top of page

జీవన రాగాలు ఎపిసోడ్ 15



'Jeevana Ragalu Episode 15'  - New Telugu Web Series Written By Ch. C. S. Sarma   

Published In manatelugukathalu.com On 24/07/2024

'జీవన రాగాలు ఎపిసోడ్ 15' తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


కొడుకు దశరథ నందన మేనేజింగ్ డైరెక్టర్ గా ప్రారంభమవుతున్న కెమికల్ ఫ్యాక్టరీ ఆహ్వాన పత్రికను, పోస్ట్ ద్వారా అందుకుంటారు దశరథ రామయ్య గారు. ఆయన భార్య పేరు సుందరి. దశరథరామయ్యగారి తండ్రి వెంకటరామయ్య, తల్లి పార్వతమ్మ. సోదరి సుశీల, బావ శంకరయ్య. 

గతం గుర్తుకు తెచ్చుకుంటారాయన. గతంలో అయన వివాహం కౌసల్యతో జరుగుతుంది. వారికి కవలలు పుడతారు. ఆ పిల్లలకు దశరథ నందన, సునంద అని పేర్లు పెడతారు. 

గుర్రపు బండిలో చెరువు దాటే సమయంలో కౌసల్య, బండి నడిపే ఫకీరా మరణిస్తారు. 

పిల్లల్ని, దశరథ రామయ్యను చూసుకోవడానికి అతనికి కౌసల్య చెల్లెలు సుందరితో వివాహం జరిపిస్తారు పెద్దలు. వారి పిల్లలే గోపినందన, హిమబాల. పిల్లలు పుట్టాక సుందరి ప్రవర్తనలో మార్పు వస్తుంది. 

దశరథనందన వివాహం మన్మధరావు కూతురు భానుప్రియతో జరిపించాలనుకుంటుంది సుందరి. 



తాగిన మైకంలో దశరథనందన, భానుప్రియను బలాత్కారం చేసినట్లు ఆరోపిస్తారు మన్మధరావు, అతని భార్య మంగ. నందనను ఇంటినుంచి వెళ్లిపొమ్మంటాడు దశరథరామయ్య. 


తాను ఏ తప్పూ చేయలేదని విశ్వసిస్తాడు నందన. సర్కిల్ ఇన్ స్పెక్టర్ మురారి సహాయంతో నిజం నిరూపిస్తాడు. ఫణీంద్ర తను తప్పు చేసినట్లు అంగీకరిస్తాడు. 


దశరధనందన నిర్దోషి అని అందరికీ తెలుస్తుంది. తను ప్రేమించిన భారతిని కలకత్తా నుండి తీసుకొని వస్తాడు నందన. 

కెమికల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం ఘనంగా జరుగుతుంది.


ఇక జీవన రాగాలు ధారావాహిక ఎపిసోడ్ 15 చదవండి. 


“భారతి, నేనంటే మా అమ్మకి ఎంతో ఇష్టం, ఆమెతో నేను గడిపిన రోజులు... ఈ రాత్రి సమయంలో ఈ గ్రామ పరిసరాలు నీకెలా గోచరించాయో, నా మనస్సున అమ్మ జ్ఞాపకాలు కూడా అలాగే ఉన్నాయి.

"అమ్మ మమ్మల్ని విడిచి పోయే నాటికి మా వయస్సు మూడున్నర సంవత్సరాలు. నేను చెల్లి సునంద కవల పిల్లలం... మా అమ్మ మా ఇద్దరినీ ఈ ఊయల మీద కూర్చోపెట్టి అన్నం తినిపించేది. చెల్లికి పాటలు అంటే చాలా ఇష్టం, అమ్మ పాటలు పాడుతూ బలవంతంగా తినిపించేది!" చెప్పాడు నంద.


"ఎంతో కాలం అయ్యిన, ఈ ఊయలను ఇలాగే ఉంచారు అంటే మీ నాన్న గారు చాలా చాలా గొప్పవారు!” అంది భారతి.


