top of page

మనశ్శాంతి

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.







Video link

'Manassanthi' New Telugu Story


Written By Dasu Radhika


రచన: దాసు రాధిక





"అబ్బా ఆ దిండు కింద చూడవచ్చు గా... రోజూ వెతకటమే... తాళాల కోసం... ఒక్క నిమిషం ప్రశాంతంగా దేవుడికి దణ్ణము కూడా పెట్టుకో నివ్వరు" ...


ప్రసాద్కిది మామూలే…


"రాజేష్, ఫోను మ్రోగుతున్నది, ఎత్తచ్చు కదరా ?"

"సార్, ఒక్క నిమిషం, నేను ఇక్కడ చిమ్ముకొని అవతలకి పోతాను... నాకూ టైమ్ అవుతోంది"... పనిమనిషి కూడా ఊపిరి తీస్తున్నది…


అటు పనిమనిషి చేతిలో ఉన్న చీపురు తనకు తగలకుండా ఇటు పెళ్లాంతో, కొడుకు తో మాట్లాడుతూ దేవుడి ని ఆ క్షణం తను అడగాలనుకున్నది కూడా మర్చిపోయాడు ప్రసాద్...


ఒక్క నిమిషం ప్రశాంతంగా దేవుడి ముందు చేతులు జోడించి నిలబడ లేని పరిస్థితి... ప్రతీ రోజు అంతే... ఏంటో...


కాస్త పలహారం నోట్లో పడుతుండగానే కాలింగ్ బెల్లు మ్రోగింది... ఆ నిమిషంలో ఇంట్లో ఉన్న మనుషులంతా మాయమైపోయారా ఏం? ఒక్కరూ వచ్చి తలుపు తియ్యలేదు అని టిఫిన్ తినకుండా చెయ్యి కడుక్కొని తలుపు తీశాడు ప్రసాద్...


"ఎవరు నాన్న? " అని లోపల నుండి అరిచాడు రాజేష్...


"నీకెందుకు రా, ఆ కంప్యూటర్ దగ్గరే తగలడు" అన్నాడు ప్రసాద్.


కొడుకు రాజేష్ కి పగలు రాత్రి తేడా లేకుండా పోయింది... ఆ కంప్యూటర్ మెడ కి కట్టు కొని తిరుగుతాడు... ఇప్పటికే స్టార్ట్ అప్ అని ఎంతో డబ్బు ఎన్నో సార్లు తగ లేశాడు ... ఇంట్లో ఏం జరుగుతున్నదో అతనికి సంబంధం లేదు...


వచ్చింది పేపర్ బిల్లు తీసుకొని న్యూస్ పేపర్ బాయ్... వాడికి ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు తయారైపోతాడు ... ఎన్ని సార్లు మొత్తుకున్నాడో ప్రసాద్... వీడి మొహాన ఆ బిల్లు డబ్బులు ఇచ్చేస్తే టిఫిన్ తిన్నంత ఫలితం... ఒట్టి పేచి కోరు... మొత్తం చిల్లర తో సహా చెల్లించాడు అతనికి ప్రసాద్... లేకపోతే ఏదో బాకీ వాడు ఇంటి ముందు గోల చేసినట్టు చేస్తాడు వెధవ…


ఈ తలనొప్పి తనకే ... పేపర్ అందరూ చదువుతారు కాని తన అర్ధాంగి ప్రమీల ఏ రోజు నెల వారీ బిల్లులు కట్టదు... అర్ధాంగి అనే మాట కు తన జీవితం లో అర్థం లేదు, (అదే అర్ధం కాలేదు ఇన్ని ఏళ్లు గా)అంగీ మటుకు ఉంది... అర్ధం కాలేదా? అదేనండి…


కొన్నేళ్లుగా ఉద్యోగానికి రోజూ ఆడవాళ్లందరి లాగా చీరెలకు స్వస్తి చెప్పి పంజాబీ డ్రస్సులు వేసుకుంటోన్ది.


