top of page
Original.png

ఇన్స్పెక్టర్ ఝాన్సి

Jul 17
3 min read

Updated: Jul 22


ప్రేమలో మోసపోయి పోలీస్ ఇన్స్పెక్టర్‌గా ఎదిగిన ఝాన్సి – మహిళా సాధికారత తెలుగు కథ
ప్రేమలో మోసపోయి పోలీస్ ఇన్స్పెక్టర్‌గా ఎదిగిన ఝాన్సి – మహిళా సాధికారత తెలుగు కథ

Inspector Jhansi - Telugu Inspirational Story | Penumaka Vasantha

ఇన్స్పెక్టర్ ఝాన్సి - తెలుగు ప్రేరణాత్మక కథ | పెనుమాక వసంత

Published In manatelugukathalu.com On 17/07/2026


ఆ ఆశ్రమంలో పోలీస్ జీప్ ఆగింది. అందులో నుండి ఒక పాతికేళ్ల యువతి పోలీసు కానిస్టేబుల్ డ్రెస్సులో దిగింది. బయట వాచ్మెన్ ను పలకరించింది.

"తాతా బాగున్నావా?” 


“అమ్మా ఎవరు తమరు?” 


“నేను.. గుర్తు పట్టలేదా? నేను ఝాన్సీని, ఇక్కడే ఉన్నాగా, చాలారోజులు గుర్తు పట్టలేదా?" అని కిలకిల నవ్వింది.


ఆ నవ్వు గుర్తు పట్టి, "ఆ ఝాన్సమ్మా! నువ్వు చిరునవ్వులు చిందిస్తే.. ఇపుడు గుర్తు పట్టాను. బావుండావా తల్లి?" 


"బావున్నా. నువ్వు ఎలా ఉన్నావు?" 


"బావుండాను. నువ్వు ఈ డ్రెస్సులో!" అంటూ ఆశ్చర్యంగా చూసాడు తాత. 


"నేను పోలీసు ఆఫీసర్ అయ్యాను. ఈ స్వీట్ పాకెట్ తీసుకో. అమ్మమ్మ బావుందా? అమ్మమ్మను అడిగానని చెప్పి ఈ స్వీట్ ఝాన్సీ ఇచ్చిందని ఇవ్వు." 


"అట్టాగే తల్లి, సల్లగా ఉండు."

"తాతా, ఆశ్రమంలో అమ్మ ఉన్నారా?" 


"వున్నారు అమ్మా! లోనికి వెళ్ళు" అన్నాడు ఎంతో ప్రేమగా.


లోపలికి వెళితే చాలా ప్రశాంతంగా ఉంది. నిర్మలమైన ప్రేమను పంచే పూజ్య మాతాజీ అక్కడ భక్తులకు ప్రియ భాషణం చేస్తున్నారు. అక్కడ వెనుక వరుసలో కూచుని మాతాజీ ఉపన్యాసం వింటూ ఉంది ఝాన్సీ.


"భక్తులకు నేను కోరేది ఒక్కటే. మనకు కాలం కలిసిరానపుడు పరిస్థితులకు తగ్గట్లుగా వుండటం నేర్చుకోవాలి. ముందు నిన్ను నువ్వు నమ్ముకో. ఎన్ని అపజయాలు ఎదురైనా నువ్వు నిశ్శబ్ద యుద్ధం చేయి. తర్వాత విజయం సాధించినప్పుడు ఆ నిశ్శబ్దాన్ని చేధించి అపుడు నువ్వు నీ గొంతు సవరించుకుని మాట్లాడు. విజయానికి వాళ్ళు మోకరిల్లి నిన్ను అక్కున చేర్చుకుంటారు."


'అమ్మా, మీరు చెప్పిన మాటలకే నేను నన్ను మార్చుకుని ఈనాడు ఈ స్థితికి చేరానంటే మీ వల్లే అమ్మా' అనుకుంది మనసులో. 


అందరూ వెళ్ళిన తర్వాత మాతాజీని కలిసింది ఝాన్సీ. టోపీ తీసి మాతాజీ చేతిలో పండ్లు ఉంచి నమస్కరించింది.



"ఝాన్సీ! నిన్ను ఈ డ్రెస్సులో చూస్తే ఆనందంగా ఉంది తల్లి. నువ్వు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం అందుకున్నావు" అంది మాతాజీ. 


