top of page
Original.png

మొనదేలిన మనసు

#వసుంధరరాణిమునిపల్లె, #VasundharaRaniMunipalle, #మొనదేలినమనసు, #బామ్మకథలు, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు, #TeluguChildrenStories, #తెలుగుబాలలకథలు

బామ్మ కథలు - 30

Monadelina Manasu - New Telugu Story Written By Vasundhara Rani Munipalle Published in manatelugukathalu.com on 23/02/2026

మొనదేలిన మనసుతెలుగు కథ

రచన: వసుంధర రాణి మునిపల్లె 


​చింటూకి చిత్రలేఖనం అంటే చాలా ఇష్టం. కానీ వాడికి ఒక పెద్ద సమస్య ఉంది—ఓపిక అస్సలు ఉండదు. ఏదైనా త్వరగా అయిపోవాలి, లేదంటే విసుగు వచ్చేస్తుంది.


ఒకరోజు స్కూల్ కాంపిటీషన్ కోసం ఒక బొమ్మ గీస్తున్నాడు. బొమ్మ దాదాపు పూర్తి కావొచ్చింది, కానీ సడన్ గా చేతిలో ఉన్న పెన్సిల్ ముక్కు విరిగిపోయింది. చింటూ చిరాకుగా దాన్ని షార్ప్ చేశాడు. మళ్ళీ గీస్తుంటే మళ్ళీ విరిగిపోయింది. అలా మూడు సార్లు అయ్యేసరికి వాడికి కోపం నశాలానికి అంటింది. "ఛీ! ఈ పనికిమాలిన పెన్సిల్! అస్సలు మొన పడటం లేదు. షార్ప్ చేసే కొద్దీ విరిగిపోతోంది. నా బొమ్మ కూడా పాడైపోయింది!" అని అరుస్తూ ఆ పెన్సిల్‌ను నేలకేసి కొట్టాడు. ఆ కోపంలో తన డ్రాయింగ్ షీట్‌ను కూడా నలిపేయబోయాడు.


​అప్పుడే అక్కడికి వచ్చిన బామ్మ, చింటూని ఆపి, నేల మీద పడ్డ పెన్సిల్‌ను తీసుకుంది. "ఏమైందిరా చింటూ? అంత కోపం ఎందుకు?" అని అడిగింది. చింటూ ఏడుపు మొహం పెట్టి, "చూడు బామ్మ, ఈ పెన్సిల్ నన్ను ఎంత ఇబ్బంది పెడుతుందో! ఇది పనికిరాదు, పారేద్దాం" అన్నాడు.


బామ్మ చింటూని పక్కన కూర్చోబెట్టుకుని, చింటూ ఈ పెన్సిల్‌ని చూసి నువ్వు నేర్చుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయిరా అని చెప్పడం మొదలుపెట్టింది.

​"ఈ పెన్సిల్ పదునుగా మారాలంటే ఆ షార్పనర్ లోపల ఉన్న బ్లేడుతో చెక్కబడాలి, దానికి అది నొప్పిగానే ఉండొచ్చు కానీ అలా చెక్కబడితేనే అది అందమైన బొమ్మలు గీయగలదని వివరించింది. మన జీవితంలో కూడా కష్టాలు మనల్ని పదునైన వ్యక్తిత్వంగా మారుస్తాయని, ఈ పెన్సిల్ పైన ఉన్న రంగు కేవలం ఒక కవచం మాత్రమేనని, అసలైన పని చేసేది లోపల ఉన్న నల్లటి గ్రాఫైట్ అని బామ్మ చెప్పింది. మనిషి కూడా అంతే, బయటి అందం కంటే మన మనసులో ఉన్న మంచి ఆలోచనలే మనల్ని గొప్పవారిని చేస్తాయని హితవు పలికింది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, పెన్సిల్‌తో రాసేటప్పుడు ఎరేజర్‌తో తప్పులను తుడిపేసి మళ్ళీ సరిగ్గా రాసుకోవచ్చని, నువ్వు ఇప్పుడు బొమ్మ పాడైందని కోప్పడకుండా ఆ ఎరేజర్‌తో తుడిపేసి మళ్ళీ ప్రయత్నించు అని ధైర్యం చెప్పింది.


నిజానికి ఓపిక, సహనం ఉంటే ఎంతటి కష్టాన్నైనా జయించవచ్చని, మన అంతర్గత శక్తే మనకు నిజమైన విజయాన్ని అందిస్తుందని బామ్మ చింటూకి ప్రేమగా నచ్చజెప్పింది.


​బామ్మ మాటలు విన్నాక చింటూ ఆలోచనలో పడ్డాడు. తన ఓపిక లేని తనమే తనకి పెద్ద శత్రువు అని అర్థం చేసుకున్నాడు. మెల్లగా డ్రాయింగ్ షీట్‌ను సరిచేసి, మళ్ళీ అదే పెన్సిల్‌ను పదునుగా చెక్కి, ఓపికగా బొమ్మను పూర్తి చేశాడు. ఆ రోజు కాంపిటీషన్ లో చింటూకి ప్రైజ్ వచ్చింది. ఆ మెడల్ కంటే కూడా, తన మనసును మొనదేల్చిన బామ్మ మాటలు, ఆ పెన్సిల్ నేర్పిన జీవిత పాఠం చింటూకి ఎంతో విలువైనదిగా అనిపించింది.


           *** 

సమాప్తం. 

వసుంధర రాణి మునిపల్లె గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):

వసుంధర రాణి మునిపల్లె గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: వసుంధర రాణి మునిపల్లె


నాకు ఈ సదవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు.


నేనొక హౌస్ వైఫ్ ని నాకు కథలు రాయడం ఒక హాబీ.

ఇంతకుముందు జాగృతి లాంటి పత్రికలలో కథలు ప్రచురితమయ్యాయి. ఇంకా కొన్ని కథలు పరిశీలనలో ఉన్నాయి.

bottom of page