top of page
Original.png

వ్యాపారాత్మక దృక్పథమే కల్పిత పురాణ కథల ప్రాచుర్యానికి మూలం

సనాతన ధర్మం, వేదాలు, వేద విజ్ఞానం, ఉపనిషత్తులు, వేదాంతం, ఓంకారం, ఓం కార మహిమ, వేదవ్యాసుడు, భగవద్గీత, స్మృతులు, అపౌరుషేయ వేదాలు, హిందూ ధర్మం, వేద అధ్యయనం, ఆధ్యాత్మిక జ్ఞానం, వేద సారం, ఉపనిషత్ తత్వం, సనాతన సంప్రదాయం, భారతీయ ఆధ్యాత్మికత, వేద సంస్కృతి, పరబ్రహ్మ తత్వం

వేదాలు, రామాయణం, మహాభారతం, భాగవతం వంటి మూల గ్రంథాలను గురుకులంలో విద్యార్థులకు బోధిస్తున్న వృద్ధ సంస్కృత పండితుడి ద్వారా సనాతన ధర్మం, శాస్త్రసమ్మత పురాణాలు, ఆధ్యాత్మిక జ్ఞాన పరిరక్షణను ప్రతిబింబించే భావోద్వేగ దృశ్యం.
వేదాలు, రామాయణం, మహాభారతం, భాగవతం వంటి మూల గ్రంథాలను గురుకులంలో విద్యార్థులకు బోధిస్తున్న వృద్ధ సంస్కృత పండితుడి ద్వారా సనాతన ధర్మం, శాస్త్రసమ్మత పురాణాలు, ఆధ్యాత్మిక జ్ఞాన పరిరక్షణను ప్రతిబింబించే భావోద్వేగ దృశ్యం.

 

A commercial perspective is the root cause for the popularity of fictional mythological stories - Telugu Article | R C Kumar

వ్యాపారాత్మక దృక్పథమే కల్పిత పురాణ కథల ప్రాచుర్యానికి మూలం - తెలుగు వ్యాసం | ఆర్ సి కుమార్

Published In manatelugukathalu.com On 03/07/2026


వ్యాపారాత్మక దృక్పథమే కల్పిత పురాణ కథల ప్రాచుర్యానికి మూలం అనే ఈ ఆలోచనాత్మక వ్యాసం, వేదాలు, ఉపనిషత్తులు, రామాయణం, మహాభారతం, భాగవతం వంటి మూల గ్రంథాల్లోని శాస్త్రసమ్మతమైన పురాణ గాథలకు, తరువాత కాలంలో ప్రాచుర్యం పొందిన కల్పిత పురాణ కథలు, జానపద గాథలు, పౌరాణిక సినిమాలు మధ్య ఉన్న తేడాలను విశ్లేషిస్తుంది. శ్రీకృష్ణార్జున యుద్ధం, శ్రీరామాంజనేయ యుద్ధం, మాయాబజార్‌లోని శశిరేఖా పరిణయం వంటి ప్రసిద్ధ కథాంశాలను ఉదాహరణలుగా తీసుకొని, పురాణాల అసలు సందేశాన్ని తెలుసుకోవాలంటే మూల గ్రంథాల అధ్యయనం ఎంత ముఖ్యమో ఈ వ్యాసం వివరిస్తుంది. సనాతన ధర్మ పరిరక్షణ, పురాణాల పవిత్రత, యువతలో శాస్త్ర అధ్యయనంపై ఆసక్తి పెంపొందించడం వంటి అంశాలపై లోతైన చర్చను అందిస్తుంది.


వేదోపనిషత్తులు, రామాయణ, భారత, భాగవత గ్రంథాలు,‌ అష్టాదశ పురాణాలలో ప్రస్తావించబడిన శాస్త్ర సమ్మతమైన పురాణ గాథలు, నీతి కథలు మాత్రమే ప్రవచనాలలో మరియు సత్సంగాలలో భక్తులకు వినిపించడం ధర్మం. కానీ దురదృష్టవశాత్తు పుక్కిటి పురాణాలు, జానపద కథలు, సినిమా కథల వంటి కొన్ని కల్పితాలను యదార్ధంగా జరిగినట్లే చిత్రీకరించి  కొందరు తమ ప్రసంగాల ద్వారా,  సినిమాలు, నాటకాల ద్వారా ప్రచారం చేస్తూ భక్తులను తప్పుదారి పట్టిస్తున్నారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న కొన్ని ఆధ్యాత్మిక పత్రికల్లో కూడా ఈ ధోరణి కొనసాగుతోంది. ఆ విధంగా పురాణాలను వక్రీకరించడం, వినోదం కోసం మార్చడం వల్ల భక్తుల విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావాలు సన్నగిల్లుతాయి. పురాణాలు మన సంస్కృతికి, ఆధ్యాత్మిక విశ్వాసాలకు మూలస్తంభాలు అనే విషయం జగమెరిగిన సత్యం. వాటి పవిత్రతకు భంగం కలగకుండా చూసుకోవడం మనందరి బాధ్యత.


