాంటాక్ట్ చేసింది. త్వరత్వరగా బి-వన్ టెర్రరిస్టు గ్రూపు నివసిస్తున్న ప్రదేశాలు మార్క్ చేసి, అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయమని కోరింది. భారత ప్రభుత్వం లెటర్ హెడ్ మీద రాసి ఆథరైజ్ చేసిన ఉత్తరం వారికి పంపింది.


ఆ తర్వాత భారత దేశ న్యాయ వ్యవస్థ, కెనడా దేశపు న్యాయవ్యవస్థ సంయుక్తంగా ఏ-వన్ , బివన్ లకు తక్షణ మరణశిక్ష విధించి అమలు చేసింది.


"కెనడియన్ ప్రభుత్వం కూడా భారత ప్రభుత్వ ఇంటిలిజెన్స్ శాఖని, వేనోళ్ళ అభినందిస్తూ కెనడా లో ఉన్న ఉగ్రవాద ముఠాల స్థావరాలన్ని, శోధించి నాశనం చేసింది.

ఇక ఆ రోజు ఇంటెలిజెన్స్ చీఫ్ రాజశేఖర్ గారు ఢిల్లీకి బయలుదేరబోతూ, తన కారుని శేఖర్ ఇంటి ముందు ఆపించి, లోనికి వెళ్లి, మర్యాదపూర్వకంగా శేఖర్ భార్యను పలకరిస్తూ, “అమ్మా! మీ భర్త శేఖర్ దేశ రక్షణకు భంగం వాటిల్లుతుందని, ఆయన మందు మత్తులో తెలుసుకోలేక, ధనానికి ప్రలోభ పడి, మాయ ప్రేమను అనుభవిస్తూ, చేయరాని పని చేశాడు! కానీ ఎందుకో కొన్ని పరిస్థితుల వల్ల నిజం తెలుసుకొని, అన్ని రహస్య వివరాలు ఉన్న హార్డ్ డిస్క్ నీకు ఇచ్చి కాల్చేయమని చెప్పి, ఒకరకంగా "దేశ భద్రత , రక్షణ వ్యవస్థ వివరాలు" పైకి వెళ్లకుండా, ఉగ్రవాదుల చేత పడకుండా, తనకు తానే ఆహుతి అయ్యాడు!


బాధ పడకమ్మా! నీకు సహాయం గా ప్రభుత్వంతో మాట్లాడి, ఉద్యోగం వచ్చేటట్టు చేస్తాను. నువ్వు జీవితంలో భారతమాతకు సేవ చేస్తూ మీ భర్త కు వచ్చిన కళంకాన్ని సమూలంగా నివారించు. ఇదే నేను నీకు చేసే సాయం! ఆ తర్వాత నీ పాప ఎంత చదివినా, ఆ చదువు మన స్టేట్ గవర్నమెంట్ కూడా మొత్తం సాయం చేస్తుంది!” అంటూ తనకు ఒంగి పాదాభివందనం చేస్తున్న శేఖర్ భార్య రేణుక తల మీద నిమురుతూ, విజయగర్వంతో వెనుదిరిగారు రాజశేఖర్ గారు.


ఆ మర్నాడు ప్రశాంతమైన హృదయంతో ఢిల్లీలోని ఇండియా గేట్ కి వెళ్లి మనసారా “జైహింద్!” అంటూ సెల్యూట్ కొట్టి భారతమాతకు వందనాలు అర్పించారు ఇంటెలిజెన్స్ చీఫ్ రాజశేఖర్ గారు. *****జై హింద్.

ఈ కథ కేవలం కల్పితం మాత్రమే. ఎవరిని ఉద్దేశించి రాసింది కాదు. ఇది నా స్వీయ రచన.

( వేల్పూరి లక్ష్మీ నాగేశ్వరరావు).


Podcast Link


వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసంమాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.రచయిత పరిచయం :

నమస్కారాలు. నా పేరు వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు. వైజాగ్ లో టాక్స్ కన్సల్టెంట్ గా పని చేస్తున్నాను.కథలు చదవడం, తీరిక సమయాల్లో రచనలు చేయడం నా హాబీ. నా కుమార్తె సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. శ్రీమతి వైజాగ్ లోనే ఒక ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తోంది.నా కథలను ఆదరిస్తున్న పాఠకులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.24 views0 comments

Comments


bottom of page