“అవును, ఈ ఊయల అంటే నాన్నగారికి ప్రాణం, ఒక్కప్పుడు అమ్మ నాన్న ఈ ఊయలలో ఊగేవారు అంట, అమ్మ పోయాక నాకు తెలిసి, నాన్న గారి ప్రతి రోజు ఈ ఊయల లో సాయంత్రం పూట రెండు గంటలు ఆయిన కుర్చుని అమ్మని తలుచుకుంటూ గడిపేవారు. ఇక్కడ కూర్చుంటే ఆయన పక్కనే అమ్మకూర్చున్నట్టు ఫీల్ అయ్యేవారు అంట. ఇక మా తాతయ్య, నాన్నమ్మ అయితే నన్ను, అక్కని ఎంతో ప్రియంగా చూచుకునే వారు. మేము ఎప్పుడైనా తెలియక అమాయకముగా అమ్మ కావాలి అంటే, అమ్మ దేవుడి దగ్గరకి వెళ్ళింది అని, మేము పెద్దయ్యాక వస్తుంది అని చెప్పి ఒదార్చే వారు! 


మా నాన్న గారు ఒంటరిగా మాతో ఇబ్బంది పడుతూ ఉండటం, మాకు తల్లి ఉండాలి అనే ఉద్దేశంతో, మా నాన్నమ్మ, తాతయ్య, బంధువులు బలవంతం మీద మా నాన్న మా అమ్మ చెల్లి అయిన సుందరి పిన్ని ను రెండో పెళ్లి చేసుకున్నారు. వారిద్దరికీ పెళ్లి అయిన రెండు సంవత్సరాలకి కవల పిల్లలు పుట్టారు. వారి పేర్లు గోపి నందన, ....హిమ బాల.... వారికి మాకు మధ్య ఎనిమిది సంవత్సరాల వ్యత్యాసం ఉంది. 


మా పిన్నికి పిల్లలు పుట్టక ముందు నన్ను చెల్లిని చాలా ప్రేమగా చూసుకునేది, ఎప్పుడైతే పిల్లలు పుట్టారో అప్పటి నుండి మమ్మల్ని నిర్లక్ష్యం చేయటం మొదలు పెట్టింది. మొదటిలో చిన్నపిల్లలను చూసుకునే ఒత్తిడిలో మా మీద ధ్యాస పెట్టలేక పోతుంది అని అందరూ అనుకున్నారు, కానీ సొంత కడుపున బిడ్డలు పుట్టేసరికి మమ్మల్ని పరాయి వాళ్ళ లాగానే చూస్తుంది అని అర్థం అయ్యింది. ఆ తరువాత తాతయ్య, నాన్నమ్మ,... ఫకీరు భార్య ముంతాజ్ మమ్మల్ని ఎంతో ప్రేమాభిమానాలతో పెంచారు. ఈనాడు ఎందుకో ఈ ఊయలను చూడగానే ఆ జ్ఞాపకాలు అన్ని మదిని తడుముతూ ఉన్నాయి!” ఆగి భారతి ముఖం వైపు చూసాడు.


భారతి చిన్నగా నవ్వుతూ ఏంటి అన్నట్టు కళ్ళు ఎగరేసింది.


నంద నవ్వుతూ "పాత విషయాలు అన్ని చెప్పి నీకు విసుగు తెప్పిస్తున్నా నా?" అడిగాడు. భారతి నవ్వుతూ “లేదు, ఇంకా చెప్పండి!” అంది.


“పెద్దల వలన అంటే మా నాన్న, తాతయ్య వలన మంచి, మానవత్వ విలువలు నాకు ఊహా తెలిసిన నాడే తెలిసాయి. సృష్టిలో పుట్టిన ప్రతి మనిషి నిర్ణీత కాల ప్రమాణం లో జీవితాన్ని సాగించి చనిపోక తప్పదు. నా వారి నుంచి నేను నేర్చుకున్నది... మనం పోయాక, మనకంటూ ఒక చరిత్ర మనవారి మధ్యన, మన ప్రాంతంలో శాశ్వతంగా నిలిచిపోవాలి. మన జీవిత కాలంలో మనం మన సాటి వారిని, మన కన్న పేద వారికి అభివృద్ధిని కలిగించే దానికి పాటుపడాలి. మన చర్య కొన్ని కుటుంబాలకి అశ్రయన్ని కలిగించేలా ఉండాలి. అందుకే నేను కౌసల్య దశరధరామ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను స్థాపించాను. నా ఈ ఆశయం నెరవేడానికి నా చెల్లి సునంద, బావ శాంతారామ్ వారి తండ్రి గారు, తల్లి గారు, ఆదినారాయణ, ఊర్మిళ అత్తయ్యలు ఎంతగానో నాకు సహకరించారు.