టైమ్ అయిపోయింది. ప్లేటులో టిఫిన్ ఒక చిన్న డబ్బాలో పెట్టుకుని ఆఫీసు కి వెళ్లేందుకు స్కూటర్ తీశాడు ప్రసాద్…


ప్రమీల కారు లో ఫోను మాట్లాడుతూ దూసుకొని పక్కకి చూడ కుండా వెళ్లిపోయింది... ఎంత ఉద్యోగం చేస్తే మటుకు... కట్టుకున్న మొగుడు అంటే…


వద్దు లే...పొద్దున్నె మూడ్ పాడై పోతుంది...


తాను పొద్దున మిస్ చేసిన కాల్ ఎవరిదో ఆఫీసుకు వెళ్లిన గంట తరువాత చూసుకున్నాడు ప్రసాద్…


కొత్త నెంబర్... ఎవరా అని రింగ్ చేశాడు... ఈ లోపల బాస్ పిలిచాడు…


ఒక గంట మీటింగ్ బాదుడు... ఆ మిస్డ్ కాల్ గురించి మర్చిపోయాడు …


పెద్ద పని వచ్చి పడింది... "భగవన్తుడా ... అందరికీ ఇలాగే ఉందా లేదా తనకే నా?"..

రోజూ ఇంతే... ఏదో ఒత్తిడి...


రాత్రి ఒక అరగంట లేటు అయింది ఆఫీసు లో బయలుదేరే సరికి... ఇంటికి చేరే సరికి ఒక గంట తేడా వచ్చింది రోజూ కంటే...


"అమ్మ బాబోయి... ప్రమీల ఇంటికి వచ్చేసి ఉంటుంది... ఇవాళ నిద్ర పోయే ముందు కూడా మనశ్శాంతి ఉండదని మనసు లో అనుకున్నాడు ప్రసాద్…


ప్రమీల ఏమో సాఫ్ట్వేర్ కంపెనీ లో టీం లీడర్... ఎప్పుడూ బిజీ... మరి తను...


మొగుడు కి లేట్ అయిన రోజు ప్రమీల విశ్వరూపం చూడాలి... " ఇంత సేపు ఎక్కడికెళ్లారు ? ఎవరితో తిరిగి వస్తున్నారు... మీకే అంత ఉంటే నేను సాఫ్ట్వేర్…”

ఈ శోది వింటూ ఆ పూట కు పస్తు ఉండాల్సిందే ప్రసాద్... ఏంటో... ఇలా పాతికేళ్లు గడిపేశాడు…


"అయినా ఫోన్ కూడా ఆన్సర్ చేయ లేనంత బిజీ ఆ? సాఫ్ట్వేర్ లో ఉండి నేను ఫోన్లు ఆన్సర్ చేస్తూ పని పూర్తి చేసి మీ కంటే ముందు ఇల్లు చేరి, స్విగ్గీ లో ఫుడ్ ఆర్డర్ చేసి ఇంకా రాలేదు మీరు అని వేడి గా ఉన్న ఫుడ్ పార్శిల్ చూస్తూ కూర్చోవాలా? "


"సరే సారీ ప్రమీ, తిన్దాము పెట్టు" అన్నాడు ప్రసాద్...


ప్రమీల పట్టించుకునే దీని లో లేదు ... "అందుకే రోజూ కంటే ఎక్కువ ఆకలి వేసి పార్శిల్ పూర్తి గా తినేశాను" అంది.


ప్రసాద్ కు అయిపోయింది అప్పటి కి ఒంట్లో ఛార్జి...

అరిటి పండ్లు కనిపించాయి... తిని పడుకొన్నాడు...


ప్రమీల మొదలు పెట్టింది మళ్లీ... "అమ్మాయి వైషు కోసం సంబంధం వాళ్లు ఫోన్ చేశారు... మీరు దొరకక పోతే నాకు చేశారు... రేపు దానికి చేసి ఏ సంగతి కనుక్కొని వాళ్ళ తో మాట్లాడండి"... అంటూ ప్రమీల గొణుక్కున్ది... "అసలు లైఫ్ లో మనశ్శాంతి లేకుండా పోయింది"...


ప్రసాద్ ని అప్పటి కి రెండు సార్లు పిలిచాడు బాస్... ఫోను లో వైషు గట్టిగా ఏడుస్తోన్ది... సతీష్ అనే కుర్రాడి తో తాజాగా బ్రేక్ అప్ అయింది ... మ్యాటర్ చాలా సీరియస్... రెండు నెలల నుంచి గాఢముగా ప్రేమించుకుంటే ఎవరో చామంతి అని కొత్త అమ్మాయి మధ్య లో దూరినది... ఆ పై ‘ఈ పెళ్లి గోల ఏంటి నాన్న.. నన్ను కొంచెం మనశ్శాంతి గా బతకనిస్తారా’ అని కూతురు వేసిన ప్రశ్నకు ప్రసాద్ తల తిరిగి పోయింది...


