top of page
Writer's pictureSita Mandalika

నాతి చరామి

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.





Video link

'Nathi Charami' New Telugu Story Written By Sita Mandalika

రచన: సీత మండలీక


“చక్రీ, నిన్న నా స్నేహితురాలు సునంద హైద్రాబాద్ నుండిఫోన్ చేసింది. కాలేజీ స్నేహితులందరూ హైద్రాబాద్ లో కలుద్దామని ప్రపోజ్ చేసింది.. వెళ్ల మంటారా?

"అలా అడుగుతావేమిటి గాయత్రీ. నువ్వు తప్పకుండా వెళ్ళు. ఎన్నాళ్ళు ప్రోగ్రాం వేసుకున్నారు డియర్?"

"అంతా వారం. హైద్రాబాద్ లో నాలుగు రోజులు గడిపేక శ్రీ శైలం వెళ్తాం. అక్కడ నించి తిరిగి వచ్చేక ఒక రోజు హైద్రాబాద్ లో బడలిక తీర్చుకుని తిరిగి వచ్చేస్తాను".

"హాయి గా తిరిగి రా గాయత్రీ. అన్ని చోట్ల ఫోటో లు తీసుకుని వెంటనే నాకు పంపించాలి. స్నేహితులతో పడి మర్చిపోకు"

"ఎలా మర్చిపోతాను చక్రీ. అయినా మీరు కూడా రావచ్చు కదా"

"నేను రాను గాయత్రీ. నువ్వు వచ్చేక మనం ఊటీ వెళదాం"

“ఆమ్మో మనం ఊటీ వెళ్లడం ఏమిటి. మీ ఆరోగ్యం ఏమవుతుంది. వద్దండి మన ఊటీ సిమ్లా అన్నీ ఈ వైజాగ్ లోనే. కానీ చక్రీ మమ్మల్ని వదిలి ఎలా వెళ్ళను అని ఆలోచిస్తున్నాను"

"గాయత్రీ! నువ్వు వెళ్తున్నావు. నా హార్ట్ ఆపరేషన్ అయి మూడేళ్లయింది. ఈ మూడేళ్ళలో ఏదేనా అనారోగ్యం గాని హార్ట్ ప్రాబ్లెమ్ గాని వచ్చిందా. డాక్టర్ గారు మనకి ధైర్యం చెప్పలేదా. నేను నీకు జబ్బు మనిషి లా కనిపిస్తున్నానా? ఎందుకు అంత భయం.. నీ అతి జాగ్రత్తతో నాకు విసుగొస్తోంది”

"అరే సార్! నేను ఆలా ఉండబట్టే మీరు ఆరోగ్యం గా ఉన్నారు"

"అవును అంతా నీ దయే. లేక పోతేనా"...... అంటూ కోపం గా బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోయేడు చక్రి.

‘వెళదామా వద్దా అనుకున్నాను గాని నేను హైద్రాబాద్ వెళ్తాను. నేను వెళ్తేనే చక్రికి నా లోటు ఏమిటో తెలుస్తుంది.’

ఆ రాత్రి ముభావం గానే ఉంది గాయిత్రి.

మర్నాడు పొద్దున్నే "గాయత్రీ లేస్తావా. నీ ఫిల్టర్ కాఫీ తాగితే గాని నాకు రోజంతా ఉత్సాహం గా ఉండదు. నువ్వు కలిపిన కాఫీ లో ఏదో ప్రత్యేకత ఉంది. అదే నాకు నచ్చుతుంది డియర్ " అంటూ రాత్రి వాదనలన్నీ మర్చిపోయి గ్గాయత్రిని పొగడ్తలతో ముంచెత్తేడు చక్రి.

చక్రి ది అమాయకత్వం అనుకోవాలో, గడుసు తనం అనుకోవాలో గాయత్రికి అర్ధం కాదు. ఏది ఏమయినా తనతో మాటలు లేకుండా అతను ఉండలేడు అనుకుంటూ కాఫీ పెట్టడానికి వెళ్ళింది.

