top of page
Original.png

కథ అంతా కవరింగ్‌దే

Jul 29
2 min read

కథ అంతా కవరింగ్‌దే, కొత్త విరిత, తెలుగు వ్యాసం, ప్రెజెంటేషన్, ప్యాకేజింగ్, మార్కెటింగ్, సామాజిక వ్యంగ్యం, జీవన సత్యాలు, ఆలోచింపజేసే వ్యాసం, తెలుగు రచన

ఒకే వస్తువుకు కవరింగ్‌, ప్రెజెంటేషన్‌ మారితే విలువ ఎలా మారుతుందో చూపించే ప్రతీకాత్మక దృశ్యం
ఒకే వస్తువుకు కవరింగ్‌, ప్రెజెంటేషన్‌ మారితే విలువ ఎలా మారుతుందో చూపించే ప్రతీకాత్మక దృశ్యం

Katha Antha Covering de - Telugu Inspirational Article | Kotha Viritha

కథ అంతా కవరింగ్‌దే తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత

Publishes in manatelugukathalu.com on 29/07/2026


ఒకే వస్తువు… కానీ చూపించే విధానం మారితే దాని విలువ కూడా మారిపోతుందా? మామిడిపండ్లు, కూరగాయలు, దుస్తులు, ఇంటి భోజనం వంటి నిత్యజీవిత ఉదాహరణలతో మన సమాజం నాణ్యత కంటే ప్రెజెంటేషన్‌, ప్యాకేజింగ్‌, కవరింగ్‌కే ఎక్కువ విలువ ఇస్తోందనే చేదు వాస్తవాన్ని కొత్త విరిత తన ప్రత్యేకమైన శైలిలో ఆలోచింపజేసేలా చెప్పారు. చివర్లో ఒక్క వాక్యంతో మనల్ని మనమే ప్రశ్నించుకునేలా చేసే అద్భుతమైన వ్యాసం ఇది.


హైవే పక్కన మామిడిపండ్ల మీద నాలుగు పచ్చని ఆకులు కప్పితే "అయ్యో! ఇప్పుడే తోట నుంచి కోసుకొచ్చారేమో!" అని రెండు కిలోలు కొంటాం.

అదే ఆకులు తీసేసి ఇంట్లో పెడితే,"ఇవేనా?" అంటూ మూలన పడేసి కుళ్లబెట్టేస్తాం.కూరగాయల మీద కాస్త నీళ్లు చల్లితే "ఫ్రెష్." ఇంట్లో కడిగి పెట్టితే "పాతవి."


మాల్‌లో వేల రూపాయల షర్ట్‌కు మూడు లైట్లు, రెండు అద్దాలు, ఒక మ్యూజిక్,

చాలు,అది "బ్రాండెడ్."

అదే షర్ట్ ఇంట్లో చూపిస్తే,

"అరెరే... ఇస్త్రీ కూడా చేయలేదా? కాలర్ నలిగిపోయింది!" అంటాం.


రెస్టారెంట్‌లో అదే పప్పు, అదే కూర,పెద్ద ప్లేట్, ఇంగ్లీష్ పేరు, పైన రెండు కొత్తిమీర ఆకులు,జేబుకి చిల్లు పడే బిల్లు."వావ్... అద్భుతమైన టేస్ట్!" అంటూ స్టార్ రేటింగ్ ఇస్తాం.ఇంట్లో అమ్మ లేదా భార్య అదే ప్రేమతో వండితే"ఉప్పు కాస్త తక్కువైంది..." అంటూ మొహం ముడుస్తాం.


ఈ సమాజానికి నాణ్యతతో అంత పని లేదు, ప్రెజెంటేషన్‌తోనే పని.

సరుకు కన్నా,దాన్ని ఎలా చూపిస్తున్నావు, ఎలా అమ్ముతున్నావు అన్నదే ముఖ్యం.


సరుకు అదే,కానీ ఆకులు మారితే ధర మారుతుంది, ప్లేట్ మారితే రుచి పెరుగుతుంది, లైటింగ్ మారితే విలువ అదిరిపోతుంది.


మొత్తానికి... మనం వస్తువులను కాదు, వాటి చుట్టూ అల్లిన కవరింగ్‌ను, ఆ కవరింగ్ చెప్పే కథనే ఎక్కువగా కొనేస్తున్నాం.

అందుకే... కథ అంతా కవరింగ్‌దే!


కొత్త విరిత

సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్

ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్




మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



కొత్త విరిత
కొత్త విరిత

రచయిత్రి పరిచయం: కొత్త విరిత


నా పేరు కొత్త విరిత


B.sc B.ed Msc చేశాను

IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.

240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.

6 Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Rated 5 out of 5 stars.

Super

Like

Rated 5 out of 5 stars.

Excellent 👌

Like

Rated 5 out of 5 stars.

Cent percent correct 💯

Like

Rated 5 out of 5 stars.

NICE

Like

Rated 5 out of 5 stars.

So true

Like
bottom of page