"ఇన్స్పెక్షన్ కు ఇంకో నాలుగు రోజుల్లో ఢిల్లీ నుండి టీమ్ వస్తోంది... ప్రసాద్ వాట్ ఈజ్ ద మ్యాటర్ విత్ యు? " అని బాస్ అరిచాడు... మరీ ఇంత అధ్వానంగా ఉంటాయి తన గ్రహాలు అని ఏ మాస పత్రిక వాడు రాయ లేదే…


వార మాస ఫలాల కోసం తను అన్ని పత్రికలూ అసలే చాలా శ్రద్ధ గా చదువు తాడాయె …


శని ఆదివారాలు కొంచెం ఊపిరి పీల్చు కొందామనుకున్నాడు ప్రసాద్...


సరిగ్గా ఆ రెండు రోజులే మెయిన్టెనెన్సు పనుల వల్ల నీళ్ల సరఫరా రోజు కో గంట మాత్రమే అని అపార్టమెన్ట్ అసోసియేషన్ ప్రకటించింది…


హాయిగా తన చిన్న తనం లో ఇటువంటి బాధలు లేవు కదా... చిన్న గ్రామాల్లో జీవితం ఎంతో ప్రశాంతంగా గడిచి పొయ్యేది అందరికీ.... అప్పుడు చిన్న జీతాలు, సీదా సాదా గా అందరూ బ్రతికే వారు... ఇప్పుడు పట్నవాసం, ఊహించని జీతాలు. కాని ఒత్తిడి తో కూడిన జీవితాలు... ఆ రోజులే బాగున్నాయి...


నిట్టూర్పు విడుస్తూ ప్రసాద్ తన మిత్రుడు శివ కు ఫోన్ చేశాడు... “ఈ వీకెన్డ్ మీరు ఇంట్లో ఉంటారా? మీ ప్రోగ్రామ్ ఏంటి? మాకు వాటర్ సప్లయ్ లేదు ట. సో మేము అక్కడి కి వస్తాము శివ "...


ఇది సిటీజ్ లో ఉండే వాళ్లకు మామూలే...ఈతి బాధలు తప్పవు...డబ్బు తో అన్నీ తీరవు ...


ప్రమీల కు పాపం వీకెన్డ్ కూడా విశ్రాంతి లేదు. బ్యూటీ పార్లర్ పని చేసుకోవాలి... లేకపోతే నలుగురి లో చిన్న తనంగా ఉంటున్ది...


ఈ మొగవాళ్ల కి అర్థం అయితేగా... ఆడ వాళ్ళ ఇబ్బందులు...


ఇంకా తన ఫ్రెండ్ శివ ఇంటికి వెళ్లేది ఎవరు?? పెళ్లాం రెండు రోజులు పూర్తి గా పార్లర్ కు అంకితం అయిపోయింది...


కొడుకు కి స్నానం, తిండి తో ఏ సంబంధం లేదు... మిగిలింది తను... ఏదో తంటాలు పడితే సరిపోతుంది …


కూతురు ఎలాగో తన ఆఫీసు కు దగ్గర గా ఉండే ఉమెన్స్ హాస్టల్ లో ఉంటోంది…


శివ కు మళ్ళీ ఫోన్ చేసి’ రావడం లేదు’ అని చెప్పాడు ప్రసాద్...


"ఇది నీ ఫ్యామిలీ కు మామూలే గా.... ఎవరి గోల లో వాళ్లు ఉంటారు... నీ పిచ్చి గాని..." అన్నాడు శివ


అప్పుడే వైషు కోసం చూసిన సంబంధం వాళ్ళ ఫోన్ వచ్చింది... వాళ్ల కు చాలా తొందరగా ఉంది...