ఒక నాటి నా కలను వారంతా కలిసి చక్కని సాకారాన్ని కల్పించారు.” ఆగాడు నంద. 


భారతి ఆసక్తిగా నంద చెప్పేది వింటుండటంతో, నంద మళ్ళీ “భారతి, మనం పెళ్లి చేసుకుని భార్య, భర్తలం కాబోతున్నాము. నీవు మా వారందరికీ ఎంతగానో నచ్చావు. అందుకే నా గురించి నీకు అన్ని విషయాలు తెలియాలి అనే ఉద్దేశంతోనే నీతో ఈ విషయాలు అన్ని పంచుకున్నాను! ఇవన్నీ వింటుంటే నీకు బోర్ అనిపించిందా?" అడిగాడు. 


భారతి నవ్వుతూ “అల ఏం లేదు, మీరు చెప్పేవన్నీ నాకు తెలియని విషయాలే, పైగా నేను తెలుసుకోవాల్సిన విషయాలు. అందుకే నాకు ఆసక్తిగా ఉంది. అవును, ఇలా అడగవచ్చు. లేదో, మీ తాతయ్య గారు, నాన్నమ్మ గారు ఎప్పుడు మరణించారు?” అడిగింది.


అడగనైతే అడిగింది కానీ, అల అడిగి నందనీ బాధ పెట్టానా అని మనసులో అనుకుంది భారతి.

నిట్టూర్చిన నంద “మా నాన్నమ్మ పార్వతమ్మ గారు మా పన్నెండోయేట మా అమ్మగారి తల్లి సంధ్య, తండ్రి ఆనంద రావు గారితో కలిసి కాశీ మహా క్షేత్రంకి వెళ్ళింది. దక్షిణశ్వరంలోని కాళీమాత ఆలయాన్ని, బేతూరులోని రామకృష్ణల వారి మఠాన్ని దర్శించారు. పవిత్ర గంగా నదిలో స్నానం చేశారు. కాశీ విశ్వేశ్వరలను అన్నపూర్ణమ్మలను దర్శించారు. ఊరికి తిరిగి రైల్లో బయల్దేరారు. ఒరిస్సా ప్రాంతంలో రాత్రి సమయంలో జరిగిన రైలు ప్రమాదంలో ఆ ముగ్గురూ మరణించారు. తాతయ్య, నాన్నగారు, నేను, చెల్లి ఎంతగానో బాధ పడ్డాము. మా తాతయ్య, నాన్నమ్మలు మరువరాని మహోన్నతరాలు. నన్ను, చెల్లిని ఎంతగానో అభిమానించి సాకి పెద్ద చేశారు.” ఎంతో ఉద్వేగంగా చెప్పాడు నంద.


అప్పటికే ఆలస్యం అయిపోవటంతో నంద “భారతి, బాగా పొద్దుపోయింది. పద క్రిందకి వెళ్ళి పాడుకుందాం!" అన్నాడు.


ఇరువురు మేడ పైనుండి క్రిందకు దిగి వారి వారి గదులకి వెళ్లి పడుకున్నారు.

మరుదినం ఉదయాన్నే దశరథ రామయ్యగారు పుండరీకను పిలిపించారు. వారిరువురు మంచి స్నేహితులు.


వరండాలో సీనియర్ లాయర్ ఆదినారాయణ, దశరథ రామయ్యలు కూర్చొని కాఫీ తాగుతున్నారు.

“పెద్దలకు నమస్కారము!” నవ్వుతూ చేతులు జోడించి వారిరువురు ముందు నిలబడ్డాడు పుండరీక.

“కూర్చో పుండరీక!” చెప్పాడు దశరథ రామయ్య.


పుండరీక నవ్వుతూ కుర్చీలో కూర్చుంటూ "పెద్ద లిరువురు ఎదో ముఖ్యమైన ఆలోచనలో ఉన్నట్లున్నారు!” అని అన్నాడు.


