top of page
Original.png

హిమాచల్ ప్రదేశ్ యాత్ర – 4

2 minutes ago
2 min read

హిమాచల్ ప్రదేశ్ యాత్రలో బగళాముఖి, చింతపూర్ణి మరియు జ్వాలాముఖి దేవి ఆలయాలను దర్శించిన ఆధ్యాత్మిక అనుభవం

Himachal Pradesh Yathra - 4 - Telugu Piligrimage Story | Annapurna Somayajulu

హిమాచల్ ప్రదేశ్ యాత్ర – 4 - తెలుగు తీర్థయాత్ర కథ | అన్నపూర్ణ సోమయాజులు

Published in manatelugukathalu.com on 18/09/2026



హిమాచల్ ప్రదేశ్ యాత్ర – 4

                            *********

9.8. 2026, ఆదివారం 


ఉదయం తొమ్మిది గంటలకు ధర్మశాల బయలుదేరాం. 

మొదటగా దలైలామా గారికి సంబంధించిన ఆశ్రమాలు/ ఆలయాలు చూసాం. 

ఆ తర్వాత ధర్మశాల, క్రికెట్ స్టేడియం చూసాం. ప్రపంచంలో అన్నిటికన్నా ఎత్తైన స్టేడియం అట. మా గ్రూప్ లో ఉన్న క్రికెట్ అభిమానులు చాలా మంది చాలా సంతోషించారు. 

నాకు క్రికెట్ గురించి పెద్దగా అవగాహన ఆసక్తి లేకపోవడంతో, ఫొటోలు తీసి పిల్లలకు పంపి ఆనందించాను. 


ఆ తర్వాత వార్ మెమోరియల్ అని ఒక ప్రదేశం చూసాం. ఇక్కడ నా అనుభూతి మాత్రం అక్షరాలకు అందనిది. 

వీరమరణం పొందిన సైనికుల స్మారక స్థూపాలూ, వారిని నినదిస్తూ రాసి ఉన్న రకరకాల నినాదాలు, కళ్ళవెంట నీళ్ళు జారుతున్న విషయం కూడా గమనించలేదు నేను. 


నిజంగా మన పిల్లాపాపలతో మనం నిశ్చింతగా ఉండగలుగుతున్నామంటే ఆ వీరధీరసైనికుల త్యాగాల ఫలితమే. వారి స్మారక స్థూపాల ముందు మౌనంగా మోకరిల్లడం మినహా మరేం చేయగలం మనం??!!  


కొండవాలు ప్రదేశాలలోని టీ తోటలూ, స్థానిక కళాకృతుల విక్రయాలు జరిగే వీధులూ, ఇలా చూడదగిన, చూడగలిగిన ప్రదేశాలు చూసుకుంటూ సాయంత్రానికి హోటల్ కి చేరాం. 


సాయంత్రం ఓపిక ఉన్నవాళ్ళు దగ్గరలోనే ఉన్న చాముండాదేవి ఆలయానికి మరొకసారి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చారు. 

ఆ తర్వాత మామూలే. డిన్నర్ ముగించి నిద్రాదేవి ఒడిలో వాలిపోయాం.


10.8.2026, సోమవారం. 

ఉదయం, ఆరున్నర గంటలకే బయలుదేరామీరోజు.

మధ్యాహ్నం ఒంటిగంటకు నైనా దేవి ఆలయం చేరాం. 

ఆ దారి అందాలు ఆస్వాదించాల్సిందేగానీ అక్షరీకరించడం నావల్ల కాలేదు. 

అందమంతా మూటగట్టి ఆ కొండకోనల్లో పోసేసాడు ఆ మహేశ్వరుడు. 


ఔనుమరి, వజ్రేశ్వరీ, చాముండా, బగళాముఖీ, శీతలా, చింతాపూర్ణి, జ్వాలాముఖి, నైనా దేవి , మానసాదేవి........

ఇలా ఇన్ని రూపాలుగా అమ్మవారు కొలువుదీరినచోట,  అందానికేం కొదువ!!! 

సాక్షాత్తూ సౌందర్యలహరి ఆ తల్లి. 


నైనాదేవి ఆలయం, హిందూ పురాణాల ప్రకారం సతీదేవి నేత్రాలు పడిన పవిత్ర స్థలంగా భావిస్తారు, అందుకే  ఇక్కడ అమ్మవారిని 'నయనా దేవి' అంటారు. వాడుకలో నైనాదేవి అయ్యింది. 

54 శక్తి పీఠాలలో ఇది ఒకటి.


హిమాచల్ ప్రదేశ్ లోని బిలాస్‌పూర్ జిల్లాలో  శివాలిక్ శ్రేణి కొండలపై ఈ ఆలయం ఉంది.

చుట్టూ సుందరమైన ప్రకృతి దృశ్యాలతో కనువిందు చేస్తుంది.


ఆ తర్వాత మానసాదేవి ఆలయం. సతీదేవి హృదయం ఇక్కడ పడిందట.

సిద్దపీఠమని కొంతమంది, శక్తిపీఠమని కొంతమంది. 

రెండింటికీ తేడా నాకు తెలియలేదు. 

సతీదేవి శరీరభాగాలు పడిన క్షేత్రాలు శక్తి పీఠాలు,

మన సాధనకు సిద్ధి కలిగించే క్షేత్రాలు సిద్దపీఠాలు,

అని నేను అనుకుంటున్నాను. 


హరిద్వార్ లో ఉన్న మానసాదేవి శక్తి పీఠమనీ, 

ఇక్కడ ఈ ఆలయం సిద్దపీఠమనీ స్థానిక పూజారులు చెప్పారు. 


కథలూ కారణాలూ వేరువేరైనా, కనువిందుచేస్తున్న రూపం మాత్రం కమనీయం.  కళ్ళనిండుగా నింపుకున్నామని మనసుకి సర్దిచెప్పుకోవడమే గానీ,  ఈ ప్రకృతి అందాలు ఆస్వాదించాలంటే  ఒక జీవితకాలం సరిపోదు అనిపించింది.  

అక్కడి స్థానికులు ఎంత అదృష్టవంతులో  అని పదే పదే అనుకుంటూ,  రాత్రి ఎనిమిది గంటలకు హోటల్ చేరాం. 


                                                                                                  

 (సశేషం)

          

***


పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.



అన్నపూర్ణ సోమయాజులు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


అన్నపూర్ణ సోమయాజులు

 రచయిత్రి పరిచయం: అన్నపూర్ణ సోమయాజులు

పేరు : అన్నపూర్ణ సోమయాజులు. వెంపటి.

W/o. V.s. somayajulu.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page