ప్రసాద్ తన కూతురికి నచ్చ చెప్పిన తీరు-- " అమ్మా వైషు... పెళ్లి కి ఒప్పుకో... నీ కొత్త బాయ్ ప్రెండ్ నీ భర్త మహేష్... ఇంక బ్రేక్ అప్ అనేది నీ జీవితం లో జరగదు...ఎంచక్కా రోజూ నీ కిష్టమైనట్లు మీ ఫోటోలు సోషల్ మీడియా లో పెట్టు కొనవచ్చును...".


"సరే నాన్న... అతని జీతం నెలకు రెండు లక్షలు కాకపోతే నేను ఓకే చెప్పే దాన్ని కాదు... ఏమున్నా లేక పోయినా కొంచెం మనశ్శాంతి నాకూ కావాలి కదా నాన్న... అమ్మ ని నిన్ను చూసి బాగా తెలుసు కున్నాను... నీ కన్నా అమ్మ కి రెట్టింపు జీతం వస్తోంది కాబట్టి సరి పోయింది. లేక పోతే పాపం అమ్మ పని ఏమయ్యేది??" వైషాలి ఇచ్చిన జవాబుకు నిర్ఘాంత పోయాడు తండ్రి ప్రసాద్...


ఎంత మారి పోయింది కాలం... అని తన లో తాను అనుకున్నాడు... పెద్దవాళ్ల తో మాట్లాడే పద్థతే మారిపోయింది... ఎవరు చెబుతారు కూతురికి... వాళ్ళ అమ్మ పెళ్లి అయ్యాక తన ప్రోత్సాహం తో డిగ్రీ పూర్తి చేసిందని... ఇక ఉద్యోగం మాట వస్తే, అందులోనూ సాఫ్ట్వేర్ .... పదిహేనేళ్లు కష్టపడితే కాలం కలిసొచ్చి ఈ రోజు ప్రమీల కారు నడుపుతూ కనిపిస్తోంది... తను మటుకు అదే స్కూటర్... కూతురి లో మరో ప్రమీల కనిపించింది ప్రసాద్ కు...


రోజు తెల్లవారుజామున వాకింగ్ కెళ్ళినప్పుడు కలిసే శర్మ గారు వారం అయింది ప్రసాద్ కు కనిపించి... ఒక రోజు ఆఫీసు లో ఉండగా ఫోన్ చేశాడు... తాను ఊరు విడిచి వెళ్లి పోతున్నానని చెప్పాడు... చెప్పలేని చిక్కుల్లో ఉన్నట్లు భోరుమన్నాడు ... గట్టిగా అడిగితే పది లక్షల అప్పు వారం లో చెల్లించాల్సి ఉందని వాపోయాడు ... ఆ డబ్బు సర్దుబాటు ఎలాగో చేద్దామని ప్రసాద్ భరోసా ఇచ్చిన తరువాత అతను మామూలు ధోరణి కొచ్చాడు...


శర్మ గారికి ఇన్ని చికాకులు ఉన్నాయన్టే ఆ కాలనీ లో ఎవరూ నమ్మరు... పెళ్లాం ఎప్పుడు క్లబ్బు లో కాలక్షేపం చేస్తూ కనబడితే, పిల్లలు సోషల్ మీడియా లో హడావిడి చేస్తూ కనిపిస్తారు... శర్మ గారు చిద్విలాసంగానే అందరికీ తెలుసు.... లేని మనశ్శాంతి కోసం ఇన్నాళ్లూ నటిస్తూ ఉన్నాడని ప్రసాద్ కు అర్ధమయ్యిన్ది...

ఆ రోజు సాయంత్రం టీ వీ వార్తల్లో ఒక ప్రముఖ శాస్త్రీయ గాయని భర్త ఆత్మహత్య చేసుకున్నాడని, ఆలుమగల మధ్య కలహాలే దానికి కారణం అని బట్ట బయలు అయింది...


ప్రసాద్ కు చాలా బాధ వేసింది... ప్రమీల తో ఇలా అన్నాడు- "ప్రపంచం లో ఇతరుల బాధలు చూశాక విన్నాక మనం ఎంతో హాయిగా ఉన్నామనిపిస్తోన్ది ప్రమీ"...