“పుండరీక గారు...!” ఆదినారాయణ గారి పలకరింపు.


“ఆ చెప్పండి సార్..!” నవ్వుతూ అన్నాడు పుండరీక.


“వివాహానికి మంచి ముహూర్తాలు ఎప్పుడు ఉన్నాయి...?" అడిగాడు ఆదినారాయణ.


ఒక క్షణం ఆలోచించిన పుండరీక “పైనెల పదవ తేదీ తరువాత ఒకటి రెండు ముహూర్తాలు ఉన్నాయి, ఇంతకి మీరు ఎవరి వివాహాన్ని గురించి మాట్లాడుతున్నారు సర్?" అని అడిగాడు.

దశరథ రామయ్యా నవ్వుతూ "పుండరీక, బావ ఎవరి వివాహాన్ని గురించి మాట్లాడతారు అనేది నీకు తెలీదా?” అని అడిగారు.


“మీరే చెప్పండి, నేను ఎవరి వివాహం గురించి అడిగి ఉంటానో!!!" చిరునవ్వుతో పుండరీక ముఖంలోకి చూసారు ఆదినారాయణ.


"మన దశరధనంద, భారతి వివాహమేగా?" అడిగాడు పుండరీక.


అవును అన్నట్టు నవ్వుతూ తల ఊపారు ఆదినారాయణ.

"అంతేకాదు, ఫణీంద్ర, భాను ప్రియల వివాహ ముహూర్తం కూడా నిర్ణయించాలి. పుండరీక!” అని చెప్పాడు దశరథ రామయ్య.


వారు మాట్లాడుకుంటూ ఉండగా, వాకిటికి ఒక కారు వచ్చి ఆగింది. ముగ్గురి దృష్టి ఆ వైపు మరలింది.

సన్నటి పాతిక సంవత్సరాల యువకుడు, మరో వ్యక్తి కారు నుండి దిగారు.


“బావా..! ఎవరు ఆ రమణ రెడ్డి! పక్కన ఉన్న ఆ దాడివాలా” అడిగాడు ఆది నారాయణ. 


“ఏమో బావ నాకు తెలియదు, ఎవరో కొత్త ముఖాలు!” సమాధానం ఇచ్చాడు దశరథరామయ్య.

ఆ ఇరువురు భవంతి ముందరి పెవ్మెంట్ మీదుగా వరండాను సమీపించారు.


కొత్త వ్యక్తుల వాసనను గ్రహించిన కుక్కలు వారి ముందుకి దూకాయి. ఇరువురు రెండు కుక్కలని చూచి భయపడి కదలలేదు.


“రంగా !... రాణి !... ఇలా రండి" దశరథ రామయ్య గారి పిలుపు.


రెండు కుక్కలు వెనుతిరిగి వరండా మెట్లు ఎక్కి దశరథ రామయ్యను సమీపించాయి. 

“ఏం చేయవు రండి!” ఆ కొత్త వ్యక్తులని ఆహ్వానించాడు దశరథ రామయ్య.


వారు బెరుకుతో మెల్లగా నడిచి వరండాను సమీపించారు.

పనిమనిషి వీరయ్య వరండాలోకి వచ్చి కుక్కల మెడకు చైన్స్ తగిలించి తనతో తీసుకుని భవంతి వెనుక వైపుకు వెళ్ళాడు.


పాతికేళ్ల రమణారెడ్డి గారు, వారితోనే ఉన్న మరో వ్యక్తి నిట్టూర్చి గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు.

“రండి, కూర్చోండి... " చెప్పాడు దశరథ రామయ్య.


ఇరువురు పుండరీక ప్రక్కన ఉన్న కుర్చీల్లో కూర్చున్నారు.

మీరేవరండి?" అడిగాడు ఆదినారాయణ.


“నా... నా...’’ భయంతో మాటలు ఫ్రీగా రాలేదు ఆ రమణారెడ్డి ఆకారం నుండి. 


"భయపడకండి, కుక్కలు వెళ్లిపోయాయిగా...! నిర్భయంగా తమరు ఎవరూ..? ఎక్కడనుండి వచ్చారు? వచ్చిన కారణం ఏమిటి? తెలియచేయండి.” చిరునవ్వుతో చెప్పాడు పుండరీక.