"అమ్మా! ఆరోజు నేను దిక్కు లేని స్థితిలో అమ్మవాళ్ళు వదిలేశారు. ప్రేమించిన వాడు వదిలేశాడు. చావబోయే స్థితిలో మీ దగ్గరకు వస్తే నన్ను అక్కున చేరుకున్నారు. తర్వాత మీ సాయంతో చదివి ఈ పోలీసు ఆఫీసర్ గా ఎన్నిక అయ్యాను. ఇపుడు నా కర్తవ్యం, నాలాంటి ఆడపిల్లలను ఈ మగ వాళ్ళ నుండి రక్షించటానికి నా ప్రయత్నం చేస్తాను."


"అట్లాగే తల్లి, నువ్వు పడిన బాధ ఎవరూ పడకూడదని నువ్వు తీసుకునే నిర్ణయం మంచిదే. సమాజంలో అన్ని వర్గాల వారికి సాయం చేస్తూ అందరి బంధువు అనిపించుకో." 


"అలాగే అమ్మా!" అంది ఝాన్సీ. 


"నువ్వు అలా చేస్తావని నాకు తెలుసు!" అంటూ మాతాజీ చిరునవ్వు నవ్వింది. ఆమె నవ్వును చూసి 'చిరునవ్వుల దేవత మా అమ్మ' అనుకుని బయటకు వచ్చింది ఝాన్సీ.


ముందుగా తనను ప్రేమించి మోసం చేసిన ఫణి ఇంకొకరి జీవితంతో ఆడుకుంటున్నాడని తెలిసింది. ముందు ఆ ఫణి సంగతి కనుక్కోవాలి అంటూ సన్నద్ధురాలు అయింది ఇన్స్పెక్టర్ ఝాన్సి.


ఆరోజు సాయంత్రం బస్టాండ్ లో సివిల్ డ్రెస్సులో కూచుని ఉంది ఝాన్సీ. అపుడే వచ్చిన ఫణి ఒక అమ్మాయితో క్లోజుగా మాటాడుతున్నాడు. "ఫణి, నన్ను మర్చిపోయి ఈ అమ్మాయితో తిరుగుతున్నావా?"


"నా ఇష్టం. నువ్వెవరు చెప్పటానికి? సుమ, ఈ పిచ్చి దాని మాటలు వినవాకు. దీని మీద నాకు ప్రేమ లేదు. అదే నన్ను ప్రేమించమని వెంట పడుతుంది. నాకు రేపో మాపో ఉద్యోగం వస్తుంది. నిన్ను అపుడు పెళ్లి చేసుకుంటాను."


ఆ అమ్మాయి దగ్గరికి ఝాన్సీ వెళ్ళి, "వీడు వట్టి వెదవ. నువ్వు వీడి ట్రాప్ లో పడకు. వీడు అందరినీ ప్రేమించానని చెప్పి తర్వాత మాయం అవుతాడు." 


"నువ్వెవరివే చెప్పటానికి?" అంటూ ఫణి ఝాన్సీ చేయి పట్టుకోగానే... పక్కనే పోలీసు జీప్ వచ్చి ఆగింది.


ఇద్దరు పోలీసు కానిస్టేబుల్స్ ఫణిని జీప్ ఎక్కిస్తూ "మా మేడం గారిని నువ్వెవరు అంటావా?" అంటూ లాఠీతో వాయించారు. 


'ఓసీ, ఈ ఝాన్సీ ఎపుడు పోలీసు ఇన్స్పెక్టర్ అయింది?' అనుకుంటూ ఏడుపు మొహంతో జీప్ ఎక్కాడు ఫణి.


సుమ "థాంక్స్ మేడం!" అని ఝాన్సీతో అంది. 


"ఇలాంటి వెధవలను ప్రేమించే కన్నా మీ తల్లితండ్రులను ప్రేమించండి. ముందు చదువు ముఖ్యం." అంటూ అక్కడున్న ఆడపిల్లలకు క్లాస్ తీసి జీప్ ఎక్కింది.

సమాప్తం

పెనుమాక వసంత గారి కొన్ని ఇతర రచనలు:


పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం


  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

 రచయిత్రి పరిచయం:

పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page