“అయితే ఇన్నాళ్లూ అనిపించ లేదా? యేమంత కష్టాలు పడ్డారని ... నాకు ఉన్నట్లు జాబ్ టెన్షన్ కూడా లేదు మీకు... అనవసరంగా ఎవరి గురించో ఆలోచించి మనశ్శాంతి ని పాడు చేసుకోవద్దు" అని వెటకారం గా నవ్వింది ప్రమీల…


ఏంటో ఈ జీవితం... ఒకరినొకరు అర్థం చేసుకోక పోయినా కలిసి బతికేస్తారు 90% మనుషులు…


వైషాలి పెళ్లి ఘనంగా జరిగింది... ప్రమీల సాఫ్ట్వేర్ టీమ్ సంగీత్ అంటూ డాన్స్లు చేసి ఒక ఊపు ఊపారు... రాజేష్ తండ్రి అంచనాలకు తగ్గట్టు ఎవరో కిరస్తానీ పిల్లను తీసుకొచ్చి నలుగురి లో తనకు కాబోయే పెళ్లాం అని ప్రకటించాడు…


"ఇన్నాళ్లూ ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను... ఈ రోజు మీ అందరి తో విషయం చెప్పాక నాకు మనశ్శాంతి గా ఉంది నాన్న" అన్నాడు రాజేష్...


"ఇంట్లో చెప్పాల్సిన విషయం ఇలా పబ్లిక్ గా చెప్పావేన్టి రా?" అని ప్రసాద్ ప్రశ్నిస్తే, "అబ్బ ఊరు కుంటారా" అని ప్రమీల కట్ చేసింది...


ఆ అమ్మాయి ఎవరో కాదు... ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఎండి మైఖేల్ కూతురు... రాజేష్ లక్కీ... రేపు పెళ్లి అయ్యాక కంపెనీ లో సగం వాటా వాడికే"... ప్రమీల లో గత రెండేళ్లుగా వచ్చిన మార్పు మరీ ముదిరి పోయింది... ప్రసాద్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది...


పెళ్లి కొచ్చిన పెద్దలలో భక్తి టీ వీ లో తన ప్రవచనం తో ఖ్యాతి పొందిన శ్రీ పూర్ణానందము గారు ఉన్నారు... కాసేపు వచ్చిన అతిథుల లో చాలా మంది ఆయన తో ముచ్చటించారు...


ఆ తరువాత ఆయన కు భోజనం పెట్టిస్తూ ప్రసాద్ అన్నాడు... " ఎంతో పుణ్యం చేసుకుంటే మీ లాగా జన్మ వస్తుంది కదా"...


దానికి ఆయన నవ్వి ఊరుకున్నారు ...


ప్రసాద్ అడిగాడు " అన్నీ ఉన్నా ఎందుకు మనుషులు ఆనందం గా లేరు? మనశ్శాంతి ఎందుకు అందరికీ దొరకదు? మీకు మటుకు ఆ దేవుడు కొంచెం ఎక్కువగా శాంతి ని ప్రసాదించాడు?"


"నా గురించి మీకు ఎంత తెలుసు? ఎన్నో ఘోరమైన కష్టాలు పడి ఇవాళ ఈ మాత్రం నలుగురు కి ఉపయోగ పడుతున్నాను... మీరు ఊహించ లేరు... జీవితంలో లభించని మనశ్శాంతి ని ఇలా ప్రవచనాలు చెబుతూ వేదికలపై వెతుక్కుంటూ ఉన్నాను"...


మర్నాటి నుంచి ప్రసాద్ లో నూతన ఉత్సాహం కనిపించింది... అలవాటైన తన కుటుంబం... రాజేష్ , ప్రమీల తనకు కొత్త కాదు కదా... ఆ రోజు నుంచి ఆ భగవంతుని వాళ్ల కు కావాల్సినది ప్రసాదించమని కోరుకోవటం మొదలు పెట్టాడు...