సంభాషణ ఇంగ్లీష్ లో ప్రారంభించాడు రమణారెడ్డి ఆకారం.


“మీకు ఇంగ్లీష్ తెలుసా? నాకు తెలుగు తెలియదు ...!” ఇంగ్లీష్ లో అన్నాడు.


“ప్లీజ్ టాక్ ఇన్ ఇంగ్లీష్...!” చెప్పాడు దశరథ రామయ్య.


"నేను భారతి భావను (ఇంగ్లీష్ లో చెప్పాడు), వీడు నా మిత్రుడు బిశ్వాస్, పోలీస్ ఇన్స్పెక్టర్!”

“అయితే?” ఆదినారాయణ అడిగాడు నవ్వుతూ.


"మీ దశరథ నంద మా అమ్మాయిని మాకు తెలియకుండా లేపుకు వచ్చాడు” ఆవేశంగా చెప్పాడు ఆ రమణారెడ్డి ఆకారం (రమణారెడ్డి పాత ఫేమస్ కమెడియన్ నటుడు). 


“మీ పేరు ఏమిటి?”

“బీహారీ!”


"మిస్టర్ బీహారీ... నా కొడుకు, నీ మరదలని లేపుకు రాలేదు. ఆమె మా అబ్బాయిని ప్రేమించింది. మీరు ఆమెకు వేరే వ్యక్తితో వివాహం ప్రయత్నాలు చేస్తుంటే, మా అబ్బాయితో తను వాణ్ణి ఇష్టపడిన కారణంగా వచ్చేసింది. నేను వారికి పెండ్లి జరిపిస్తాను. మీ ఊరికి వచ్చి మీ వారితో మాట్లాడతాను. ఆవేశంలో అర్థం లేని మాటలు మాట్లాడకండి. అది అనాగరికం.” ఎంతో సౌమ్యంగా ఇంగ్లీష్ లో చెప్పాడు దశరథ రామయ్య.


పోలీస్ బిస్వాస్ ఆశ్చర్యంగా బీహారీ ముఖంలోకి చూసాడు.

బీహారీ అవేశం అధికమయ్యింది.


"మా అమ్మాయి వివాహాన్ని మాతో సంప్రదించకుండా... మా అనుమతి లేకుండా మీరు ఎలా చేస్తారు?” గద్దించినట్లు అడిగాడు.


"మిస్టర్ బీహారీ జీ! మా బావగారు చెప్పింది అర్థం కాలేదా?” కాస్త హెచ్చు స్థాయిలో అన్నాడు ఆదినారాయణ.


వారి మాటలు విని లోపల గదుల్లో ఉన్న వారంతా వేగంగా వరండాలోకి వచ్చారు. 

“మీరు తప్పుగా మాట్లాడుతున్నారు... నేను ఎవరో తెలుసా? పోలీస్ ఇన్స్పెక్టర్ బిశ్వాస్!" 


తన హోదాను నిర్భయంగా చెప్పాడు బిశ్వాస్.

“సారు... అదే మీ బిహారీ జీ అదే చెప్పారు!” నవ్వుతూ చెప్పాడు పుండరీక. 


“ఏమిటి?” ఆంగ్లంలో అన్నాడు బిశ్వాస్.


“యువర్ నేమ్...! హోదా!” చెప్పాడు పుండ్రీక ఆంగ్లంలో.


"మిస్టర్ బిశ్వాస్ మీరు బిహారీజీతో ఎందుకు వచ్చారు?” అడిగాడు ఆదినారాయణ.


“వాడు నా ఫ్రెండ్... సహాయానికి వచ్చాను” బీహారీ జవాబు.


"మీ ఇరువురికి ఏం కావాలి?" అడిగాడు  దశరథ రామయ్య. 


“భారతిని మాకు అప్పగించండి." బిశ్వాస్ జవాబు.


ఆదినారాయణ ఆ టాక్సీ ని సమీపించి ఆ డ్రైవర్ తో ఎదో చెప్పాడు, అతను తల ఆడించి వెళ్ళిపోయాడు. తమని సంప్రదించకుండా ఆ టాక్సీ వాలా వెళ్ళిపోవటంతో బిహారీ జీ, బిశ్వాస్ ఆశ్చర్యపోయాడు.