శ్రీ కృష్ణార్జున యుద్ధం జరగనేలేదు. అటువంటి సంఘటన వ్యాసభగవానుడు రచించిన‌ మహాభారతంలో ఎక్కడా కనిపించదు. కానీ అది కల్పిత పురాణ గాథలు, జానపద కథలు మరియు నాటకాల ద్వారా ప్రచారంలోకి వచ్చింది. చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు రాసిన "గయోపాఖ్యానం" నాటకంలో ఈ ఘట్టం ఉంటుంది. ఈ కథ ఆధారంగానే తెలుగులో శ్రీ KV రెడ్డి దర్శకత్వంలో ⁠1963లో శ్రీకృష్ణార్జున యుద్ధము అనే పౌరాణిక చిత్రం నిర్మించబడింది. ఎన్టీఆర్, ఏఎన్నార్ లు నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ కావడం మనకు తెలిసిన విషయమే. కృష్ణార్జునలు మంచి స్నేహితులే కాదు బావమరుదులు కూడా. గయోపాఖ్యానం అని సృష్టించబడిన ఆ జానపద నాటకం ప్రకారం కృష్ణార్జునుల మధ్య యుద్ధానికి దారి తీసిన కల్పిత సంఘటన ఆసక్తికరంగా రూపొందించబడింది. ఒకసారి శ్రీకృష్ణుడు సంధ్యావందనం చేస్తుండగా, గయుడు అనే గంధర్వుడు ఆకాశంలో ఎగురుతూ తన నోరు శుభ్రం చేసుకుని ఉమ్మివేయగా అది శ్రీకృష్ణుడి దోసిట్లో పడుతుంది. తన పూజకు విఘ్నం కలిగించిన ఆ గయుడిని వధిస్తానని కృష్ణుడు ప్రతిజ్ఞ చేస్తాడు. విషయం తెలుసుకున్న గయుడు జరిగినదానికి చింతిస్తాడు.


భయపడిన గయుడు నారదుడి సలహా మేరకు జరిగిన విషయం చెప్పకుండా రక్షణ కోసం అర్జునుడిని ఆశ్రయిస్తాడు. కృష్ణుడి శపధం తెలియని అర్జునుడు శరణు కోరిన అతన్ని కాపాడతానని మాట ఇవ్వడం జరుగుతుంది. గయుడిని రక్షించడానికి అర్జునుడు, అతన్ని శిక్షించడానికి కృష్ణుడు ఒకరిపై ఒకరు బాణాలు ప్రయోగించుకుంటారు. ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. కృష్ణుడు వేసే అస్త్రాలను అర్జునుడు నాశనం చేస్తుంటాడు అలాగే అర్జునుడు వేసే అస్త్రాలను కృష్ణుడిని నాశనం చేస్తాడు. ఇక లాభం లేదనుకొని కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని అర్జునుడి పైకి సంధిస్తాడు. అప్పుడు అర్జునుడు తనకు మహాశివుడు ఇచ్చిన పాశుపతాస్త్రాన్ని కృష్ణుడి పైకి పంపుతాడు. ఇద్దరి అస్త్రాలు ఒకదానినొకటి ఢీకొని ప్రళయాన్ని సృష్టిస్తాయి. లోక వినాశనాన్ని ఆపడానికి పరమేశ్వరుడు బ్రహ్మ ప్రత్యక్షమై ఇద్దరినీ శాంతింప చేస్తారు. అనంతరం వారు గయుణ్ణి అప్పజెప్పమని చెప్పగా అర్జునుడు గయుణ్ణి కృష్ణుడు వద్దకు పంపగానే కృష్ణుడు అతన్ని చంపుతాడు. వెంటనే బ్రహ్మ తన కమండలంలో జలాన్ని చల్లి గయుణ్ణి బతికిస్తాడు. దీంతో అటు కృష్ణుడు, ఇటు అర్జునుడు ఇద్దరి ప్రతిజ్ఞలు నెరవేరుతాయి. అర్జునుడు ఇచ్చిన మాటకు కట్టుబడి ధర్మం కోసం పోరాడినట్టు, మరోవైపు మహాభారత యుద్ధంలో అర్జునుడి శక్తిని పరీక్షించడానికి కృష్ణుడు చేసిన లీలగా ఆ వృత్తాంతాన్ని చెప్పుకుంటారు. నిజానికి కృష్ణార్జునల మధ్య ఎటువంటి యుద్ధము జరగకపోయినా ఆ సినిమా మరియు నాటకాల ప్రభావంతో అది జరిగిందేమో అన్న భ్రమ కలగక మానదు.


