top of page

నీ రాకతో మొదలైన ఆనందం…


'Ni Rakatho Modalaina Anandam' written by N. Dhanalakshmi

రచన : N. ధనలక్ష్మి

కోరుకున్న ప్రేమ దరికి చేరింది.

ఇంతలో అనుకోకుండా ఎదురైన ఓ చేదు అనుభవం....


వారి దరికి చేరిన ఓ చిన్నారి ఎలాంటి ఆనందాలను తీసుకువచ్చింది అని తెలియచేసే కథ...

@@@@@@@@@@@@@@@@

రూమ్ ఎంత అందంగా ముస్తాబు అయి ఉందో అంతే అందంగా తయారు అయి తన ప్రియసఖి కోసం ఎదురు చూస్తున్నాడు అఖిల్ .....

తన పెళ్ళి ఎలా జరిగిందో గుర్తుకు తెచ్చుకున్నాడు...


ఫ్రెండ్ పెళ్ళికి అమ్మ, నాన్నతో కలిసి అమలాపురంకి వెళ్ళాడు ... అక్కడే చూసాడు హాసిని ని ... పేరుకి తగ్గట్టుగానే తన చుట్టున్న అందరినీ నవ్విస్తూ, నవ్వుతూ ఉండే తనని తొలిచూపులోనే ప్రేమించేశాడు...


హాసిని వైపు దొంగ చూపులు చూస్తున్న అఖిల్ ను చూసిన కాంతం గారికి మొత్తం విషయం అర్థం అయింది... ఎన్నో రోజుల నుంచి వివాహం చేసుకో అంటే మాట వినడం లేదు.. మొత్తానికి ఒక అమ్మాయి నచ్చింది... ఎలా అయిన సరే పెళ్ళి చేసెయ్యాలి అనుకున్నారు..


కాంతం గారు హాసిని పెద్దవారితో మాట్లాడడం, వాళ్ళందరికీ కూడా అఖిల్ కుటుంబ సభ్యులు కూడా నచ్చడంతో వాళ్ళు కూడా సముకుత చూపారు..

పైగా ఇద్దరి జాతకాల రీత్యా అదే ముహూర్తం ఉండడం, మళ్ళీ ఆలస్యం చేస్తే కొడుకు మనసు ఎక్కడ మారిపోతుంది ఏమో అని ఇటు కమల గారు, మళ్ళీ తమ బిడ్డకి ఇంత మంచి సంబంధం దొరుకుతుందొ లేదో అటు హాసిని పెద్దవాళ్ళు హడావిడిగా పెళ్ళి చేసేశారు..

మనస్పూర్తిగా హాసినితో మాట్లాడే అవకాశం రాలేదు తనకి....


ఇంతలో తలుపు చప్పుడు అవ్వడంతో అటువైపు చూస్తూ అలాగే ఉండిపోయాడు...


తెల్లని చీరలో , మెడలో తను కట్టిన మంగళసూత్రం చక్కగ మెరిసిపోతూ దేవకన్యలా ఉన్న హాసిని వైపు చాలా ప్రేమగా చూస్తున్నాడు...


హాసిని ఏడుపుతో ఈ లోకం లోకి వచ్చి...


" అరెరే! ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు... కొంపదీసి నీకు ఈ పెళ్ళి అంటే ఇష్టం లేదా


ఏంటి!???... మీ వాళ్ళు బలవంతం చేశారా ఏంటి!???” అన్నాడు అఖిల్

" మీరు ఎక్కువగా సీరియల్స్ చూస్తారా ఏంటి.. !?? మీకు మీరే ఊహించుకుంటూన్నారు... నేను చెప్పానా మీకు మీరంటే ఇష్టం లేదని... " అంది హాసిని చిరు కోపంగా



" మరి ఎందుకు ఏడుస్తున్నావు!????


"ఏమి చెప్పను.. !.