“నందా..!” పిలిచాడు దశరథ రామయ్య.


అందరి మధ్య ఉన్న నందా తండ్రిని సమీపించాడు.

“ఏం నాన్న?”


“వారికి భారతి కావాలట!" వ్యంగ్యంగా నవ్వాడు దశరథ రామయ్య. 


“సునందా...!”


“అన్నా!”


“భారతి వంటింట్లో పిన్నితో ఉంది. పిలుచుకు రా!” చెప్పాడు నంద. 


సునంద లోనికి వెళ్ళింది.

ఐదు నిముషాల్లో సునంద, భారతిలు వరండాలోకి వచ్చారు.

బిహారీ జీ బెంగాల్ లో భారతిని తిట్టడం ప్రారంభించారు.


బెంగాలీ బాగా తెలిసిన ఆదినారాయణ... బెంగాలీలో ... “ఓయ్! బీహారీ జీ... నోటికొచ్చినట్లు మాట్లాడకు, మర్యాద... మర్యాద... భారతి ఇప్పుడు మీ పిల్ల కాదు, నా కూతురు.” తల ఆడిస్తూ చిరునవ్వుతో చెప్పాడు.


“మీరు మా టాక్సీ పంపించేశారు. అది తప్పు కాదా?” టాపిక్ మార్చాడు బీహారీ.


“చూడు బీహారీ జీ!... అవును మీరు వచ్చిన టాక్సీ వాలాను నేను పంపించాను. మనం మాట్లాడుకుని ఒక నిర్ణయానికి రావాలిగా. అంతదాకా వెయిటింగ్ వెస్ట్ కదా. వాణ్ణి పంపించి మీకు డబ్బులు మిగిల్చాను!" వ్యంగ్యంగా నవ్వుతూ చెప్పాడు ఆదినారాయణ. 


"మేము డబ్బులు ఇవ్వలేదు గా..!”


“నేను ఇచ్చానుగా ! మీ ఇరువురికి నాదో సలహా. ప్రక్కన మా గెస్ట్ హౌస్ ఉంది. అక్కడకి వెళ్ళి స్నానం చేసి శుచిగా రండి. అందరం కలిసి భోజనం చేద్దాం. ఇంతలో నా కొడుకు మురారి సర్కిల్ ఇన్స్పెక్టర్ వస్తాడు. మనమందరం కలిసి మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వస్తాను. బావా! ఏమంటారు?” చిరునవ్వుతో అడిగాడు ఆదినారాయణ.


“కరెక్ట్ గా చెప్పారు బావ !... వీరయ్య!..” పిలిచాడు దశరథ రామయ్య గారు. 


పరుగున వీరయ్య వచ్చాడు.

“అయ్యా!”


“చూడు వీరయ్య, వీరు మన బంధువులు. గెస్ట్ హౌస్ తెరువు, వారు స్నానాదులు చేసేందుకు ఏర్పాట్లు చెయ్యి. మిస్టర్ బీహారీ జీ, బిశ్వాస్ జీ... అతనితో వెళ్ళండి. హాయిగా స్నానం చేయండి. భోజనానంతరం మా బావగారు చెప్పినట్లుగా, కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుందాం." ప్రశాంతంగా చిరునవ్వుతో చెప్పాడు దశరథ రామయ్య.


బిహారీ జీ, బిశ్వాస్ లు కోరలు పీకిన పాములై పోయారు. మౌనంగా వీరయ్య వెనుక నడిచారు గెస్ట్ హౌస్ వైపుకి.


వెళ్ళిన టాక్సీలో సర్కిల్ ఇన్స్పెక్టర్ మురారి వచ్చారు. అతన్ని ఆదినారాయణ బిహారీ జి, బిశ్వాస్ లకు పరిచయం చేశాడు.


అందరూ కలిసి భోజనం చేశారు. నవ్వుతూ కొసరి కొసరి వడ్డించారు సునంద, భారతిలు. 

అక్కడ వాతావరణం చూసి బిహారీజి, బిశ్వాస్లు మంత్రముగ్ధులయ్యారు.


========================================================================

ఇంకా వుంది..

========================================================================


సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.



21 views0 comments

Commentaires


bottom of page