అటువంటి మరొక కల్పిత కథా చిత్రమే శ్రీరామాంజనేయ యుద్ధం కూడా. మూల రామాయణం ప్రకారం శ్రీ రాముడికి, హనుమంతునికి మధ్య ఎలాంటి యుద్ధమూ జరగలేదు. హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం అత్యంత ప్రామాణికమైన వాల్మీకి రామాయణంలో గానీ, ఇతర ముఖ్య పురాణాల్లో గానీ ఇలాంటి యుద్ధ ప్రస్తావన ఎక్కడా లేదు. హనుమంతుడు శ్రీరామునికి పరమ భక్తుడు, వారి మధ్య యుద్ధం జరగడం అసాధ్యం. రామ నామ విశిష్టతను చాటిచెప్పడానికి పుట్టిన ఒక కాల్పనిక జానపద కథే తప్ప, ఇది నిజంగా జరిగిన సంఘటన కానే కాదు. స్థానిక నాటకాల ద్వారా ఈ జానపద కథ బాగా ప్రాచుర్యం పొందింది. ఈ ప్రచారం ఆధారంగానే బాపు దర్శకత్వంలో ఎన్.టి. రామారావు నటించిన 'శ్రీ రామాంజనేయ యుద్ధం' పేరుతో తెలుగులో నిర్మించబడిన ఈ సినిమా అప్పట్లో విపరీతమైన ప్రేక్షకాదరణ పొందింది.


దీనికి సంబంధించిన కాల్పనిక కథ  ఏమిటంటే యయాతి అనే కాశీరాజు తెలియక ఒకసారి విశ్వామిత్ర మహర్షిని అవమానిస్తాడు. ఆగ్రహించిన విశ్వామిత్రుడు, ఆ రాజును సంహరించమని శ్రీరాముడిని ఆదేశిస్తాడు. ప్రాణభయంతో ఉన్న ఆ రాజు నారదుడి సలహాతో హనుమంతుడిని శరణు వేడగా శరణాగతుడిని రక్షిస్తానని హనుమంతుడు మాట ఇస్తాడు. దాంతో మాట నిలబెట్టుకోడానికి హనుమంతుడు, గురు ఆజ్ఞను పాటించడానికి శ్రీరాముడు ఒకరికొకరు యుద్దరంగంలో ఎదురుపడాల్సి వస్తుంది.‌ యుద్ధం జరిగినట్టు చూపించే ఈ కట్టు కథ వెనుక ఒక సందేశం ఇవ్వడానికి ప్రయత్నించారు. యుద్ధంలో శ్రీరాముడు హనుమంతునిపై బాణాలు, ఆఖరికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినా, హనుమంతుడు కేవలం "శ్రీరామ" నామాన్ని జపిస్తూ ధ్యానంలో ఉంటాడు. రామ నామ శక్తి వల్ల ఆ అస్త్రాలు హనుమంతుడిని ఏమీ చేయలేవు. రాముడి కంటే రాముడి నామమే గొప్పదని నిరూపించడానికే నారద మహర్షి ఈ లీలను నడిపించాడన్న సందేశం ఇవ్వబడింది.