ఆ రోజు గోదావరి ఎక్స్ ప్రెస్ లో గాయిత్రి ప్రయాణం. నాలుగు రోజుల కోసం నాలుగైదు రకాల కూరలు, తనకి ఇష్టమైన సాంబారు, పొద్దున్న బ్రేక్ ఫాస్ట్ కి ఇడ్లీ పిండి, ఇలా తనకి ఇబ్బంది కాకుండా ప్రతీది సమకూర్చింది.

"నీ ప్రేమ నాకు అర్ధం అవుతుంది గాని అలా టూ మచ్ కేర్ అంటేనే నాకు విసుగొస్తుంది. నువ్వు వెళ్లి హాయిగా ఒక వారం రోజులు గడిపి రా. నేను నా గురించి చూసుకోగలను"

తన మంచికే చెప్తాననిఎందుకు అర్ధం చేసుకోడు?ఏదో తనని బాధ పెట్టడం తప్ప. ఈ ఆపరేషన్ లేకపోతే జీవితం మరోలా ఉండును కదా. డాక్టర్ తనకి అంతా విపులంగా చెప్పేడు. ఆపరేషన్ చాలా బాగా అయిందని చక్రి హార్ట్ పూర్వం కన్నా బాగా పని చేస్తోందని, ఏమీ భయం లేదని. అయినా తనలో ఏదో పిరికితనం. ఆ పిరికితనం తోనే చక్రి ని ఎప్పుడూ కాపాడాలనే తాపత్రయం. అది చక్రికి అర్ధం కాదు

ఆ సాయంత్రం గాయిత్రి తన ఫ్రెండ్స్ తో కలిసి గోదావరి ఎక్ష్ప్రెస్స్ లో హైదరాబాద్ బయలు దేరింది. గాయిత్రి వెళ్లి పోగానే ఇల్లంతా సూన్యం గా అనిపించింది చక్రికి.

తను వాదిస్తూ ఉంటాడు గాని గాయిత్రి లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేడు. అందులోనూ ఒంటరిగా ఉండడం అసాధ్యం. తనకి కావలిసినవన్నీ చక్కగా సిద్ధ పరిచింది గాయిత్రి. పని మెల్లగా చేస్తుందని విసుక్కుంటాడు గానీ ఆ పనిలో వేలెత్తి చూపడానికి ఉండదు. ఆ ఆలోచనల తోనే నిద్రలోకి జారుకున్నాడు చక్రి.

“గాయత్రీ నీ ఫ్రెండ్స్ తో సరదాగా గడుపు గానీ నిమిష నిమిషానికీ ఒక సారి ఫోన్ చేసి టైం ప్రకారం బ్రేక్ ఫాస్ట్ చేసేవా భోజనం చేసేవా, మందులు తీసుకున్నావా అని అడగవద్దు. మీ ఫ్రెండ్స్ అందరూ నేను చేత కాని వాడి ననుకుంటారు” అని మరీమరీ చెప్పేడు.

ఇప్పుడు అదే తప్పు చేసేను అనుకున్నాడు చక్రి. కాఫీ, ఇడ్లీ గొడవలో పడి మందులు మర్చిపోయేడు. ఇంక గాయిత్రి వచ్చేస్తే బాగుండును. ఒక్క రోజు కూడా అవలేదు. మనసు గాయిత్రి మీద కి మళ్లింది.

ఇంతలోనే గాయిత్రి ఫోన్ వచ్చేసరికి చాలా సంతోషం అనిపించింది చక్రికి

"హలో నేనండీ హైదరాబాద్ చేరి ఒక గంటయింది. అందరం చాలా సంవత్సరాల తరవాత కలవడం చాలా సంతోషం గా ఉంది. సునంద అన్ని ఏర్పాట్లు చేసింది. మా ప్రోగ్రాం కొంచెం మారింది. రేపే శ్రీశైలం వెళ్తున్నాము. అక్కడినించి వచ్చేక మాట్లాడుతాను. మీరు బ్రేక్ ఫాస్ట్ చేసేరా" అని, “గాయత్రీ” అని తను అనే లోపునే సెల్ బంద్ చేసింది. మరి కాసేపు మాట్లాడచ్చు కదా.