నా పేరు పక్కన హాసిని ఎంబీఏ అని చూసుకోవాలని ఆశ .. కానీ సడెన్ గా పెళ్ళి చేసేశారు..

ఇప్పుడు ఫస్ట్ నైట్, ఎంత లేదన్నా ఏడాదిలో పిల్లలు పుట్టడం జరిగిపోతుంది.. ఇంకా వారిని, మిమ్మల్ని చూసుకోవడం లో సరిపోతుంది ఇంకా నా కోరిక గోవింద గోవింద అంతే అని బాధగా మంచం వైపు కూర్చొని బాధ పడుతుంది... " అంది హాసిని.


అఖిల్ నవ్వుతూ

" హాసిని కాసేపు భయపెట్టేశావు .. ఇంత చిన్న విషయానికి ఎవరైనా ఏడుస్తారా చెప్పు.. పెళ్ళి తరువాత కూడా చదువుకోవచ్చు.. బాధ పడకు జాబ్ చేయాలని ఉన్న చేయచ్చు.....


సరే నీ ఎంబీఏ పూర్తి అయ్యేవరకు మనం లవర్స్ గా ఉందాము.. నీ సర్టిఫికేట్ చేతికి రాగానే మన ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేద్దాము... సరే ఎక్కువ ఆలోచించకుండా నిద్ర పో…” అంటు నిద్ర పోయాడు .


" అరె హాసిని ! ఎక్కడో మచ్చ వేసుకొని పుట్టి ఉంటావు .. లేకపోతే నిన్ను అర్థం చేసుకునే నడుచుకునే భర్త రావడం అంటే మాటల ఏంటి మనసులో అనుకొని హ్యాపీగా నిద్ర పోయింది .. "

ఆనాటి నుండి హసినికి అన్నిటిలో చేదోడు, వాదోడుగా ఉన్నాడు అఖిల్... అఖిల్, హాసిని ఒక్కరినీ ఒక్కరూ బాగా అర్థం చేసుకున్నారు ఈ రెండు ఏళ్ళలో....


ఇదిలా ఉండగా హాసిని పుట్టిన రోజున తమ పేర్లు కలిసి ఉండేలా రింగ్స్ గిఫ్ట్ ఇచ్చి హగ్ చేసుకొని

" వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మై డియర్ వైఫ్.. చెప్పు ఎక్కడికి వెళదాము.. సరదాగా తిరిగి వద్దము... "


" నేను చెప్పితే మీరు ఖచ్చితంగా నవ్వుతారు

మీతో కలిసి సైకిల్ పై వెళ్ళాలి అని ఉంది..

నేను ముందర, నా వెనక మీరు కూర్చొని ప్రేమ కబుర్లు చెప్పుకుంటూ గ్రౌండ్ చుట్టూ రౌండ్స్ కొట్టాలి అని కోరిక...


ఓసి ఇంతే కదా అంటూ సైకిల్ తీసుకొని వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న పార్క్ కి వెళ్ళారు...

కొద్దీ సేపు అలా సరదాగా గడిపారు.. వర్షం వచ్చేలా ఉందని పార్క్ లోని ఉన్నవారందరూ వెళ్ళిపోయారు..


వర్షం మొదలైంది. అక్కడ ఎదో చిన్న రూం లాంటిది ఉంటే అక్కడికి వెళ్ళారు... అది ఎదో స్టోర్ రూం లాగ ఉంది... వర్షపు జల్లులు పడుతున్నాయి అని తలుపును లాక్ చేశాడు..


హాసిని వణికిపోతూ అఖిల్ ను చుట్టేసింది..

ఎవరు లేని ఏకాంతం, భయట వాన.. తన ప్రియసఖి అంత గట్టిగా హత్తుకొని ఉంది... అఖిల్ మనసు ఎదో కావాలని అరాటపడతుంటే హసినిని మరింత దగ్గరగా తీసుకొని గట్టిగ హత్తుకున్నాడు..