ఇక మాయలతో కూడిన మాయాబజార్ సినిమా తెలుగు చలనచిత్ర చరిత్రలోనే అత్యంత విజయవంతమైన, చిరస్మరణీయమైన చిత్రంగా నిలిచింది. ఇది కేవలం బాక్సాఫీస్ విజయీన్ని సాధించడమే కాకుండా, సాంకేతిక అద్భుతాలతో ఒక సాంస్కృతిక మైలురాయిగా గుర్తింపు పొందింది. అయితే మాయాబజార్ సినిమాలో చూపించిన 'శశిరేఖా పరిణయం' అనే ఘట్టం వ్యాసమహర్షి రచించిన మహాభారతంలో లేదు. అసలు శశిరేఖ అనే పాత్రే భారతంలో ఎక్కడా కనబడదు. వాస్తవానికి బలరాముడికి ఆ పేరు గల కుమార్తె లేదు. ఆయనకు ఇద్దరు కుమారులు మాత్రమే ఉన్నారు. లక్ష్మణ కుమారుడికి బదులుగా అభిమన్యుడికి శశిరేఖతో పెళ్లి జరిపించడం మహాభారతంలో లేదు. ఆ సందర్భంగా ఘటోత్కచుడు చేసిన మాయలు అన్నీ కల్పితాలే. అవి సినిమా రక్తి కట్టించడానికి సృష్టించిన సీన్లు మాత్రమే. జానపద కథల ఆధారంగా సినిమా కోసం రచయిత శ్రీ పింగళి నాగేంద్రరావు అల్లిన కల్పిత కథ మాత్రమే అది. వాస్తవానికి మహాభారతంలోని ఆది పర్వం ప్రకారం, అభిమన్యుడి ఏకైక భార్య మత్స్య దేశపు రాజైన విరాటుడి కుమార్తె ఉత్తర. వారి పుత్రుడు పరీక్షిత్తు.


తెలుగు సినిమాల్లో కల్పిత పురాణ కథలను ప్రేక్షకులను అలరించడానికి, ఆధునిక సాంకేతికతో  సన్నివేశాలలో పట్టు బిగించడానికి ఉపయోగిస్తారు. నిజమైన పురాణాలను మార్చలేరు, కానీ కల్పిత పురాణాలతో దర్శకుడికి నచ్చినట్లు కథను తిప్పుకునే స్వేచ్ఛ ఉంటుంది. ఆ విధంగా వ్యాపారాత్మక వినోదాన్ని, ఉద్వేగాన్ని పంచుతూ నిర్మాతలు సొమ్ము చేసుకుంటారు. సినిమాటిక్ ఎఫెక్ట్ కోసం మూల గ్రంథాలలోని ఘట్టాలను కొంతవరకు నాటకీయంగా చూపించవచ్చు, కానీ ప్రేక్షక లోకాన్ని తప్పుదోవ పట్టించేలా వాటిని పూర్తిగా మార్చడం లేదా కల్పిత కథలతో ముస్తాబు చేయడం అన్యాయమే. పురాణాలను చెప్పేటప్పుడు లేదా చిత్రీకరించేటప్పుడు మూల గ్రంథాల ఆధారాలను మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే పురాణాలు కేవలం కథలు మాత్రమే కావు, నీతిని, ధర్మాన్ని మరియు జీవిత సత్యాలను బోధించే పవిత్ర బోధనలు అన్న విషయాన్ని సినీ దర్శకులు నిర్మాతలు గుర్తించాలి.


ఈనాటి విద్యార్థులు, నవతరం యువతలో రామాయణ, భారత, భాగవతాది మూల గ్రంధాలలో ఉన్న శాస్త్ర సమ్మతమైన పురాణ గాధలను చదివే ఓపిక, ఆసక్తి కొరవడింది. కాబట్టి వాళ్లకు ఫిక్షన్, ఫాంటసీ ఆధారిత గ్రాఫిక్స్ తో కూడిన పౌరాణిక సినిమాలపై మోజు పెరగడం చిత్ర నిర్మాతలకు కలిసొచ్చింది. కల్కి, కార్తికేయ 2, హనుమాన్ వంటి మరెన్నో వ్యాపారాత్మక సినిమాలతో కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. ఈ ధోరణికి అడ్డుకట్ట పడే అవకాశాలు ఏ మాత్రం గోచరించడం లేదు. చిత్ర పరిశ్రమ పోకడలను నియంత్రించే యంత్రాంగాన్ని పటిష్ట పరచవలసిన దిశగా మేధావులు ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. పురాణ గాధలను తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల వాటి అసలు లక్ష్యం మరియు సందేశం ప్రజలకు చేరదు. వాటి ద్వారా అందవలసిన నైతిక, ధర్మ సూత్రాల మూలార్థం సమూలంగా మారిపోతుంది. సనాతన ధర్మ పవిత్రతను, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడంలో ప్రభుత్వం మరియు ప్రజల బాధ్యతలు అత్యంత కీలకమైనవి. పురాణాల్లోని నైతిక విలువలను, ధర్మ పరిరక్షణ సంబంధించిన విషయాలను పాఠ్యాంశాలుగా చేర్చి పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు బోధిస్తే సామాజిక పరిస్థితులు తప్పనిసరిగా మెరుగుపడుతాయి.