శ్రీశైలం చూసి బస్సు ఎక్కిన దగ్గరనిండీ గాయిత్రి మనసు మనసు లో లేదు. అప్పుడే రెండు రోజులయింది చక్రికి ఫోన్ చేసి. ఎలా ఉన్నారో. అయినా ఫోన్ చేసి ఊరికే ఆయన వెనకాల పడి మందులేసుకున్నారా , ఆ ఫుడ్ మంచిది ఈ ఫుడ్ మంచిది, అని పొద్దున్న లేచింది మొదలు విసిగించకూడదు. తన పనులు తానే స్వతంత్రం గా చేసుకోడం లో ఉన్న తృప్తి సంతోషం వేరు. ఐ ఏం నాట్ ఏ సిక్ పర్సన్. నా పని నేను చేసుకోగలను అనే వారు. నిజమే ఆపరేషన్ అయి మూడేళ్లు దాటింది. ఇప్పుడు ఆరోగ్యం గానే ఉన్నారు. నాలో మార్పు రావాలి. వస్తుంది కూడా. చక్రి దగ్గరకి వెంటనే వెళ్ళిపోవాలి ఆయన్ని వదిలి నేను ఉండలేను అనుకుంటూనే బస్సు ప్రయాణం సాగింది.

మర్నాడు పొద్దున్నే స్నేహితులకి ఏదో సాకు చెప్పి సెలవు తీసుకుని ఎయిర్ పోర్ట్ కి బయలు దేరింది గాయిత్రి.

గాయిత్రి నించి ఫోన్ రాలేదు అని ఆరాట పడుతున్నాడు చక్రి. తన ఒంట్లో ఎలా ఉందొ ప్రయాణం బడలిక తో జ్వరం గాని రాలేదు కదా. లేక పోతే మరి ఫోన్ ఎందుకు చెయ్యలేదు . చికాకు తో డ్రాయింగ్ రూమ్ లో కూర్చుని ‘తను చెయ్యడమేమిటి? నేనే చేస్తాను’ అని గాయత్రికి కాల్ చేసేడు.

గాయిత్రి జవాబిచ్చింది- "హలో నేను ఇక్కడే ఉన్నాను. తలుపు తీయండి బాబూ" అని.

ఆశర్యం, ఆనందం తో తలుపు తీసేడు చక్రి .

“అదేంటి? అప్పుడే వచ్చేసావు?” అని గాయత్రిని దగ్గరగా తీసుకుని "ఈ రెండు రోజులు నిన్ను చాలా మిస్ అయ్యేను గాయత్రీ. తొందరగా వచ్చి మంచి పని చేసేవు డియర్" అన్నాడు.

"నేను మాత్రం నిన్ను వదిలి ఉండగలననుకుంటున్నావా చక్రీ అందుకే స్నేహితులనందరినీ వదిలి వచ్చేసాను"అంది గాయత్రి.

“గాయత్రీ! పెళ్లి సమయం లో ఏడడుగులు వేస్తూ ధర్మేచ, అర్ధేచ, కామేచ.. అంటూ శాస్త్రి గారు చెప్పిన మంత్రాలు వల్లిస్తాం గానీ, ఆ చక్కటి పదాల అర్ధం జీవితం లో ఒక్కొక్క అడుగూ ముందుకు వేస్తూ పోయినప్పుడే ఆ పదాల అర్ధం అవగతం అవుతుంది” అన్నాడు చక్రి.

“అది నిజం చక్రీ! ఒకరిపై ఒకరికి నమ్మకం, ఒకరినొకరు అర్ధం చేసుకోడం, ఒకరిపై ఒకరికి అభిమానం.. ఇవన్నీ

అవినాభావ బంధం యొక్క అందమైన బంధాలు అంటూ చక్రి కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది గాయిత్రి.

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం : సీత మండలీక

నేను హౌస్ మేకర్ ని. కొడుకులిద్దరూ అమెరికాలో పెళ్ళిళ్ళై స్థిరపడిపోయాక, భర్త ఎయిర్ ఇండియా లో రిటైర్ అయ్యేక ఇప్పుడు నాకు కొంచెం సమయం దొరికింది

కధలు చదవడం అలవాటున్నా రాయాలన్న కోరిక ఈ మధ్యనే తీరుతోంది


128 views0 comments

Comments


bottom of page