హాసిని కళ్ళ పై, బుగ్గల పై ముద్దు పెట్టి అదే తమకంతో పెదవులు అందుకోవాలని అని తన పెదవులను దగ్గరికి వచ్చాడు.. ఇంతలో తనకిచ్చిన మాట గుర్తుకు వచ్చి దూరం జరిగాడు...


హాసిని కి విషయం అర్థం అయి... " ఇంకో రెండు నెలల్లో నా ఎంబీఏ కోర్స్ పూర్తి అవుతుంది.. ఇప్పుడు మనం ఒక్కటి అయిన నో ప్రాబ్లెమ్... అంటు సిగ్గుతో అఖిల్ ను అల్లుకుపోతుంది....


అఖిల్ ఎంతో సంతోషంగా లవ్ యు హాసిని అంటు అల్లుకుపోయాడు... అలా వర్షం సాక్షిగా ఒక్కటి అయ్యారు...


మూడు నెలలకి హాసిని నెల తప్పింది .. ఆ రోజు మొదలు అఖిల్ హాసిని ని ఎంతో ప్రేమగా చూసుకునే వాడు...

అఖిల్ " నీకు పాప అంటే ఇష్టమా, బాబు అంటే ఇష్టమా "...


మన ప్రేమకి ప్రతిరూపమే మన బిడ్డ అది... ఎవరు అయితే ఏంటి.......


" హాసిని హ్యాపీగా నవ్వుతూ... నాకెందుకో కడుపులో ఇద్దరు ఉన్నారు అనిపిస్తుంది.. ఈ సారి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు స్కానింగ్ చేయించుకోవాలి...


" వావ్!హాసిని ఇది కనుక నిజం అయితే మనకన్నా లక్కీ వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. "...


హాసిని ఊహించినట్టు తనకి కవలలు అని డాక్టర్ చెప్పింది... వారి ఆనందానికి అవధులు లేవు...


అఖిల్ , హాసిని ఇద్దరు తమ బిడ్డల రాకకై చాలా ఎదురు చూస్తున్నారు..


అలా సరదాగా డ్రైవ్ కి వెళ్ళదాము అని హాసిని అడగడంతో ఓ రాత్రి వెళ్ళారు... సరదాగా కాసేపు గడిపి వస్తుండగా ఆక్సిడెంట్ అయింది.. ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు కానీ హాసిని కి గర్భస్రావం అయింది...


ఇద్దరు ఈ బాధ నుండి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది ...


ఎప్పుడు నవ్వుతూ ఉండే హాసిని మొహం ఇప్పుడు కన్నిరుతో నిండి పోయింది..


పిల్లల కోసం వాళ్ళు ఏర్పాటు చేసిన రూంలో కూర్చొని ఏడుస్తూ పిచ్చిదానిలా మారిపోయింది ..

రెండు సార్లు చనిపోవలని కూడా ట్రై చేసింది...

అతి కష్టం మీద అఖిల్ తనని కాపాడగలిగాడు...


" హాసిని! మన బిడ్డలు దూరం అయ్యారు.. ఇది మనం ఎప్పటికీ మర్చిపోలేని చేదు జ్ఞాపకం.. అలా అని ఇలా ఏడుస్తుంటే ఎలా!?? నా వల్ల కావడం లేదు.. అయిన మనకి వయసు ఏమి ఎక్కువ అయింది అని.. మళ్ళీ మనకి పిల్లలు పుడతారు.. ఇంకా ఆ విషయం వదిలిపెట్టి మూవ్ ఆన్ అవ్వు.... ప్లీజ్ రా..... "


"అఖిల్! నాకు మళ్ళీ పిల్లలు పుట్టరు అని డాక్టర్ నీతో చెప్పడం నేను విన్నాను... అందుకే నేను చనిపోవాలని చూసింది . నేను ఉండగా నువ్వు ఇంకో పెళ్ళి చేసుకోవుగా"


అఖిల్ కోపంగా హాసిని లాగిపెట్టి ఒక్కటి ఇచ్చాడు...


