top of page
Original.png

నాట్ 24/7 - బాధకు కూడా ఆఫీస్ అవర్స్ ఉండాలి

బాధకు కూడా ఆఫీస్ అవర్స్ ఉండాలి, Thought Management Telugu, Thought Containment Practice, Emotional Management Telugu, భావోద్వేగ నియంత్రణ, ఒత్తిడి నిర్వహణ, తెలుగు వ్యక్తిత్వ వికాసం, Self Improvement Telugu, కొత్త విరిత

www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'నాట్ 24/7 - బాధకు కూడా ఆఫీస్ అవర్స్ ఉండాలి' వ్యాసంలో  గడియారం పక్కన డైరీలో భావోద్వేగాలకు సమయాన్ని కేటాయిస్తూ ప్రశాంతంగా కూర్చున్న యువ తెలుగు ఉద్యోగి – ఆలోచనల నియంత్రణ, మానసిక ప్రశాంతతకు ప్రతీక.
www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'నాట్ 24/7 - బాధకు కూడా ఆఫీస్ అవర్స్ ఉండాలి' వ్యాసంలో  గడియారం పక్కన డైరీలో భావోద్వేగాలకు సమయాన్ని కేటాయిస్తూ ప్రశాంతంగా కూర్చున్న యువ తెలుగు ఉద్యోగి – ఆలోచనల నియంత్రణ, మానసిక ప్రశాంతతకు ప్రతీక.

Not 24/7 - Even sadness should have office hours Telugu Inspirational Article | Kotha Viritha

నాట్ 24/7 - బాధకు కూడా ఆఫీస్ అవర్స్ ఉండాలి తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత

Publishes in manatelugukathalu.com on 08/07/2026


బాధ, కోపం, ఆందోళన వంటి భావోద్వేగాలను పూర్తిగా తొలగించడం సాధ్యం కాదు. కానీ వాటిని రోజంతా మన జీవితాన్ని నియంత్రించనివ్వకుండా ఒక సమయ పరిమితిలో ఉంచడం మాత్రం సాధ్యమే. "నాట్ 24/7 - బాధకు కూడా ఆఫీస్ అవర్స్ ఉండాలి" అనే ఈ ఆలోచనాత్మక తెలుగు వ్యాసం, మానసిక ఆరోగ్యానికి ఉపయోగపడే Thought Management మరియు Thought Containment Practice వంటి పద్ధతులను సరళంగా వివరిస్తుంది.


నాట్ 24/7 - బాధకు కూడా ఆఫీస్ అవర్స్ ఉండాలి


"బాధగా ఉందా? టైమ్ టేబుల్ వేసుకో... ఒక టైమ్ పెట్టుకుని బాధపడు. 


కోపంగా ఉందా? టైమ్ టేబుల్ వేసుకో... ఒక టైమ్ పెట్టుకుని అరిచేయి. 


ప్రశాంతంగా గడపాలనుందా? టైమ్ టేబుల్ వేసుకో... ఒక టైమ్ పెట్టుకుని నీతో నువ్వు గడిపేయి. "


ఇది వినగానే కొంచెం విచిత్రంగా అనిపించొచ్చు. కానీ మనసు పని చేసే విధానం అర్థమైతే, ఇందులో ఉన్న సైన్స్ కూడా అర్థమవుతుంది. 


మన సమస్యలు చాలాసార్లు బాధ వల్ల రావు. బాధను రోజంతా మోసుకెళ్లడం వల్ల వస్తాయి. ఒక ఆలోచన ఐదు నిమిషాల్లో ముగిసిపోవచ్చు. కానీ అదే ఆలోచనను మనం గంటల తరబడి నములుతుంటే అది రూమినేషన్ అవుతుంది. అదే మన శక్తిని, ఏకాగ్రతను, ప్రశాంతతను నెమ్మదిగా కరిగిస్తుంది. 


అందుకే "థాట్ కంటైన్మెంట్ ప్రాక్టీస్" అనే పద్ధతి ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెబుతుంది. భావోద్వేగాలను అణచిపెట్టొద్దు, కానీ వాటికి ఒక సమయ పరిమితిని ఇవ్వండి. 


"సాయంత్రం 7 నుంచి 7:20 వరకు నేను ఈ విషయం గురించి ఆలోచిస్తాను. అప్పటివరకు కాదు" అని మనసుతో ఒక ఒప్పందం చేసుకోండి. 


వింతగా అనిపించినా, మనసు కూడా అలవాట్లను, షెడ్యూల్‌ను గౌరవించడం నేర్చుకుంటుంది. 

ఎందుకంటే నియంత్రించాల్సింది భావోద్వేగాలు కాదు వాటికి మనం ఇచ్చే సమయం. 

మీ రోజులో పని చేయడానికి సమయం ఉంటుంది. భోజనం చేయడానికి సమయం ఉంటుంది. ఆఫీసుకు వెళ్లడానికి సమయం ఉంటుంది. నిద్రపోవడానికి సమయం ఉంటుంది. అయితే బాధపడటానికి, కోపాన్ని బయటపెట్టడానికి, ప్రశాంతంగా ఉండడానికి కూడా ఒక సమయం ఎందుకు ఉండకూడదు?


భావోద్వేగాలను జీవితంలో నుంచి తొలగించలేం. అలా అని రోజంతా వాటి గురించి ఆలోచించాల్సిన అవసరమూ లేదు. కానీ అవి జీవితమంతా ఆక్రమించకుండా మాత్రం చూడగలం. జీవితాన్ని మార్చేది టైమ్ మేనేజ్‌మెంట్ మాత్రమే కాదు థాట్ మేనేజ్‌మెంట్ కూడా. 


మనసును బలహీనపరచేది బాధ కాదు. బాధకు హద్దు లేకపోవడం. ఆలోచనలను ఆపాల్సిన అవసరం లేదు కానీ వాటికి ఒక సమయం కేటాయిస్తే చాలు. 


ఎందుకంటే మీరు మీ ఆలోచనలను షెడ్యూల్ చేయకపోతే చివరికి మీ ఆలోచనలే మీ జీవితాన్ని షెడ్యూల్ చేస్తాయి. 


కొత్త విరిత

సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్

ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్


***************************************


కొత్త విరిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



కొత్త విరిత
కొత్త విరిత

రచయిత్రి పరిచయం: కొత్త విరిత


నా పేరు కొత్త విరిత


B.sc B.ed Msc చేశాను

IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.

240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.

5 Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Rated 5 out of 5 stars.

👌 👌 👌 👌 👍

Like

Haritha kotha
Haritha kotha
an hour ago
Rated 5 out of 5 stars.

👌👌👌👌

Like

vegiupendrasai
2 hours ago
Rated 5 out of 5 stars.

Very thoughtful, people also should be aware what exactly feeding into their mind plays a major role….if right thoughts were processed in your brain, there is no place for the sarrows or worries 🤗

Like

Kishan Kotha
Kishan Kotha
2 hours ago
Rated 5 out of 5 stars.

Thought scheduling is a wonderful concept.Initially it may be difficult but thinking in those direction is welcome move and many give wonderful results

Like

# Vikki
# Vikki
3 hours ago
Rated 5 out of 5 stars.

Well written

Like
bottom of page