కృష్ణార్పణం  🙏   

📖 ఈ వ్యాసం మీకు ఉపయోగకరంగా అనిపించిందా?

💬 ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో పంచుకోండి.

📚 మన సనాతన గ్రంథాలను సాధ్యమైనంత వరకు మూల ఆధారాల నుంచే అధ్యయనం చేయండి.

🙏 ఈ వ్యాసాన్ని మీ కుటుంబ సభ్యులు, విద్యార్థులు, ధార్మిక అధ్యయనంపై ఆసక్తి ఉన్న మిత్రులతో పంచుకొని, శాస్త్రసమ్మత పురాణాలపై అవగాహన పెంపొందించడానికి సహకరించండి.

మన తెలుగు కథలులో ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక, చారిత్రక, ఆలోచనాత్మక వ్యాసాల కోసం తరచూ సందర్శించండి.



ఆర్ సి కుమార్  గారి కొన్ని ఇతర రచనలు:


ఆర్ సి కుమార్  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ఆర్.సి. కుమార్
ఆర్.సి. కుమార్

రచయిత పరిచయం:

నమస్తే 

ఆర్.సి. కుమార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో వివిధ హోదాల్లో అత్యుత్తమ సేవలు అందించి అనేక అవార్డులు రివార్డులు పొందారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ చేసిన పిదప సంస్థకు చెందిన పూర్వ ఉద్యోగులతో వెటరన్స్ గిల్డ్ అనే సంస్థను స్థాపించి అనేక సామాజిక, సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేశారు.

పదవి విరమణ తర్వాత గత పది సంవత్సరాలుగా వివిధ హోదాల్లో తన ప్రవృత్తికి ఊతమిచ్చే సామాజిక సేవా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అమీర్ పేట, సనత్ నగర్ ప్రాంతాలలో గల కాలనీల సంక్షేమ సంఘాలతో కూడిన సమాఖ్యను 'ఫ్రాబ్స్' (FRABSS, ఫెడరేషన్ అఫ్ రెసిడెంట్స్ అసోసియేషన్స్ ఆఫ్  బల్కంపేట్, సంజీవరెడ్డి నగర్, సనత్ నగర్) అనే పేరుతో ఏర్పాటు చేసి అచిరకాలంలోనే స్థానికంగా దానినొక ప్రఖ్యాత సంస్థగా తీర్చిదిద్దారు. సుమారు ఐదు సంవత్సరాల పాటు ఆ సంస్థ తరఫున అధ్యక్ష హోదాలో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రముఖ సామాజిక వేత్తగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.


రాయల సేవా సమితి అనే మరొక స్వచ్ఛంద సంస్థను స్థాపించి పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజం పై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తూ, బీద సాదలకు అన్నదానాలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్షిప్ లు అందించడం, మొక్కలు నాటించడం వంటి సేవా కార్యక్రమాలు ప్రతి నెలా  చేస్తుంటారు. బస్తీలు, కాలనీల లో సమాజ సేవా కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, జల సంరక్షణ వంటి అనేక సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన తెచ్చే విధంగా పాటుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీరి సేవలను కొనియాడుతూ ప్రశంసా పత్రాన్ని సైతం  అందజేశారు.


కథలు కవితలు రాయడం వారికి ఇష్టమైన హాబీ. స్వతంత్ర పాత్రికేయుడిగా వీరి రచనలు తరచుగా మాస పత్రికలు, దినసరి వార్తా పత్రికల్లోని ఎడిటోరియల్ పేజీల్లో ప్రచురింపబడుతుంటాయి. వక్తగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అనేక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను కొనసాగించడమే కాక ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, సత్సంగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. 


వందనం, ఆర్ సి కుమార్

(కలం పేరు - రాకుమార్, పూర్తి పేరు - ఆర్. శ్రీరామచంద్రకుమార్) 

సామాజికవేత్త

war impact economy, oil crisis Telugu, inflation Telugu, global economy war, Iran Israel war impact, petrol price increase, economic crisis Telugu, Yuddha Prabhavam Arthika Samkshobham, యుద్ధ ప్రభావం ఆర్థిక సంక్షోభం, R C Kumar, ఆర్ సి కుమార్


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page