" నువ్వు లేకపోతే నేను ఎలా ఈ లోకం లో బ్రతికి ఉంటాను అనుకున్నావు.. పిల్లలు లేకపోతే ఏమైంది... మనం ఒక్కరికొకరుం తోడుగా, నీడగా ఉందాము...

ఒక మాట అడుగుతాను నిజం చెప్పు...

ఒకవేళ లోపం నాలో ఉంటే అప్పుడు నువ్వు నన్ను వదిలేసి ఇంకో పెళ్ళి నువ్వు చేసుకుంటావ..."


"నో! అఖిల్ నీ స్థానము ఎవరికి ఇవ్వలేను.."


"మరి నేను ఎలా ఇస్తాను అనుకున్నావు..... "


"సారీ అఖిల్ ఇంకా ఎప్పుడు ఇలా నేను బాధ పడి, మిమ్మల్ని బాధ పెట్టను" అని చెప్పి ఏడుస్తూ తనని గట్టిగ హత్తుకొని తనివితీరా ఏడిచింది...


అఖిల్ ఇంటి నుండి పని చేస్తూ అటు వృత్తిని , భార్యను కంటికి పాపల చూసుకుంటూ ఇటు బాధ్యతను నిర్వహిస్తూ ఉన్నాడు...

ఒక రోజు టీవీలో ఎవరో అప్పుడే పుట్టిన పసికందును చెత్త కుప్పలో వదిలిపెట్టి వెళ్ళారు అని న్యూస్ టెలికస్ట్ చేస్తున్నారు...


మనం బిడ్డలను కోల్పోయి ఎంత బాధ పడుతున్నాము.. అలాంటిది ఆ పసికందును ఎలా అండి చెత్త కుప్పలో విసిరేసి వెళ్ళారు.. వాళ్ళకి కొంచం కూడా పాపం అనిపించలేదా... ఏవండీ! మనం ఆ బిడ్డను తెచ్చుకుందామా.. !??అని హాసిని అడగడంతో..

తప్పకుండా ! రా ఇప్పుడే వెళ్దామా.. ఇంకా నుంచి మన బిడ్డగా తను పెరుగుతుంది అంటు నేరుగు న్యూస్ ఛానల్ దగ్గరికి వెళ్ళి వివరాలు తెలుసుకున్నారు..


అఖిల్ , హాసిని ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి

పాపని తెచ్చుకున్నారు.. ఆనాటి నుండి పాపే వారి లోకం అయింది.. కంటికి రెప్పలా చూసుకుంటూ ఉన్నారు..


హాసిని, పాపని కలిపి రకరకాలుగా ఫోటోలు తీశాడు ప్రతి నెల పాప ఏజ్ ను ప్రతిబింబించేలా

రకరకాల ఫోటోలు తీసి వాటిని గోడలపై అందంగాఅలకరించేవాడు అఖిల్



తమ జీవితాల్లో వెలుగులు నింపిన పాప అంటే ఇద్దరికీ పంచప్రాణాలు... పాపకి శిశిర అని పేరు పెట్టుకున్నారు...

అఖిల్ ఎన్నో ఏళ్లుగా కలలు కంటున్న

ఎదురుచూస్తున్న సీఈఓ పొజిషన్ తనకి వరించింది..

అదంతా శిశిర తమ జీవితంలోకి రావడం వల్లే అని తమ ఇంటి మహాలక్ష్మి గా భావించారు ..


పాపకి మూడు ఏళ్ళు ఉన్నప్పుడు హాసిని కళ్ళు తిరిగి పడిపోయింది... కంగారు పడిన అఖిల్ డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళారు...


హాసిని నెల తప్పింది అని చెప్పారు డాక్టర్.. వాళ్ళిద్దరు ఆశ్చర్యపోయారు...