ప్రమీల కు ఇంకా ప్రమోషన్ కావాలి, ఇంకా పెద్ద కారు, అలమర లు సరిపోనన్ని డ్రస్సులు.. ఇవే కదా... రాజేష్ కొత్త పెళ్లాం తో ఇల్లరికం ఉంటానని వెళ్లి పోయాడు... వాడు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి, అదే ప్రసాద్ కి కావాలి... వైషు అదృష్టము... దాని కోరికలు తీర్చే డబ్బు గల భర్త దొరికాడు ... దాని మనశ్శాంతి కి ఢోకా లేదు…


ఇక తన మనశ్శాంతి కి ఏంటి తక్కువ... పిల్లల బాధ్యతలు తీరి పోయాయి... ముప్పై ఏళ్లుగా దినచర్య ఒక పందా లో జరిగి పోతోంది... ఎంత మంది కి జరుగుతుంది?? ఎంతో మంది బయటకు ఒక లాగా ఉంటారు, అందరినీ నమ్మిస్తారు కూడా... కాని నిజానికి చాలా మనస్తాపానికి గురవుతూ ఉంటారు... శారీరక అవస్థలు, మానసిక ఒత్తిళ్లు, ఆర్థిక బాధలు, కష్టాలు, కన్నీళ్లు ఇంకా ఎన్నో...


చిన్న చిన్న సర్దు బాటులు చేసుకుంటూ లైఫ్ ను హాయిగా గడపవచ్చు... ఆఫీసు చేరే లోగా ఎవరైనా లిఫ్ట్ అడిగితే ఎక్కించు కొని దింపటము లో కొత్త గా ఆనందం వచ్చింది ప్రసాద్ కు... అప్పటి నుండి పెళ్లాం అదే టైమ్ లో కారు లో దూసుకొని వెళ్లడం ప్రసాద్ కు కనిపించ లేదు…


స్కూటర్ లేకుండా కాలి నడక న వెళ్లే వాళ్లు పాపం చాలా మంది...


అలాగే కొత్త పరిచయాలు అయ్యాయి…


శని ఆదివారాల లో ప్రమీల బిజీగా షాపింగ్ చేస్తూ లేదా పార్లర్ కు అంకిత మైతే తను ఇంట్లో కొత్త వంటకాలు నేర్చుకుని ప్రమీల ఇంటికి రాగానే రెడీ చేసి పెట్టే వాడు...


ఏదో ఒక రోజు ఆమె మెప్పు పొందు తాడని అతని నమ్మకం... తన వంటరితనాన్ని ఉల్లాసంగా మార్చు కొనే ప్రయత్నం చేశాడు... యు ట్యూబ్ లో పాడ్కాస్ట లు చదవడం మొదలు పెట్టాడు... మెల్లగా తను ఉండే కాలనీ లో నలుగురు అభిమానులను సంపాదించుకున్నాడు...


ఆఫీసు లో బాస్ తో నవ్వుతూ మాట్లాడటం మొదలు పెట్టాడు... దాని వల్ల ఎంత పని అయినా తేలిక గా అయిపోతున్ది...లేకపోతే సతమతమవుతూ ఇన్ని ఏళ్ల గా తానేమి సాధించినట్లు...


ఎవరి చుట్టూ ఉన్న వాళ్ళ వాళ్ళ చిన్ని ప్రపంచం లోనే రోజువారి చిన్న చిన్న సంతోషాలను ఎవరికి వాళ్లు వెతుక్కుంటే ఇంక మనశ్శాంతి కేమీ తక్కువ?? అదనంగా ఇంకో పదేళ్లు ఆరోగ్యంగా బ్రతుకును సాగించువచ్చు...


********************************

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం

పూర్తి పేరు: శ్రీమతి దాసు రాధిక

వయసు: 52 సం.

నివాసం: బెంగుళూరు ( ప్రస్తుతము)

స్వస్థలం: తెనాలి

చదువు: BA English Litt., B.Ed

వృత్తి: గృహిణి. 1993-1997 హై స్కూల్ టీచర్ గా పని చేసిన అనుభవం.

ప్రవృత్తి: సంగీతం వినటం, పాటలు పాడటం

పాడుతా తీయగా ETV లో రెండో బ్యాచ్ 1997 లో క్వార్టర్ ఫైనలిస్ట్.

స్కూల్, కాలేజి లో పాటలు, నాటకాల( ఇంగ్లీషు, తెలుగు) అనుభవం.

కథలు వ్రాయటం, ఇంగ్లిష్ - తెలుగు భాషా అనువాదాలు.

ఇటీవలే ఛాంపియన్స్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ నుండి , ఆసియన్ వరల్డ్ రికార్డ్స్ వారినుండి సర్టిఫికేట్ లు పొందాను.







176 views0 comments
bottom of page