హాసిని అయితే మీరు నిజమే చెప్తున్నార .. ఎవరివి అయిన రిపోర్ట్స్ మారిపోయాయి ఏమో ఒక్కసారి చెక్ చేయండి...


లేదండీ.. అలా ఏమి లేదు... మీరు నిజంగానే కన్సీవ్ అయ్యారు.. అయిన ఎందుకు మీరు ఇలా సందేహ పడుతున్నారు !??


అఖిల్ తమ చేదు అనుభవాన్ని పంచుకున్నాడు..

గత జ్ఞాపకాలు గుర్తుకు రాగానే ఇద్దరి కంట్లో తడి మొదలైంది ..


ఒక్కోసారి దేవుడు ఇలా మేజిక్ చేస్తుంటారు... అదే ఇది... రెగ్యులర్ చెకప్ చేయించుకోవాలి .. ఈ మందులు ప్రతిరోజూ క్రమం తప్పకుండా వాడండి అని డాక్టర్ సూచనలు ఇచ్చారు ..


ఇంటికి చేరుకొని శిశిరను తీసుకొని ముద్దులతో ముంచెత్తి రేయ్ కన్న నువ్వు అడుకోవడానికి తమ్ముడూ రాబోతున్నారు అని ఆనందపడ్డారు ఇద్దరు..


శిశిర వల్లే తమకి ఈ అదృష్టం దక్కిందని వాళ్ళ నమ్మకం .


ఈ సారి ఎంతో జాగ్రత్తగా ఉన్నారు... కొన్ని నెలల తరువాత హాసినికి కవలలు పుట్టారు ఆ పిల్లలను చూసి ఎంతో ఆనంద పడ్డారు .. ఎవరినీ అయితే మూడు ఏళ్ల క్రితం కోల్పోయారు అని అనుక్షణం బాధ పడ్డారో వాళ్ళే మళ్ళీ జన్మించారు..


శిశిర అయితే తన తమ్ములను ఇద్దరినీ చూసి

తెగ ముద్దులు పెడుతూ మమ్మీ నా కోసమే ఇద్దరు వచ్చారు.. థాంక్స్ మమ్మీ అంటు హాసిని మొహానికి ముద్దులు పెట్టింది ..


మరి పప్ప కు లేదా అని అఖిల్ అనడం ఆలస్యం ..

అఖిల్ ని చేరి ముద్దులు పెట్టింది...


విశాల్, వీహస్ అని పేర్లూ పెట్టారు పిల్లలకి....

పిల్లల ప్రతి పుట్టిన రోజుకి కొంతమంది పిల్లల్ని దత్తత తీసుకొని చదివిస్తున్నారు...


విశాల్, వీహస్ ను ఎవరైనా ఏమైనా అంటే శిశిర అసలు ఊరుకోదు... చివరకి అమ్మ, నాన్న అయిన సరే...


శిశిర కు తన తమ్ముళ్ల పై కల ప్రేమను చూసి మురిసిపోయే వారు హాసిని, అఖిల్..


శిశిర, విశాల్, వీహస్ అల్లరి కేరింతలతో ఆనందంగా వారి జీవితం సాగిపోతుంది.....

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.


లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం :

నమస్తే. నా పేరు ధనలక్ష్మి. వృత్తి రీత్యా ప్రైవేట్ స్కూల్లో గణితం బోధిస్తాను. మాది మదనపల్లి, చిత్తూర్ జిల్లా. కథలు , కవితలు రాయడం నాకు ఇష్టమైన వ్యాపకం. ఆనందం వేసినా, బాధ వేసినా, కోపం వచ్చినా నేను పంచుకునే నా నేస్తం అక్షరం. నాలో మెదిలే భావాలను, నేను చూసిన సంఘటనలను రాయడం నాకు అలవాటు.





63 views0 comments
bottom of page